Top Stories
ప్రధాన వార్తలు
చంద్రబాబే సుప్రీం.. రెడ్బుక్కే రాజ్యాంగం!
సాక్షి, అమరావతి: భారత రాజ్యాంగమే ప్రామాణికం.. సుప్రీంకోర్టు తీర్పులే మార్గ నిర్దేశం.. అన్నది దేశంలో పరిపాలన వ్యవస్థకు దిక్సూచి. పాలకులు, అఖిల భారత సర్వీసు అధికారులతోపాటు అందరూ పాటించాల్సిన విధివిధానాలవి. కానీ రాష్ట్ర సీఐడీ విభాగం అందుకు పూర్తి విరుద్ధంగా బరితెగిస్తోంది. ‘చంద్రబాబే మాకు సుప్రీం.. టీడీపీ రెడ్బుక్కే మాకు రాజ్యాంగం.. చంద్రబాబు అవినీతి కేసులు నీరుగార్చడమే ఏకైక లక్ష్యం’ అని చెలరేగిపోతోంది. అందుకోసం ఏకంగా న్యాయస్థానాల్లో సీఆర్పీసీ 164 కింద నమోదు చేసిన వాంగ్మూలం పవిత్రత, ప్రమాణికతనే దెబ్బ తీసేలా కుట్రలకు పదును పెడుతోంది. ఓసారి సీఆర్పీసీ 164 కింద ఇచ్చిన వాంగ్మూలాన్ని మార్చేందుకు వీల్లేదన్న సుప్రీంకోర్టు మార్గదర్శకాలను బరితెగించి మరీ ఉల్లంఘిస్తోంది. చంద్రబాబు సూత్రధారి, పాత్రధారిగా సాగిన కుంభకోణాల గురించి గతంలో పలువురు ఐఏఎస్ అధికారులు న్యాయస్థానంలో ఇచ్చిన వాంగ్మూలాలకు భిన్నంగా తప్పుడు వాంగ్మూలాలు నమోదు చేయించేందుకు సీఐడీ సన్నాహాలు వేగవంతం చేస్తోంది. డీజీపీ పోస్టు ఇస్తానని ముఖ్య నేత ఎర వేయగానే సుప్రీంకోర్టు మార్గరద్శకాలను కూడా తోసిరాజంటూ సీఐడీ ఉన్నతాధికారి చెలరేగిపోతుండటం విస్మయ పరుస్తోంది. ఈ వ్యవహారం యావత్ దేశాన్ని విస్మయానికి గురి చేస్తోంది.కుంభకోణాల కుట్రదారు చంద్రబాబే..2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో యథేచ్ఛగా అవినీతికి పాల్పడ్డారు. రాజధాని అమరావతిలో అసైన్డ్ భూముల కుంభకోణం, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో అక్రమాల కుంభకోణం, ఫైబర్‌నెట్ కుంభకోణం, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణం, మద్యం కుంభకోణం, ఇసుక కుంభకోణం.. ఇలా వివిధ కుంభకోణాలతో వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. వాటిపై సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) కేసు నమోదు చేసి పూర్తి ఆధారాలతోసహా ఆ భారీ దోపిడీని బట్టబయలు చేసింది. ఆ వ్యవహారాల్లో కీలక పాత్రధారులగా ఉన్న ఐఏఎస్ అధికారులను విచారించింది. నిబంధనలకు విరద్ధమని తాము అభ్యంతరం తెలిపినప్పటికీ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోలేదని వారు చెప్పారు. చంద్రబాబు ఒత్తిడితోనే నిబంధనలకు విరుద్ధంగా అసైన్డ్ భూముల బదలాయింపు, ఇన్నర్ రింగ్‌రోడ్డు అలైన్మెంట్లో మార్పులు, కాంట్రాక్టుల కేటాయింపు, నిధుల విడుదల.. ఇలా అన్ని వ్యవహారాలు సాగాయని వెల్లడించారు. టీడీపీ ప్రభుత్వంలో సీఆర్డీఏ కమిషనర్‌గా వ్యవహరించిన చెరుకూరి శ్రీధర్, ఫైబర్‌నెట్ ఎండీగా వ్యవహరించిన అజయ్ జైన్, గుంటూరు కలెక్టర్‌గా చేసిన కాంతిలాల్ దండే తదితరులు ఆ వాస్తవాలను ‘సిట్’కు తెలిపారు. అంతే కాకుండా ఆ విషయాలను న్యాయస్థానంలోనూ వెల్లడించడం ప్రాధాన్యత సంతరించుకుంది. సీఆర్పీసీ 164 కింద వారు ఇచ్చిన వాంగ్మూలాలను న్యాయస్థానం నమోదు చేసింది. అందుకే ఆ కేసుల్లో చంద్రబాబును ప్రధాన నిందితుడు(ఏ1)గా పేర్కొంటూ సిట్ కేసులు నమోదు చేసింది. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబును అరెస్ట్ చేయగా, ఆయన రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో 52 రోజులు రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే.తప్పుడు వాంగ్మూలాల నమోదుకు ప్రభుత్వ కుట్రగత ఏడాది రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు అవినీతి కేసులను నీరుగార్చేందుకు కుట్రకు తెరతీసింది. అందుకోసం డీజీపీ, సీఐడీ అధికారులు ఆ కేసుల దర్యాప్తు వివరాలను చంద్రబాబుకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. అంటే ప్రధాన నిందితుడే ఆ కేసులను సమీక్షించారు. ఆ కేసులను ఎలా నీరుగార్చాలనే కుట్రకు అప్పుడే బీజం పడింది. అనంతరం చంద్రబాబు తరఫున గతంలో వాదించిన ఢిల్లీ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా రంగ ప్రవేశం చేశారు. డీజీపీ, సీఐడీ అధికారులతో సమావేశమై చంద్రబాబుపై కేసులను నీరుగార్చే కుట్రకు కార్యాచరణ రూపొందించారు. గతంలో చంద్రబాబే కుట్రదారు.. కుంభకోణాలకు ఆయనే సూత్రధారి.. అని న్యాయస్థానంలో వాంగ్మూలాలు ఇచ్చిన వారితో తాజాగా తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించాలని పన్నాగం పన్నారు. ఆ బాధ్యతను సీఐడీకి అప్పగించారు. గతంలో సిట్‌లో సభ్యులుగా ఉన్న కింది స్థాయి అధికారులను డీజీపీ, సీఐడీ చీఫ్ పిలిపించుకుని మరీ తప్పుడు వాంగ్మూలాలు నమోదు చేసే ప్రక్రియను వివరించారు. బాధిత రైతులు, సాధారణ సాక్షులను కింది స్థాయి అధికారులు బెదిరిస్తుండగా, ఐఏఎస్ అధికారులతో తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించే బాధ్యతను సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ భుజానికెత్తుకున్నారు.బెదిరించి.. భయపెట్టి..కుట్రలో భాగంగా ఐఏఎస్ అధికారులు చెరుకూరి శ్రీధర్, అజయ్ జైన్‌లతో తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించేందుకు సీఐడీ బరితెగించింది. గతంలో న్యాయస్థానంలో 164 సీఆర్పీసీ కింద తాము ఇచ్చిన వాంగ్మూలానికి విరద్ధుంగా వాంగ్మూలం ఇవ్వాలని వారిపై సీఐడి తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చింది. బెదిరింపులకు పాల్పడింది. తప్పుడు వాంగ్మూలం ఇవ్వకపోతే సంగతి తేలుస్తామని హెచ్చరించింది. గతంలో ఇచ్చిన వాంగ్మూలానికి విరుద్ధంగా తప్పుడు వాంగ్మూలం ఇవ్వడం సాధ్యం కాదని, అది నేరమని కూడా ఆ అధికారులు, న్యాయ నిపుణులు చెప్పినా సరే సీఐడీ చీఫ్ రవి శంకర్ అయ్యన్నార్ ఏమాత్రం వినిపించుకోలేదని సమాచారం. ఇలా సీఐడీ సామ, దాన, బేధ, దండోపాయాలను ప్రయోగించి చెరుకూరి శ్రీధర్, అజయ్ జైన్లను బెంబేలెత్తించారు. దాంతో వారు తప్పుడు వాంగ్మూలాలు ఇచ్చేందుకు సమ్మతించినట్టుగా సీఐడీ వర్గాలు చెబుతున్నాయి. వారిద్దరితో గుంటూరులోని న్యాయస్థానంలో శుక్రవారం తప్పుడు వాంగ్మూలం నమోదు చేయించేందుకు సీఐడీ అధికారులు తీసుకువచ్చేందుకు సిద్ధపడ్డారు. అయితే న్యాయాధికారి సెలవులో ఉండటంతో ఆ ప్రయత్నాన్ని శనివారానికి వాయిదా వేశారు. తీరా శనివారం చెరుకూరి శ్రీధర్ ఒక్కరినే తీసుకెళ్లారు. కోర్టు బయట కొద్ది సేపు హైడ్రామా నడిచింది. ఆ తర్వాత కోర్టు హాలు లోపలికి వెళ్లకుండానే శ్రీధర్ వెనుదిరిగారు. మళ్లీ ఈ నెల 8వ తేదీన ఆయన్ను న్యాయస్థానానికి తీసుకొచ్చి వాంగ్మూలం నమోదు చేయించాలని సీఐడీ నిర్ణయించినట్లు తెలిసింది.నాడు గూండాల బెదిరింపులు.. నేడు సర్కారు వేధింపులు చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాజధానిలో అసైన్డ్ భూములు, ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణాల గురించి న్యాయస్థానంలో వాంగ్మూలం ఇచ్చిన ఐఏఎస్ అధికారి చెరుకూరి శ్రీధర్.. తనను ఆ కేసుల్లో సాక్షిగా పరిగణించాలని కోరారు. దాంతో ఆయన అంతు చూస్తామని టీడీపీ గూండాలు బెదిరించారు. తీవ్ర ఆందోళన చెందిన ఆయన అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యాదర్శికి ఫిర్యాదు చేశారు. టీడీపీ గూండాల నుంచి తనకు ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా పోలీసు శాఖను కోరారు. దాంతో ఆయనకు పోలీసు శాఖ ప్రత్యేకంగా గన్‌మెన్‌ను కేటాయించింది. అప్పటి నుంచి ఆయనకు గన్‌మెన్ భద్రత కొనసాగుతోంది. అప్పట్లో టీడీపీ గుండాలు బెదిరింపులకు పాల్పడగా, ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వమే అధికారికంగా ఆయన్ను బెదిరిస్తోంది. తప్పుడు వాంగ్మూలం ఇవ్వకపోతే అంతు తేలుస్తామని సీఐడీ ద్వారా వేధిస్తోంది. కాగా, రాష్ట్ర ప్రభుత్వం, సీఐడీ తీరుపై న్యాయ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సీఆర్సీపీ 164 వాంగ్మూలాల గురించి సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుతోపాటు గతంలో ఇచ్చిన తీర్పులను ఉటంకిస్తున్నారు.మొదటి వాంగ్మూలానికి విరుద్ధంగా ఉండకూడదు సీఆర్సీపీ 164 కింద ఓసారి న్యాయస్థానంలో నమోదు చేసిన వాంగ్మూలం అత్యంత విశ్వసనీయమైనదిగా పరిగణిస్తాం. ఎందుకంటే న్యాయమూర్తి ఎదుట ప్రమాణ పూర్వకంగా నమోదు చేసిన వాంగ్మూలమది. ఆ వాంగ్మూలాన్ని మార్చేందుకు వీల్లేదు. గతంలో ఇచ్చిన వాంగ్మూలానికి విరుద్ధంగా వాంగ్మూలం ఇచ్చేందుకు సాక్షులు ప్రయత్నిస్తే వారిని సంబంధిత న్యాయస్థానం ప్రశ్నించాలి. మొదట ఇచ్చిన వాంగ్మూలాన్నే సాక్షంగా పరిగణలోకి తీసుకోవాలి.– 2024 నవంబరు 25న ఇచ్చిన తీర్పులో సుప్రీంకోర్టు. ఈ మేరకు ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన ఓ కేసులో జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ సతీష్‌చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం విస్పష్టమైన తీర్పునిచ్చింది.విరుద్ధంగా ఇస్తే కఠిన చర్యలు ఓసారి సీఆర్సీపీ 164 కింద ఇచ్చిన వాంగ్మూలానికి విరుద్ధంగా మరోసారి వాంగ్మూలం ఇస్తే అది నేరంగా పరిగణిస్తాం. ఎందుకంటే ప్రమాణ పూర్వకంగా ఇచ్చిన వాంగ్మూలాన్ని న్యాయమూర్తి చదవి వినిపించిన తర్వాత సమ్మతించి, మరీ సంతకం చేసి ఇచ్చిన వాంగ్మూలమది. మొదటిసారి ఇచ్చిన వాంగ్మూలానికి విరుద్ధంగా మరో వాంగ్మూలం ఇవ్వడమంటే.. మొదట ఇచ్చింది తప్పుడు వాంగ్మూలమని అంగీకరించినట్టే. అత్యంత విశ్వసనీయమైన న్యాయస్థానంలో న్యాయమూర్తి ఎదుట ప్రమాణం చేసి మరీ తప్పుడు వాంగ్మూలం ఇచ్చినట్టు అవుతుంది. అంటే అబద్ధపు వాంగ్మూలం ఇచ్చినందుకు నేరంగా పరిగణిస్తాం. ఆ విధంగా అబద్ధపు వాంగ్మూలం ఇచ్చిన వారిపై ఐపీసీ 193, సీఆర్సీపీ 340 కింద కఠిన చర్యలు తీసుకుంటాం. – వినోద కుమారి వర్సస్ మధ్యప్రదేశ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పుఎదుర్కోవాల్సిన పరిణామాలను న్యాయమూర్తి వివరించాలి సీఆర్పీసీ 164 కింద ఓసారి ఇచ్చిన వాంగ్మూలానికి విరుద్ధంగా మరో వాంగ్మూలం ఇచ్చేందుకు సాక్షి ప్రయత్నిస్తే.. దాని వల్ల ఉత్పన్నమయ్యే పరిస్థితులు, ఎదుర్కోవాల్సి వచ్చే పరిణామాల గురించి న్యాయమూర్తి ఆ సాక్షికి వివరించాలి.– అలహాబాద్ హైకోర్టు తీర్పుఏడేళ్ల వరకూ జైలు శిక్ష న్యాయస్థానాల్లో కేసుల విచారణ ప్రక్రియలో ఏ సందర్భంలో అయినా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వడం తీవ్రమైన నేరం అని సెక్షన్ 229 (1) స్పష్టం చేస్తోంది. అటువంటి అబద్ధపు వాంగ్మూలం ఇచ్చిన వ్యక్తికి ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించేందుకు అవకాశం కల్పిస్తోంది. అంటే సీఆర్పీసీ 164 కింద న్యాయమూర్తి ఎదుట ప్రమాణ పూర్వకంగా రెండు విరుద్ధ వాంగ్మూలాలు ఇస్తే అందులో ఒకటి అబద్ధపు వాంగ్మూలమే అవుతుంది. మొదటి వాంగ్మూలం గానీ రెండో వాంగ్మూలం గానీ ఏది అబద్ధపు వాంగ్మూలం అయినా శిక్షార్హమే. దాన్ని నేరంగా పరిగణించి ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు.
సాగునీళ్లూ షాక్ కొడతాయా?
