Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Chilli farmers lost by trusting the coalition government1
సర్కారు మోసం.. మిర్చి రైతు హాహా‘కారం’

సాక్షి, అమరావతి/నెట్‌వర్క్‌: మిరప రైతుల నెత్తిన టీడీపీ కూటమి ప్రభుత్వం కుచ్చుటోపి పెట్టింది. మద్దతు ధర పేరిట ఊరించి ఊహల పల్లకిలో ఊరేగించి నిలుపునా ముంచేసింది. మద్దతు, మార్కెట్‌ ధరల మధ్య వ్యత్యాసానికితోడు రైతుల ఖాతాకు జమ చేస్తామని కొంతకాలం, బోనస్‌ ఇచ్చే ఆలోచన చేస్తున్నామంటూ మరికొంత కాలం నాన్చింది. ఇప్పుడు మార్కెట్‌లో ధరలు ఎగబాకిపోతున్నందున ఇక మద్దతు ధర ఇవ్వాల్సిన అవసరం లేదంటూ తేల్చి చెబుతోంది. మరి నష్టానికి అమ్ముకుంటున్న రైతుల పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తే ప్రభుత్వ పెద్దల నోరు పెగలడం లేదు. బోనస్‌ విషయంలో చేతులెత్తేశారు. తేజ రకం తప్ప మిగిలిన రకాలన్నీ నేటికీ మద్దతు ధర కంటే తక్కువగానే పలుకుతున్నాయి. అయినా సరే ధరలు ఎగబాకిపోతున్నాయంటూ అసెంబ్లీ సాక్షిగా మంత్రులు, ఎమ్మెల్యేలు పోటీ పడుతూ అబద్ధాలు వల్లె వేస్తున్నారు. విదేశాలకు ఎగుమతుల ఆర్డర్లు తగ్గడంతో పంట మార్కెట్‌కు వచ్చే సమయంలోనే ధరల పతనం మొదలైంది. మరో వైపు ధరలు మరింత తగ్గుతాయన్న ఆలోచనతో మసాలా కంపెనీలు కూడా కొనుగోలు నిలిపివేశాయి. ఇదే విషయమై ఓ వైపు ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం వ్యవసాయ మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ కేంద్రం హెచ్చరికలు చేసినా, మార్కెటింగ్‌ శాఖ ముందుగానే గుర్తించించినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేరుగా రంగంలోకి దిగి మిర్చి యార్డుకు వెళ్లి మిరప రైతులకు బాసటగా నిలవడంతో కూటమి పెద్దలు నానా హంగామా చేశారు. చేతిలో ఉన్న మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దింపి ఆదుకోవల్సింది పోయి కేంద్రానికి లేఖలు రాశామని, సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రితో భేటీ అయ్యారని.. మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు కేంద్రం దిగివచ్చేసిందంటూ ఊదరగొట్టారు. కేంద్రంపై భారం మోపి.. చేతులెత్తేశారు దిగుబడుల్లో కనీసం 30 శాతం (3 లక్షల టన్నులపైన) పంట సేకరిస్తే రూ.3,480 కోట్లు ఖర్చవుతుందని.. ఆ భారం కేంద్రమే భరించేలా ఒప్పిస్తామంటూ తొలుత రాష్ట్ర ప్రభుత్వం నమ్మబలికింది. ఆ తర్వాత మార్కెట్‌ ధర, మద్దతు ధర మధ్య వ్యత్యాసంలో 50 శాతం (మిగతా 50 శాతం కేంద్రం) భరించేలా ఫిబ్రవరి మూడో వారంలో ఎకరాకు 5 క్వింటాళ్ల చొప్పున 25 శాతం (2.9 లక్షల టన్నులు) పంటకు రూ.846.15 కోట్లు, 50 శాతం (5.83 లక్షల టన్నులు) పంట కొనుగోలుకు రూ.1,692.31 కోట్లు, 75 శాతానికి (8.75 లక్షల టన్నులు) రూ.2,538.46 కోట్లు ఖర్చవుతుందని అధికారులు రెండోసారి ప్రతిపాదనలు పంపారు. ఆ ప్రతిపాదనలు కేంద్రానికి పంపి చేతులు దులిపేసుకున్నారు. రూ.11,781 చొప్పున కేంద్రం కొంటుందంటూ కేంద్ర మంత్రులు రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని గొప్పగా ప్రకటించారు. అన్నీ తెలిసి దొంగ నాటకాలు సీఎం చంద్రబాబు మిర్చి రైతులు, ఎగుమతిదారులు, వ్యాపారులతో గత నెల 21న ఏర్పాటు చేసిన సమావేశంలో తమకు శుభవార్త చెబుతారని రైతులు ఎంతగానో ఆశగా ఎదురు చూశారు. 25 శాతానికి మించి కేంద్రం కొనుగోలు చేసే పరిస్థితులు కన్పించడం లేదంటూ తేల్చి చెప్పేశారు. వాస్తవానికి మద్దతు ధర పెంచాలన్నా, 25 శాతానికి మించి కొనుగోలు చేయాలన్నా, కేంద్ర కేబినెట్‌ ఆమోద ముద్ర వేయాల్సిందే. నాటి భేటీలో వారం పది రోజుల్లో మరోసారి భేటీ అయ్యి తాము నిర్దేశించిన మద్దతు ధర రూ.11,781 కంటే తక్కువగా ఉంటే అప్పుడు ఆలోచిద్దామని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఈ ప్రకటన చేసి మూడు వారాలు దాటినా మళ్లీ ఆ ఊసెత్తడం లేదు. ధరలు పెరిగిపోయాయంటూ అబద్ధాలు మద్దతు–మార్కెట్‌ ధరల మధ్య వ్యత్యాసం చెల్లిస్తామంటూ హంగామా చేశారు. ఆ మేరకు యార్డులో మిర్చి విక్రయించిన రైతుల వివరాలను సేకరించిన ప్రభుత్వం ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేయకుండా కాలయాపన చేస్తోంది. పైగా ఈ హడావుడి తర్వాత మార్కెట్‌లో ధరలు పెరిగిపోతున్నాయంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు అసెంబ్లీ సాక్షిగా పోటీపడి స్టేట్‌మెంట్లు ఇస్తూ సమస్యను నీరుగార్చేస్తున్నారు. వాస్తవానికి గురువారం మిర్చి యార్డులో తేజ రకానికి మాత్రమే గరిష్టంగా రూ.14 వేలు, కనిష్టంగా రూ.5,500 పలికింది. తక్కువ ధరకు అమ్ముకున్న రైతులకు ఎంతో కొంత బోనస్‌ ప్రకటించి ఆదుకోవాలని కోరుతున్నారు.ఈయన పేరు కన్నెబోయిన బాలసాయి. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం వాదంపల్లి స్వగ్రామం. తనకున్న మూడెకరాల్లో తేజ రకం మిర్చి సాగు చేశారు. ఎకరాకు రూ.1.75 లక్షలు ఖర్చయ్యింది. గతేడాది ఎకరాకు 25 క్వింటాళ్ల దిగుబడి వస్తే ఈ ఏడాది తెగుళ్లు, వాతావరణ పరిస్థితుల ప్రభావంతో 15 క్వింటాళ్ల లోపే వచ్చింది. సగానికి పైగా తాలు. గత సీజన్‌లో క్వింటా రూ.23వేల నుంచి రూ.27 వేల మధ్య పలికిన తేజ రకం కాయలు నేడు రూ.11వేల నుంచి రూ.12 వేల మధ్య పలుకుతున్నాయి. తాలు రకానికి గత సీజన్‌లో క్వింటాకు రూ.17 వేలు ధర వస్తే ఈ ఏడాది రూ.5 వేలు కూడా దక్కలేదు. ‘గత నెల మొదటి వారంలో 40 బస్తాలు గుంటూరు యార్డుకు తీసుకొస్తే క్వింటాకు రూ.15 వేలు ధర వస్తే నేడు 50 బస్తాలు తెస్తే క్వింటా రూ.11 వేలు ఇస్తామంటున్నారు. ప్రభుత్వం క్వింటాకు మద్దతు ధర రూ.11,781గా ప్రకటించిన తర్వాత ధరలు మరింత పతనమయ్యాయి. రైతులను పట్టించుకునే నాథుడే లేడు. మిర్చి పంట అమ్ముకోవాలంటే భయం వేస్తోంది. ఇళ్ల వద్ద కూలీలతోపాటు ఎరువులు, మందుల షాపుల వారు కాచుకుని కూర్చున్నారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. క్వింటాకు రూ.20 వేలు ధర పలికితే పెట్టుబడి వస్తుంది. ప్రభుత్వం ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యం’ అని బాలసాయి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.సాగు, దిగుబడి లెక్కలివి.. రాష్ట్రంలో 2023–24 సీజన్‌లో 6 లక్షల ఎకరాలకు పైగా మిరప సాగైంది. 14.50 లక్షల టన్నులకుపైగా దిగుబడులొచ్చాయి. అలాంటిది 2024–25లో వరుస వైపరీత్యాలకు తోడు ప్రభుత్వ నిర్వాకంతో కేవలం 3.95 లక్షల ఎకరాల్లో మాత్రమే మిరప సాగైంది. దిగుబడి 11 లక్షల టన్నులొస్తాయని అంచనా వేయగా, క్షేత్ర స్థాయిలో ఆ పరిస్థితి కన్పించడం లేదు. మరోపక్క గుంటూరు మార్కెట్‌ యార్డుకు ఈ ఏడాది 4.76 లక్షల టన్నులు మిరప వస్తుందని అంచనా వేయగా, జనవరిలో 61 వేల టన్నులు, ఫిబ్రవరిలో 1.10 లక్షల టన్నులు రాగా, ఈ నెలలో ఇప్పటి వరకు 1.09 లక్షల టన్నులొచ్చాయి. ఈ నెలలో మరో లక్ష టన్నులు, ఏప్రిల్‌లో 65 వేల టన్నులు, మేలో 30 వేల టన్నులు మార్కెట్‌కు వస్తాయని అంచనా. ఈ దుస్థితి ఏనాడు లేదు దశాబ్దాలుగా మిర్చి పంటను పండిస్తున్నా. ఈ పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదు. కాయలు కోత కోద్దామంటే కూలీలు వచ్చే పరిస్థితి లేదు. గత సీజన్‌లో కిలో ఎండు మిర్చి తీతకు రూ.10 ఇస్తే, ఈ ఏడాది రూ.25 ఉంది. గతేడాది తేజ రకం మిర్చి క్వింటా రూ.20 వేలకు పైగా అమ్మితే ఈ ఏడాది రూ.10 వేలకు మించి కొనడం లేదు. విచిత్రంగా మిర్చి ధర తగ్గి కూలీల ధర పెరగటం దారుణం. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.11,781 దేనికీ సరిపోదు. – దొండపాటి అంజయ్య, అడిగొప్పుల, పల్నాడు జిల్లాఅప్పులే మిగిలాయి3 ఎకరాల్లో మిరపసాగుకు ఎకరాకు రూ.75 వేలకుపైగా పెట్టుబడి పెట్టా. వైరస్‌ సోకి ఎకరాకు 8 క్వింటాళ్లకు మించి దిగుబడి రాలేదు. మార్కెట్‌లో ధర లేదు. చివరికి క్వింటా రూ.9 వేలకు అమ్ముకున్నా. కనీస పెట్టుబడి కూడా మిగల్లేదు. అప్పులు మాత్రమే మిగిలిపోయాయి. – అహ్మద్, కమాన్‌దొడ్డి, కొసిగి మండలం, కర్నూలు జిల్లా

Digital ad industry estimated to cross Rs 62000 crore by 20252
డిజిటల్‌ జోరు..!

కొన్నాళ్ల క్రితం వరకు ప్రకటనలంటే పత్రికలు, టీవీలు, రేడియోల్లాంటి సాంప్రదాయ మాధ్యమాలకే పరిమితమయ్యేవి. ఇంటర్నెట్‌ వాడకం పెరిగిన తర్వాత నెమ్మదిగా డిజిటల్‌ వైపు మళ్లడం మొదలైంది. ఇక అందరి చేతుల్లోకి స్మార్ట్‌ఫోన్లు వచ్చేస్తుండటం, డేటా చౌకగా లభిస్తుండటంలాంటి అంశాల కారణంగా ఇది మరింతగా జోరందుకుంది. ఎంత లా అంటే .. అడ్వర్టైజింగ్‌ సంస్థలు తమ బడ్జెట్‌లో దాదాపు సగభాగాన్ని డిజిటల్‌కే కేటాయిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఆఖరు నాటికి దేశీయంగా డిజిటల్‌ అడ్వర్టైజింగ్‌ విభాగం, సాంప్రదాయ మాధ్యమాలకు మించి ఏకంగా రూ. 62 వేల కోట్లకు చేరుతుందనే అంచనాలు నెలకొన్నాయి. అడ్వర్టైజింగ్‌ పరిశ్రమలో డిజిటల్‌ మీడియా చాలా వేగంగా ప్రాచుర్యంలోకి వచ్చేసింది. నగరాలు మొదలుకుని గ్రామాల వరకు ఇది అసాధారణ స్థాయిలో విస్తరిస్తోంది. దీంతో డిజిటల్‌ యూజర్ల దృష్టిని ఆకట్టుకునేందుకు కంపెనీలు ఒకదానితో మరొకటి పోటీపడుతున్నాయి. సాం ప్రదాయ మీడియాని మించి డిజిటల్‌పై భారీగా వెచ్చిస్తున్నాయి. అంతర్జాతీయ అడ్వర్టైజింగ్‌ దిగ్గజం డెంట్సు నివేదిక ప్రకారం.. దేశీఅడ్వర్టైజింగ్‌ పరిశ్రమ ప్రస్తుతం రూ. 93,166 కోట్లుగా ఉంది. 2025 ఆఖరు నాటికి ఇది సుమారు మరో 10 శాతం పెరిగి రూ. 1,12,453 కోట్లకు చేరుతుందని అంచనా. 2022లోలో రూ. 40,685 కోట్లుగా ఉన్న డిజిటల్‌ విభాగం ఈ ఏడాది ఆఖరుకల్లా రూ. 62,045 కోట్లకు.. అంటే మొత్తం అడ్వర్టైజింగ్‌ బడ్జెట్లలో సగానికి పైగానే వాటా దక్కించుకునే అవకాశం ఉంది. గతేడాది విషయం తీసుకుంటే 44 శాతం వాటాతో డిజిటల్‌ అగ్రస్థానంలో ఉండగా, టీవీ 32 శాతం, ప్రింట్‌ మీడియా 20% వాటాతో తర్వాత స్థానాల్లో నిల్చాయి. ఏఐలాంటి టెక్నాలజీ ఊతంతో టార్గెట్‌ ఆడియన్స్‌ను సరిగ్గా చేరుకునే వెసులుబాటు ఉండటం డిజిటల్‌కి సానుకూలాంశంగా ఉంటోంది. టెలికం అత్యధిక కేటాయింపులు.. టెలికం రంగ సంస్థలు తమ మీడియా బడ్జెట్లలో 64 శాతం భాగాన్ని డిజిటల్‌కి కేటాయిస్తున్నాయి. ఎఫ్‌ఎంసీజీ సెగ్మెంట్‌ తమ బడ్జెట్లలో 94 శాతం భాగాన్ని డిజిటల్, టీవీ మాధ్యమాలకు కేటాయిస్తోంది. సాంప్రదాయ అడ్వర్టైజర్లే కాకుండా, డైరెక్ట్‌ టు కన్జూమర్‌ బ్రాండ్లు, స్టార్టప్‌లు మొదలైనవి ఎక్కువగా ఆన్‌లైన్‌ ప్రకటనలపైనే దృష్టి పెడుతున్నాయి. క్విక్‌–కామర్స్, ఈ–కామర్స్, విద్యా రంగ సంస్థల్లాంటివి మరింతగా కస్టమర్లకు చేరువయ్యేందుకు డిజిటల్‌ మాధ్యమాల మీదే ఆధారపడుతున్నాయి. షార్ట్‌ వీడియోలు, సోషల్‌ కామర్స్‌లపై ఇన్వెస్ట్‌ చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల డిజిటల్‌ బడ్జెట్లూ ఎక్కువగానే ఉంటున్నాయి. దేశీయంగా డిజిటల్‌ విప్లవం ప్రజల జీవితాలు, పరిశ్రమలు, సమాజంలో పెను మార్పులు తీసుకొస్తోందని, కృత్రిమ మేథ కూడా ఇందుకు దోహదపడుతోందని డెంట్సు దక్షిణాసియా సీఈవో హర్ష రజ్దాన్‌ చెప్పారు. టెక్నాలజీ ఎంత పెరిగినా మానవీయ కోణానికి కూడా ప్రాధాన్యతనివ్వాలని, పారదర్శకత, జవాబుదారీతనం, నైతిక విలువలకు పెద్ద పీట వేస్తూ పరిశ్రమ భవిష్యత్తును తీర్చిదిద్దాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. సోషల్‌ మీడియా హవా...డిజిటల్‌ మీడియా కేటగిరీలో చూస్తే 30% వాటాతో (రూ. 11,962 కోట్లు) సోషల్‌ మీడియా అగ్రస్థానంలో ఉండగా, ఆన్‌లైన్‌ వీడియోలు 29%, పెయిడ్‌ సెర్చ్‌ 23% వాటా దక్కించుకున్నాయి. టెలికం కంపెనీలు తమ డిజిటల్‌ మీడియా బడ్జెట్లో 80% భాగాన్ని ఆన్‌లైన్‌ వీడియో, సోషల్‌ మీడియా, పెయిడ్‌ సెర్చ్‌లకు కేటాయిస్తున్నాయి. ఈ–కామర్స్‌ కంపెనీలైతే తమ మొత్తం మీడియా బడ్జెట్లో 61 శాతాన్ని డిజిటల్‌ మీడియాకు కేటాయిస్తున్నాయి.తెలుగు రాష్ట్రాల్లోనూ అదే తీరు.. తెలుగు రాష్ట్రాల్లోనూ డిజిటల్, సోషల్‌ మీడియా ప్రకటనలు జోరుగానే ఉంటున్నాయి. ముఖ్యంగా ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు వీటికి భారీగానే బడ్జెట్లు కేటాయిస్తున్నాయి. రాజకీయేతర డిజిటల్‌ ప్రకటనల వ్యయాలపై నిర్దిష్ట డేటా లేకపోయినప్పటికీ గత కొన్నాళ్లుగా, చాలా వేగంగా వృద్ధి చెందుతోందని ఓటీఎస్‌ అడ్వర్టైజింగ్‌ అకౌంట్‌ డైరెక్టర్‌ సాయి సిద్ధార్థ్‌ నల్లూరి తెలిపారు. దక్షిణాదివ్యాప్తంగా 2020 నాటి నుంచి గణాంకాలు చూస్తే డిజిటల్‌ అడ్వర్టైజింగ్‌ 30 శాతం వృద్ధి రేటు కనపర్చిందని చెప్పారు. విద్య తదితర రంగాలు డిజిటల్‌పై ప్రధానంగా దృష్టి పెడుతున్నాయని, ఈ సేవల కోసం స్పెషలైజ్డ్‌ ఏజెన్సీలు కూడా వచ్చాయని పేర్కొన్నారు. కోవిడ్‌ తర్వాత సాంప్రదాయ మీడియాపై ప్రకటనల వ్యయాలు తగ్గాయని వివరించారు. – సాక్షి, బిజినెస్‌డెస్క్‌

Shortage Of Medicines In Government Hospitals: Telangana3
జ్వరం గోలీలూ లేవు!