‘‘టంగుటూరు మిరియాలు తాటికాయలంత...’’. తెలుగు నాట ఇదొక సామెత. చేతలు గడప దాటకుండానే మాటల్ని కోటలు దాటించే కోతల రాయుళ్లపై ఇటువంటి సామెతలు చాలానే ఉన్నాయి. ఈ మధ్య ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎడాపెడా విసురుతున్న మాటల ఈటెల్నీ, పలుకుతన్న పద జాలాన్నీ చూస్తుంటే ఈ సామెతలు సరిపోవనిపిస్తున్నది. ‘విజన్–2047’ పేరుతో ఆయన అట్టహాసంగా ఓ డాక్యుమెంట్‌ను ఇటీవల విడుదల చేశారు. ఈ విజన్ దెబ్బకు ఇంకో ఇరవై మూడేళ్లలో ఏపీ స్టేట్ ‘ఏక్ నంబర్ స్టేటస్’ చేరుకోనున్నదని ఆ సందర్భంగా ఆయన ఉద్ఘాటించారు. ‘ఏక్ నంబర్ స్టేటస్’ వస్తున్నప్పుడు స్పెషల్ స్టేటస్ ఎందుకనుకున్నారేమో గానీ, ఆ డాక్యుమెంట్లో అటువంటి ప్రస్తావన లేదు.చంద్రబాబు పార్టీకి గానీ, యెల్లో మీడియాకు గానీ ఇలా గొప్పలకు పోవడం, డప్పు వాయించుకోవడం కొత్తేమీ కాదు. కానీ, వారు ప్రగల్భాలకు మాత్రమే పరిమితం కావడం లేదు. జనం మీదకు తేనె పూసిన కత్తుల్ని విసురుతున్నారు. విష గుళికలకు విజన్ లేబుళ్లు వేస్తున్నారు. కాకుల్ని కొట్టి, గద్దల్ని మేపే సామాజిక దుర్నీతి ఆయన తాజా విజన్ నిండా పరుచుకున్నదనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఆ విజన్ డాక్యుమెంట్ మీద ఇంకా పూర్తి స్థాయి చర్చ ప్రారంభం కాక ముందే, అందులోంచి ఆయన ఓ జలపాత దృశ్యాన్ని బయటకు తీశారు. అరుంధతీ నక్షత్రం మాదిరిగా యెల్లో మీడియా దాన్ని ప్రజలకు చూపెట్టింది. ఈ నక్షత్రానికి ఆయన ‘తెలుగుతల్లికి జలహారతి’ అని నామకరణం కూడా చేసుకున్నారు.ఈ ‘జలహారతి’ పథకం తన ‘మానస పుత్రిక’ని కూడా బాబు ప్రకటించుకున్నారు. ‘విజన్ డాక్యుమెంట్’లో పండంటి రాష్ట్రానికి పది సూత్రాలని చెప్పుకున్నారు. ఆ పది సూత్రాల్లో ఒకటి ‘జలభద్రత’. నదుల అనుసంధానం ద్వారా ‘జలభద్రత’ కల్పించాలన్న ఒక అంశానికి కొనసాగింపుగా ఈ ‘జలహారతి’ పథకాన్ని ప్రకటించారు. ఈ విజన్‌ను కొంత లోతుగా తరచి చూస్తే, ఇందులో ఎంత ప్రజావ్యతిరేకత దాగి ఉన్నదో, పెత్తందారీతనపు ఫిలాసఫీ ఎలా ఇమిడి ఉన్నదో అవగతమవుతుంది.2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే, నాటి ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి గోదావరి – బనకచర్ల ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. జల వనరుల అధికార్లు,ఇంజినీర్లతో పలు దఫాల సమీక్ష, సాంకేతిక అంశాల పరిశీలన తర్వాత ఒక సమగ్ర నివేదిక (డీపీఆర్)ను జగన్ ప్రభుత్వం తయారు చేసింది. పోలవరం కుడి కాల్వ ప్రవాహ సామర్థాన్ని పెంచి, ఈ కొత్త ప్రాజెక్టుకు అవసరమైన నీటిని కూడా దాని ద్వారా తరలించి ప్రకాశం బరాజ్‌కు చేర్చాలని నిర్ణయించారు. అక్కడి నుంచి సాగర్ కుడి కాల్వను ఉపయోగించుకొని, బొల్లాపల్లి దగ్గర కొత్తగా నిర్మించే రిజర్వాయర్‌కు చేరుస్తారు. అక్కడి నుంచి బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ దగ్గరికి చేర్చాలి. ఇదీ ప్రాజెక్టు.ఈ ప్రాజెక్టు వల్ల సాగర్ కుడి కాలువతో పాటు, వెలిగొండ, తెలుగుగంగ, ఎస్సార్ బీసీ, గాలేరు–నగరి తదితర ప్రాజెక్టుల కింద ఉన్న 22 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడం జరు గుతుంది. అదనంగా ఏడున్నర లక్షల ఎకరాల ఆయకట్టు చేరుతుందనీ, 80 లక్షల జనాభాకు తాగునీటి వసతి లభిస్తుందనీ అంచనా వేశారు. ఇందులో నదుల అనుసంధానానికి సంబంధించిన అంశం ఇమిడి ఉన్నందువల్ల అనుసంధానం కేంద్రం బాధ్యత కనుక ఈ ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇవ్వాలని ప్రధాన మంత్రికి జగన్ మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రధాని సూచన మేరకు ‘కేంద్ర జలసంఘం’ అనుమతి కోసం 2022లోనే రాష్ట్రం ఈ ప్రాజెక్టుపై డీపీఆర్‌ను సమర్పించింది.అదిగో అదే డీపీఆర్‌ను ఇప్పుడు బయటకు తీసి తన మానస పుత్రికగా చంద్రబాబు ప్రకటించుకున్నారు. నామకరణ మహోత్సవాన్ని కూడా జరుపుకున్నారు. అయితే ఇందులో ఒక్క మార్పు మాత్రం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. పోలవరం కుడి కాలువ సామర్థ్యం పెంచడం ద్వారా బనకచర్లకు కూడా వరద రోజుల్లో రోజుకు రెండు టీఎమ్సీల చొప్పున తరలించాలన్నది గత ప్రభుత్వ ప్రతిపాదన. చంద్రబాబు సర్కార్ ఇక్కడ మార్పు చేసింది. పోలవరం ప్రాజెక్టుకు దిగువన తాడిపూడి పాయింట్ దగ్గర ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేసి, కుడి కాల్వకు సమాంతరంగా మరో కాలువను తవ్వి, నీటిని తరలించాలని ప్రతిపాదించింది.ఎత్తిపోతల పంపుల కోసం, కరెంట్ కోసం అదనపు ఖర్చు. మరో కాలువ తవ్వడానికి భూసేకరణ ఒక ప్రధాన సమస్య. అదనపు ఖర్చు కూడా. జగన్ పథకాన్ని యథాతథంగా కాపీ చేయకుండా ఈ ఒక్క మార్పును ఎందుకు చేసినట్టు? అదనపు ఖర్చు వల్ల అదనపు కమిషన్ లభిస్తుందన్న కండూతి ఒక కారణం కావచ్చు. దీంతోపాటు ఇంకో విమర్శ కూడా వినిపి స్తున్నది. పోలవరం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 45.72 మీటర్లకు బదులుగా 41.15 మీటర్లకే పరిమితం చేయడానికి బాబు సర్కారు అంగీకరించిందనీ, ఈ మేరకు కేంద్ర కేబినెట్లో కూడా నిర్ణయం జరగిందనీ ఇటీవల సాక్షి మీడియాలో ప్రము ఖంగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ తాడిపూడి ఎత్తి పోతల నిర్ణయం కూడా దాన్ని నిర్ధారిస్తున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.41.15 మీటర్ల ఎత్తుకే నీటి నిల్వను పరిమితం చేస్తే కుడి కాలువ ఆయకట్టుకే సరిపోను నీటిని అందివ్వలేదనీ, అటువంట ప్పుడు ఇక బనకచర్లకు తరలింపు ఎలా సాధ్యమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కనుక ప్రాజెక్టు దిగువన కూడా వరద రోజుల్లో ప్రవాహం ఉన్నప్పుడు ఎత్తిపోయడానికి ఈ పథకాన్ని మార్చి ఉండవచ్చని తెలుస్తున్నది. ఇంకొక ముఖ్యమైన మార్పు సిసలైన గేమ్ ఛేంజర్ వంటి అంశం మరొకటి ఉన్నది. నదుల అనుసంధానం కింద ఈ ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇవ్వాలని జగన్ ప్రభుత్వం కోరింది. కానీ, చంద్రబాబు ఆలోచన మరో విధంగా ఉన్నది. ఈ పాజెక్టును ప్రకటించిన సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ అసలు విషయాన్ని కొద్దిగా ఆయన బయట పెట్టారు. ప్రాజెక్టు కోసం కేంద్రం నిధులిచ్చే అవకాశం లేదని చెబుతూ – ప్రైవేట్ వ్యక్తుల ద్వారా సేకరిస్తామని చెప్పారు. ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు పదేళ్లదాకా వాటి నిర్వహణను కూడా ప్రైవేట్ వారికే అప్పగిస్తామన్నారు. ఇటీవలే గ్రామీణ రోడ్ల నిర్మాణం – నిర్వహణను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తామని చంద్రబాబు చెప్పిన విషయం పాఠకులకు గుర్తుండే ఉంటుంది. ప్రైవేట్ వ్యాపారులు, సేవా దృక్పథంతో రోడ్లేయరు కదా! జనం తోలు వలిచి టోల్ వసూలు చేస్తారు. ఇక సాగునీటి సరఫరాకు కూడా అదే పద్ధతి రాబోతుందన్న మాట.ప్రాజెక్టులు నిర్మించి, నిర్వహించినందుకు ప్రభుత్వమే వారికి సొమ్ము చెల్లిస్తుందని ప్రస్తుతానికి ముఖ్యమంత్రి చెబుతు న్నప్పటికీ అది నమ్మశక్యంగా లేదు. అంతటి ఆర్థిక సామర్థ్యమే ఉంటే, మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టుగా జలయజ్ఞంలోని అసంపూర్తి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి నడుం కట్టేవారు. ఈ ప్రాజెక్టు నదుల అనుసంధానంలో భాగం కనుక కేంద్ర నిధుల కోసం ఒత్తిడి చేసేవారు. పైగా తమ సంఖ్యా బలం మీద ఆధార పడిన ప్రభుత్వాన్ని ముక్కుపిండి ఒప్పించడం ఎంతసేపు? జగన్ సర్కార్ డీపీఆర్‌ను కాపీ కొట్టిన ప్రభుత్వం ఆయన అనుసరించిన వైఖరిని ఎందుకు అనుకరించడం లేదు?ఎందుకంటే, సంపూర్ణ ప్రైవేటీకరణ ఆయన విధానం కనుక. ప్రజలకు ఏదీ ఉచితంగా ఇవ్వడానికి వీల్లేదనీ, ప్రభుత్వ సేవలన్నిటికీ యూజర్ చార్జీలను వసూలు చేయాల్సిందేననీ గతంలోనే తన సిద్ధాంత పత్రాన్ని ఆయన రాసుకున్నారు కనుక. పాతికేళ్ల కింద ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ మాదిరిగానే ‘విజన్ 2020’ని చంద్రబాబు ప్రకటించారు. అప్పుడు ఆకాంక్షించిన ఆర్థిక వృద్ధి జరిగిందా? కొందరు బలవంతులు మాత్రం మహాబలసంపన్నులుగా ఎదిగి పోయారు. ఆర్థిక అసమానతలు అమానవీయంగా పెరిగి పోయాయి. ఆ డాక్యు మెంట్‌కు కొనసాగింపే ‘విజన్ – 2047’. అంతేగాకుండా, కేంద్ర సర్కార్ ఇప్పటికే ప్రకటించిన ‘వికసిత్ భారత్–2047’కు అనుగుణంగా దీన్ని రూపొందించినట్టు స్వయంగా ముఖ్యమంత్రే చెప్పారు. దొందూ దొందే. మేడ్ ఫర్ ఈచ్ అదర్.చంద్రబాబు ప్రైవేటీకరణ పదజాలంలోకి కొత్త మాటలు వచ్చి చేరుతున్నాయి. గతంలో పీత్రీ (P3) మోడల్‌ను తానే ప్రతి పాదించాననీ, ఇప్పుడింకో ‘పీ’ని చేర్చి పీఫోర్ (P4)ని ప్రతిపా దిస్తున్నాననీ ఆయన చెప్పారు. పబ్లిక్–ప్రైవేట్ పార్టనర్‌షిప్‌లో పీపుల్‌ను కూడా చేర్చారట. ‘పీత్రీ’ని అమలు చేసినప్పుడు పబ్లిక్ రంగ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టారు. లాభసాటిగా నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను ఖాయిలా పట్టించి కోట్ల విలువైన వాటి ఆస్తులతో సహా 54 సంస్థలను పప్పుబెల్లాలకు తన వారికి కట్టబెట్టిన ఉదంతాన్ని మరిచిపోగలమా?ఇప్పుడు ఇంకో ‘పీ’ పేరుతో ప్రజల్ని చేర్చారు. ప్రజలు ఎలా భాగస్వాములు అవుతారు? ప్రైవేట్ ఆస్తులను ప్రజలకైతే అప్పగించరు కదా! ప్రజలే వారి దగ్గర ఉన్న భూముల్ని ఇవ్వాల్సి ఉంటుంది. ప్రైవేట్ సేవలకు మెచ్చి నీటి పన్ను, బాట పన్ను, బడి పన్ను, దవాఖానా పన్ను వంటి వాటిని అవసరాన్ని బట్టి చెల్లించవలసి ఉంటుంది. తమ రెక్కల కష్టాన్ని సమర్పించు కోవాల్సి ఉంటుంది. ప్రజల భాగస్వామ్యానికి సంబంధించి ఇంతకంటే భిన్నమైన ప్రతిపాదనలైతే విజన్‌లో కనిపించలేదు. ఆంధ్రప్రదేశ్ అడ్రస్‌ను వెతుక్కుంటూ వేలకోట్ల పెట్టుబడులు పరుగెత్తుకొస్తున్నాయని విడతల వారీగా ప్రకటనలు గుప్పిస్తు న్నారు. తాజాగా చేసిన ప్రకటనలో రిలయన్స్‌వారు ‘కంప్రెస్డ్ బయోగ్యాస్’ ఉత్పాదన కోసం 65 వేల కోట్లు పెట్టుబడి పెడ తారనే, కళ్లు చెదిరే లెక్క కూడా చెప్పారు. అందుకోసం వారికి ఐదులక్షల ఎకరాల భూమిని అప్పగిస్తారట. ప్రతిగా కంపెనీ వాళ్లు రెండున్నర లక్షలమందికి ఉపాధి కల్పిస్తారట. అంత భూమిని పేదలకు అసైన్ చేస్తే అంతకంటే ఎక్కువమందే ఉపాధి పొందవచ్చు గదా అనే సందేహాలు అజ్ఞానులకు మాత్రమే కలుగుతాయి. ఆర్థిక నిపుణులు వాటికి సమాధానం చెప్పరు.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం...బంధువులతో ఆనందంగా గడుపుతారు. మీ ఊహలు నిజం చేసుకుంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. జీవితాశయం నెరవేరుతుంది. వాహనయోగం. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పనులు ఆటంకాలు లేకుండా చకచకా సాగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో అనుకోని లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు చికాకులు, ఇబ్బందులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాల వారు అభివృద్ధి పథంలో సాగుతారు. వారం చివరిలో ఆరోగ్యభంగం. బంధువులతో వివాదాలు. పసుపు, ఆకుపచ్చ రంగులు, గాయత్రీ ధ్యానం మంచిది.వృషభం...దూరపు బంధువుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సమాజంలో పరపతి పెరుగుతుంది. ధనప్రాప్తి. కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. విద్యార్థుల శ్రమ వృథా కాదు. వ్యాపారాలు పుంజుకుని లాభాల బాటలో నడుస్తారు. ఉద్యోగులకు శ్రమ ఫలించి మంచి గుర్తింపు లభిస్తుంది. రాజకీయవేత్తలకు మరింత పురోగతి కనిపిస్తుంది. . వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. ఆరోగ్యభంగం. గులాబీ, ఎరుపు రంగులు. వారాహీ స్తోత్రం పఠించండి.మిథునం....ఆర్థిక వ్యవహారాలలో పురోగతి కనిపిస్తుంది. అనుకున్న పనులు సజావుగా కొనసాగుతాయి. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల సలహాలతో ముందుకు సాగి విజయాలు సా«ధిస్తారు. ఆస్తులు సమకూర్చుకుంటారు. ఒక ప్రకటన నిరుద్యోగులను ఆకట్టుకుంటుంది. కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలను విస్తరిస్తారు. ఉద్యోగులకు ఉన్నతహోదాలు దక్కే అవకాశం. కళారంగం వారికి నూతనోత్సాహం. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. దూరప్రయాణాలు. పసుపు, నేరేడు రంగులు, మేధా దక్షిణామూర్తి స్తుతి మంచిది.కర్కాటకం...మిత్రుల ద్వారా కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఇంటాబయటా మీకు ఎదురుండదు. పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఇంటిలో శుభకార్యాలపై ఒక నిర్ణయం తీసుకుంటారు. బంధువులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. నిరుద్యోగులు, విద్యార్థుల ఆశలు ఫలిస్తాయి. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు విధి నిర్వహణలో అవరోధాలు తొలగుతాయి. కళారంగం వారు పురస్కారాలు పొందుతారు. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు. అనారోగ్యం. మానసిక అశాంతి. తెలుపు, ఆకుపచ్చ రంగులు, పంచాక్షరి మంత్రం పఠించండి.సింహం.....ప్రారంభంలో కొద్దిపాటి చికాకులు ఉన్నా క్రమేపీ సర్దుబాటు కాగలవు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. వాహనాలు, భూములు, వాహనాలు కొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ముఖ్య విషయాలు తెలుసుకుంటారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు అనుకున్న విధంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు కొంత వరకూ తొలగుతాయి. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. వారం మధ్యలో వ్యయప్రయాసలు. అనుకోని ప్రయాణాలు. శ్రమ పెరుగుతుంది. ఎరుపు, గులాబీ రంగులు, నారాయణ అష్టాక్షరి మంత్రం పఠించండి.కన్య.....ఇంటిలో శుభకార్యాల ప్రస్తావన. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. దీర్ఘకాలిక సమస్య నుంచి బయటపడతారు. సంఘంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థులకు ఊహించని అవకాశాలు దక్కుతాయి. వ్యాపారులు అనుకున్న లాభాలు దక్కించుకుంటారు. ఉద్యోగులకు కొత్త హోదాలు రాగలవు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. మిత్రులతో విభేదాలు. మానసిక అశాంతి. ఆకుపచ్చ, నేరేడు రంగులు, శ్రీ భువనేశ్వరి మంత్రం పఠించండి.తుల....దూరప్రాంతాల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. పనులలో విజయం సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఒక వ్యక్తి ద్వారా కొంత సాయం అందే సూచనలు. నూతన విద్య,ఉద్యోగావకాశాలు దక్కించుకుంటారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. కొన్ని సమస్యల నుండి గట్టెక్కుతారు. వ్యాపారాలలో విస్తరణ కార్యక్రమాలు వేగవంతంగా చేస్తారు. ఉద్యోగులకు విధుల్లో చికాకులు తొలగే అవకాశం. పారిశ్రామికవర్గాలకు మరింత ఉత్సాహం. వారం మధ్యలో ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. తెలుపు, గులాబీ రంగులు, శ్రీహయగ్రీవస్తుతి మంచిది.వృశ్చికం....వీరికి పట్టింది బంగారమే అన్నట్టుంటుంది. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. బంధువులు, మిత్రులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వ్యాపారాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగులకు ఉన్నతస్థితి లభించే అవకాశం. రాజకీయవర్గాలకు కొత్త పదవులు దక్కుతాయి. వారం ప్రారంభంలో ఆరోగ్య సమస్యలు. వృథా ఖర్చులు. ప్రయాణాలలో అవాంతరాలు. ఎరుపు, పసుపు రంగులు, నవగ్రహస్తోత్రాలు పఠించండి.ధనుస్సు....ముఖ్యమైన పనులు కొంత నెమ్మదించినా క్రమేపీ పుంజుకుంటాయి. ఆర్థిక లావాదేవీలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. కొత్త వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్నిస్తుంది. ఒక ప్రకటన నిరుద్యోగులను ఆకట్టుకుంటుంది. వాహన, కుటుంబసౌఖ్యం. కుటుంబపరంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలలో మరిత విస్తరించే అవకాశం. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. కళారంగం వారికి సమస్యల నుండి విముక్తి. వారం చివరిలో ధనవ్యయం. ఆప్తులతో కలహాలు. దూరప్రయాణాలు. గులాబీ, తెలుపు రంగులు, శ్రీదత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.మకరం....వ్యయప్రయాసలు ఎదుర్కొంటారు. పనుల్లో కొంత జాప్యం తప్పదు. ప్రయాణాలలో మార్పులు ఉండవచ్చు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. సోదరులు, మిత్రులతో మాటపట్టింపులు. ఆరోగ్యపరంగా చికాకులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార విస్తరణ యత్నాలు ముందుకు సాగవు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు ఇబ్బందిగా మారతాయి.. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. వారం మధ్యలో శుభవార్తలు. ధన,వస్తులాభాలు. పరిచయాలు పెరుగుతాయి. నీలం, నేరేడు రంగులు, హయగ్రీవస్తోత్రాలు పఠించండి.కుంభం...ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్న రీతిలో సాగుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఇంటాబయటా ప్రోత్సాహకరంగా ఉంటుంది. సన్నిహితుల సాయంతో ముందడుగు వేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులకు పోటీపరీక్షల్లో విజయం. వాహనాలు, ఇళ్లు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు, మంచి గుర్తింపు రాగలవు. కళారంగం వారి చిరకాల కోరిక నెరవేరుతుంది. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనుకోని ప్రయాణాలు. మానసిక ఆందోళన. ఆకుపచ్చ, గులాబీ రంగులు, సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.మీనం...బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. కోర్టు కేసులు కూడా అనుకూలిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వాహనయోగం. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగులకు ఉన్నతస్థితి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో దూరప్రయాణాలు. ధనవ్యయం. శ్రమాధిక్యం. ఆరోగ్య సమస్యలు. గులాబీ, మెరూన్ రంగులు, ఆదిత్య హృదయం పఠించండి.