ఆస్పత్రిలో మందుల్లేక..బయట కొనలేక! ఈ ఫొటోలో కన్పిస్తున్న వృద్ధురాలి పేరు మాశమ్మ. నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రానికి సమీపంలోని నాగనూల్‌ గ్రామానికి చెందిన ఈమె ఒంటి నొప్పుల నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రికి వచ్చింది. పరీక్ష చేసిన డాక్టర్‌ మందులు రాశారు. అయితే ఆ మందులు ఆసుపత్రిలో లేవని చెప్పిన సిబ్బంది బయట ప్రైవేటులో తీసుకోవాలని చెప్పారు. డబ్బులు పెట్టి ప్రైవేట్‌ దుకాణంలో మందులు కొనే స్తోమత లేని మాశమ్మ ఇలా నిస్సహాయంగా నిలబడింది.సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రులను మందుల కొరత పీడిస్తోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో (పీహెచ్‌సీలు) పాటు రాష్ట్రంలో కీలకమైన ఉస్మానియా, గాం«దీ, నిలోఫర్, ఎంఎన్‌జే, వరంగల్‌ ఎంజీఎం, ఆదిలాబాద్‌ రిమ్స్‌ వంటి ఆసుపత్రుల్లో కూడా రోగులు మందుల కోసం ఇబ్బందులు పడుతున్నారు. అనేకచోట్ల సాధారణ జబ్బులకు అవసరమైన ట్యాబ్లెట్లు కూడా ఉండటం లేదనే ఆరోపణలు విన్పిస్తున్నాయి.జ్వరానికి వాడే పారాసెటమాల్, జలుబుకు ఉపయోగించే సిటిరిజైన్‌ లాంటివి కూడా బయట కొనుక్కోవాల్సి వస్తోందని రోగులు చెబుతున్నారు. డాక్టర్లు రాసిచ్చిన 5 మందుల్లో కనీసం 2 లేదా 3 బయట కొనుక్కోక తప్పడం లేదని అంటున్నారు. మందుల కొరత నేపథ్యంలో కొన్ని జిల్లా ఆసుపత్రుల్లో అవసరమైన మేరకు కాకుండా 10 రోజుల వరకే మందులు ఇస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.అయితే రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రులకు అవసరమైన మందుల నిల్వలు తమ వద్ద ఉన్నాయని టీజీఎంఎస్‌ఐడీసీ ఎండీ హేమంత్‌ చెపుతున్నారు. అలాగే జిల్లాల్లోని సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్స్‌ (సీడీఎస్‌)లలో కూడా మందుల నిల్వలు ఉన్నాయని ఆయా జిల్లాల డీఎంహెచ్‌ఓలు చెబుతున్నప్పటికీ..వాస్తవ పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉందనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. చాలాచోట్ల అవసరమైన మందుల కోసం ఇండెంట్లు పెట్టేవారే లేరని, మరోవైపు మందులు సమీకరించి పంపాల్సిన టీజీఎంఎస్‌ఐడీసీకి నిధుల కొరత సమస్యగా మారిందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. సాధారణ మందులకూ తిప్పలు తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీజీఎంఎస్‌ఐడీసీ) ద్వారా రాష్ట్రంలోని జిల్లా ఆసుపత్రులు, బోధన కళాశాలలకు అనుబంధంగా ఉన్న ఆసుపత్రులు, పీహెచ్‌సీలకు అక్కడి నుంచి ఆరోగ్య ఉప కేంద్రాలకు మందులు సరఫరా అవుతుంటాయి. ఈ మేరకు జిల్లా ఆస్పత్రులు, తదితర ఆస్పత్రుల నుంచి ఇండెంట్లు అందుతుంటాయి. ఈ విధంగా పలు ఆస్పత్రులు ఇండెంట్‌లు పంపినా కొన్ని మందులు నెలలుగా సరఫరా కావడం లేదు. జ్వరానికి వాడే పారాసెటమాల్‌ టాబ్లెట్‌ ప్రతి ఆసుపత్రిలో తప్పక ఉండాలి.కానీ పెద్దపల్లి జిల్లాలోని కొన్ని పీహెచ్‌సీల్లో ఈ ట్యాబ్లెట్ల కొరత ఉన్నట్లు రోగులు చెపుతున్నారు. ఐదేళ్ల లోపు పిల్లల్లో కంటి చూపు సమస్య నివారణ కోసం వ్యాధి నిరోధక టీకాలకు అనుబంధంగా అందించే విటమిన్‌ –ఏ సిరప్‌ కొరత దాదాపుగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ఉంది. నెల రోజులుగా ఈ సిరప్‌ నిల్వలు నిండుకోగా.. జిల్లా ఆసుపత్రులతో పాటు పీహెచ్‌సీలు, ఇతర ఆరోగ్య కేంద్రాల్లో కేవలం టీకాలు మాత్రమే ఇస్తున్నారు. ఈ సమస్య పరిష్కారానికి మరో 15 రోజులు పట్టే అవకాశం ఉందని వైద్యాధికారులే చెపుతున్నారు.అలాగే సర్వ సాధారణ మందులైన రాన్‌టాక్, పాన్‌టాప్, జోఫర్, డైసైక్లోమిన్, ఎవిల్, ఫెరజోడిన్, సిటిరిజైన్, మెట్రోజిల్, బెటాడిన్‌ ఆయింట్‌మెంట్, డైక్లో, స్రైబీష్‌ లోషన్‌ వంటివి కూడా కొన్నిచోట్ల అందుబాటులో లేవు. పీహెచ్‌సీల్లో బీపీ, షుగర్‌కు సంబంధించి నెల రోజులకు సరిపడే మందులు ఇవ్వాల్సి ఉండగా, గత కొంతకాలంగా 10 రోజులకే పరిమితం చేస్తున్న పీహెచ్‌సీలు చాలా ఉన్నాయి. జింక్, యాంటి బయోటిక్, ఐరన్‌ గోలీలతో పాటు ఐవీ సెట్లు కూడా చాలా పీహెచ్‌సీలు, ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో లేవని, బయట కొనుక్కోమంటున్నారని రోగులు చెపుతున్నారు. ప్రముఖ ఆసుపత్రుల్లోనూ... ఉస్మానియా, గాందీ, నీలోఫర్, ఎంజీఎం, ఎంఎన్‌జే ఆసుపత్రుల్లో అధికారిక పడకలు, నిత్యం వచ్చే రోగులను పరిగణనలోకి తీసుకుని టీజీఎంఎస్‌ఐడీసీ మందులను సరఫరా చేస్తోంది. 80 శాతం మందులు ఇక్కడి నుంచే వస్తుండగా, మరో 20 శాతం మందులను అత్యవసర పద్ధతిలో ఆసుపత్రి అధికారులు కొనుగోలు చేస్తుంటారు. కానీ 20 శాతం మందుల కొనుగోలుకు సంబంధించి 8 నెలలైనా టెండర్ల ప్రక్రియ పూర్తి కాలేదు. దీంతో పూర్తిస్థాయిలో మందులు అందుబాటులో ఉండటం లేదు. మరోవైపు అధికారిక లెక్కల కంటే రోగుల తాకిడి ఎక్కువగా ఉండటం కూడా సమస్యకు కారణమవుతోంది.ఉస్మానియా ఆసుపత్రిలో 1,100 పడకల వరకు ఉండగా, నిత్యం 1,500 మందికి పైగానే రోగులు వస్తున్నారు. ఇక గాంధీ ఆస్పత్రిలో 1000 పడకలకు గానూ 1,500కు పైనే రోగుల తాకిడి ఉంటోంది. కొన్నిసార్లు (సీజన్‌) ఈ రెండు ఆసుపత్రుల్లో రోగుల సంఖ్య 2 వేలకు పైగానే ఉంటోంది. దీంతో గాం«దీ, ఉస్మానియా ఆసుపత్రుల ఆవరణల్లో అక్రమంగా నిర్వహిస్తున్న ప్రైవేటు మెడికల్‌ దుకాణాలు 24 గంటలు రోగులతో కిటకిటలాడుతూ ఉంటున్నాయి. వరంగల్‌ ఎంజీఎంలో 2,500 నుంచి 3,000 వరకు రోగులు నమోదవుతున్నారు. కాగా మందుల కొరత నేపథ్యంలో జిల్లా ఆసుపత్రులు, మండలాలు, పట్టణ కేంద్రాల్లోని ఆరోగ్య కేంద్రాల పక్కనే ఉంటున్న ప్రైవేటు మెడికల్‌ షాపులే రోగులకు గతవుతున్నాయి. 293 మందులకు 100 కూడా ఉండటం లేదు.. నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) మార్గదర్శకాల ప్రకారం గ్రామాల్లోని పీహెచ్‌సీలు, సబ్‌సెంటర్స్‌లో మందులు, సిరప్‌లు, ఇంజెక్షన్లు, ఆయింట్‌మెంట్లు, లోషన్లు, యాంటి బయాటిక్స్, ఐవీ సెట్లు మొదలైనవన్నీ కలిపి 293 కేటగిరీల మందులు ఉండాలి. జ్వరం, దగ్గు, జలుబుతో వచ్చే రోగులు మొదలుకొని ధీర్ఘకాలిక వ్యాధులైన మధుమేహం, బీపీతో వచ్చే వారికి, చర్మ వ్యాధులు, పాము కాట్లు, పురుగు మందులు తాగి ఆత్మహత్యకు ప్రయత్నిచిన వారికి ఉపయోగపడే మందుల వరకు ప్రతి ఒక్కటీ పీహెచ్‌సీల్లో ఉండాలి.కానీ ప్రస్తుతం రాష్ట్రంలోని 636 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 249 పట్టణ పీహెచ్‌సీలు, 4,693 ఉప ఆరోగ్య కేంద్రాల్లో పలుచోట్ల 50 నుంచి 100 లోపు కేటగిరీల్లోనే మందులు ఉంటున్నాయనే ఆరోపణలున్నాయి. పాముకాటుకు గురై పీహెచ్‌సీలకు వచ్చే వారికి ‘పాం’ ఇంజక్షన్‌ అందుబాటులో ఉండడం లేదు. కుక్కకాటుకు కూడా ఇంజెక్షన్‌ అందుబాటులో ఉండాలని ఎన్‌హెచ్‌ఎం చెపుతుండటం గమనార్హం. మందుల కొరత లేదు.. టీజీఎంఐడీసీ ద్వారా 568 రకాల మందులను కొనుగోలు చేసి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆసుపత్రులకు పంపిస్తున్నాం. ఇందులో ఒక కేటగిరీ కింద 293 రకాల మందులు, మరో కేటగిరీలో 100 రకాల మందులు అవసరానికి అనుగుణంగా పంపిస్తాం.ప్రధాన ఆసుపత్రులైన ఉస్మానియా, గాం«దీ, ఎంఎన్‌జే, నీలోఫర్, ఎంజీఎం ఆసుపత్రులను వారానికోసారి సంప్రదించి ఇండెంట్‌ ద్వారా వారికి అవసరమైన మందులను పంపిస్తాం. అలాగే జిల్లాల్లోని సీడీఎస్‌లకు కూడా వారు పంపే ఇండెంట్లను బట్టి మందులు పంపిస్తున్నాం. మందుల కొరత లేదు. ఎక్కడైనా ఉన్నట్లు మా దృష్టికి వస్తే వెంటనే పంపించే ఏర్పాటు చేస్తాం. – హేమంత్‌ (టీజీఎంఐడీసీ ఎండీ) పాముకాటు మందు కోసం 17 కి.మీ ప్రయాణం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మండలంలోని ఓ గ్రామానికి చెందిన శ్రీను కొన్నిరోజుల క్రితం ఓ ఇంటి దగ్గర ఉదయం వేళ పనిచేస్తుండగా, కట్టెల కింద పడుకున్న విషపు పాము చేతిపై కాటేసింది. అక్కడే ఉన్న శ్రీను బావ తాడుతో చేయికి కట్టుకట్టి, బైక్‌పైన గ్రామంలోని పీహెచ్‌సీకి తీసుకెళ్లాడు. అక్కడ పాము కాటుకు వేసే మందు ‘పాం’ అందుబాటులో లేదు. కరీంనగర్‌ వెళ్లాలని సిబ్బంది సూచించారు. దాంతో బైక్‌ పైనే అక్కడికి 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న కరీంనగర్‌ పెద్దాసుపత్రికి వెళ్లగా వైద్యులు చికిత్స అందించి ప్రాణాలు కాపాడారు.

Rasi Phalalu: Daily Horoscope On 15-03-2025 In Telugu4
ఈ రాశి వారికి కొత్త వ్యక్తులతో పరిచయం.. శుభవార్తలు వింటారు

గ్రహం అనుగ్రహం: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, తిథి: బ.పాడ్యమి ప.1.02 వరకు, తదుపరి విదియ, నక్షత్రం: ఉత్తర ఉ.7.48 వరకు, తదుపరి హస్త, వర్జ్యం: సా.5.02 నుండి 6.46 వరకు, దుర్ముహూర్తం: ఉ.6.18 నుండి 7.47 వరకు, అమృతఘడియలు: రా.3.29 నుండి 5.15 వరకు; రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు, యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు, సూర్యోదయం: 6.13, సూర్యాస్తమయం: 6.06.మేషం: పనులలో విజయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. విందువినోదాలు. వ్యాపారాలు కొంత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ఉన్నతస్థితి.వృషభం: ఆర్థిక విషయాలు కొంత నిరాశ పరుస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనుకోని ప్రయాణాలు. దైవదర్శనాలు. ఉద్యోగయత్నాలు నెమ్మదిస్తాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.మిథునం: సన్నిహితులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. పనులు మధ్యలో విరమిస్తారు. దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు. ధన్యయం.కర్కాటకం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.సింహం: వ్యయప్రయాసలు. బంధువులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. విద్యార్థులకు నిరాశ. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు.కన్య: పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆహ్వానాలు అందుతాయి. కొన్ని వివాదాలు తీరతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో హోదాలు.తుల: వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. అనారోగ్యం. శ్రమ తప్పదు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.వృశ్చికం: కొన్ని వివాదాలు పరిష్కారమవుతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వాహనయోగం. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.ధనుస్సు: ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. పనుల్లో విజయం. శుభవార్తలు వింటారు. నూతన ఉద్యోగప్రాప్తి. భూలాభాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అనుకూలత.మకరం: కుటుంబంలో ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. శ్రమకు ఫలితం కనిపించదు. నిరుద్యోగుల యత్నాలు నిరాశ పరుస్తాయి. వ్యాపారాలు నిదానిస్తాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు. ఆలయ దర్శనాలు.కుంభం: పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో వివాదాలు. విద్యార్థులకు నిరుత్సాహం. దైవదర్శనాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో మార్పులు.మీనం: వ్యవహారాలలో విజయం. శుభకార్యాలకు హాజరవుతారు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.

DMK government in Tamil Nadu is one step ahead of the Trinamool government in Bengal5
‘రూ’పం... సారం