సాగు యోగ్యతతోనే ‘భరోసా’!: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వ్యవసాయ యోగ్యమైన భూములకు రైతు భరోసా పథకం కింద ఎకరాకు ఏటా రూ.12 వేలు చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రకటించారు. భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు కూడా ఏటా రూ.12 వేలు ఇవ్వాలని నిర్ణయించామని చెప్పారు. ఈ కొత్త పథకానికి ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’అని పేరుపెట్టినట్టు తెలిపారు. ఇక రాష్ట్రంలో రేషన్‌కార్డు లేని పేద కుటుంబాలన్నింటికీ కొత్త రేషన్‌కార్డులు జారీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగం అమల్లోకి వచ్చి జనవరి 26తో 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ మూడు పథకాల అమలును ప్రారంభించాలని నిర్ణయించామని తెలిపారు. శనివారం సాయంత్రం సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఇతర మంత్రులతో కలసి రేవంత్ మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. వారికి రైతు భరోసా వర్తించదు.. రైతుభరోసా విషయంలో ఎలాంటి గందరగోళం అవసరం లేదని సీఎం రేవంత్ పేర్కొన్నారు. వ్యవసాయ యోగ్యం కాని భూములంటే.. రాళ్లు, రప్పలు, గుట్టలు, రోడ్ల నిర్మాణంలో పోయిన భూములు, మైనింగ్ భూములు, నాలా కన్వర్షన్ పొందిన భూములు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, పరిశ్రమల కోసం సేకరించిన భూములు, రైతుల నుంచి ప్రభుత్వం సేకరించిన భూములకు రైతు భరోసా పథకాన్ని వర్తింపజేయబోమని సీఎం స్పష్టం చేశారు. రెవెన్యూ అధికారులు గ్రామాల వారీగా (లబ్ధిదారుల) సమాచారం సేకరించి గ్రామసభల ద్వారా ప్రజలకు వివరిస్తారని తెలిపారు. ప్రభుత్వం, అధికారుల వద్ద ఉన్న సమాచారం ఆధారంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను వర్తింపజేస్తామని వెల్లడించారు. రెవెన్యూ రికార్డుల్లో, ధరణిలో లోపాలతో గతంలో వ్యవసాయానికి యోగ్యంకాని భూములకూ రైతుబంధు వచ్చిందని.. వారే స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రభుత్వానికి వివరాలు అందించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆర్థిక పరిస్థితి, వెసులుబాటు మేరకు.. రైతు భరోసా కింద ఎకరాకు ఏటా రూ.15 వేలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విషయాన్ని మీడియా గుర్తు చేయగా.. గత ప్రభుత్వం రైతు బంధు కింద ఎకరాకు రూ.10 వేలు ఇస్తే తాము రూ.12 వేలకు పెంచామని సీఎం రేవంత్ బదులిచ్చారు. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, వెసులుబాటును బట్టి భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు సైతం రూ.12 వేలు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. ఆదాయం పెంచి పేదలకు పంచడమే తమ ప్రభుత్వ విధానమని చెప్పారు. ఎంత వెసులుబాటు ఉంటే అంతగా రైతులకు మేలు చేయాలన్నదే తమ ఆలోచన అని పేర్కొన్నారు. భూమి లేని వారి ఆవేదన తీర్చడానికి.. ‘‘తమకు భూములు లేకపోవడం ఒక శాపమైతే, ప్రభుత్వం పట్టించుకోకపోవడం మరో శాపమని గతంలో నేను, భట్టి విక్రమార్క, ఇతర సహచరులు నిర్వహించిన పాదయాత్రల సందర్భంగా తండాల్లో, మారుమూల ప్రాంతాల్లోని భూమి లేని వ్యవసాయ కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశాయి. వాళ్లు కూడా సమాజంలో, మనలో భాగమని గుర్తించి ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పథకాన్ని తీసుకొచ్చాం. చాలా ఏళ్ల నుంచి రేషన్‌కార్డుల సమస్య పేదవాళ్లను పట్టి పీడిస్తోంది. రేషన్‌కార్డులు లేని వారందరికీ జనవరి 26 నుంచి కొత్త కార్డులు ఇస్తాం’’ అని సీఎం రేవంత్ చెప్పారు. కేసీఆర్ కుటుంబం వెయ్యేళ్లు జైలుకు వెళ్లాల్సి ఉంటుంది రైతుబంధు కింద అనర్హులకు చెల్లించిన రూ.వేల కోట్లను తిరిగి వసూలు చేస్తారా? అని మీడియా ప్రశ్నించగా.. ‘‘గతంలో ఏం జరిగిందో వెనక్కి వెళితే కేసీఆర్ కుటుంబం వెయ్యేళ్లు జైలు శిక్షకు వెళ్లాల్సి ఉంటుంది. రైతు భరోసాకు సంబంధించి విపక్షాలు శాయశక్తులా ఊహాగానాలు రేపాయి. ఉన్నవి లేనివి ప్రభుత్వ నిర్ణయాలంటూ ప్రచారం చేసి రైతుల్లో గందరగోళం సృష్టించాయి. రైతులకు మేం శుభవార్త వినిపించాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం’’ అని సీఎం రేవంత్ చెప్పారు. కొత్త సంవత్సరంలో మొదటిసారి పత్రికా సమావేశం నిర్వహిస్తున్నామని.. రాష్ట్ర రైతాంగానికి మంచి జరగాలని, ఈ ప్రభుత్వం వాళ్లను అన్నిరకాలుగా ఆదుకోవాలని సీఎం ఆకాంక్షించారు. వ్యవసాయం దండుగ కాదు పండుగ చేయాలని తమ ప్రభుత్వం పట్టుదలతో ఈ పథకాలను చేపట్టిందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనరసింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వర్రావు, కొండా సురేఖ, సీఎస్ శాంతికుమారి పాల్గొన్నారు.కేబినెట్ తీసుకున్న ఇతర కీలక నిర్ణయాలివే..పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్‌రెడ్డి పేరు పెట్టాలని నిర్ణయంసింగూరు ప్రాజెక్టు కెనాల్‌కు మంత్రి దామోదర రాజనర్సింహ తండ్రి, మాజీ మంత్రి రాజనర్సింహ పేరు పెట్టేందుకు ఆమోదం.జూరాల జలాశయం నుంచి కృష్ణా జలాలను తరలించి మహబూబ్‌నగర్ జిల్లాలో కొత్తగా ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ఉన్న మార్గాలు, ప్రత్యామ్నాయాల పరిశీలన కోసం టెక్నికల్ ఎక్స్పర్ట్ కమిటీ నియామకం. ఎంత నీటి లభ్యత ఉంది? ఎక్కడ ఉంది? ఎక్కడి నుంచి ఎంతెంత నీటిని తీసుకునే వీలుంది? ఎక్కడెక్కడ రిజర్వాయర్లు నిర్మించాలనే అంశాలతోపాటు ఇప్పుడున్న ప్రాజెక్టుల ద్వారా మరింత నీటిని తీసుకునేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలపై ఈ కమిటీతో అధ్యయనం చేయించాలని నిర్ణయం.మల్లన్నసాగర్ నుంచి గోదావరి జలాలను తాగునీటి అవసరాల కోసం హైదరాబాద్‌కు తరలించేందుకు ప్రతిపాదించిన గోదా వరి డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ ఫేజ్–2,3లకు ఆమోదం. గతంలో 15 టీఎంసీల తరలింపునకు ఈ ప్రాజెక్టు ప్రతిపాదించగా.. భవిష్యత్ అవసరాల దృష్ట్యా 20 టీఎంసీలకు పెంచేందుకు నిర్ణయం. కొత్తగూడెం మున్సిపాలిటీకి మున్సిపల్ కార్పొరేషన్‌గా హోదా పెంపు.
అంతరిక్షంలో జీవం ‘పురుడు’ పోసుకుంది!
న్యూఢిల్లీ: కొన్నేళ్లుగా అంతరిక్షంలో అద్భుతాలతో ప్రపంచాన్ని అబ్బురపరుస్తున్న ఇస్రో మరో ఘనత సాధించింది. అంతరిక్షంలో జీవసృష్టి చేసి చూపించింది. స్పేడెక్స్ మిషన్‌లో భాగంగా పీఎస్ఎల్వీ–సి60 ఆర్బిటాల్ ఎక్స్పెరిమెంట్ మాడ్యూల్ (పోయెమ్–4) ద్వారా డిసెంబర్ 30న అంతరిక్షంలోకి పంపిన అలసంద విత్తనాలు కేవలం 4 రోజుల్లోనే మొలకెత్తాయి! కాంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫర్ ఆర్బిటాల్ ప్లాంట్ స్టడీస్ (సీఆర్‌ఓపీఎస్) టెక్నాలజీ ద్వారా ఈ ప్రయోగాన్ని ఇస్రో విజయవంతంగా నిర్వహించింది. సూక్ష్మ గురుత్వాకర్షణ పరిస్థితుల్లో విత్తనాల అంకుర, మనుగడ ప్రక్రియను అధ్యయనానికి ఉద్దేశించిన ఆటోమేటెడ్ వ్యవస్థ అయిన సీఆర్‌ఓపీఎస్ పేలోడ్‌ను విక్రం సారాబాయ్ అంతరిక్ష కేంద్రం అభివృద్ధి చేసింది. ఇందులో భాగంగా ఎనిమిది అలసంద విత్తనాలను నియంత్రిత వాతావరణంతో కూడిన బాక్సులో ఉంచారు. వాటికి నిరంతరం కచ్చితత్వంతో కూడిన వెలుతురు అందేలా జాగ్రత్త తీసుకున్నారు. విత్తనాల్లో జరుగుతున్న మార్పుచేర్పులను అత్యంత హై రిజల్యూషన్‌తో కూడిన కెమెరా ఇమేజింగ్, ఉష్ణోగ్రత, సీఓటూ సాంద్రత, ఆర్ద్రత వంటివాటి తనిఖీ తదితరాల ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వచ్చారు. నాలుగు రోజుల్లోనే విత్తనాలు మొలకెత్తడంతో సైంటిస్టులు ఆనందోత్సాహాల్లో తేలిపోతున్నారు. ‘‘అంతరిక్షంలో జీవం పురుడు పోసుకుంది. ప్రయోగం విజయవంతమైంది. విత్తనాలు విజయవంతంగా మొలకెత్తాయి’’ అంటూ ఇస్రో హర్షం వెలిబుచి్చంది. ‘‘త్వరలో వాటికి ఆకులు కూడా రానున్నాయి. అంతరిక్ష అన్వేషణ యాత్రలో అదో కీలక మైలురాయిగా నిలవనుంది’’అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేసింది.స్పేడెక్స్ నుంచి పుడమి ఫొటోలు స్పేడెక్స్ జంట ఉపగ్రహాల్లో ఒకటైన చేజర్ భూమిని తొలిసారి ఫొటోలు, వీడియోలు తీసింది. దాన్ని ఇస్రో శనివారం విడుదల చేసింది. చేజర్ 470 కి.మీ. ఎత్తున దిగువ కక్ష్యలో పరిభ్రమిస్తూ తీసిన ఈ వీడియోలో భూమి అత్యంత అందంగా కని్పస్తోంది. ఉపగ్రహం తాలూకు అత్యంత అధునాతనమైన ఇమేజింగ్ సామర్థ్యంతో పాటు అత్యంత కీలకమైన తదుపరి దశ పరీక్షలకు దాని సన్నద్ధతకు ఈ వీడియో నిదర్శనమని ఇస్రో ఒక ప్రకటనలో పేర్కొంది. త్వరలో కీలక డాకింగ్ (ఉపగ్రహాల అనుసంధాన) పరీక్షకు చేజర్, టార్గెట్ శాటిలైట్లు సన్నద్ధమవుతున్నాయి. వీలైతే దాన్ని జనవరి 7న నిర్వహిస్తామని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ ప్రకటించడం తెలిసిందే. ఈ పరీక్ష విజయవంతమైతే డాకింగ్ పరిజ్ఞానమున్న అమెరికా, రష్యా, చైనాల సరసన భారత్ సగర్వంగా చేరుతుంది. గగన్‌యాన్ మొదలుకుని పలు భావి అంతరిక్ష పరీక్షలకు డాకింగ్ పరిజ్ఞానం కీలకం కానుంది.
మరీ ఇంత ద్రోహమా? ఇంత బరితెగింపా?: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి : ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో అలసత్వం, నిర్లక్ష్యం, ఎగవేత ధోరణి ప్రదర్శిస్తున్న కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తాజాగా తల్లికి వందనం ఎగవేతపై కూటమి సర్కార్‌ను నిలదీశారు. లక్షలాది మంది తల్లులు, పిల్లలు.. అన్నదాతలంటే మీకు అలుసా.. అని ప్రశ్నించారు. మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేయడం, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కడం మీకు అలవాటుగా మారిపోయిందని నిప్పులు చెరిగారు. ఈ మేరకు శనివారం ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.⇒ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలపై ఇంతటి బరితెగింపా? మేనిఫెస్టోపై ఇంతటి తేలిక తనమా? ప్రజలకు ఇచ్చిన మాటను అమలు చేయకుండా టేక్ ఇట్ గ్రాంటెడ్‌గా తీసుకుంటారా? లక్షల మంది తల్లులకు, పిల్లలకు, రైతులకు ఇంతటి ద్రోహం తలపెడతారా?⇒ అధికారంలోకి వస్తే తల్లికి వందనం అని, ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికీ ఏడాదికి రూ.15 వేలు చొప్పున ఇస్తామన్నారు. అధికారంలోకి రాగానే అంతకు ముందు మేం ఇస్తున్న అమ్మ ఒడి పథకాన్ని సైతం ఆపేశారు. వరుసగా కేబినెట్ సమావేశాలు జరుగుతున్నాయి కానీ, తల్లికి వందనం పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారో నిర్దిష్టంగా చెప్పలేదు. తీరా ఈ ఏడాదికి ఇవ్వం అని కేబినెట్లో తేల్చి చెప్పేశారు. ఇంతకన్నా మోసం ఏమైనా ఉంటుందా? ఇంతకన్నా పచ్చి దగా ఏమైనా ఉంటుందా?⇒ చంద్రబాబు గారూ.. ఎన్నికల వేళ మీరు, మీ కూటమి నాయకులు రాష్ట్రంలోని ప్రతి చోటా తల్లికి వందనంపై చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. ఇంటింటికీ తిరిగి కనిపించిన ప్రతి పిల్లాడినీ పట్టుకుని నీకు రూ.15 వేలు.. నీకు రూ.15వేలు.. నీకు రూ.15వేలు అన్నారు. ఇద్దరుంటే రూ.30 వేలు ఇస్తామన్నారు. ముగ్గురుంటే రూ.45 వేలు ఇస్తామన్నారు. నలుగురు ఉంటే రూ.60 వేలు ఇస్తామన్నారు. ప్రజలకు మీరు చేసిన వాగ్దానం, మీరు చెప్పిన మాటలు ఆడియో, వీడియోల రూపంలో సాక్ష్యాధారాలుగా ప్రతి ఒక్కరి సెల్ఫోన్లో ఉన్నాయి.వైఎస్సార్సీపీ హయాంలో 44.48 లక్షల మంది తల్లులకు, దాదాపు 84 లక్షల మంది పిల్లలకు రూ.26,067 కోట్లను మేము అందించి, అత్యంత విజయవంతంగా అమలు చేసిన అమ్మ ఒడిని ఆపేసినా, మీరు ఇస్తామన్న పథకం వస్తుందేమోనని బడికి వెళ్లే ఆ పిల్లలు, వారి తల్లులు ఏడెనిమిది నెలలుగా ఎదురు చూస్తూనే ఉన్నారు. చివరకు వారి ఆశలపై నీళ్లు జల్లి, ఈ ఏడాది ఇవ్వం అని నిస్సిగ్గుగా చెబుతున్నారు. ప్రజలకు ఒక మాట ఇచ్చి, దాన్ని నమ్మించి, వారి ద్వారా అధికారాన్ని తీసుకుని, ఇప్పుడు ఇవ్వలేమంటూ ఎలాంటి సంకోచం లేకుండా చెబుతున్నారు. మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేయడం, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కడం మీకు అలవాటుగా మారిపోయింది.⇒ ఇక రైతు భరోసా తీరు కూడా అలానే ఉంది. ఈ ఏడాది ఖరీఫ్, రబీ రెండు సీజన్లు అయిపోతున్నా ఇవ్వకుండా గడిపేశారు. అదిగో, ఇదిగో అంటూ లీకులు ఇస్తున్నారు కానీ, ఇప్పటి వరకు రైతులకు పెట్టుబడి సహాయం కింద ఒక్కపైసా ఇవ్వలేదు. మేము అధికారంలోకి వచ్చిన ఆ ఏడాదే.. అంటే 2019 అక్టోబర్‌లో ప్రారంభించి నప్పటి నుంచి క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం రూ.13,500 చొప్పున 53.58 లక్షల మంది రైతుల చేతిలో, రూ.34,378 కోట్లు పెట్టాం. కేంద్రం ఇచ్చేది కాకుండా మీరు ఏడాదికి రూ.20 వేలు ఇస్తామన్నారు.ఇప్పుడు ఖరీఫ్ అయిపోయిందీ, రబీ కూడా అయిపోయింది. ఒక్క పైసా ఇవ్వలేదు. ఇన్ని కేబినెట్ మీటింగ్‌లు పెట్టుకున్నాం ఎప్పుడు ఇస్తారో చెప్పడం లేదు. ఇది రైతులను నిలువెల్లా మోసం చేయడం కాదా? రైతులకు పెట్టుబడి సహాయం లేదు.. కనీస మద్దతు ధరా అందడం లేదు.. ఉన్న ఉచిత పంటల బీమాను కూడా రద్దు చేశారు.. ఆర్బీకేలను సైతం నిర్వీర్యం చేశారు. సంక్షోభంలో ఎవరైనా రైతులు దురదృష్టవశాత్తు ఆత్మహత్య చేసుకుంటే కనీసం ఆ కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందడం లేదు కదా, కనీసం పరామర్శకు కూడా నోచుకోవడం లేదు. ⇒ ప్రతి పిల్లాడికి రూ.15 వేలు చొప్పున ఎంత మంది పిల్లలు ఉంటే, అంత మందికీ ఇస్తామన్న తల్లికి వందనం మోసమే. రైతులకు పెట్టుబడి సాయంగా రూ.20 వేలు ఇస్తామన్నదీ మోసమే. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకూ రూ.18 వేలు ఇస్తామన్నదీ మోసమే. నిరుద్యోగ భృతి కింద యువతీ యువకులకు రూ.36 వేలు చొప్పున ఇస్తామన్నది కూడా మోసమే. 50 సంవత్సరాలు నిండిన ప్రతి అక్కకూ రూ.48 వేలు అయినా మోసమే. ఇంటింటికీ సేవలు అందిస్తూ మంచికి అర్థం చెప్పిన వలంటీర్లకూ మీరు చేసింది మోసమే. ఈ మోసాలు అన్నింటికీ తోడు, మీ పాలనలో ప్రజలపై ఛార్జీలతో బాదుడే బాదుడు కనిపిస్తోంది. ప్రతి అడుగులోనూ స్కామ్‌లే. ఇసుకను వదలడం లేదు, మద్యాన్నీ వదలడం లేదు. ⇒ చంద్రబాబూ గారూ.. రోజులు గడుస్తున్న కొద్దీ, మీరు చేస్తున్న మోసాలు ఒక్కొక్కటీ బయటకు వస్తూనే ఉన్నాయి. ఇవి ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీస్తున్నాయి. ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి, వారి గొంతుకై నిలుస్తోంది. ప్రజలకు మీరు ఇచ్చిన వాగ్దానాల అమలు కోసం వారి తరఫున నిలబడుతుంది.