నిరుడు లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించి వరసగా మూడోసారి కేంద్రంలో అధికారంలోకొచ్చిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి విపక్షాల ఆధ్వర్యంలోని రెండు రాష్ట్రాలు గట్టి ప్రతిఘటననిస్తున్నాయి. ఇందులో తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం బెంగాల్‌లోని తృణమూల్‌ సర్కారుకన్నా ఒకడుగు ముందుంది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌ ఒకపక్క నియోజక వర్గాల పునర్విభజన, మరోపక్క హిందీ భాష పెత్తనం అనే రెండు పదునైన ఆయుధాలతోకేంద్రాన్ని ఇరకాటంలో పడేస్తున్నారు. పార్లమెంటులోనూ, వెలుపలా ఈ రెండింటిపైనా విస్తృతమైన చర్చ జరిగేలా చూస్తున్నారు. నిత్యం పతాక శీర్షికలకెక్కుతున్నారు. శుక్రవారం ప్రవేశపెట్టే 2025–26 రాష్ట్ర బడ్జెట్‌ లోగో లోని హిందీ అక్షరం‘రూ’ బదులు తమిళ అక్షరం ‘రూ’ను వినియోగించబోతున్నా మని గురువారం స్టాలిన్‌ ప్రకటించటం అందులో భాగమే. అయితే తమ ఉద్దేశం తమిళభాష ఔన్న త్యాన్ని పెంచటమే తప్ప, హిందీని వ్యతిరేకించటం కాదని డీఎంకే ప్రతినిధి శరవణన్‌ వివరణ నిచ్చారు. హిందీ ‘రూ’ జాతీయ కరెన్సీ అధికారిక చిహ్నంగా 2010 జూలై నుంచి అమల్లోవుంది.వచ్చే ఏడాది జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల దృష్టితోనే డీఎంకే ఇలాంటి విన్యాసాలు చేస్తున్న దని బీజేపీ అంటున్నా, ఆ పార్టీ లేవనెత్తుతున్న రెండు అంశాలూ కొట్టిపారేయదగ్గవి కాదు.రాజ్యాంగం నిర్దేశించిన ఫెడరలిజం భావనను కేంద్రం నీరుగారుస్తోందన్న అభిప్రాయం రాష్ట్రాల్లో బలపడనట్టయితే డీఎంకే లేవనెత్తిన అంశాలకు ఇప్పుడున్నంత ప్రాముఖ్యత లభించేది కాదన్నది వాస్తవం. ఇంతకూ జాతీయ కరెన్సీ చిహ్నం రూపొందించింది తమిళనాడు వ్యక్తి, పైగా డీఎంకే మాజీ ఎమ్మెల్యే కుమారుడు. కనుకనే డీఎంకే నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ చిహ్నంలో హిందీ అక్షరమేవున్నా ఇంగ్లిష్‌ అక్షరం ‘ఆర్‌’ను కూడా పోలివుండటం దాని ప్రత్యేకత. కానీ సమస్య తలెత్తినప్పుడు ఇవన్నీ మరుగున పడతాయి. ఆ సంగతలా వుంచి ఈ అంశంలో బీజేపీ స్పందనలు శ్రుతిమించాయి. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ కరెన్సీ చిహ్నం మార్పు దేశ ఐక్యతను బలహీనపరిచే ప్రమాదకరమైన మనస్తత్వం పర్యవసానమని అభివర్ణించారు. హిందీ అమలుకు అనుసరించే విధానాలవల్లే ఆ భాషపై వ్యతిరేకత వస్తోంది. ఇది బీజేపీతో మొదలు కాలేదు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోవున్నా ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. వాటికి ఎప్పటికప్పుడు ప్రతిఘటన వస్తూనే వున్నది. 2008లో యూపీఏ సర్కారు హిందీ వాడకాన్ని పెంచడానికంటూ విడుదల చేసిన సర్క్యులర్‌పై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. మెట్రిక్, ఆపై స్థాయి అభ్యర్థులకు కేంద్ర నియామకాల కోసం నిర్వహించే పోటీ పరీక్షల్లో తప్పనిసరిగా హిందీ ప్రశ్నపత్రం ఉండాలన్నది సర్క్యులర్‌ సారాంశం. తమ పార్టీ ఆధ్వర్యంలోని యూపీఏ సర్కారే దీన్ని తీసుకొచ్చినా అప్పటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. ఇతర ప్రశ్న పత్రాల్లో మెరుగైన మార్కులు వచ్చినా హిందీలో ఫెయిలైతే ఉద్యోగానికి అనర్హులవు తారని ఆ ప్రతిపాదన తెలిపింది. ఇది హిందీ భాషా ప్రాంతాల అభ్యర్థులకే లాభిస్తుందనీ, దక్షిణాదికి అన్యాయం జరుగుతుందనీ వైఎస్‌ లేఖ రాశారు. చివరకు ఆ సర్క్యులర్‌ను ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత 2014, 2017, 2019లలో సైతం కేంద్రం ఈ మాదిరి ప్రతిపాదనలే ముందుకు తోసింది. ఇంగ్లిష్‌కు ప్రత్యామ్నాయంగా హిందీ ఉండాలని రెండేళ్ల క్రితం కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అన్నప్పుడు కూడా వివాదం రేగింది.జాతీయ విద్యావిధానం–2020తో తమిళనాడుకు పేచీవుంది. తాము ఎప్పటినుంచో వ్యతిరేకి స్తున్న త్రిభాషా సూత్రాన్ని తీసుకురావటమే ఆ విద్యావిధానం సారాంశమని డీఎంకే అంటున్నది. ఆ విధానం ప్రకారం విద్యార్థి మాతృ భాషతోపాటు ఇంగ్లిష్, మరేదైనా దేశీయ భాష నేర్చుకోవాలన్న నిబంధన వుంది. హిందీయే నేర్చుకోవాలని అందులో లేదన్నది నిజమే కావొచ్చుగానీ... వేరే భాష నేర్చుకోవాలనుకుంటే ఆ భాషా ఉపాధ్యాయులు అందుబాటులో ఉండే అవకాశముందా? హిందీ ప్రాంతాల్లో దక్షిణాది భాషలు నేర్పే టీచర్లే లేరు. అసలు ఈ త్రిభాషాసూత్రం వల్ల ఈ స్థాయిలో మేలు జరిగిందని చెప్పే గణాంకాలున్నాయా? జాతీయ విద్యావిధానం అమలు చేయలేదన్న కార ణంతో సమగ్ర శిక్షా అభియాన్‌ (ఎస్‌ఎస్‌ఏ) కింద కేంద్రం నుంచి రావాల్సిన 2,152 కోట్లను నిలిపివేశారని తమిళనాడు ఆరోపిస్తోంది. ఎస్‌ఎస్‌ఏకు రావాల్సిన ఆ నిధులను సొంత వనరులనుంచే సమీకరించాలని నిర్ణయించినట్టు ఆ రాష్ట్ర బడ్జెట్‌లో ప్రకటించారు. హిందీకి వ్యతిరేకమనో, నూతన విద్యావిధానానికి వ్యతిరేకమనో చూపి నిధులు ఆపేయటం ఒత్తిడి తీసుకొచ్చే మార్గమనికేంద్రం అనుకోవచ్చుగానీ... దీన్ని బెదిరించటంగా, బ్లాక్‌మెయిల్‌గా తమిళనాడు పరిగణిస్తోంది. విద్యాపరంగా చూసినా, పన్నుల వసూళ్లపరంగా చూసినా తమిళనాడు అనేక రాష్ట్రాలకన్నా ఎంతో ముందుంది. అందుకు ఇదా బహుమతి అనే ప్రశ్న తలెత్తదా?అమల్లోకి తీసుకురాదల్చుకున్న ఏ విధానంపైన అయినా సమగ్ర చర్చ జరపడం, అపోహల్ని తొలగించటం అవసరమని కేంద్రం గ్రహించాలి. ప్రాథమిక స్థాయి విద్య మొదలుకొని విశ్వవిద్యా లయ విద్యవరకూ అన్నింటా తన ఆధిపత్యమే ఉండాలన్న ఆత్రుత వేరే పర్యవసానాలకు దారి తీస్తున్నదని గుర్తుంచుకోవాలి. రాష్ట్రాలను మున్సిపాలిటీల స్థాయికి దిగజారిస్తే, ఫలానా పథకం అమలు చేయలేదన్న కారణం చూపి నిధులు ఎగ్గొడితే సాధారణ ప్రజలకు వేరే సంకేతాలు పోతాయి. ఆ పరిస్థితి తలెత్తకుండా చూసుకోవటం కేంద్రం బాధ్యత.

Mumbai Indians face Delhi Capitals in WPL 2025 final today6
ఢిల్లీ ఈ సారైనా సాధించేనా!

ముంబై: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో 17 సీజన్ల పాటు ఆడినా ఢిల్లీ జట్టు టైటిల్‌ గెలవలేకపోయింది. అదే యాజమాన్యానికి చెందిన మహిళల జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌ కూడా ఉమెన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)లో వరుసగా రెండు సీజన్ల పాటు నిరాశపర్చింది. 2023, 2024 సీజన్లలో గ్రూప్‌ దశలో టాపర్‌గా నిలవడంతో ఫైనల్‌కు చేరిన క్యాపిటల్స్‌ రెండుసార్లూ ఫైనల్‌ మ్యాచ్‌లలో ఓడి రన్నరప్‌గానే సంతృప్తి చెందాల్సి వచ్చింది. ఇప్పుడు తాజా సీజన్‌లో కూడా టాపర్‌గా ఫైనల్‌ చేరిన టీమ్‌ మరోసారి ట్రోఫీ కోసం తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. నేడు జరిగే ఫైనల్లో 2023 చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆడుతుంది. తాజా సీజన్‌ లీగ్‌ దశలో ఇరు జట్ల మధ్య జరిగిన రెండు మ్యాచ్‌లలోనూ ఢిల్లీనే నెగ్గి 2–0తో ఆధిక్యం ఉంది. అంతర్జాతీయ మహిళల క్రికెట్‌లో ఆల్‌టైమ్‌ గ్రేట్‌ కెప్టెన్ గా ఉన్న మెగ్‌ లానింగ్‌ గత ఏడాది ఢిల్లీకి టైటిల్‌ అందించడంలో విఫలమైంది. ఈసారి అది పునరావృతం కాకుండా సత్తా చాటాలని ఆమె పట్టుదలగా ఉంది. సీజన్‌లో ఏకంగా 157.89 స్ట్రయిక్‌ రేట్‌తో 300 పరుగులు చేసిన షఫాలీ వర్మ మరోసారి టీమ్‌కు కీలకం కానుంది.మెగ్‌ లానింగ్‌ కూడా 263 పరుగులతో టీమ్‌ విజయాల్లో ప్రధాన పాత్ర పోషించింది. జెమీమా రోడ్రిగ్స్‌ మాత్రం ఆశించినంత మెరుగైన ప్రదర్శన ఇవ్వలేదు. ఫైనల్లోనైనా ఆమె రాణించాల్సి ఉంది. ఆల్‌రౌండర్‌గా జెస్‌ జొనాసెన్‌ టోర్నీలో చక్కటి ప్రదర్శన కనబర్చింది. 137 పరుగులతో పాటు 11 వికెట్లు తీసిన ఆమెకు శిఖా పాండే (11) అండగా నిలిచింది. వీరిద్దరితో పాటు అనాబెల్‌ సదర్లాండ్‌ తమ బౌలింగ్‌తో ప్రత్యరి్థని కట్టడి చేయగలరు. దూకుడైన బ్యాటింగే ముంబై ప్రధాన బలం. నాట్‌ సివర్‌ 156.50 స్ట్రయిక్‌రేట్‌తో 5 అర్ధసెంచరీలు సహా 493 పరుగులు సాధించి అగ్ర స్థానంలో ఉంది. హేలీ మాథ్యూస్‌ (304) కూడా దూకుడైన ఆటకు మారు పేరు. కెపె్టన్‌గా హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ కూడా 156.29 స్ట్రయిక్‌ రేట్‌తో 236 పరుగులు చేసి తన వంతు పాత్ర పోషించింది. బౌలింగ్‌లో హేలీ, అమెలియా కెర్‌ కలిసి 33 వికెట్లతో ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. సమష్టిగా సత్తా చాటడంతో ముంబై జట్టుదే పైచేయి. ఈ నేపథ్యంలో అంతిమ విజేత ఎవరు అవుతారనేది చూడాలి.

India ranks first among countries attacked by hackers7
ఫైర్‌ లేని వాల్స్‌!

సాక్షి, హైదరాబాద్‌: ప్రతీ రంగంలో సాంకేతికత అత్యంత కీలకంగా మారింది. అదేస్థాయిలో సైబర్‌ దాడుల ముప్పు పొంచి ఉంటోంది. ఏదైనా సంస్థ నెట్‌వర్క్‌ను భద్రంగా ఉంచేందుకు పటిష్టమైన ఫైర్‌వాల్‌ రక్షణ వ్యవస్థ తప్పనిసరి. అయితే, హ్యాకర్ల దాడుల విషయంలో భారతీయ కంపెనీలకు చెందిన నెట్‌వర్క్‌లు బలహీనమని గ్రూప్‌–ఐబీ సంస్థ ఇటీవల విడుదల చేసిన హైటెక్‌ క్రైం ట్రెండ్స్‌ రిపోర్ట్‌–2025లో వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా 2024లో జరిగిన సైబర్‌ దాడుల్లో అత్యధికంగా 13 శాతం ఘటనలు భారత్‌లోనే జరిగినట్టు ఆ నివేదిక స్పష్టంచేసింది. ప్రధానంగా విద్యాసంస్థలకు సంబంధించిన నెట్‌వర్క్‌లపైనే హ్యాకర్లు దాడులకు పాల్పడుతున్నట్లు వెల్లడించింది. ఆ తర్వాత ప్రభుత్వరంగ సంస్థల నెట్‌వర్క్, మిలిటరీ, ఆర్థికసేవల సంస్థల నెట్‌వర్క్‌లు హ్యాకర్లకు లక్ష్యంగా మారుతున్నాయని పేర్కొంది. హ్యాకర్లు ఫైర్‌వాల్స్‌ను ఛేదించి సదరు నెట్‌వర్క్‌లోకి చొరబడి మొత్తం వ్యవస్థను తమ అ«దీనంలోకి తీసుకుని సున్నితమైన సమాచారాన్ని తస్కరిస్తున్నట్టు తెలిపింది. డేటా లీకేజీలో అమెరికాది తొలిస్థానంపబ్లిక్‌ డొమైన్‌లో ఉండే డేటా లీకేజీలో అమెరికా తొలిస్థానంలో ఉన్నట్టు నివేదిక తెలిపింది. 2024లో ఈ తరహా ఘటనలు అమెరికాలో 214 నమోదైనట్టు పేర్కొంది. తర్వాత స్థానంలో రష్యా (195 ఘటనలు) ఉండగా.. భారత్‌ (60) మూడో స్థానంలో నిలిచినట్టు గ్రూప్‌–ఐబీ నివేదిక పేర్కొంది. ఈ–మెయిల్‌ అడ్రస్‌లు, ఫోన్‌ నంబర్లు, పాస్‌వర్డ్‌లు ఈ డేటా లీకేజీలో ఉంటు­న్నాయి. 2024లో ఈ–మెయిల్‌ అడ్రస్‌లు, పాస్‌వర్డ్‌లను డార్క్‌వెబ్‌లో విక్రయించడం ద్వారానే సైబర్‌ నేరగాళ్లు రూ.248.9 కోట్లు కొల్లగొట్టారు.ఫైర్‌వాల్స్‌ అంటే? అనధికారికంగా నెట్‌వర్క్‌లోకి చొరబడకుండా, హానికరమైన డేటాను నెట్‌వర్క్‌లోకి చొప్పించకుండా రక్షించే భద్రతా పరికరమే ఫైర్‌వాల్‌. ఇది హార్డ్‌వేర్‌ లేదా సాఫ్ట్‌వేర్‌ కావొచ్చు. నెట్‌వర్క్‌ ప్యాకెట్‌లను పరిశీలించి వాటిని అనుమతించాలా లేదా నిరోధించాలా అనేదాన్ని ఫైర్‌వాల్‌ నిర్ణయిస్తుంది. ఫైర్‌వాల్స్‌ ఇంటర్నెట్‌ ద్వారా కంప్యూటర్‌ లేదా నెట్‌వర్క్‌ను యాక్సెస్‌ చేయకుండా హానికరమైన సాఫ్ట్‌వేర్‌ను నిరోధించగలవు.

High Court denies bail to Devendra  and Shilpa8
అవును.. వాళ్లు యువతులను మావోల్లో చేర్పిస్తున్నారు

సాక్షి, అమరావతి: యువతులకు బ్రెయిన్‌వాష్‌ చేసి వారిని నిషేధిత మావోయిస్టు పార్టీలో చేర్పిస్తున్న వ్యవహారంలో నిందితులుగా ఉన్న డొంగరి దేవేంద్ర, చుక్కా శిల్పలకు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దాఖలు చేసిన కేసులో బెయిల్‌ కోసం వారు దాఖలు చేసిన అప్పీళ్లను హైకోర్టు కొట్టేసింది. బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరిస్తూ కింది కోర్టు గతంలో జారీచేసిన ఉత్తర్వుల్లో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. పిటిషనర్లు యువ­తులకు బ్రెయిన్‌­వాష్‌ చేసి మావో­యిస్టు పార్టీలో చేర్పిస్తున్నారనేందుకు ప్రాథమిక ఆధారాలు­న్నాయని హైకోర్టు తేల్చిచెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ కంచిరెడ్డి సురేష్‌రెడ్డి, జస్టిస్‌ తూటా చంద్ర ధనశేఖర్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది.నా కుమార్తెను బలవంతంగా చేర్చారు..డొంగరి దేవేంద్ర, చుక్కా శిల్ప మరికొందరు కలిసి మావోయిస్టు పార్టీలోకి యువతులను చేర్పించేందుకు చైతన్య మహిళా సంఘం (సీఎంఎస్‌) పేరుతో ఓ సంఘం ఏర్పాటుచేశారు. సామాజిక సేవ నెపంతో యువతులను చేరదీసి, వారు మావోయిస్టు భావజాలానికి ఆకర్షితు­లయ్యేలా చేసి, ఆ తరువాత మావోయిస్టుల్లో చేర్పిస్తున్నారు. ఇదే రీతిలో విశాఖపట్నం, పెద్దబయలుకు చెందిన రాధా అనే యువతిని 2017లో మావోయిస్టుల్లో చేర్పించారు.2021లో రాధా తల్లి తన కుమార్తెను బలవంతంగా మావోయిస్టుల్లో చేర్పించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు తీవ్రత దృష్ట్యా దర్యాప్తు బాధ్యతలను ఎన్‌ఐఏకి అప్పగించారు. ఎన్‌ఐఏ చార్జిషీట్‌ దాఖలు చేసింది. ఇదిలాఉంటే.. ఈ కేసులో తమకు బెయిల్‌ ఇవ్వాలంటూ డొంగరి దేవేంద్ర, చుక్కా శిల్ప విశాఖపట్నంలోని ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణ జరిపిన ప్రత్యేక కోర్టు వారి బెయిల్‌ పిటిషన్లను కొట్టేస్తూ 2024 మే 29న తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాలుచేస్తూ వారిరువురూ హైకోర్టులో క్రిమినల్‌ అప్పీళ్లు దాఖలు చేశారు. ఈ అప్పీళ్లపై జస్టిస్‌ సురేష్‌రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.మావోయిస్టు కార్యకలాపాల్లో క్రియాశీలకంగా..పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది ఎ. సత్య­ప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ.. 2017లో రాధాను తీసుకెళ్లారంటూ ఆమె తల్లి 2021లో పోలీసులకు ఫిర్యాదు చేశారని.. కానీ, అప్పటికే ఆమె నాలుగేళ్ల­పాటు మౌనంగా ఉన్నారన్నారు. ఎన్‌ఐ­ఏ తరఫున డిప్యూటీ సొలిసి­టర్‌ జనరల్‌ (డీఎస్‌జీ) పసల పొన్నారావు వాదనలు వినిపిస్తూ.. పిటిషన­ర్లకు మావోయిస్టులతో సంబంధాలున్నాయని తేల్చి­చెప్పారు. ఇందుకు సంబంధించి ఎన్‌ఐఏ పలు కీలక ఆధారాలు సేకరించిందన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మా­సనం, ఎన్‌ఐఏ సేకరించిన ఆధారాలను, అది దాఖలు చేసిన చార్జిషీట్‌ను పరిశీలించింది. పిటిషనర్లకు బెయిల్‌ నిరాకరిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పులో ఏ రకంగానూ జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. పిటిషనర్లు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్లను కొట్టేస్తున్నట్లు తెలిపింది.