ఆఫ్‌స్పిన్‌ను పక్కనపెట్టి... పేస్ ఆల్‌రౌండర్‌గా
అచ్చొచ్చిన సొంత మైదానంలో స్టీవ్ స్మిత్ పెద్దగా ఆకట్టుకోలేకపోగా... టీమిండియాపై దంచి కొట్టే హెడ్ 4 పరుగులకే పెవిలియన్ చేరాడు! టీనేజ్ కుర్రాడు కొన్‌స్టాస్ మెరుపులు 3 బౌండరీలకే పరిమితం కాగా... మరో ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా వైఫల్యాన్ని కొనసాగించాడు! ఆదుకుంటాడనుకున్న లబుషేన్ ఆరంభంలోనే చేతులెత్తేయగా... అలెక్స్ కేరీ మరోసారి నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాడు!అయినా ఆ్రస్టేలియా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో చెప్పుకోదగ్గ స్కోరు చేయగలిగింది అంటే అదంతా అరంగేట్ర ఆటగాడు బ్యూ వెబ్‌స్టర్ చలవే. అటు బౌలింగ్‌లో ఇటు బ్యాటింగ్‌లో ఏమాత్రం ఆకట్టుకోలేకపోతున్న మిషెల్ మార్ష్ ను తప్పించి... చివరి టెస్టులో వెబ్‌స్టర్‌కు అవకాశం ఇవ్వగా... అతడు భారత జట్టుకు ప్రధాన అడ్డంకిగా నిలిచి భారీ ఆధిక్యం దక్కకుండా అడ్డుకున్నాడు. ఆఫ్‌స్పిన్నర్‌గా కెరీర్ ఆరంభించి... ఆ తర్వాత పేస్ ఆల్‌రౌండర్‌గా మారిన ఆ్రస్టేలియా నయా తార వెబ్స్టర్పై ప్రత్యేక కథనం... – సాక్షి, క్రీడావిభాగం సుదీర్ఘ దేశవాళీ అనుభవం... వేలకొద్దీ ఫస్ట్‌క్లాస్ పరుగులు... బౌలింగ్‌లోనూ తనకంటూ ప్రత్యేకమైన శైలి ఉన్నా... ఇప్పటి వరకు అంతర్జాతీయ అరంగేట్రం చేయలేకపోయిన వెబ్‌స్టర్... ఎట్టకేలకు జాతీయ జట్టు తరఫున ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఆకట్టుకున్నాడు. భారత బౌలర్ల ధాటికి ప్రధాన ఆటగాళ్లే నిలవలేకపోతున్న చోట... చక్కటి సంయమనంతో ఆడుతూ విలువైన పరుగులు చేశాడు. గత మ్యాచ్ ద్వారానే అంతర్జాతీయ అరంగేట్రం చేసిన స్యామ్ కొన్‌స్టాస్ తన బ్యాటింగ్ విన్యాసాలతో పాటు నోటి దురుసుతో వార్తల్లోకెక్కగా... వెబ్‌స్టర్ మాత్రం నింపాదిగా ఆడి తనదైన ముద్ర వేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 13 ఓవర్లపాటు బౌలింగ్ చేసిన అతడు... 2.23 ఎకానమీతో 29 పరుగులు మాత్రమే ఇచ్చుకున్నాడు. బౌలింగ్‌లో వికెట్ తీయలేకపోయినా... స్టార్క్, కమిన్స్ వంటి స్టార్ బౌలర్ల కంటే తక్కువ పరుగులు ఇచ్చుకొని ఆత్మవిశ్వాసం పెంపొందించుకున్నాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ జట్టు 39 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డప్పుడు క్రీజులో అడుగుపెట్టిన వెబ్‌స్టర్... తనలో మంచి బ్యాటర్ ఉన్నాడని నిరూపించుకున్నాడు. మరో ఎండ్‌లో స్టీవ్ స్మిత్ ఉండటంతో ఆరంభంలో నెమ్మదిగా ఆడుతూ అతడికే ఎక్కువ స్ట్రయిక్ ఇచ్చేందుకు ప్రయత్నించాడు. ఐదో వికెట్‌కు 57 పరుగులు జోడించిన అనంతరం స్మిత్ అవుట్ కాగా... ఆ తర్వాత ఇన్నింగ్స్‌ను నడిపించే బాధ్యత భూజానెత్తుకున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో ఆడుతున్నది తొలి మ్యాచే అయినా... దేశవాళీల్లో వందల మ్యాచ్‌ల అనుభవం ఉండటంతో లోయర్ ఆర్డర్‌తో కలిసి జట్టును నడిపించాడు. అతడు ఒక్కో పరుగు జోడిస్తుంటే... టీమిండియా ఆధిక్యం కరుగుతూ పోయింది. ఆరో వికెట్‌కు అలెక్స్ కెరీతో 41 పరుగులు, ఏడో వికెట్‌కు కెపె్టన్ కమిన్స్‌తో కలిసి 25 పరుగులు జోడించాడు. ఇక కింది వరుస బ్యాటర్ల అండతో పరుగులు చేయడం కష్టమని భావించి భారీ షాట్లకు యత్నించిన వెబ్‌స్టర్... చివరకు తొమ్మిదో వికెట్ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. గత నాలుగు టెస్టుల్లో పేస్ ఆల్‌రౌండర్‌గా జట్టులో చోటు దక్కించుకున్న మిషెల్ మార్‡్ష ఒక్క మ్యాచ్‌లోనూ అటు బ్యాట్‌తో కానీ, ఇటు బంతితో కానీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోగా... తొలి మ్యాచ్‌లోనే వెబ్‌స్టర్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అనూహ్య బౌన్స్, అస్థిర పేస్ కనిపించిన సిడ్నీ పిచ్‌పై వెబ్‌స్టర్ గొప్ప సంయమనం చూపాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారత ఆటగాళ్లు ఒక్కరు కూడా 40 పరుగులు దాటి చేయలేకపోయిన చోట ఈ మ్యాచ్‌లో తొలి అర్ధ శతకం నమోదు చేసిన వెబ్‌స్టర్... ఆ తర్వాత బంతితోనూ ఆకట్టుకున్నాడు. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 4 ఓవర్లు వేసిన వెబ్‌స్టర్ అందులో కీలకమైన శుబ్‌మన్ గిల్ వికెట్ పడగొట్టి టీమిండియాను దెబ్బకొట్టాడు. కామెరూన్ గ్రీన్ వంటి ప్రధాన ఆల్‌రౌండర్ అందుబాటులో లేకపోవడంతో మిషెల్ మార్ష్ జట్టులోకి రాగా... ఇప్పుడు వెబ్‌స్టర్ ప్రదర్శన చూస్తుంటే ఇక మార్ష్ జట్టులో చోటుపై ఆశలు వదులుకోవడమే మేలనిపిస్తోంది. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం... స్పిన్నర్‌గా కెరీర్ ఆరంభించిన 31 ఏళ్ల వెబ్‌స్టర్... ఆ తర్వాత పేస్ ఆల్‌రౌండర్‌గా ఎదిగాడు. 6 అడుగుల 7 అంగుళాలున్న వెబ్‌స్టర్‌కు బంతిని స్పిన్ చేయడం కంటే... వేగంగా విసరడం సులువు అని కోచ్‌లు సూచించడంతో తన దిశ మార్చుకున్నాడు. ఏజ్ గ్రూప్ క్రికెట్ నుంచే నిలకడ కొనసాగించిన వెబ్‌స్టర్... 2014లో తన 20 ఏళ్ల వయసులో ఫస్ట్‌క్లాస్ అరంగేట్రం చేశాడు. మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ భారీగా పరుగులు రాబట్టినా... జాతీయ జట్టులో పోటీ కారణంగా అతడికి ఆసీస్ తరఫున అరంగేట్రం చేసే అవకాశం దక్కలేదు. అయినా నిరాశ చెందకుండా దేశవాళీల్లో రాణించిన వెబ్‌స్టర్ ‘బోర్డర్–గావస్కర్’ ట్రోఫీ ప్రారంభానికి ముందు భారత్ ‘ఎ’తో జరిగిన అనధికారిక టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియా ‘ఎ’ తరఫున బరిలోకి దిగి అటు బంతితో ఇటు బ్యాట్‌తో రాణించాడు. 2023–24 షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో వెబ్‌స్టర్ విశ్వరూపం ప్రదర్శించాడు. సీజన్ ఆసాంతం ఒకే తీవ్రత కొనసాగించిన అతడు... 58.62 సగటుతో 938 పరుగులు చేయడంతో పాటు... 30.80 సగటుతో 30 వికెట్లు పడగొట్టాడు. ఈ టోర్నీ చరిత్రలో గ్యారీ సోబర్స్ తర్వాత ఒకే సీజన్లో రెండు విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాడిగా నిలిచాడు. దీంతో పాకిస్తాన్‌తో జరిగిన ప్రైమ్‌మినిస్టర్స్ ఎలెవన్ జట్టుకు ఎంపిక చేశారు. అక్కడ కూడా రాణించిన వెబ్‌స్టర్ తనను పక్కన పెట్టలేని పరిస్థితి కల్పించాడు. కెరీర్లో ఇప్పటి వరకు 93 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లాడిన వెబ్‌స్టర్ 5297 పరుగులు సాధించాడు. అందులో 12 సెంచరీలు, 24 హాఫ్‌సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్‌లో 148 వికెట్లు పడగొట్టాడు.
పాతాళాన్ని తాకిన పార్లమెంట్ ప్రతిష్ఠ
మన దేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌కు జవాబుదారీతనం వహించాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను చర్చించి సమీక్షించే అధికారాన్ని రాజ్యాంగం పార్లమెంట్‌కు దఖలు పర్చింది. ఈ ప్రక్రియ సజావుగా జరగడం కోసమే ప్రతి యేటా భారత పార్లమెంట్ మూడు పర్యాయాలు సమావేశాలు నిర్వహిస్తుంది. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌కు జవాబుదారీతనం వహించడం అంటే ప్రాతినిధ్య ప్రజాస్వామ్య వ్యవస్థ అయిన మన దేశంలో దేశ ప్రజలకు బాధ్యత వహించడమేనని ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు.ఇంత ఘనమైన రాజ్యాంగ బాధ్యత ఉన్నది కనుకనే భారత పార్లమెంట్‌ను దేశ ప్రజల భవిష్యత్తును రూపొందించే కార్య శాలగా పేర్కొంటారు. కానీ, గత రెండు దశాబ్దాల పైబడి భారత పార్లమెంట్ ప్రతిష్ఠ క్రమంగా మసకబారుతోంది. పార్లమెంట్ ఉభయ సభల్లో గతంలో కూడా అప్పుడప్పుడు సభ్యులు నిగ్రహం కోల్పోయి అరుపులు, కేకలు పెట్టడం వంటి అవాంఛనీయ ఘటనలు జరిగిన మాట వాస్తవమే అయినా, తాజాగా డిసెంబర్ 20తో ముగిసిన 18వ లోక్‌సభ శీతాకాల సమావేశాలలో అన్ని హద్దులు దాటి సభ్యులు బాహాబాహీకి దిగిన దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి. అధికార, విపక్ష సభ్యులు పరస్పరం తోపులాట లకు దిగిన హీనస్థితికి లోక్‌సభ వేదిక కావడం దిగజారిన రాజకీయ సంస్కృతికి అద్దం పడుతుంది.తగ్గిపోయిన ప్రశ్నోత్తరాల సమయందశాబ్ద కాలంగా పార్లమెంట్ సమావేశాల పని గంటలు తగ్గి పోతున్నాయి. 16వ లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయం నిర్దేశిత వ్యవధిలో 77 శాతం, అదేవిధంగా రాజ్యసభలో 44 శాతం మాత్రమే నమోదైంది. కారణం– పార్లమెంట్ ఉభయ సభల్లో అవాంతరాలు ఏర్పడి సభలు తరచుగా వాయిదా పడటమే. పార్లమెంట్ బిజినెస్‌లో ఇతర అంశాల కోసం అదనపు గంటలు పనిచేసే వెసులుబాటు ఉంది గానీ, ప్రశ్నోత్తరాలు వాయిదా పడితే... ఆ సమయాన్ని పొడిగించరు. వాటికి కేవలం రాతపూర్వక జవాబుల్ని మాత్రమే సభ్యులకు పంపుతారు. సామాన్యంగా ప్రశ్నోత్తరాల సమయాన్ని కొత్తగా ఎన్నికయిన సభ్యులు ఎక్కువగా సద్వినియోగ పర్చుకొంటారు. సభ్యులు తాము ప్రాతినిధ్యం వహించే రాష్ట్ర, నియోజకవర్గ సమస్యలకు సంబంధించి ప్రశ్నలు వేసి వాటికి జవాబులు ఆశిస్తారు. ప్రశ్నోత్తరాల సమయం రద్ద యితే... సభ్యులు తమ విలువైన అవకాశాన్ని కోల్పోవడమేగాక, వారు ఆశించి ఎదురు చూస్తున్న అంశాలపై సమాధానం పొంద లేకపోతారు.పార్లమెంట్ సమావేశాలు సవ్యంగా సాగకపోవడానికి ప్రతి సారీ ఒక్కో విధమైన కారణాలు దోహదం చేస్తున్నాయి. ఈసారి శీతాకాల సమావేశాలలో పారిశ్రామికవేత్త అదానీ వ్యవహారంపై చర్చించాలని కాంగ్రెస్ పార్టీతో సహా మరికొన్ని విపక్ష పార్టీలు గట్టిగా పట్టుబట్టి ఉభయ సభల కార్యకలాపాల్ని అడ్డుకున్నాయి. ఈ సమావేశాలలోనే రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్కడ్పై విపక్షం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి ఇచ్చిన నోటీసును డిప్యూటీ చైర్మన్ తిరస్కరించడంతో గందరగోళం నెలకొని పలుమార్లు రాజ్యసభ వాయిదా పడింది. ఇక, కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యపై భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్‌ను ఆయన అవమానించారంటూ విపక్ష సభ్యులు గందరగోళాన్ని పరాకాష్టకు తీసుకువెళ్లడంతో... అదికాస్తా అధికార, విపక్ష సభ్యుల మధ్య తోపులాటలు, ముష్టిఘాతాలకు దారితీసింది. సభల్ని సజావుగా నిర్వహించాల్సిన బాధ్యత గలిగిన అధికార ఎన్డీఏ సైతం పార్లమెంట్ వేదికగా కాంగ్రెస్ పార్టీ దేశ వ్యతిరేక శక్తులతో చేతులు కలిపిందంటూ ఆరోపణలు చేయడంతో ఉభయ సభల్లో విపక్ష పార్టీల సభ్యులు వాకౌట్ చేశారు. కారణాలు ఏవైనా, ఈ శీతాకాల సమావేశాలలో లోక్‌సభ నిర్ణీత వ్యవధిలో 54.5 శాతం, అదేవిధంగా రాజ్యసభ 40 శాతం మాత్రమే పనిచేశాయి. శీతాకాల సమావేశాలు అతి తక్కువ వ్యవధిలో పని చేయడం ఇదే ప్రథమం అని రికార్డులు వెల్లడిస్తున్నాయి.ఆమోదం పొందిన బిల్లు ఒక్కటే!నిజానికి, ఈ శీతాకాల పార్లమెంట్ సమావేశాలకు విలువైన పెద్ద ఎజెండానే సిద్ధం చేశారు. మొత్తం 16 బిల్లుల్ని ప్రవేశపెట్టిఅందులో మెజారిటీ బిల్లుల్ని ఆమోదింపజేసుకోవాలని అధికార కూటమి భావించింది. కానీ, విమానయాన రంగానికి సంబంధించిన ‘భారతీయ వాయుయాన్ విధేయక్, 2024’ బిల్లు ఒక్కటే ఉభయ సభల ఆమోదం పొందగలిగింది. ఆర్థిక రంగానికి సంబంధించి మొదటి విడత సప్లిమెంటరీ గ్రాంట్స్ కూడా ఆమోదం పొందవలసి ఉన్నాయి. అయితే కొన్ని బిల్లులు లోక్‌సభలో, మరి కొన్ని రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ముఖ్యంగా జమిలి ఎన్నికలకు సంబంధించిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టి దానిని జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపించారు. దేశ ప్రయోజనాల రీత్యా అన్ని పక్షాలు ఏకాభిప్రాయానికి రావా ల్సిన కీలక అంశాలపై కూడా అధికార, విపక్షాలు ఏకతాటిపైకి రాలేని అవమానకర దు:స్థితి నెలకొంది.చట్టసభలు క్రియాశీలంగా లేకపోవడం అంటే దేశంలో ప్రజాస్వామ్యం లేనట్టే. ‘చర్చల ద్వారా పాలన సాగించడమే ప్రజా స్వామ్యం’ అని పలువురు రాజనీతిజ్ఞులు చెప్పిన మాట మన దేశంలో క్రమేపి నవ్వులాటగా మారుతోంది. పార్లమెంటరీ ప్రజా స్వామ్యానికి పురుడుపోసిన ఇంగ్లాండ్ పార్లమెంట్ భారత్‌తో సహా అనేక దేశాలకు ఆదర్శప్రాయం. వెస్ట్‌మినిస్టర్ తరహా పాలనను అనుసరిస్తున్నామని చెప్పుకోవడమే తప్ప... నిజానికి మన పార్ల మెంటరీ పద్ధతులు, విధానాలు ఇంగ్లాండ్‌కు భిన్నంగా ఉన్నాయి. ఇంగ్లాండ్ పార్లమెంట్లో ప్రతిపక్షాల చర్చలకు ప్రత్యేకంగా 20 రోజులు కేటాయించే అవకాశాన్ని వారి రాజ్యాంగం కల్పించింది. ప్రధాన ప్రతిపక్షానికి 17 రోజులు, ఇతర విపక్ష పార్టీలకు 3 రోజులు మాట్లాడే అవకాశాన్ని కల్పిస్తున్నారు. అదేవిధంగా, 40 మంది సభ్యుల మద్దతు కూడగడితే వారు కోరిన అంశాన్ని అనివార్యంగా సభ చర్చకు స్వీకరించాల్సిందే. మన పార్లమెంట్లో అటువంటి నిబంధనగానీ, ఆనవాయితీగానీ లేవు. నిజానికి మన రాజ్యాంగ కర్తలు భవిష్యత్తులో చట్టసభలలో విపరీత పరిణా మాలు చోటుచేసుకొంటాయని ఆనాడు ఊహించలేదు. విపక్షాలు నిరసన తెలపడం, వాకౌట్ చేయడం వారి హక్కుగా, ప్రజాస్వామ్యంలో ఓ భాగంగానే భావించారు గానీ... రోజుల తరబడి చట్టసభలు వాయిదా పడతాయనీ, బిల్లులు చర్చకు నోచుకోకుండా గిలెటిన్ అవుతాయనిగానీ వారు అంచనా వేయలేకపోయారు.కారణాలు ఏవైనా పార్లమెంట్ ఔన్నత్యం, ప్రతిష్ఠ నానాటికి తగ్గడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ప్రజాప్రతినిధులు సభల నుంచి వాకౌట్ చేసి క్యాంటీన్లలో, లాబీల్లో కాలక్షేపం చేయడం సహించరానిది. చర్చకు నోచుకోకుండా బిల్లులు చట్టాలైతే అవి ప్రజలకు గుదిబండలుగా మారతాయి. అందువల్ల పార్లమెంట్ క్రియాశీలకంగా మారాలి. చట్టసభలు క్రియాశీలంగా పని చేయ డానికి, సభ్యుల చురుకైన భాగస్వామ్యానికి అవసరమైన సంస్కరణలు తక్షణం చేపట్టాలి. అందుకు అన్ని పార్టీల సలహాలు, సూచనలు స్వీకరించాలి. లా కమిషన్‌కు కూడా బాధ్యత అప్పగించాలి. ఆ విధంగా పాతాళానికి పడిపోయిన పార్లమెంట్ ప్రతిష్ఠను పున రుద్ధరించడానికి కేంద్ర ప్రభుత్వమే చొరవ తీసుకోవాలి. చట్ట సభలు అలంకార ప్రాయంగా మారిపోవడాన్ని ప్రజలు ఇకపై ఎంత మాత్రం సహించరని అన్ని రాజకీయ పార్టీలు గ్రహించాలి.డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాసకర్త ఏపీ శాసనమండలి సభ్యులు,కేంద్ర మాజీ మంత్రి
ఊపందుకుంటున్న వలంటీర్ల ఆందోళనలు
సాక్షి,అమరావతి/సత్యనారాయణపురం(విజయవా డ సెంట్రల్)/కర్నూలు (సెంట్రల్): ఎన్నికల ముందు ఉగాది పండుగ రోజున చంద్రబాబు చెప్పిన మాటలు నమ్మి మోసపోయిన వలంటీర్ల ఆందోళనలు మరింతగా ఊపందుకున్నాయి. వరుసగా గురు, శుక్ర, శనివారాల్లో రాష్ట్రవ్యాప్తంగా వలంటీర్లు ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా మరోవిడత ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 2న గ్రామ, వార్డు సచివాలయం అడ్మిన్లకు వినతిపత్రాలు ఇవ్వగా.. 3న జిల్లా కేంద్రాల్లో న్యాయం చేయాలని కోరుతూ వలంటీర్లు మోకాళ్ల మీద కూర్చుని భిక్షాటన చేశారు.ఇక శనివారం (4న) రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వలంటీర్లూ వెనుకకు నడుస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. వలంటీర్లకు న్యాయంచేస్తామని నమ్మబలికి అధికారంలోకి వచ్చాక యూటర్న్ తీసుకోవడాన్ని నిరసిస్తూ సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ బ్యాక్‌వాక్ చేస్తున్నారన్న దానిని గుర్తుచేస్తూ తమ ఆందోళన నిర్వహించారు. తాము అధికారంలోకి వస్తే వలంటీర్లను కొనసాగించడంతో పాటు వలంటీర్లకు రూ.10 వేలు ఇచ్చే బాధ్యత తమది అంటూ ప్రకటించిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వలంటీర్ల వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారని వలంటీర్ల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. పైగా.. జూన్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుంచి ఇప్పటివరకు వేతనాలు చెల్లించలేదని వారంటున్నారు. ఈ నేపథ్యంలో.. చంద్రబాబు హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ వలంటీర్లు వివిధ రూపాల్లో ఆందోళన నిర్వహిస్తున్నారు.ఎమ్మెల్యేలు, మంత్రుల ఇళ్లను ముట్టడిస్తాం..ఈ నేపథ్యంలో శనివారం విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులో వలంటీర్లు ప్రభుత్వం యూటర్న్ తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ వెనక్కి నడిచి తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వలంటీర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పరుచూరి రాజేంద్రబాబు, లంక గోవిందరాజులు మాట్లాడుతూ.. విజయవాడ వరద ముంపు సమయంలో వలంటీర్లతో సేవలు చేయించుకుని నేడు కనీసం వారికి సచివాలయాల్లో హాజరు వేసుకునే అవకాశం కూడా కల్పించకుండా వేధిస్తున్నారని మండిపడ్డారు.వలంటీర్లకు గత ఎనిమిది నెలలుగా జీతాలు కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఇచ్చిన హామీ మేరకు వలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించి వారికి రూ.పది వేల గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా 2.60 లక్షల వలంటీర్లు, వారి కుటుంబ సభ్యులు అన్ని నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు, మంత్రుల ఇళ్లను ముట్టడించి నిరసన తెలియజేస్తామని వారు హెచ్చరించారు.బాబుగారూ.. మా కడుపులు కొట్టొద్దు!ఇక కర్నూలులో కూడా వలంటీర్లు వినూత్నంగా నిరసన వ్యక్తంచేశారు. ఖాళీ ప్లేట్లు పట్టుకుని భిక్షాటన చేశారు. తమ కడుపులు కొట్టొద్దని సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ను ఈ సందర్భంగా వేడుకున్నారు. ముందుగా కలెక్టరేట్ గేటు నుంచి గాంధీ విగ్రహం వరకు ర్యాలీగా నిర్వహించారు. అనంతరం అక్కడ ధర్నా నిర్వహించి భిక్షాటన చేశారు. ఈ సందర్భంగా వలంటీర్లు మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా స్వచ్ఛంధంగా పనిచేశామని.. కానీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తమను తీసివేయడం అన్యాయమన్నారు. ఎన్నికల సమయంలో వలంటీర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. లేదంటే పెద్దఎత్తున వీధి పోరాటాలకు దిగుతామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమాలకు ఏఐవైఎఫ్ మద్దతిస్తోంది.