JD Vance says green card holders cannot stay indefinitely in US9
గ్రీన్‌ కార్డు శాశ్వత నివాసానికి... హక్కు కాదు: వాన్స్‌

వాషింగ్టన్‌/న్యూఢిల్లీ: అమెరికా వలస విధానంపై ఇప్పటికే ప్రపంచ దేశాల్లో నెలకొన్న ఆందోళనలను మరింతగా పెంచే పరిణామం చోటుచేసుకుంది. డాలర్‌ డ్రీమ్స్‌ను నిజం చేసుకోవడానికి రాచబాటగా భావించే అమెరికా గ్రీన్‌కార్డుపై ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రీన్‌కార్డు ఉన్నంతమాత్రాన అమెరికాలో నివాసానికి, పని చేయడానికి శాశ్వత హక్కులు దఖలు పడ్డట్టు కాదని స్పష్టం చేశారు. న్యూయార్క్‌లోని ప్రఖ్యాత కొలంబియా యూనివర్సిటీ గ్రాడ్యుయేట్‌ విద్యార్థి మహ్మద్‌ ఖలీల్‌ యూదు విద్వేష ఆరోపణలపై ఇటీవలే అరెస్టవడం తెలిసిందే. అతను గ్రీన్‌కార్డు హోల్డరే కావడాన్ని ప్రస్తావిస్తూ వాన్స్‌ పలు వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇదేమీ వాక్‌ స్వాతంత్య్రానికి సంబంధించిన అంశం కాదు. జాతీయ భద్రతకు సంబంధించిన అతి కీలకమైన విషయం. అంతకుమించి, అమెరికాలో శాశ్వత నివాసులుగా మాతోపాటు ఎవరుండాలన్న దానికి సంబంధించిన అంశం. దీన్ని నిర్ణయించేది అమెరికన్లు మాత్రమే’’ అంటూ కుండబద్దలు కొట్టారు. ఆయన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా, ముఖ్యంగా భారత్‌లో దుమారం రేపుతున్నాయి. ఏటా భారీ సంఖ్యలో అమెరికా బాట పట్టే భారత విద్యార్థులందరికీ గ్రీన్‌కార్డు ఒక బంగారు కల. అది చిక్కిందంటే అమెరికాలో శాశ్వత నివాసం దక్కినట్టేనని భావిస్తారు. వాన్స్‌ వ్యాఖ్యలు వారినేగాక అమెరికాలో గ్రీన్‌కార్డు హోల్డర్లయిన లక్షలాది మంది భారతీయులను కూడా కలవరపాటుకు గురిచేస్తున్నాయి. గురువారం ఫాక్స్‌ న్యూస్‌ చానల్‌ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందర్భంగా వలస విధానాలకు సంబంధించి వాన్స్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘కొలంబియా వర్సిటీలో హమాస్‌ భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్న విద్యార్థి ఖలీల్‌ కూడా గ్రీన్‌కార్డు హోల్డరే. అందుకే చెబుతున్నా, గ్రీన్‌కార్డు హోల్డర్‌కు అమెరికాలో శాశ్వతంగా ఉండిపోయే హక్కు లేదు’’ అని స్పష్టం చేశారు. గ్రీన్‌కార్డు హోల్డర్లయినా సరే, అమెరికా భద్రతకు ముప్పు కలిగించే కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్టు అనుమానిస్తున్న విద్యార్థులు తదితరులపై కఠిన చర్యలకు ట్రంప్‌ సర్కారు సిద్ధమవుతోందని ఉపాధ్యక్షుడు ప్రకటించారు. ‘‘వారి ఉనికి అమెరికాకు ముప్పని తేలిన పలువురిని త్వరలో తిప్పి పంపుతున్నాం. ఈ జాబితాలో విద్యార్థులతో పాటు ఇతరులు కూడా ఉన్నారు’’ అని వివరించారు. ట్రంప్‌ రాకతో అమెరికాలోకి అక్రమ వలసలు 95 శాతానికి పైగా తగ్గిపోయాయన్నారు.ఏమిటీ గ్రీన్‌కార్డు? పర్మనెంట్‌ రెసిడెంట్‌ (శాశ్వస నివాస) కార్డు. గ్రీన్‌కార్డుగా భారత్‌లో దాదాపు ఇంటింటికీ పరిచయం. ఇది విదేశీ పౌరులకు అమెరికాలో నివసించేందుకు, పని చేసుకునేందుకు హక్కు కల్పిస్తుంది. అంతేగాక కోరుకున్న కంపెనీలో పని చేయవచ్చు. సొంత వ్యాపారం వంటివీ చేసుకోవచ్చు. గ్రీన్‌కార్డు పొందిన మూడు నుంచి ఐదేళ్లకు పౌరసత్వం కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే నిజానికిది పేరుకే శాశ్వత నివాస కార్డు. వాన్స్‌ చెప్పినట్టుగా అమెరికాలో శాశ్వతంగా ఉండేందుకు హక్కు కల్పించదు. దీన్ని పదేళ్ల కాలపరిమితితో జారీ చేస్తారు. కొన్ని పరిస్థితుల్లో గ్రీన్‌కార్డును రద్దు చేయవచ్చు. నేర కార్యకలాపాల్లో పాల్గొన్నా, చాలాకాలం పాటు అమెరికాకు దూరంగా ఉన్నా, వలస నిబంధనలను ఉల్లంఘించినా గ్రీన్‌కార్డును కోల్పోతారు. అమెరికాలో నివసిస్తున్న భారతీయులు దశాబ్దాలుగా గ్రీన్‌కార్డుల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. వారిలో చాలామందికి కార్డు దక్కాలంటే 50 ఏళ్ల దాకా పట్టొచ్చట. కొన్ని కేటగిరీల వాళ్లకైతే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి గ్రీన్‌కార్డు రావాలంటే 134 సంవత్సరాలు పడుతుంది! 3.4 కోట్ల మందికి పైగా గ్రీన్‌కార్డు కోసం ఎదురు చూస్తుండగా వారిలో 11 లక్షల మందికి పైగా భారతీయులే! వీరిలో 4 లక్షల మంది తమ జీవితకాలంలో కార్డును కళ్లజూడలేరన్నది ఇమిగ్రేషన్‌ నిపుణుల మాట. అమెరికా ఏటా గరిష్టంగా 6.75 లక్షల గ్రీన్‌కార్డులు మాత్రమే జారీ చేస్తుంది. వాటిలో ఏ దేశానికీ 7 శాతానికి మించి ఇవ్వరాదన్న నిబంధన ఉంది. ఇదే భారతీయులకు పెద్ద అడ్డంకిగా మారింది. ప్రస్తుతం అమెరికాలో గ్రీన్‌కార్డున్న భారతీయుల సంఖ్య 3 లక్షలకు పైగా ఉంటుంది. గోల్డ్‌ కార్డు రాకతో... అమెరికాలో శాశ్వత నివాసానికి ట్రంప్‌ ఇటీవల కొత్తగా గోల్డ్‌ కార్డు స్కీమును ప్రకటించిన నేపథ్యంలో గ్రీన్‌కార్డు ప్రాధాన్యతను తగ్గించేలా వాన్స్‌ చేసిన వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘‘ఇప్పటిదాకా గ్రీన్‌కార్డుంది. ఇకపై గోల్డ్‌కార్డు తెస్తున్నాం. గ్రీన్‌కార్డు ఇచ్చే సదుపాయాలన్నింటినీ ఇదీ ఇస్తుంది. వాటితో అదనంగా అమెరికాలో శాశ్వత నివాసానికి, పౌరసత్వానికి కూడా గోల్డ్‌కార్డు రాచమార్గం’’ అని ట్రంప్‌ చెప్పు కొచ్చారు. అమెరికాలోని అత్యున్నత వర్సిటీల్లో చదివే ప్రతిభావంతులు, భారతీయ విద్యా ర్థులు దేశం దాటకుండా ఆపడంలో తమ వలస విధానం విఫలమైందని ఆయన ఆక్షేపించారు. గోల్డ్‌కార్డుకు 50 లక్షల డాలర్లు (రూ.43.54 కోట్లు) ఫీజుగా నిర్ణయించారు. ‘‘కనీసం కోటి గోల్డ్‌కార్డులు అమ్మాలన్నది మా లక్ష్యం. తద్వారా వచ్చే ఆదాయంతో అమెరికా అప్పు తీరుస్తాం’’ అని ట్రంప్‌ ప్రకటించారు. 1990 నుంచి అమల్లో ఉన్న ఈబీ–5 వీసాలను గోల్డకార్డు భర్తీ చేసింది.

A credit score reflects a persons financial history10
పడిపోతున్న సిబిల్!