భళా హైదరాబాద్
న్యూఢిల్లీ: కార్యాలయ స్థలాల (ఆఫీస్ స్పేస్) మార్కెట్లో సందడి నెలకొంది. 2024లో ఈ మార్కెట్లో లీజు లావాదేవీలు గణనీయంగా పెరిగాయి. హైదరాబాద్‌లో 37 శాతం వృద్ధితో 123 లక్షల చదరపు అడుగుల (ఎస్ఎఫ్టీ) స్థూల లీజింగ్ లావాదేవీలు నమోదయ్యాయి. 2023లో 90 లక్షల ఎస్ఎఫ్టీ మేర లావాదేవీలు జరగడం గమనార్హం. హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన నగరాల్లో 885 లక్షల చదరపు అడుగుల (ఎస్ఎఫ్టీ) విస్తీర్ణం మేర స్థూల లీజింగ్ 2024లో నమోదైనట్టు కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ నివేదిక వెల్లడించింది. అంతకుముందు ఏడాది 746 లక్షల ఎస్ఎఫ్టీతో పోల్చి చూస్తే 19 శాతం వృద్ధి నమోదైనట్టు తెలిపింది. ‘‘భారత ఆఫీస్ మార్కెట్‌కు 2024 నిర్ణయాత్మకమైనది. రికార్డు స్థాయిలో లీజింగ్ నమోదైంది. ఆఫీస్ స్పేస్‌కు అంతర్జాతీయంగా భారత్ బలమైన వృద్ధి మార్కెట్ అని మరోసారి నిరూపితమైంది’’అని కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ ఇండియా సీఈవో అన్షుల్ జైన్ పేర్కొన్నారు. గ్లోబల్ కేపబులిటీ సెంటర్లు (జీసీసీలు) పెరుగుతుండడం బహుళజాతి సంస్థలకు భారత్ వ్యూహాత్మక ప్రాధాన్యమైనదిగా తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు. ఆఫీస్ స్పేస్ డిమాండ్‌లో 30 శాతం డిమాండ్ జీసీసీల నుంచే వస్తోంది. ‘‘2025లో గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్ డిమాండ్ బలంగా ఉండనుంది. అంతర్జాతీయ ఆఫీస్ మార్కెట్లో భారత్ ఆధిపత్యం బలపడనుంది’’అని జైన్ అంచనా వేశారు. తాజా లావాదేవీలు, రెన్యువల్ అన్నీ స్థూల లీజింగ్ కిందకే వస్తాయి. పట్టణాల వారీగా లీజింగ్.. → బెంగళూరులో 259 లక్షల చదరపు అడుగుల స్థూల లీజింగ్ లావాదేవీలు 2024లో నమోదయ్యాయి. అంతకుముందు ఏడాది లీజింగ్ పరిమాణం 158.3 లక్షల చదరపు అడుగులుగా ఉంది. అత్యధికంగా 64 శాతం వృద్ది ఇక్కడ నమోదైంది. → ముంబైలో స్థూల లీజింగ్ 27 శాతం పెరిగి 178.4 లక్షల చదరపు అడుగులకు చేరింది. → అహ్మదాబాద్‌లో 11 శాతం అధికంగా 18.1 లక్షల ఎస్ఎఫ్టీ లీజు లావాదేవీలు జరిగాయి. → ఢిల్లీ ఎన్సీఆర్లో మాత్రం క్రితం ఏడాదితో పోలి్చతే 3 శాతం తక్కువగా 131.4 లక్షల చదరపు అడుగుల లీజింగ్ లావాదేవీలు నమోదయ్యాయి. → పుణెలో 84.7 లక్షల ఎస్ఎఫ్టీ లీజింగ్ రికార్డు అయింది. 2023లో లీజు పరిమాణం 97.4 లక్షల ఎస్ఎఫ్టీతో పోల్చితే 13 శాతం తగ్గింది. → కోల్‌కతా ఆఫీస్ మార్కెట్లో 17 లక్షల చదరపు అడుగుల లీజు లావాదేవీలు నమోదయ్యాయి. అంతకుముందు ఏడాదితో పోల్చితే స్థిరంగా కొనసాగింది. → ఐటీ–బీపీఎం, ఇంజనీరింగ్ అండ్ తయారీ, బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సరీ్వసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) రంగాలు ఆఫీస్ స్పేస్ డిమాండ్‌లో ప్రముఖ పాత్ర పోషించాయి. → మొత్తం స్థూల లీజింగ్‌లో కోవర్కింగ్ ఆపరేటర్లు 14 శాతం తీసుకున్నారు. ప్రాపర్టీ యజమానుల నుంచి ఆఫీస్ స్పేస్ లీజు తీసుకుని, కార్పొరేట్లు, ఇతరులకు వీరు లీజుకు ఇవ్వనున్నారు. తగ్గిన ఖాళీ స్థలాలు.. 2024లో వాణిజ్య రియల్ ఎస్టేట్‌లో రికార్డు స్థాయి లావాదేవీలు నమోదైనట్టు, ఖాళీ స్థలాలు గణనీయంగా తగ్గినట్టు ముంబైకి చెందిన రహేజా కార్ప్ ఎండీ, సీఈవో వినోద్ రోహిరా తెలిపారు. మౌలిక వసతులకు ప్రాధాన్యం ఇచ్చే అన్ని పట్టణాల్లోనూ వాణిజ్య రియల్ ఎస్టేట్‌లో వృద్ధి నమోదైనట్టు చెప్పారు. గ్రేడ్ ఏ ఆఫీస్ స్పేస్‌కు డిమాండ్ ఇక ముందూ కొనసాగుతుందన్నారు.
ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ–కాంగ్రెస్ పొత్తు
ఆదివారం ఆ ఊళ్లో మాంసం ముట్టరు
అమెరికా దిగువసభలో నలుగురు హిందువులు
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
ఇక పప్పులుడకవ్!
పీడీఎస్ కాదు.. ‘మనోహర‘మైన బియ్యం..!
బర్డ్ ఉమన్.. పిట్టలు వాలిన చెట్టు
ముందే వచ్చిన విదేశీ అతిథులు
సత్తా చాటిన నౌకాదళం
మరీ ఇంత ద్రోహమా? ఇంత బరితెగింపా?: వైఎస్ జగన్
BGT: మూడు ఐపీఎల్ సీజన్లకు సరిపడా ఓవర్లు ఒక్కడే వేశాడు!
ఏకంగా 174 కిలోల బరువు తగ్గాడు, చివరకు..
బంగారం తగ్గిందండోయ్.. కొత్త ఏడాదిలో తొలిసారి..
IND Vs AUS: 'టెస్టు క్రికెట్ చరిత్రలోనే పంత్ ఒక అద్బుతం'
'దేవర'కు 100 రోజులు.. ఎన్ని కేంద్రాలు, ఎక్కడెక్కడ..?
నూటికి ఒక్క తండ్రికి దక్కుతుందేమో ఇలాంటి అదృష్టం..!
వారెవ్వా!.. యశస్వి జైస్వాల్ ప్రపంచ రికార్డు
కోకాపేట ధరలో సగానికే లగ్జరీ ఫ్లాట్లు..!
సినీ నటి సీత ఇంట్లో విషాదం
న్యూ ఇయర్ వేళ తప్పతాగిన ప్రముఖ బుల్లితెర నటి.. నడవలేని స్థితిలో!
ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ–కాంగ్రెస్ పొత్తు
ఆదివారం ఆ ఊళ్లో మాంసం ముట్టరు
అమెరికా దిగువసభలో నలుగురు హిందువులు
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
ఇక పప్పులుడకవ్!
పీడీఎస్ కాదు.. ‘మనోహర‘మైన బియ్యం..!
బర్డ్ ఉమన్.. పిట్టలు వాలిన చెట్టు
ముందే వచ్చిన విదేశీ అతిథులు
సత్తా చాటిన నౌకాదళం
మరీ ఇంత ద్రోహమా? ఇంత బరితెగింపా?: వైఎస్ జగన్
BGT: మూడు ఐపీఎల్ సీజన్లకు సరిపడా ఓవర్లు ఒక్కడే వేశాడు!
ఏకంగా 174 కిలోల బరువు తగ్గాడు, చివరకు..
బంగారం తగ్గిందండోయ్.. కొత్త ఏడాదిలో తొలిసారి..
IND Vs AUS: 'టెస్టు క్రికెట్ చరిత్రలోనే పంత్ ఒక అద్బుతం'
'దేవర'కు 100 రోజులు.. ఎన్ని కేంద్రాలు, ఎక్కడెక్కడ..?
నూటికి ఒక్క తండ్రికి దక్కుతుందేమో ఇలాంటి అదృష్టం..!
వారెవ్వా!.. యశస్వి జైస్వాల్ ప్రపంచ రికార్డు
కోకాపేట ధరలో సగానికే లగ్జరీ ఫ్లాట్లు..!
సినీ నటి సీత ఇంట్లో విషాదం
న్యూ ఇయర్ వేళ తప్పతాగిన ప్రముఖ బుల్లితెర నటి.. నడవలేని స్థితిలో!
సినిమా
'మా అమ్మాయి నిప్పు'.. నటి బండారం బయటపెట్టిన సల్మాన్
'మా అమ్మాయి నిప్పు.. తనకు బాయ్‌ఫ్రెండ్ అంటూ ఎవరూ లేరు. అబ్బాయిలతో అంత సన్నిహితంగా ఉన్నదే లేదు. భవిష్యత్తులో కూడా తను ఎవరినీ ప్రేమించదు. నేను చూపించిన అబ్బాయిని తప్ప ఇంకెవర్నీ పెళ్లి చేసుకోదు. అనవసరంగా తన గురించి లేనిపోనివి మాట్లాడితే బాగోదు' అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది నటి (Chahat Pandey) చాహత్ పాండే తల్లి భావన పాండే. బుల్లితెర నటి చాహత్ ప్రస్తుతం హిందీ బిగ్‌బాస్ 18 (Bigg Boss 18)వ సీజన్లో పాల్గొంది. ఉతికారేసిన చాహత్ తల్లిఇటీవల ఫ్యామిలీ వీక్‌లో భాగంగా చాహత్ తల్లి బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టింది. ఆ సమయంలోనే తన కూతురితో కయ్యం పెట్టుకుంటున్న అవినాష్ మిశ్రాపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పై కామెంట్స్ చేసింది. ఈ వ్యవహారం అంతటితో ముగిసిపోలేదు. నిజంగానే చాహత్ సింగిలా? అని బిగ్‌బాస్ టీమ్‌కు డౌట్ వచ్చింది. తనకు ప్రియుడు ఉండొచ్చన్న అనుమానంతో సోషల్ మీడియా అంతా జల్లెడపట్టారు. ఈ క్రమంలో ఓ ఫోటో దొరికింది. అందులో ప్రియుడు లేడు కానీ ప్రేమలో ఉన్నట్లు యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంది.(చదవండి: గేమ్ ఛేంజర్ ఈవెంట్‌కు హీరోయిన్ డుమ్మా.. ఎందుకంటే?)మీ అమ్మ సర్టిఫికెట్ ఇచ్చింది!ఇంకేముంది, దాన్ని పట్టేసుకున్నారు. తాజా ప్రోమోలో సల్మాన్ ఖాన్ (Salman Khan).. అమ్మాయిల వెంటపడే అబ్బాయిలంటే నీకస్సలు ఇష్టముండదని మీ అమ్మ చెప్పింది. అంటే నువ్వు ఎలాంటిదానివో చెప్తూ మంచి సర్టిఫికెట్ ఇచ్చి వెళ్లిపోయింది. మా టీమ్ ఇది నిజమేనా? అని నిర్ధారించుకునే క్రమంలో ఒకటి కనుగొన్నారు. అదేంటో మీరూ చూసేయండి అంటూ ఫోటో చూపించాడు. యానివర్సరీ ఫోటో.. మరి ఇదేంటి?ఆ ఫోటోలో 'ఐదేళ్లు పూర్తయ్యాయి. హ్యాపీ యానివర్సరీ మై లవ్' అని కేక్‌పై రాసి ఉంది. ఆ కేక్ పక్కనే చాహత్ కూర్చుని ఉంది. అది చూసి చాహత్ కంగారుపడగా.. తనతో పాటు సీరియల్స్ చేసిన అవినాష్.. ఇప్పటికైనా నిజం ఒప్పుకో, సెట్లో అందరికీ ఆ విషయం తెలుసు అని చెప్పాడు. కానీ చాహత్ ఒప్పుకోలేదు.ఇంత దిగజారుతారా?అయితే ఈ వ్యవహారంలో పలువురు నెటిజన్లు బిగ్‌బాస్ టీమ్‌నే తప్పుపడుతున్నారు. తన పర్సనల్ లైఫ్‌లో ఏం జరిగిందో తెలుసుకుని మరీ అందరి ముందు దోషిగా నిలబెట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. అది తన వ్యక్తిగతమని, దానివల్ల మిగతావారికేంటి సమస్య? అని నిలదీస్తున్నారు. బిగ్‌బాస్ టీమ్ ఇంత దిగజారుతుందనుకోలేదంటూ కామెంట్లు చేస్తున్నారు.చదవండి: 'దేవర'కు 100 రోజులు.. ఎన్ని కేంద్రాలు, ఎక్కడెక్కడ..?
గేమ్ ఛేంజర్ టికెట్ రేట్ల పెంపునకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
మెగా హీరో రామ్ చరణ్ (Ram Charan) గేమ్ ఛేంజర్ సినిమా టికెట్ రేట్ల పెంపునకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జనవరి 10న అర్ధరాత్రి ఒంటిగంటకు బెనిఫిట్ షోకు అనుమతిచ్చింది. బెనిఫిట్ షో టికెట్ ధర రూ.600గా నిర్ణయించింది.జనవరి 23 వరకు రోజుకు ఐదు షోలుమొదటి రోజు ఆరు షోలకు అనుమతిచ్చింది. ఈ నెల 11 నుంచి 23వ తేదీ వరకు ఐదు షోలు వేసుకోవచ్చని తెలిపింది. సింగిల్ స్క్రీన్‌లో టికెట్ ధర రూ.135 పెంచగా.. మల్టీప్లెక్స్‌లో అదనంగా రూ.175 పెంచుకునేందుకు అంగీకరిచింది. ఈ మేరకు శనివారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.సినిమా..గేమ్ ఛేంజర్ సినిమా (Game Changer Movie) విషయానికి వస్తే ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ పూర్తి స్థాయిలో నటిస్తున్న చిత్రమిది. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ కథానాయిక. అంజలి ముఖ్య పాత్ర పోషించింది. తమన్ సంగీతం అందించిన ఈ మూవీ జనవరి 10న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.చదవండి: మా అమ్మ ఎవర్నీ గాయపర్చలేదు, ఈ భారం మోయలేకున్నా!: పవిత్ర కూతురు
'దేవర'కు 100 రోజులు.. ఎన్ని కేంద్రాలు, ఎక్కడెక్కడ..?
ఎన్టీఆర్ బ్లాక్‌బస్టర్ సినిమా దేవర 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ మధ్య కాలంలో ఒక సినిమా పది రోజులు థియేటర్స్‌లో రన్ కావడమే గొప్ప విషయమని చెప్పవచ్చు. అలాంటిది దేవర చిత్రం ఆరు కేంద్రాలలో వందరోజుల మార్క్‌ను అందుకుంది. పుష్ప2 వంటి భారీ హిట్ సినిమా ముందు కూడా దేవర ఈ రికార్డ్ సాధించడం అనేది సాధరణ విషయం కాదని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ మధ్య కాలంలో ఒక సినిమా 100రోజులు, 50 రోజులు ప్రదర్శన అనే మాటే వినిపించడమే లేదు. అయితే, దేవర ఆ లోటును పూర్తి చేసింది.దేవర సినిమా 52 కేంద్రాల్లో 50 రోజుల పోస్టర్ పడింది. ఇప్పుడు ఆరు కేంద్రాలలో దేవర 100 రోజులు విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ మేరకు తాజాగా మేకర్స్ ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. నవంబర్ 15న దేవర 50 రోజుల వేడుకను సెలబ్రేట్ చేసుకున్న అభిమానులు ఇప్పుడు వందరోజుల పండగను సందడిగా జరుపుకుంటున్నారు.ఆరు థియేటర్లలో 100 రోజులుఈస్ట్ గోదావరి జిల్లాలో రెండు థియేటర్స్ మలికిపురం ( పద్మజ ), మండపేట (రాజరత్న) ఉన్నాయి. చిలకలూరిపేటలోని (రామకృష్ణ), చిత్తూరు జిల్లాలోని బి. కొత్తకోట (ద్వారక), కల్లూరు (ఎమ్ఎన్ఆర్), రొంపిచర్ల (ఎమ్ఎమ్ డీలక్స్) వంటి థియేటర్లలో దేవర 100 రోజులు పూర్తి చేసుకుంది.కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర సినిమాతో జాన్వీకపూర్ తొలిసారి తెలుగు తెరపై మెరిసింది. ఇందులో సైఫ్ అలీఖాన్, శ్రుతి మరాఠే, ప్రకాశ్‌రాజ్, శ్రీకాంత్ వంటి స్టార్స్ కీలకపాత్రల్లో నటించారు. సినిమాటోగ్రఫీతో పాటు సంగీతం ప్రేక్షకులను విశేషంగా మెప్పించాయి. దేవర పార్ట్2 కూడా ఉందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.
నమో నమః శివాయ సాంగ్: చై, సాయిపల్లవి తాండవం చూశారా?
యువ సామ్రాట్ నాగ చైతన్య (Naga Chaitanya), సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ 'తండేల్' (Thandel Movie). చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.ఈ సినిమా నుంచి రిలీజైన ఫస్ట్ సింగిల్ "బుజ్జి తల్లి" సెన్సేషనల్ హిట్ అయింది. ఇప్పుడు అందరూ ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సెకండ్ సింగిల్ "నమో నమః శివాయ" లిరికల్ (Namo Namah Shivaya Lyrical Song) వీడియోను రిలీజ్ చేశారు. మహాదేవ్ నామస్మరణతో కొనసాగిన ఈ శివ శక్తి పాట బ్రీత్ టేకింగ్ మాస్టర్ పీస్. డ్యాన్స్, డివొషన్, గ్రాండియర్ విజువల్ తో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసింది.జొన్నవిత్తుల సాహిత్యం శివుని సర్వశక్తి, ఆధ్యాత్మికత సారాంశాన్ని అద్భుతంగా చూపించింది. అనురాగ్ కులకర్ణి అద్భుతంగా పాడాడు. హరిప్రియ గాత్రం పాటకు మరింత అందాన్ని తెచ్చింది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ మరొక హైలైట్. డ్యాన్స్ ద్వారా భక్తి గాథను అందంగా వివరించడం బాగుంది. 'లవ్ స్టోరీ' మూవీలో తమ ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నాగ చైతన్య, సాయి పల్లవి (Sai Pallavi) ఈ పాటలో మెస్మరైజ్ చేశారు. నాగ చైతన్య పవర్ ఫుల్ ప్రెజెన్స్, సాయి పల్లవి అత్యద్భుతమైన ఎక్స్ ప్రెషన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ఈ మూవీకి షామ్‌దత్ సినిమాటోగ్రాఫర్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా, శ్రీనాగేంద్ర తంగాల ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. తండేల్ ఫిబ్రవరి 7న విడుదల కానుంది. చదవండి: మా అమ్మ ఎవర్నీ గాయపర్చలేదు, ఈ భారం మోయలేకున్నా!: పవిత్ర కూతురు
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు
తండ్రైన టీమిండియా విధ్వంసకర ఆటగాడు
టీమిండియా విధ్వంసకర ఆటగాడు శివమ్ దూబే రెండోసారి తండ్రి అయ్యాడు. దూబే భార్య అంజుమ్ ఖాన్ నిన్న (జనవరి 3) ఆడబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ పుట్టిన విషయాన్ని దూబే ఇవాళ సోషల్‌మీడియా వేదికగా షేర్ చేశాడు. మేము 4 మంది కుటుంబంగా మారడంతో మా హృదయాలు పెద్దవిగా మారాయి. మెహ్విష్ శివమ్ దూబేకు స్వాగతం అంటూ దూబే తన ఇన్‌స్టా ఖాతాలో రాసుకొచ్చాడు. View this post on Instagram A post shared by shivam dube (@dubeshivam)31 ఏళ్ల దూబేకు 2021 జులై 16న అంజుమ్ ఖాన్‌తో వివాహమైంది. వీరికి 2022 ఫిబ్రవరి 13న బాబు జన్మించాడు. బాబుకు అయ్యాన్ దూబే అని పేరు పెట్టారు.దూబే క్రికెటింగ్ కెరీర్ విషయానికొస్తే.. ప్రస్తుతం అతను ముంబై తరఫున విజయ్ హజారే ట్రోఫీ ఆడుతున్నాడు. ఈ టోర్నీలో అతను ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో 80 పరుగులు చేసి ఓ వికెట్ తీసుకున్నాడు. దూబే.. 2024 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ గెలిచిన ముంబై జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఈ టోర్నీలో దూబే ఐదు మ్యాచ్‌లు ఆడి 75.50 సగటున 151 పరుగులు చేశాడు. సర్వీసెస్‌పై దూబే మ్యాచ్ విన్నింగ్ నాక్ (71 నాటౌట్) ఆడాడు.వరల్డ్‌కప్ గెలిచిన జట్టులో సభ్యుడు2019 నవంబర్‌లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన దూబే.. 2024 టీ20 వరల్డ్‌కప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. మెగా టోర్నీలో దూబే ప్రతి మ్యాచ్ ఆడాడు. ఆ టోర్నీలో దూబే ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో 22.16 సగటున 133 పరుగులు చేశాడు. సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్లో దూబే కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో దూబే 16 బంతుల్లో 27 పరుగులు చేయడంతో భారత్ నిర్ణీత ఓవర్లలో 176 పరుగులు చేయగలిగింది. రోహిత్ శర్మ నేతృత్వంలో భారత్ టీ20 వరల్డ్‌కప్ విజేతగా నిలిచింది. టీమిండియా పొట్టి ప్రపంచకప్‌ను సాధించడం అది రెండోసారి.దూబే టీమిండియా తరఫున 33 టీ20లు ఆడి 29.86 సగటున 448 పరుగులు చేశాడు. ఇందులో మూడు అర్ద సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన దూబే 11 వికెట్లు కూడా తీశాడు. టీమిండియా తరఫున నాలుగు వన్డేలు కూడా ఆడిన దూబే 43 పరుగులు చేసి ఓ వికెట్ పడగొట్టాడు.
రెండు సెంచరీలు, ఓ డబుల్ సెంచరీ.. సౌతాఫ్రికా భారీ స్కోర్
కేప్‌టౌన్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా భారీ స్కోర్ చేసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ప్రొటీస్ తొలి ఇన్నింగ్స్‌లో 615 పరుగులకు ఆలౌటైంది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో ఓ భారీ డబుల్ సెంచరీ, రెండు సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ నమోదయ్యాయి. ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ (259) రికార్డు డబుల్ సెంచరీతో రెచ్చిపోగా.. కెప్టెన్ టెంబా బవుమా (106), వికెట్‌కీపర్ కైల్ వెర్రిన్ (100) సెంచరీలు చేశారు. ఆఖర్లో మార్కో జన్సెన్ (54 బంతుల్లో 62; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీతో మెరవగా.. కేశవ్ మహారాజ్ (35 బంతుల్లో 40; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో ఎయిడెన్ మార్క్రమ్ 17, వియాన్ ముల్దర్ 5, ట్రిస్టన్ స్టబ్స్ 0, డేవిడ్ బెడింగ్హమ్ 5, క్వేనా మపాకా 0 పరుగులకు ఔటయ్యారు. పాకిస్తాన్ బౌలర్లలో సల్మాన్ అఘా, మొహమ్మద్ అబ్బాస్ తలో మూడు వికెట్లు పడగొట్టగా.. మిర్ హమ్జా, ఖుర్రమ్ షెహజాద్ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు.ఆరు క్యాచ్‌లు పట్టిన రిజ్వాన్ఈ మ్యాచ్‌లో (తొలి ఇన్నింగ్స్) పాకిస్తాన్ వికెట్‌కీపర్ మొహమ్మద్ రిజ్వాన్ ఆరు క్యాచ్‌లు పట్టాడు. ఓ పక్క సౌతాఫ్రికా బ్యాటర్లు రెచ్చిపోయి ఆడినప్పటికీ రిజ్వాన్ అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. టెస్ట్‌ల్లో పాక్ తరఫున అత్యధిక క్యాచ్‌లు పట్టిన వికెట్కీపర్ల జాబితాలో రిజ్వాన్ నాలుగో స్థానంలో నిలిచాడు.7 - వాసిం బారి vs NZ, ఆక్లాండ్, 19796 - రషీద్ లతీఫ్ vs ZIM, బులవాయో, 19986 - అద్నాన్ అక్మల్ vs NZ, వెల్లింగ్టన్, 20116 - మొహమ్మద్ రిజ్వాన్ vs SA, కేప్ టౌన్, 2025100 వికెట్ల క్లబ్లో మొహమ్మద్ అబ్బాస్ఈ మ్యాచ్‌లో పాక్ పేసర్ మొహమ్మద్ అబ్బాస్ 100 వికెట్ల క్లబ్లో చేరాడు. క్వేనా మపాకా వికెట్ అబ్బాస్‌కు టెస్ట్‌ల్లో 100వది.తొలి ఓవర్లోనే పాక్‌కు షాక్సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ చేసి ఆలౌటైన అనంతరం పాక్ తొలి ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే పాక్‌కు భారీ షాక్ తగిలింది. తొలి ఓవర్ చివరి బంతికి కెప్టెన్ షాన్ మసూద్ (2) ఔటయ్యాడు. రబాడ బౌలింగ్‌లో బెడింగ్హమ్కు క్యాచ్ ఇచ్చి మసూద్ పెవిలియన్ బాట పట్టాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగాల్సిన సైమ్ అయూబ్ గాయపడటంతో అతని స్థానంలో బాబర్ ఆజమ్ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. గాయం తీవ్రత అధికంగా ఉండటంతో సైమ్ అయూబ్‌కు ఆరు వారాల విశ్రాంతి అవసరమని డాక్టర్లు చెప్పారు. 3.4 ఓవర్ల అనంతరం పాక్ స్కోర్ 10/1గా ఉంది. బాబర్ ఆజమ్ (2), కమ్రాన్ గులామ్ (4) క్రీజ్‌లో ఉన్నారు. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు పాక్ ఇంకా 605 పరుగులు వెనుకపడి ఉంది.
సూపర్ సెంచరీతో ఆదుకున్న రహ్మత్ షా
బులవాయో వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు రహ్మత్ షా (105 నాటౌట్) సూపర్ సెంచరీతో మెరిశాడు. ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో షా బాధ్యతాయుతంగా ఆడుతూ ఆఫ్ఘనిస్తాన్‌ను కష్టాల్లో నుంచి గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. షా సెంచరీతో కదంతొక్కడంతో ఆఫ్ఘనిస్తాన్ రెండో ఇన్నింగ్స్‌లో గౌరవప్రదమైన స్కోర్ దిశగా సాగుతుంది. మూడో రోజు టీ విరామం సమయానికి ఆఫ్ఘనిస్తాన్ స్కోర్ 207/6గా ఉంది. షా అజేయ సెంచరీతో ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుండగా.. అతనికి జతగా ఇస్మత్ ఆలం (31) క్రీజ్‌లో ఉన్నాడు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ 121 పరుగుల ఆధిక్యంలో ఉంది.ఆదుకున్న షా69 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన ఆఫ్ఘనిస్తాన్‌ను రహ్మత్ షా ఆదుకున్నాడు. షా.. షాహీదుల్లా కమాల్ (22), ఇస్మత్ ఆలమ్‌ల సహకారంతో ఇన్నింగ్స్‌ను నిర్మిస్తున్నాడు. షా సెంచరీతో ఆదుకోకపోయుంటే ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్ ఘోరంగా పతనమయ్యేది. ఆఫ్ఘన్ ఇన్నింగ్స్‌లో అబ్దుల్ మాలిక్ 1, రియాజ్ హసన్ 11, హష్మతుల్లా షాహిది 13, జియా ఉర్ రెహ్మాన్ 6, అఫ్సర్ జజాయ్ 5 పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో ముజరబానీ 3, నగరవ 2, సికందర్ రజా ఓ వికెట్ పడగొట్టారు.అంతకుముందు జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 243 పరుగులకు ఆలౌటైంది. సికందర్ రజా (61), క్రెయిగ్ ఎర్విన్ (75) అర్ద సెంచరీలతో రాణించగా.. సీన్ విలియమ్స్ (49) పరుగు తేడాతో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో రషీద్ ఖాన్ 4, అహ్మద్జాయ్ 3, ఫరీద్ అహ్మద్ 2, జియా ఉర్ రెహ్మాన్ ఓ వికెట్ పడగొట్టారు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. జింబాబ్వే బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో 157 పరుగులకే చాపచుట్టేసింది. సికందర్ రజా, న్యామ్హురి తలో మూడు వికెట్లు పడగొట్టగా.. ముజరబానీ 2, నగరవ ఓ వికెట్ పడగొట్టారు. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌లో రషీద్ ఖాన్ (25) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.కాగా, రెండు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో తొలి మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. ఈ మ్యాచ్‌లో రెండు డబుల్ సెంచరీలు, నాలుగు సెంచరీలు నమోదయ్యాయి. జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో సీన్ విలియమ్స్ (154), క్రెయిగ్ ఎర్విన్ (104), బ్రియాన్ బెన్నెట్ (110 నాటౌట్) సెంచరీలు చేశారు. ఆఫ్ఘనిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో రహ్మత్ షా (234), హష్మతుల్లా షాహిది (246) డబుల్ సెంచరీలు చేయగా.. అఫ్సన్ జజాయ్ (113) శతక్కొట్టాడు.
ఇదెక్కడి రనౌట్ రా సామీ.. క్రికెట్ చరిత్రలో వింత ఘటన
పాకిస్తాన్ దేశవాలీ క్రికెట్లో ఓ వింత రనౌట్ చేసుకుంది. కైడ్ ఏ ఆజమ్ ట్రోఫీలో భాగంగా పెషావర్‌తో జరిగిన మ్యాచ్‌లో సియాల్కోట్ బ్యాటర్ మొహమ్మద్ వాలీద్ దురదృష్టకర రీతిలో రనౌటయ్యాడు. బౌలర్ రిటర్న్ త్రోను తప్పించుకోబోయి మొహమ్మద్ వాలీద్ గాల్లోకి ఎగరగా.. అదే సమయంలో బంతి వికెట్లను తాకింది. దీంతో వాలీద్ రనౌటయ్యాడు. ఈ వింత రనౌట్‌కు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది.A STRANGE RUN-OUT IN PAKISTAN DOMESTIC CRICKET. 🤯 pic.twitter.com/dCCV6e9DhO— Johns. (@CricCrazyJohns) January 4, 2025పూర్తి వివరాల్లో వెళితే.. పెషావర్ బౌలర్ మొహమ్మద్ ఆమిర్ ఖాన్ సంధించిన బంతిని మొహమ్మద్ వాలీద్ డిఫెండ్ చేసుకున్నాడు. ఆ బంతి నేరుగా బౌలర్ ఆమిర్ ఖాన్ చేతుల్లోకి వెళ్లింది. బ్యాటర్ ముందుకు రావడం చూసిన ఆమిర్ ఖాన్ బంతిని వికెట్లపైకి విసిరాడు. అప్పటికే క్రీజ్‌లో ఉన్న వాలీద్ బంతి నుంచి తప్పించుకోబోయి పైకి జంప్ చేశాడు. వాలీద్ గాల్లో ఉండగానే బంతి వికెట్లను తాకింది. దీంతో పెషావర్ ఆటగాళ్లు గట్టిగా అప్పీల్ చేశారు. అప్పీల్ రీజనబుల్‌గా ఉండటంతో ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్‌కు రెఫర్ చేశాడు. పలు కోణాల్లో రీప్లేలను పరిశీలించిన థర్డ్ అంపైర్ బ్యాటర్ వాలీద్‌ను రనౌట్‌గా ప్రకటించాడు. వాలీద్ గాల్లో ఉన్నప్పుడు బంతి వికెట్లను తాకినట్లు రీప్లేలో స్పష్టంగా కనపడింది. క్రికెట్ చరిత్రలో ఇలాంటి విచిత్ర రనౌట్లు చోటు చేసుకోవడం చాలా అరుదు. ఈ రనౌట్‌కు సంబంధించిన వీడియోను చూసిన నెటిజన్లు ఇదెక్కడి రనౌట్ రా సామీ అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఇదిలా ఉంటే, ప్రస్తుతం పాక్ జాతీయ జట్టు సౌతాఫ్రికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. పాక్ ప్రస్తుతం సౌతాఫ్రికాతో రెండో టెస్ట్ మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో పాక్ బౌలర్లు తేలిపోవడంతో సౌతాఫ్రికా బ్యాటర్లు చెలరేగిపోతున్నారు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా ముగ్గురు సౌతాఫ్రికా బ్యాటర్లు మూడంకెల స్కోర్ చేశారు. ఇందులో ఓ డబుల్ సెంచరీ కూడా ఉంది. టెంబా బవుమా (106), కైల్ వెర్రిన్ (100) సెంచరీ అనంతరం ఔట్ కాగా.. డబుల్ సెంచరీ చేసిన ర్యాన్ రికెల్టన్ (233 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నాడు. 123 ఓవర్ల అనంతరం సౌతాఫ్రికా స్కోర్ 477/6గా ఉంది. రికెల్టన్కు జతగా జన్సెన్ క్రీజ్‌లో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో రెండో రోజు రెండో సెషన్ ఆట కొనసాగుతుంది.
బిజినెస్
యాపిల్ స్పైగా ‘సిరి’..? రూ.814 కోట్లకు దావా
ప్రపంచ నం.1 సంస్థ యాపిల్(Apple) తన వర్చువల్ అసిస్టెంట్ ‘సిరి’ని వినియోగదారుల అనుమతి లేకుండా ఉపయోగించడానికి వీలు కల్పించిందని ఆరోపణలు ఎదుర్కొంది. ఈమేరకు అమెరికా ఫెడరల్ కోర్టులో దావా దాఖలైంది. యూజర్లకు తెలియకుండా సిరి మైక్రోఫోన్ సంభాషణలను రికార్డ్ చేసిందని, వాటిని ఇతరులతో పంచుకునే అవకాశం ఉందని దావాలో ఆరోపించారు.‘సిరి’ని యాపిల్ స్పైగా మార్చిందని దావాలో తెలిపారు. ఐఫోన్లు(IPhone), ఇతర డివైజ్‌ల యూజర్లపై సిరి నిఘా పెట్టిందని పేర్కొన్నారు. ఇది వినియోగదారుల వ్యక్తిగత గోప్యతకు, వారి నిబద్ధతకు యాపిల్ ద్రోహం చేయడమేనని దావా పేర్కొంది. ఈ విషయాన్ని యాపిల్ ధ్రువీకరించింది. దావా దాఖలు చేసినవారి వాదనలను ఖండించింది. యూజర్ ప్రైవసీ పట్ల నిబద్ధతతో ఉన్నట్లు తెలిపింది. కానీ కేసును పరిష్కరించాలనే ఉద్దేశంతో 95 మిలియన్ డాలర్లు(రూ.814 కోట్లు) చెల్లించడానికి అంగీకరిస్తున్నట్లు పేర్కొంది. ప్రతిపాదిత సెటిల్మెంట్కు సంబంధించిన వ్యాజ్యం ఈ వారం ప్రారంభంలో ఫెడరల్ కోర్టులో దాఖలు చేశారు. అయితే దీన్ని న్యాయమూర్తి ఆమోదించాల్సి ఉంది.ఇదీ చదవండి: ప్రపంచంలో అధిక వేతనం ఈయనకే..!అసలేం జరిగిందంటే..2014-22 వరకు యాపిల్ తన వర్చువల్ అసిస్టెంట్ ‘సిరి(Siri)’ని వినియోగదారుల అనుమతి లేకుండా ఉపయోగించడానికి వీలు కల్పించిందని ఆరోపణలు వచ్చాయి. యూజర్లకు తెలియకుండా సిరి మైక్రోఫోన్ సంభాషణలను రికార్డ్ చేసిందని, వాటిని ప్రకటనదారులతో పంచుకునే అవకాశం ఉందనేలా దావాలో ఆరోపించారు. ఈ దావా సమస్య పరిష్కారం అయితే సెప్టెంబర్ 17, 2014 నుంచి 2022 చివరి వరకు యాపిల్ ‘సిరి’ ఎనేబుల్డ్ పరికరాలను కలిగి ఉన్న లేదా కొనుగోలు చేసిన యూఎస్‌లోని యూజర్లకు ఈ సెటిల్మెంట్ మనీ అందుతుందని నిపుణులు చెబుతున్నారు.
10 నిమిషాల్లో అంబులెన్స్.. ‘జాగ్రత్తగా వ్యవహరించాలి’
బ్లింకిట్ వంటి క్విక్‌కామర్స్ సంస్థలు చట్టాలను ఉల్లంఘించకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ సూచించారు. క్విక్ కామర్స్ (Quick commerce) ప్లాట్‌ఫారమ్ బ్లింకిట్ (Blinkit) ఇటీవల ‘10 నిమిషాల్లో అంబులెన్స్’ (ambulance)సేవను గురుగ్రామ్‌లో ప్రారంభించింది. ఈ నేపథ్యంలో అలాంటి సర్వీసులు ప్రారంభించాలనుకునే కంపెనీలకు మంత్రి సూచనలు చేశారు.‘అంబులెన్స్ సేవలు అందించడం, ఔషధాలు వంటివి త్వరగా డెలివరీ చేయాలనే ఉద్దేశంతో బ్లింకిట్ కొత్త సర్వీసులు ప్రారంభించింది. అయితే సదరు సర్వీసులు అందించే క్రమంలో తప్పకుండా చట్టాలను, ప్రభుత్వ నియమాలను పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలి. నిబంధనల ఉల్లంఘన జరగకూడదు. క్విక్ కామర్స్, ఇ-కామర్స్ సంస్థల వల్ల తమ వ్యాపారం దెబ్బతింటోందని కిరాణాదారులు ఆందోళన చెందుతున్న విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. పోటీ నిబంధనల ఉల్లంఘన జరిగితే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(CCI) చర్యలు తీసుకుంటుంది’ అని చెప్పారు.ఇదీ చదవండి: ఈపీఎఫ్ఓ ఏటీఎం కార్డులు ఎప్పటి నుంచో తెలుసా..బ్లింకిట్ (Blinkit) కొత్త సర్వీస్‌ను ప్రారంభించిన సమయంలో కంపెనీ CEO అల్బిందర్ ధిండ్సా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ‘మన నగరాల్లో వేగవంతమైన, విశ్వసనీయమైన అంబులెన్స్ కొరత ఉంది. ఈ సమస్యను పరిష్కరించడానికి మేము మొదటి అడుగు వేస్తున్నాం. ప్రాథమికంగా గురుగ్రామ్‌లో ఐదు అంబులెన్స్‌లను ప్రారంభించాం’ అన్నారు.
ఈపీఎఫ్ఓ ఏటీఎం కార్డులు ఎప్పటి నుంచో తెలుసా..