హిందూపురానికి చెందిన కరీముల్లా ఆర్నెళ్ల క్రితం రూ.లక్ష విలువ చేసే ఫర్నిచర్‌ను ఓ ప్రైవేటు సంస్థ ద్వారా ప్రతి నెలా రూ.5 వేలు చెల్లించేలా ఒప్పందంపై కొనుగోలు చేశాడు. తొలి నాలుగు నెలలు సజావుగానే ఈఎంఐ చెల్లించాడు. ఆ తర్వాత అతడు చేస్తున్న చిరుద్యోగం కాస్త ఊడిపోయింది. దీంతో కంతులు చెల్లించడంలో జాప్యం నెలకొంది. ఫలితంగా ఆర్నెల్ల తర్వాత చూసుకుంటే ఆయన సిబిల్‌ స్కోరు ఒక్కసారిగా 300కు పడిపోయింది. పుట్టపర్తికి చెందిన చిరు వ్యాపారి కృష్ణసాయి తన అవసరాల నిమిత్తం ఓ బ్యాంకులో వ్యక్తిగత రుణం తీసుకున్నాడు. అనివార్య కారణాలతో వ్యాపారం తీసేయాల్సి వచ్చింది. దీంతో నెలవారీ కంతులు చెల్లించడంలో ఇబ్బందులు నెలకొని సిబిల్‌ స్కోరు 200కు పడిపోయింది. ఆ తర్వాత ఎన్ని బ్యాంకుల్లో ప్రయత్నించినా.. కొత్త రుణం ఆయనకు పుట్టలేదు. .... ఇప్పట్లో సిబిల్‌ స్కోరుకు పెరిగిన ప్రాధాన్యతకు ఈ ఘటనలు ఓ ఉదాహరణ మాత్రమే. ఆర్థిక నియంత్రణ కోల్పోతే భవిష్యత్తు కష్టమని ఆర్థిక నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. సాక్షి, పుట్టపర్తి: ఎవరైనా వ్యక్తి ఆర్థిక చరిత్రకు అద్దం పట్టేది క్రెడిట్‌ స్కోరు. ఇక్కడ తీసుకున్న లోన్లు.. చెల్లింపుల తీరు.. క్రెడిట్‌ కార్డుల వినియోగం.. అప్పుల కోసం ఎన్ని సార్లు ప్రయత్నించారు. గతంలో ఏమైనా లోన్లు ఎగ్గొట్టారా.. ఇప్పటికీ ఈఎంఐ కడుతున్నారా.. ఇలా అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. ఈ క్రెడిట్‌ రిపోర్టుతో వ్యక్తి ఆర్థిక క్రమశిక్షణ ఏపాటిదో సులువుగా తెలుసుకోవచ్చు. ఆర్థిక నియంత్రణ క్రమశిక్షణ లేకపోవడం కారణంగా చాలామంది చిరుద్యోగులు, చిరు వ్యాపారులు భారీ మూల్యం చెల్లించుకుంటున్నారు. అప్పు చేసి విలాసాలు.. పులిని చూసి నక్క వాత పెట్టుకున్న చందంగా మారింది ప్రస్తుతం మధ్య తరగతి ప్రజల పరిస్థితి. తమ చుట్టుపక్కల వారు ఏదైనా వస్తువు కొనుగోలు చేస్తే తమ ఇంట్లోనే ఉండాలనే ఆకాంక్ష తప్పు కాదు. అయితే ఇందు కోసం అప్పు చేసి ఆ తర్వాత రుణాలు చెల్లించలేక ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి లేని తలనొప్పులు తెచ్చుకుంటున్నారు. చిన్నపాటి లావాదేవీల విషయంగానే సిబిల్‌ స్కోరు పడిపోయి.. భవిష్యత్తులో బ్యాంకుల ద్వారా రుణాలు పొందే సదుపాయాన్ని కోల్పోతున్న వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. మధ్య తరగతి ప్రజల అవసరాలను తెలివిగా ప్రైవేటు ఫైనాన్స్‌ సంస్థలు సొమ్ము చేసుకుంటున్నాయి. ఆఫర్ల పేరుతో రుణాల ఎర వేసి ఆకట్టుకుంటున్నారు. అయితే రుణం తీసుకునే సమయంలో సరైన ప్లానింగ్‌ లేకపోవడంతో నెలవారీ కంతులు చెల్లించడంలో జాప్యం చోటు చేసుకుని భారీగా నష్టపోతున్నారు. ఆర్థిక క్రమశిక్షణ, అవగాహన లేకుంటే ప్రమాదకర స్థాయికి చేరుకునే అవకాశముందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెరిగిపోతున్న డిఫాల్టర్లు.. జిల్లా వ్యాప్తంగా రకరకాల ప్రైవేటు సంస్థల ద్వారా రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించలేని స్థితిలో చాలా మంది డిఫాల్టర్లుగా మారిపోతున్నారు. ఇటీవల వీరి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. మొబైల్‌ ఫోన్లు, వాషింగ్‌ మెషీన్లు, టీవీలు, ఫ్రిజ్‌లు, ఫర్నిచర్లు... తదితరాలను కొనుగోలు చేసిన వారే ఎక్కువ మంది డిఫాల్టర్లుగా మారినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. సాధారణంగా సిబిల్‌ స్కోరు 650 దాటితే ఏవైనా రుణాలొస్తాయి. కానీ తీసుకున్న రుణం సక్రమంగా చెల్లించకపోవడంతో ప్రతి పది మందిలో ఇద్దరు డిఫాల్టర్లుగా మారుతున్నారు. సున్నా వడ్డీతో ఆకర్షిస్తూ.. పలు ఫైనాన్స్‌ కంపెనీలు జీరో ప్రాసెసింగ్, సున్నా వడ్డీ అంటూ ఇచ్చే ప్రకటనలతో చాలామంది వినియోగదారులు మోసపోతున్నారు. ఎలాంటి వడ్డీ లేకుండా, ప్రాసెసింగ్‌ ఫీజు లేకుండా వస్తువుకు డబ్బు కట్టి, పది నెలలు మనతో రీపేమెంట్‌ ఎందుకు చేసుకుంటాయనే లోగుట్టును చాలా మంది అర్థం చేసుకోలేకపోతున్నారు. ఓ కంపెనీ ఎలాంటి లాభాపేక్ష లేకుండా జీరో ప్రాతిపదికన రుణం ఎందుకు ఇస్తుందనే విషయాన్ని వినియోగదారులు ఆలోచించాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా ఉంటే ఉత్తమమని సూచిస్తున్నారు. సిబిల్‌ స్కోరు కీలకం ప్రస్తుత పరిస్థితుల్లో సిబిల్‌ స్కోరు చాలా కీలకంగా మారింది. చిన్నపాటి అప్పుల సమాచారాన్ని సైతం ఆయా ఫైనాన్స్‌ సంస్థలు సిబిల్‌కు తెలియజేస్తాయి. చెల్లింపుల్లో జాప్యం లేదా మొండి బకాయిలు.. ఇలా రకరకాల కారణంగా చాలామందికి సిబిల్‌ స్కోరు లేక బ్యాంకుల్లో రుణాలు అందడం లేదు. వస్తువు తీసుకున్నాక సకాలంలో చెల్లింపులు చేయకపోతే భవిష్యత్తులో పరపతి లభించడం చాలా కష్టం. – రాధాకృష్ణారెడ్డి, ఆడిటర్, పుట్టపర్తి

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

National View all
title
మన ఏడు రెస్టారెంట్లు ఆసియాలో బెస్ట్‌...

ఉత్తమ హోటళ్లు, బార్లు, రెస్టారెంట్లను గుర్తించడంలో ప్రసిద్ధి చెందిన సంస్థ ‘50 బెస్ట్‌’ఆవిష్కరించిన ఆసియా ఉత్తమ రెస్టారెం

title
ప్రశాంతంగా ముగిసిన  హోలీ, రంజాన్‌ ప్రార్థనలు

న్యూఢిల్లీ: దేశమంతటా హోలీ సంబరాలు అంబరాన్నంటాయి.

title
ఉద్యోగాల కంటే నిరుద్యోగులు ఎన్నో రెట్లు ఎక్కువ

న్యూఢిల్లీ: దేశంలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల కంటే వా

title
పశ్చిమ బెంగాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమ

title
Ranya Rao : మరో బిగ్‌ షాక్‌.. రన్యారావు చుట్టూ బిగుస్తున్న ఉచ్చు!

బెంగళూరు : కన్నడ నటి రన్యారావు (Ranya Rao)

International View all
title
మన ఏడు రెస్టారెంట్లు ఆసియాలో బెస్ట్‌...

ఉత్తమ హోటళ్లు, బార్లు, రెస్టారెంట్లను గుర్తించడంలో ప్రసిద్ధి చెందిన సంస్థ ‘50 బెస్ట్‌’ఆవిష్కరించిన ఆసియా ఉత్తమ రెస్టారెం

title
గ్రీన్‌ కార్డు శాశ్వత నివాసానికి... హక్కు కాదు: వాన్స్‌

వాషింగ్టన్‌/న్యూఢిల్లీ: అమెరికా వలస విధానంపై ఇప్పటికే ప్రపంచ

title
అమెరికాలోనూ నో ట్యాక్స్‌..! ట్రంప్‌ భారీ పన్ను ప్రణాళిక

భారత్‌లో మాదిరిగానే అమెరికాలోనూ ఆదాయపు పన్నుకు సంబంధించి భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది.

title
ఇంజిన్ పేల్చేశారు.. ట్రైన్ కిటికీలు పగలగొట్టారు..!

న్యూఢిల్లీ: పాకిస్తాన్ లో జాఫర్ ఎక్స్ ప్రెస్ ను బలోచిస్తాన్

title
రంగులు పులుముకున్న జాబిల్లి.. ఆకాశంలో ఈ సుందర దృశ్యం చూశారా?

ఆకాశంలో ఇవాళ సుందర దృశ్యం ఆవిష్కృతమైంది. ఈ ఏడాదిలో మొదటి గ్రహణం.. అందునా సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది.

NRI View all
title
గ్రీన్‌కార్డులపై బాంబు పేల్చిన జేడీ వాన్స్‌.. అమెరికా పౌరసత్వం కట్‌!

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసార

title
ఫిలడెల్ఫియాలో తానా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

తానా మిడ్-అట్లాంటిక్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఫిలడెల్ఫియాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు.

title
భారత విద్యార్థుల చూపు.. ఆ దేశాలవైపు!

ఉన్నత విద్య కోసం అగ్ర రాజ్యాలకు వెళ్తున్న భారతీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది.

title
సుదీక్ష మిస్సింగ్‌.. కిడ్నాపైందా?

న్యూఢిల్లీ: కరీబియన్‌ దేశం డొమినికన్‌ రిపబ్లిక్‌లో తెలుగు వి

title
టీటీఏ (TTA) న్యూయార్క్‌ చాప్టర్‌ రీజినల్ వైస్ ప్రెసిడెంట్‌గా జయప్రకాష్ ఎంజపురి

తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్(TTA)  న్యూయార్క్ చాప్టర్‌కి రీజినల్ వైస్ ప్రెసిడెంట్ (RVP)గా జయప్రకాష్ ఎంజపురి &

Advertisement
Advertisement