కోట్లాది మంది ఈపీఎఫ్ఓ(EPFO) చందాదారులు తమ పీఫ్ డబ్బును ఏటీఎం(ATM) ద్వారా విత్‌డ్రా చేసుకునేందుకు తేదీ ఖరారైంది. ఇందుకోసం ప్రభుత్వం కొత్తగా సాఫ్ట్వేర్ వ్యవస్థను ప్రారంభిస్తుందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ఈ ఏడాదే ఈపీఎఫ్ఓ 3.0ను ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. ఈ కొత్త విధానం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) సభ్యుల సమస్యలను పరిష్కరించి, వారికి మెరుగైన సర్వీస్‌ను అందిస్తుందన్నారు. ఈపీఎఫ్ఓ ఏటీఎం కార్డులను జూన్ 2025 వరకు అందుబాటులోకి తీసుకొచ్చేలా కార్యాచరణ రూపొందించినట్లు మంత్రి పేర్కొన్నారు.ఈపీఎఫ్ఓ ఏటీఎం కార్డుఈపీఎఫ్ఓ 3.0 వెర్షన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పీఎఫ్ చందాదారులకు ఏటీఎం కార్డులను జారీ చేస్తామని కేంద్ర మంత్రి మాండవీయ ధ్రువీకరించారు. ఉద్యోగులు ఈ ఏటీఎం కార్డు ద్వారా తమ ఈపీఎఫ్ పొదుపును సులభంగా పొందవచ్చన్నారు. తద్వారా అత్యవసర పరిస్థితుల్లో డబ్బు వెంటనే అందుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. అందుకు సంబంధించి వెబ్సైట్, సిస్టమ్ అప్డేట్ల(Updates) ప్రారంభ దశను ఈ నెలాఖరులోగా ఖరారు చేస్తామని మాండవీయ పేర్కొన్నారు.ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ఈపీఎఫ్వో సభ్యులను ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ (ETF) పరిధికి మించి ఈక్విటీలలో పెట్టుబడి పెట్టడానికి అనుమతించే అవకాశాన్ని పరిశీలిస్తోంది. ఈ ప్రతిపాదిత మార్పు పీఎఫ్ ఖాతాదారులకు వారి ఫండ్లను మెరుగ్గా నిర్వహించడానికి, అధిక రాబడిని అందుకునేందుకు, పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్‌కు వీలు కల్పిస్తుంది. ఇది ఆమోదం పొందితే డైరెక్ట్ ఈక్విటీ పెట్టుబడి సభ్యులకు తమ పెట్టుబడి వ్యూహాలను, ఆర్థిక వృద్ధిని పెంచుకోవడానికి కొత్త మార్గాన్ని అందిస్తుంది.ఇదీ చదవండి: ప్రపంచంలో అధిక వేతనం ఈయనకే..!ఏ బ్యాంకు నుంచైనా పెన్షన్ఈపీఎఫ్వో పెన్షనర్ల కోసం గణనీయమైన మార్పులను అమలు చేస్తోంది. ఇటీవలి ఆదేశాల ప్రకారం.. పింఛనుదారులు అదనపు ధ్రువీకరణ లేకుండా తమ పెన్షన్‌ను దేశవ్యాప్తంగా ఏ బ్యాంకు నుంచి అయినా ఉపసంహరించుకునే వెసులుబాటు రానుంది.
ప్రపంచంలో అధిక వేతనం ఈయనకే..!
ప్రముఖ కంపెనీ సీఈఓ వేతనం రూ.48 కోట్లు.. ‘ఇందులో ప్రత్యేకత ఏముంది.. ప్రస్తుతం చాలామంది ఈ రేంజ్ వేతనాన్ని అందుకుంటున్నారు కదా’ అంటారా.. అయితే కేవలం ఈ రూ.48 కోట్లు తన ఒకరోజు సంపాదనే! వేగంగా మారుతున్న టెక్ ప్రపంచంలో నైపుణ్యాలు కలిగిన వారికి కంపెనీలు ఎంతైనా చెల్లిస్తాయనడానికి ఇదో ఉదాహరణ మాత్రమే. రోజు రూ.48 కోట్ల చొప్పున జగ్దీప్సింగ్ వార్షికాదాయం ఏకంగా సుమారు రూ.17,500 కోట్లు. ఇంతకీ ఆయన ఏ కంపెనీలో పని చేస్తున్నారు.. ఎందుకు అంత వేతనం అందిస్తున్నారనే అంశాలను తెలుసుకుందాం.ప్రపంచంలోనే అత్యధిక వేతనం అందుకుంటున్న ఉద్యోగిగా జగ్దీప్ సింగ్ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇలాన్‌మస్క్ వంటి వ్యక్తుల వార్షిక ఆదాయం ఎక్కువే ఉంటుంది. కానీ వారికి వేతనం, షేర్లు, ఇతర అలవెన్స్‌ల రూపంలో చెల్లింపులు అధికంగా ఉంటాయి. సింగ్‌కు నేరుగా అధిక మొత్తంలో వేతనం అందిస్తున్నారు. జగ్దీప్ సింగ్ పెద్ద పారిశ్రామికవేత్త మాత్రమే కాదు, ప్రపంచంలో పెరుగుతున్న భారతీయ ప్రతిభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ముఖ్యంగా టెక్నాలజీ, క్లీన్ ఎనర్జీ రంగాల్లో పరిశ్రమలు పెరుగుతున్న కొద్దీ ఇన్నోవేటివ్ కంపెనీల్లో లీడర్ల జీతభత్యాలు సైతం వేగంగా పెరుగుతున్నాయి. ‘క్వాంటమ్ స్కేప్’ కంపెనీకి సింగ్ నాయకత్వం(సీఈఓ) వహిస్తున్నారు.టెక్నాలజీలో వస్తోన్న పురోగతిజగ్దీప్ సింగ్ స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి బీటెక్ పూర్తి చేశారు. బెర్క్లీలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుంచి ఎంబీఏ పట్టా పొందారు. బీటెక్‌లో నేర్చుకున్న సాంకేతిక నైపుణ్యాలు, ఎంబీఏలో నేర్చుకున్న వ్యాపార మెలకువలు తాను ఎదిగేందుకు ఎంతో ఉపయోగపడ్డాయని ఆయన అన్నారు. ఆయన క్వాంటమ్ స్కేప్‌ను స్థాపించడానికి ముందు పదేళ్లకు పైగా వివిధ కంపెనీల్లో పనిచేశారు. బ్యాటరీ టెక్నాలజీలో వస్తోన్న విప్లవాత్మక పురోగతిని అర్థం చేసుకోవడానికి ఈ అనుభవం ఎంతో ఉపయోగపడిందని చెబుతున్నారు. ఈ అనుభవంతో 2010లో క్వాంటమ్‌స్కేప్ సంస్థను ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్స్‌లో అగ్రగామిగా నిలుస్తోంది.ఇదీ చదవండి: ఏథర్ కొత్త మోడళ్లు.. ధర ఎంతంటే..కంపెనీ ఏం చేస్తోందంటే..క్వాంటమ్ స్కేప్ ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉపయోగించే ఘనస్థితి(సాలిడ్ స్టేట్) బ్యాటరీలను అభివృద్ధి చేస్తోంది. సంప్రదాయ లిథియం-అయాన్ బ్యాటరీలతో పోలిస్తే ఇవి అధిక శక్తిని, వేగవంతమైన ఛార్జింగ్ సమయాన్ని, మెరుగైన భద్రతను అందిస్తున్నాయి. క్లీన్, గ్రీన్ ట్రాన్స్‌పోర్టేషన్ దిశగా సాగుతున్న పరిశోధనల్లో ఈ కంపెనీ టెక్నాలజీ ముందంజలో ఉంది. బిల్ గేట్స్, వోక్స్ వ్యాగన్ వంటి దిగ్గజాలు ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టారు. ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు క్లీన్ ఎనర్జీ స్పేస్‌లో కూడా ఇది కీలకంగా వ్యవహరిస్తోంది.
ఫ్యామిలీ
ఆ అమ్మ సునామీకి జన్మనిచ్చింది!
ఎప్పుడూ చూసే సముద్రమే ఆ రోజు కొత్తగా ఉంది. భయంగా ఉంది. ఎప్పుడూ నవ్వుతూ పలకరించే సముద్రం విలయ విధ్వంసానికి సిద్ధంగా ఉంది. ఆరోజు... ఏ రోజూ మరచిపోలేని రోజు. సునామీ విశ్వరూపాన్ని చూపిన రోజు. ఇరవై సంవత్సరాల తరువాత కూడా... నిన్ననే జరిగినట్లు వెన్నులో చలిపుట్టించే రోజు...అండమాన్ నికోబార్‌లోని హట్ బే దీవిలో భీకర అలల ధాటికి నమిత రాయ్ ఇల్లు పూర్తిగా దెబ్బతిన్నది. అప్పుడు నమిత వయసు పాతిక సంవత్సరాలు. దిక్కుతోచని పరిస్థితుల్లో పాములకు ప్రసిద్ధి చెందిన అడవిలో ఆశ్రయం పొందారు. ఎటు నుంచి ఏ విషసర్పం వచ్చి ప్రాణం తీస్తుందో తెలియని భయానక పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లోనే ఆ పాముల అడవిలోనే పండంటి పిల్లాడికి జన్మనిచ్చింది నమిత.ఆ పిల్లాడికి ‘సునామీ’ అని పేరు పెట్టారు. రెండు దశాబ్దాల తరువాత మళ్లీ ఆ రోజుల్లోకి వెళ్లింది నమిత రాయ్...‘ఆ చీకటి రోజును గుర్తు చేసుకుంటే ఇప్పటికీ ఒంట్లో వణుకు పుడుతుంది. అప్పుడు నేను గర్భవతిని. రోజువారీ పనులతో బిజీగా ఉన్నాను. ఉన్నట్టుండి భయంకరమైన నిశ్శబ్దం ఆవరించింది. మా తీరం నుండి మైళ్ళ దూరంలో సముద్రం తగ్గుముఖం పట్టడం చూసి షాక్ అయ్యాను. కొన్ని సెకనుల తరువాత మా దీవి వైపు భారీ సముద్రపు అలలు దూసుకొస్తున్నాయి, ఆ తర్వాత బలమైన ప్రకంపనలు వచ్చాయి. ప్రజలు కేకలు వేస్తూ గుట్ట వైపు పరుగెత్తడం చూశాను. పానిక్ ఎటాక్ వచ్చి స్పృహ తప్పి పడిపోయాను.కొన్ని గంటల తరువాత స్పృహలోకి వచ్చాను. కొండ అడవిలో వేలాది మంది స్థానికుల మధ్య నేను ఉన్నాను. నా భర్త, పెద్ద కొడుకును చూడగానే ప్రాణం లేచి వచ్చింది. మా ద్వీపంలోని చాలాప్రాంతాలు రాక్షస అలల తాకిడికి నాశనం అయ్యాయి. ఆస్తి అనేది లేకుండా పోయింది.ఒకరోజు రాత్రి పదకొండు గంటల తరువాత నాకు పురిటినొప్పులు వచ్చాయి. కానీ చుట్టుపక్కల డాక్టర్లు ఎవరూ లేరు. నేను ఒక బండరాయిపై పడుకొని సహాయం కోసం ఏడ్చాను. నా భర్త ఎంత ప్రయత్నించినా వైద్యసహాయం అందలేదు. అడవిలో ఆశ్రయం పొందిన కొందరు మహిళలను నా భర్త వేడుకున్నాడు. వారి సాయంతో అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో సునామీకి జన్మనిచ్చాను.తిండి లేదు. సముద్రానికి భయపడి అడవి నుండి బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో నా బిడ్డ బతుకుతాడా అనే బాధ మొదలైంది. కొబ్బరి నీళ్లే ఆహారమయ్యాయి. లాల్ టిక్రీ హిల్స్‌లో నాలుగు రాత్రులు గడిపిన మమ్మల్ని రక్షణ సిబ్బంది కాపాడారు. చికిత్స కోసం నన్ను పోర్ట్ బ్లెయిర్‌లోని జీబీ పంత్ ఆసుపత్రికి ఓడలో తీసుకువెళ్లారు. హట్ బే నుంచి పోర్ట్ బ్లెయిర్‌కు 117 కిలోమీటర్ల దూరం. సుమారు ఎనిమిది గంటల సమయం పట్టింది’ అంటూ గతాన్ని గుర్తు చేసుకుంది నమిత.కోవిడ్ మహమ్మారి సమయంలో భర్త లక్ష్మీ నారాయణ మరణించడంతో ఇద్దరు కుమారులు సౌరభ్, సునామీలతో కలిసి పశ్చిమబెంగాల్లోని హుగ్లీలో నివసిస్తుంది నమితా రాయ్.నమిత పెద్ద కుమారుడు సౌరభ్ ఒక ప్రైవేట్ షిప్పింగ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. చిన్న కుమారుడు సునామీ ‘ఓషనోగ్రాఫర్’ కావాలనుకుంటున్నాడు.‘మా అమ్మే నాకు సర్వస్వం. ఆమె ధైర్యశాలి. నాన్న చనిపోయాక మమ్మల్ని పోషించడానికి చాలా కష్టపడింది. ఫుడ్ డెలివరీ సర్వీసును నిర్వహించింది. దానికి సునామీ కిచెన్ అని సగర్వంగా పేరు పెట్టింది’ అంటున్నాడు సునామీ రాయ్.‘2004లో సమర్థవంతమైన హెచ్చరిక వ్యవస్థ లేకపోవడంతో పెద్ద ఎత్తున విధ్వంసం,ప్రాణ నష్టం జరిగింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 1.400కు పైగా హెచ్చరిక కేంద్రాలు(వార్నింగ్ స్టేషన్స్) ఉన్నాయి. సునామీ నాటి పరిస్థితిని ఎదుర్కొనేందుకు మేము సర్వసన్నద్ధంగా ఉన్నాం’ అంటున్నారు అండామన్ నికోబార్ దీవుల అడ్మినిస్ట్రేషన్ సీనియర్ అధికారులు.
55 ఏళ్లు.. 150 కిలోమీటర్లు
కొందరు ఓటమి నుంచి విజయాలు అందుకుంటారు. మరికొందరు తమ జీవితంలో ఎదురైన ప్రతిబంధకాల నుంచి బయటపడేందుకు ఏదో సాధించాలనే తపనతో ముందుకు సాగుతారు. ఆ కోవకు చెందిన వారే స్విమ్మర్ గోలి శ్యామల. సామర్లకోటకు చెందిన శ్యామల భర్త మోహన్ ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగి. కుమారుడితో కలిసి బతుకుదెరువు కోసం హైదరాబాద్‌లో యానిమేషన్ స్టూడియో పెట్టుకుని పలు సీరియళ్లు, సినిమాలకు పనిచేశారు. దురదృష్టవశాత్తూ స్టూడియో ద్వారా తీవ్రంగా నష్టపోవడంతో మానసికంగా మనోవేదనకు గురయ్యారు. దాంతో ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. 45 ఏళ్ళ వయసులో శరీరం సహకరించని స్థితిలో మనసును మళ్ళించేందుకు హైదరాబాద్‌లో స్విమ్మింగ్ నేర్చుకున్నారు. స్వతహాగా ఆమె స్విమ్మర్ కాదు... అయితేనేం, నాటి మనోవేదనకు ఉపశమనంగా ప్రారంభించిన స్విమ్మింగ్ నేడు ఐదు పదుల వయసులో ఆమెను సముద్రాలు దాటే సాహస యాత్రికురాలిగా తీర్చిదిద్దింది.150 కిలోమీటర్లు ఏడు రోజుల్లో అలవోకగా.. డిసెంబరు 28న విశాఖలోని ఆర్కే బీచ్ వద్ద సముద్ర తీరంలో ఈత ప్రారంభించిన శ్యామల శుక్రవారం కాకినాడ తీరం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె సాక్షితో మాట్లాడుతూ యానిమేషన్ స్టూడియోలో నష్టం రావడంతో డిప్రెషన్ లోకి వెళ్ళిపోయిన తాను మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు స్విమ్మింగ్ప్రారంభించాననీ, కోచ్ జాన్ సిద్ధిక్ సహకారంతో జీరో లెవెల్ నుంచి 150 కిలోమీటర్ల స్విమ్ చేసేలా తయారయ్యానని సగర్వంగా చెప్పారు. 2021లో శ్రీలంక నుంచి ఇండియా వరకు రామ్‌సేతు దాటానని, తాజాగా ఫిబ్రవరిలో లక్షద్వీప్‌లో స్విమ్ చేశానన్నారు. బంగాళాఖాతంలో 150 కిలోమీటర్లు ఈదడం ద్వారా ఆసియా స్థాయిలో ఘనత సాధించానన్నారు. విశాఖపట్నం నుంచి కాకినాడ వరకు ఈదాలని రెండేళ్ళ కిందటే నిర్ణయించుకున్నానని, అయితే రెండుసార్లు వాతావరణం అనుకూలించలేదనీ, ఎట్టకేలకు డిసెంబర్ 28న చిన్న ఫిషింగ్ బోట్, ఇద్దరు స్క్రూపర్ డ్రైవర్స్తోప్రారంభించానన్నారు. ఆర్కే బీచ్‌లో సముద్రంలో ప్రవేశించాక మళ్ళీ కాకినాడలో నేలపైకి వచ్చామన్నారు. మొదటి రోజు 7 గంటల్లోనే 30 కిలోమీటర్ల దూరం ఈదానన్నారు. తరువాత నుంచి ఈరోజు వరకు అనేక ఒడుదొడుకులను అధిగమిస్తూ ఈదుకుంటూ వచ్చానన్నారు. తల వెంట్రుకల నుంచి కాలి గోళ్ల వరకు స్విమ్మింగ్ వల్లే ఆరోగ్యం కలుగుతుందని, స్విమ్మింగ్‌ను స్పోర్ట్‌గా కాకుండా సర్వైవల్ స్పోర్ట్‌గానే చెబుతానన్నారు. మహిళలు ఈత చేయడం వలన గైనిక్ సమస్యలు తగ్గుతాయన్నారు. హేళన చేసిన వారే పొగుడుతున్నారుసముద్రంలో ఈత కోసం తొలి ప్రయత్నం చేసినప్పుడు చాలామంది హేళన చేశారు. కొందరు యూ ట్యూబ్‌లో కామెంట్లు పెట్టారు. వాటిని పట్టించుకోలేదు. అరేబియా సముద్రం ఈదాను, శ్రీలంక నుంచి ఇండియా ఈత మరపురానిది, మేదీ స్ఫూర్తితో లక్షద్వీప్‌లో 18గంటల పాటు 48 కిలోమీటర్లు ఈదాను. వైజాగ్ నుంచి కాకినాడ 150 కిలోమీటర్లు ఈదగలిగినందుకు చాలా హ్యాపీగా ఉంది. – గోలి శ్యామల – స్విమ్మర్. – లక్కింశెట్టి శ్రీనివాసరావుసాక్షి ప్రతినిధి.. కాకినాడ.ఫోటోలు: విశ్వనాధుల రాజబాబు. కాకినాడ రూరల్
గ్రీన్ ఆర్మీ
ఉత్తరప్రదేశ్‌లో గతంలో ‘గులాబ్ గ్యాంగ్’ ఘనత విన్నాం. ఇప్పుడు ‘గ్రీన్ ఆర్మీ’. స్త్రీల మీద జరిగే దురాగతాలను స్త్రీలే ఉమ్మడిగా ఎదిరిస్తూ బాధితులకు బాసటగా నిలుస్తున్నారు. వారణాసిలో క్రియాత్మకంగా ఉన్న ‘గ్రీన్ ఆర్మీ’ మహిళా బృందాన్ని ప్రధాని మోదీ ఇటీవలి మన్‌కీ బాత్‌లో ప్రశంసించారు.వాళ్లంతా ఒక 50 మంది ఉంటారు. ఆకుపచ్చ చీరలో, చేతి కర్రతో వరుసగా నడుస్తూ ఊళ్లోకి వస్తారు. ఇక ఊళ్లోని మగాళ్లకు గుండె దడే. భార్యలను కొట్టేవాళ్లు, తాగుబోతులు, పేకాట రాయుళ్లు, మత్తు పీల్చేవాళ్ళు, కట్నం కోసం వేధించేవాళ్లు... ఎక్కడికక్కడ సెట్‌రైట్ కావాల్సిందే. ఎందుకంటే వారు ‘గ్రీన్ ఆర్మీ’. అందరి స్క్రూలు టైట్ చేసే ఆర్మీ. అందుకే మొన్నటి ‘మన్ కీ బాత్’లో వీరి గురించి మోదీ ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ‘వీరి ఆత్మనిర్భరతకు, కృషికి అభినందనలు. నూతన సంవత్సర శుభాకాంక్షలు’ అని తెలిపారు. దాంతో గ్రీన్ ఆర్మీలో కొత్త జోష్ వచ్చింది.వారణాసి చుట్టుపక్కలగ్రీన్ ఆర్మీ 2014లో పుట్టింది. బెనారస్ హిందూ యూనివర్సిటీలో చదువుకున్న రవి మిశ్రా వారణాసి చుట్టుపక్కల పల్లెల్లో ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్ ఉత్తర జిల్లాలలో గృహ హింస ఎక్కువగా ఉందని గమనించాడు. స్త్రీలకు సెల్ఫ్ డిఫెన్స్ నేర్పిస్తే వారు ఆత్మరక్షణ చేసుకోగలరని అనుకున్నాడు. కొందరు విద్యార్థులతో కలిసి నిర్మలాదేవి అనే గృహిణిని గృహ హింసను ప్రతిఘటించమని కోరాడు. రైతు కూలీగా ఆమె సంపాదించేదంతా ఆమె భర్త లాక్కుని తాగేవాడు. కొట్టేవాడు. నిర్మాలా దేవి విద్యార్థుల స్ఫూర్తితో ఆత్మరక్షణ నేర్చుకుంది. అంతేకాదు గ్రామంలోని మరికొంతమందిని జమ చేసింది. అందరూ కలిసి ఇక గృహ హింసను ఏ మాత్రం సహించమని ఎలుగెత్తారు. అంతేకాదు.. కర్ర చేతబట్టి మాట వినని భర్తలకు బడితె పూజ చేశారు. నిర్మలాదేవి భర్త దారికొచ్చాడు. దాంతో గ్రీన్ ఆర్మీ పేరు వినపడసాగింది.270 పల్లెల్లో...వారణాసిలో, చుట్టుపక్కల జిల్లాల్లో ఇప్పుడు 270 గ్రామాల్లో గ్రీన్ ఆర్మీ ప్రతినిధులు ఉన్నారు. 2000 మంది స్త్రీలు ఇందులో భాగస్వాములు. ప్రతి ఊరిలో ఇరవై నుంచి యాభై మంది స్త్రీలు ఆకుపచ్చ చీరల్లో దళంగా మారి క్రమం తప్పక ఇంటింటికీ వెళ్లి సమస్యల ఆచూకీ తీస్తారు. వాటికి పరిష్కారాలు వెదుకుతారు. స్త్రీల మీద చెయ్యెత్తడం అనేది వీరు పూర్తిగా ఊళ్లల్లో నిర్మూలించారు. ఇక తాగుడు పరిష్కారం కోసం తాగుబోతులకు కౌన్సెలింగ్ ఇవ్వడంప్రారంభించారు. పేకాట, డ్రగ్స్కైతే స్థానమే లేదు. గ్రీన్ ఆర్మీతో స్థానిక పోలీస్ కాంటాక్ట్‌లో ఉంటుంది. ఎవరైనా గ్రీన్ ఆర్మీకి ఎదురు తిరిగితే పోలీసులు వచ్చి చేయవలసింది చేస్తారు. వరకట్న సమస్య ఉత్తరప్రదేశ్‌లో ఎక్కువగా ఉంది. ‘మీకు కట్నం ఎందుకు ఇవ్వాలి... సరంజామా ఎందుకివ్వాలి’ అని గ్రీన్ ఆర్మీ ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. దాంతో గొంతెమ్మ కోరికలు పూర్తిగా తగ్గాయి. ఇచ్చింది పుచ్చుకుంటున్నారు.ఆడపిల్లే అదృష్టంకొన్ని జిల్లాల్లో ఇప్పటికీ ఆడపిల్ల పుడితే శోకం వ్యక్తం చేస్తారు. ఏడుస్తూ గుండెలు బాదుకుంటారు. కాని గ్రీన్ ఆర్మీ బయలుదేరి ఈ శోకానికి ముగింపు చెప్పింది.‘ఆడపిల్ల అంటే లక్ష్మీ అని ఇంటికి భాగ్యమనీ బాగా చదివిస్తే సరస్వతి అని, శక్తిలో దుర్గ అని... ఆడపిల్లను మగపిల్లాడితో సమానంగా చూడాల’ని ఇంటింటికి తిరిగి చైతన్యం కలిగించారు. ఆడపిల్లకు జన్మనిచ్చిన తల్లులకు రక్షణగా నిలబడ్డారు. ఇవన్నీ సాంఘికంగా చాలా మార్పు తెచ్చాయి. అందుకే ఒక్కరు కాకుండా సమష్టిగా ప్రయత్నిస్తే విజయాలు వస్తాయి. గ్రామీణ జీవితంలో స్త్రీలకు ఇంకా ఎన్నో ఆటంకాలున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి. కర్రచేత బట్టి ఆర్మీగా మారకపోయినా స్త్రీలు సంఘాలు ఏర్పరుచుకుంటే సమస్యలు దూరం కాకపోవడం ఉండదు. గ్రీన్ ఆర్మీ ఇస్తున్న సందేశం అదే.
2024లో వార్తల్లో నిలిచిన 'సూపర్‌ఫుడ్స్' ఏంటో తెలుసా?
2024 ఏడాదికి బైబై చెప్పేసి2025 సంవత్సరానికి ఆహ్వానం పలికాం. అనేక రంగాల్లో ఎన్నో పరిశోధనలు, సరికొత్త అధ్యయనాలకు సాక్ష్యం 2024. ఈ క్రమంలో 2024లో సూపర్ ఫుడ్‌గా వార్తల్లో నిలిచిన ఆహారం గురించి తెలుసుకుందాం. గతంలో లాగానే 2024 కూడాసహజమైన ఆహారాలు , పదార్దాల ఆరోగ్య ప్రయోజనాలపై కొత్త పరిశోధనలకు బలమైన సంవత్సరంగా నిలిచింది వీటిలో కొన్ని శతాబ్దాలుగా సాంప్రదాయ వైద్యంలో ఉపయోగించ బడుతున్నవే. బరువు తగ్గడం, కణాల మరమ్మత్తు, వాపు లేదా గుండె ఆరోగ్యం తదితర విషయాల్లో 'సూపర్‌ఫుడ్స్' అద్భుత నివారణలు కాకపోవచ్చు. కానీ కొన్ని మాత్రం ఆరోగ్య సంరక్షణ మించి ఉన్నాయని తేలింది. అలాగే చాలా మంచి ఫుడ్ కూడా కొంతమందికి ప్రాణాపాయంగా ఉండవచ్చిన నిపుణులు చెప్పారు.చీజ్‌తో మానసిక ఆరోగ్యం2.3 మిలియన్ల మంది వ్యక్తులపై జరిపిన ఒక అధ్యయనంలో, షాంఘై జియావో టోంగ్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు చీజ్ వినియోగంతో మెరుగైన మానసిక ఆరోగ్యం ముఖ్యంగా వృద్ధుల్లో సామాజిక ఆర్థిక కారకాలతో సంబంధం లేకుండా ఎక్కువ ప్రభావం ఉంటుందని తేలింది. జన్యపరంగా వృద్ధాప్యం సహజమే అయినా, చీజ్ ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి ముఖ్యమైన సాంఘికీకరణ వంటి ఇతర కార్యకలాపాలతో ముడిపడి ఉందని పరిశోధన సూచించింది.నట్స్ - మెదడుగింజలు చిత్తవైకల్యం నుండి మెదడును రక్షించడంలో సహాయపడతాయి మెల్బోర్న్లోని మోనాష్ యూనివర్శిటీ పరిశోధకులు 49-ఐటమ్ ఫుడ్-ఫ్రీక్వెన్సీ సర్వేను పూర్తి చేసిన 70 ఏళ్లు పైబడిన 9,916 మంది వ్యక్తుల రికార్డులను పరిశీలించారు. ఇతర కారకాలను పరిశీలించిన తరువాత, తక్కువ నట్స్ తినే వారితో పోలిస్తే,తమ ఆహారంలోరోజుకు ఒకటి లేదా రెండుసార్లు నట్స్‌ను తీసుకునేవారిలో మంచి అభిజ్ఞా పనితీరు శారీరక ఆరోగ్యాన్ని నిలుపుకోవటానికి మంచి అవకాశం ఉందని గుర్తించింది. ఫాక్స్ నట్స్ఫాక్స్ నట్స్ ఆగ్నేయాసియాతోపాటు ఇండియాలో చాలాకాలంగా సంప్రదాయ వైద్యంలో వాడుతున్నారు. నీటి కలువ కుటుంబానికి చెందిన నీటి మొక్క (యురేల్ ఫెరోక్స్ ఫ్లవర్) గింజలే ఫాక్స్ నట్స్. వీటిల్లోని యాంటీ ఏజింగ్ లక్షణాలు ఈ ఏడాది పరిశోధకులకు ప్రత్యేక ఆసక్తిని కలిగించాయి. 2012, 2018, 2020లో అధ్యయనాలతో పాటు, ఇటీవల 2023లోని యాంటీఆక్సిడెంట్ల అధ్యయనాలను సమీక్షించారు. తద్వారా ఇవి కణాల ఆరోగ్యానికి, వాపును ఎదుర్కోవడానికి ముఖ్యమైన సమ్మేళనాలు అని గమనించారు. అంతేకాదు ప్రోటీన్- స్టార్చ్-రిచ్ సీడ్స్ పాప్‌కార్న్ లాగా చేసుకోవచ్చు. ఇవి ఊబకాయం, అధిక కొలెస్ట్రాల్ నివారణలో బాగా ఉపయోగడతాయని గుర్తించారు.గాలి నుండి తయారైసూపర్ ప్రోటీన్సొలీన్ ప్రొటీన్ ఉత్పత్తికి ప్రపంచంలోనే మొట్టమొదటి వాణిజ్య-స్థాయిఫ్యాక్టరీ ఫిన్లాండ్లో ఏర్పాటైంది 2024లోనే. సోలిన్ ప్రొటీన్ (సోలెంట్ గ్రీన్ కాదు) శక్తి కోసం హైడ్రోజన్‌ను ఆక్సీకరణం చేసే రహస్య సింగిల్-సెల్ మట్టిలో ఉండే సూక్ష్మజీవి ద్వారా తయారు చేస్తారు. సోలిన్ అని పిలువబడే పొడి లాంటి పదార్ధంలో 65-70% ప్రోటీన్, 5-8% కొవ్వు, 10-15% డైటరీ ఫైబర్స్ , 3-5% ఖనిజ పోషకాలు ఉంటాయి కేవల ఐదో వంతు కర్బన ఉద్గారాలతో, 100 రెట్లు తక్కువ నీరు, 20 శాతం కంటే తక్కువ మొక్క ప్రోటీన్ ఉత్పత్తి. డయాబెటిస్‌కు డార్క్ చాక్లెట్డార్క్ చాక్లెట్ ఆరోగ్య ప్రయోజనాలపై పరిశోధనా ప్రపంచంలో చర్చనీయాంశంగా ఉన్నాయి. కానీ ఈ ఏడాది హార్వర్డ్ T.H. చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధకులు వారానికి ఐదు సార్లు డార్క్ చాక్లెట్ వల్ల మంచిదని తేల్చారు. దీని వల్ల బరువు పెరగకుండానే టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం 21శాతం తగ్గుతుందని కనుగొన్నారు. అధిక-ఫ్లావనాల్ కోకో ఉత్పత్తులు ఇన్సులిన్ నిరోధకతను మెరుగుపరుస్తాయని పరిశోధకులు విశ్వసిస్తున్నారు. ఇది ఇతర రకాల చాక్లెట్లలో కనిపించదు. ఫ్లేవనోల్స్, పాలీఫెనాల్ యాంటీఆక్సిడెంట్లు మెరుగైన గుండె ఆరోగ్యాన్ని మెరుగుపర్చి, టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని అంచనా.తేనె- ప్రొబయాటిక్స్ఇల్లినాయిస్ యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్ అర్బానా-ఛాంపెయిన్ పరిశోధకులు పెరుగులో ఒక టేబుల్ స్పూన్ తేనెను జోడించడం వల్ల జీర్ణకోశంలో ప్రోబయోటిక్ మనుగడను పెంచుతుందనికనుగొన్నారు. జీర్ణక్రియను పెంచడంలో సహాయ పడుతుంది. ముఖ్యంగా క్లోవర్ తేనె - మంచి బ్యాక్టీరియాను రక్షిస్తుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది ఎగువ జీర్ణశయాంతర ప్రేగుల ద్వారా గట్ మైక్రోబయోమ్‌కు ప్రయాణిస్తుంది, అక్కడ మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.అలర్జీ నివారణలో స్ట్రాబెర్రీటోక్యో యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ జరిపిన ఒక అధ్యయనం ప్రకారం, స్ట్రాబెర్రీ అలర్జీల నివారణలో సాయపడతాయి. ఫ్లేవనాయిడ్ కెంప్ఫెరోల్ రోగనిరోధక వ్యవస్థపై దాని ప్రభావం ద్వారా ఆహార అలెర్జీలతో సహా,ఇతర శరీరం అలెర్జీలను ఇవి తగ్గిస్తాయి. కెంప్ఫెరోల్ టీ, బీన్స్, బ్రోకలీ, యాపిల్స్, స్ట్రాబెర్రీలలో పుష్కలంగా ఉంటుంది. ఈ నిర్దిష్ట ఫ్లేవనాయిడ్ మైక్రోబయోలాజికల్ యాంటీగ్గా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
ఫొటోలు
National View all
కులం పేరిట విషం చిమ్ముతున్నారు
న్యూఢిల్లీ: ప్రతిపక్షాల తీరుపై ప్రధాని నరేంద్ర మోదీ ఆగ
‘ఇస్రో’ రోబో హస్తం
న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ఘన
ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ–కాంగ్రెస్ పొత్తు
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ–కాంగ్రెస్‌లు తమ మధ్య పొ
బర్డ్ ఉమన్.. పిట్టలు వాలిన చెట్టు
పురుషుల చరిత్రలో స్త్రీలు తెర వెనుక ఉంటారు.
అంతరిక్షంలో జీవం ‘పురుడు’ పోసుకుంది!
న్యూఢిల్లీ: కొన్నేళ్లుగా అంతరిక్షంలో అద్భుతాలతో ప్రపంచాన్ని
International View all
అమెరికా దిగువసభలో నలుగురు హిందువులు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలతోపాటు జరిగిన పార్లమెంట్
యుద్ధభూమిలో రక్తమోడుతున్న రష్యా
గుడ్లురిమి చూస్తూ పొరుగుదేశం ఉక్రెయిన్‌పైకి దురాక్రమణ జెండాతో దూసుకొచ్చిన రష్యా ఇప్పుడు యుద్ధభూమిలో నెత్తురోడుతోంది.
విమానంలోనూ వైఫై
దేశీయ ప్రయాణం కోసం విమానం ఎక్కుతున్నామంటే మన మొబైల్ ఫోన్లో ఫ్లైట్ మోడ్ ఆన
ఏకంగా 174 కిలోల బరువు తగ్గాడు, చివరకు..
మనిషి కాస్త లావుగా ఉంటే.. బాడీ షేమింగ్ చేస్తూ హేళన చేసే సమాజం ఇది. అయితే తమ కొవ్వును కరిగించుకుని..
తడబడ్డ కమలాహారిస్..వీడియో వైరల్
వాషింగ్టన్:అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ తడబడ్డారు.
NRI View all
భావ వైవిధ్యం.. అన్నమయ్య సంకీర్తనా గానంపై నాట్స్ వెబినార్
అమెరికాలోనూ ‘చాయ్.. సమోసా’
‘తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ’ అంటూ భారతీయ పర్యాటకులను మరింతగా ఆకట్టుకునేం
న్యూ ఇయర్ వేళ విషాదం : భారత సంతతి వైద్యుడు దుర్మరణం
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) దేశంలో దుబాయ్ ఎమిరేట్, రాస్ అల్ ఖైమాలో జరిగిన చిన్న ప్రైవేట్ విమాన ప్రమ
మహిళా క్యాషియర్‌పై దాడి, అనుచిత వ్యాఖ్యలు, ఎన్ఆర్ఐకు జైలు, జరిమానా
మహిళా క్యాషియర్‌పై అనుచితంగా ప్రవర్థించిన భారత సంతతికి చెందిన 27 ఏళ్ల వ్యక్తికి సింగపూర్ కోర్టు జైలు
సుచీర్ బాలాజీ కేసులో షాకింగ్ ట్విస్ట్!
ఓపెన్ఏఐ విజిల్‌బ్లోయర్
క్రైమ్
అంకుల్.. మొత్తం కుటుంబాన్ని చంపేశా..!
లక్నో: తల్లితో సహా నలుగురు చెల్లెల్ని ఓ కిరాతకుడు దారుణంగా హత్య చేసిన ఘటన యూపీలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. మాయమాటలతో హోటల్‌కు తీసుకెళ్లి తన కుటుంబంలోని సభ్యులను హతమార్చాడు. యూపీలోని సాంబాల్కు చెందిన అర్షద్.. తన తల్లి, చెల్లెళ్లను కొత్త ఏడాది సంబరాల పేరుతో లక్నోలోని హోటల్‌కు తీసుకెళ్లాడు. ఆపై తాను వేసుకున్న పథకం ప్రకారం వారిని బంధించి భయానకంగా చంపేశాడు. అనంతరం తన బంధువుల్లో ఒకరికి వీడియో కాల్ చేసి మరీ తన కుటుంబ సభ్యుల్ని హత్య చేసిన సంగతిని ఏదో ఘనకార్యం చేసినట్లుగా చెప్పుకున్నాడు. ‘అంకుల్.. చూడు.. కుటుంబాన్ని మొత్తం చంపేశా’ అంటూ అస్మా సోదరుడు(అర్షద్‌కు మేనమామ)కు ఫోన్ చేసి చెప్పాడు.అర్షద్ అనే యువకుడు తల్లి అస్మాను, చెల్లెళ్లు అలియా(9), అక్సా(16); రాచ్మీన్(18), అల్షియా(19)లను లక్నోలోని ఒక హోటల్‌కు తీసుకెళ్లాడు. న్యూ ఇయర్ సంబరాలు చేసుకుందాం అంటూ వారిని హోటల్‌కు తీసుకెళ్లాడు. అయితే మృత్యువు కొడుకు రూపంలో వస్తుందని తల్లీ గ్రహించలేకపోయింది. చెల్లెళ్లు కూడా సోదరుడు సంబరాలు చేసుకుందామంటే తెగ సంబర పడ్డారే కానీ వారికి అదే చివరి రోజు అవుతుందనే విషయాన్ని పసిగట్టలేకపోయారు. తన కొడుకు.. చెల్లెళ్లతో కలిసి సంబరాలు చేసుకుందామంటే ఆ తల్లి ఎంతో మురిసిపోయింది. కానీ అది ఆ కన్నపేగుకు ఎంతోసేపు నిలవలేదు. ఇంత కిరాతకానికి ఒడిగడతాడని తల్లి ఊహించలేపోయింది. కొడుకు చేతిలో ప్రాణాలు కోల్పోయే క్ష ణంలో తల్లి ఏమీ చేయలేని జీవచ్ఛవంలా మారిపోయింది.ఆ నీచుడికి మరణశిక్ష వేయాల్సిందే..ఇంత దారుణానికి ఒడిగట్టిన అర్షద్‌కు మరణశిక్ష వేయాల్సిందేనని అస్మా కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. అస్మా సోదరుడు మహ్మద్ జీషాన్ మాట్లాడుతూ.. ఆ కిరాతకుడ్ని వదలొద్దని పోలీసులకు విన్నవించాడు. తన సోదరిని, మేనకోడల్ని చంపిన నీచుడ్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలొద్దన్నాడు. ‘ అదే రోజు వారిని చంపేసిన తర్వాత నాకు ఫోన్ చేశాడు.అంకుల్ మొత్తం ఫ్యామిలీని చంపేశా’ అంటూ తనకు ఫోన్ చేసినట్లు జీషన్ చెప్పుకొచ్చాడు. నా సోదరితో మాట్లాడి నాలుగు నెలలు అయ్యింది. కూతుళ్లతో కలిసి ఆమె చాలా సింపుల్ జీవితాన్ని ఎంతో ఆనందంగా గడుపుతోంది. అటువంటి కుటుంబాన్ని హతమార్చిన అర్షద్‌ను వదలకండి. అతనికి వేసే శిక్ష చాలా తీవ్రంగా ఉండాలి’ అని జీషన్ కన్నీటి పర్యంతంతో పోలీసుల్ని వేడుకున్నాడు.కుటుంబ పెద్ద సహకారం కూడా ఉందా?ఇంతటి దారణమైన హత్యల కేసులో కుటుంబ పెద్దగా ఉన్న అర్షద్ తండ్రి పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుటుంబాన్ని చంపేసిన ఘటనలో తండ్రి పాత్ర కూడా ఉన్నట్లు అర్షద్ స్పష్టం చేసినట్లు ప్రాథమిక ఆధారాల్ని బట్టి తెలుస్తోంది.
కీచక భర్త హత్య .. ఆపై ముక్కలు
దొడ్డబళ్లాపురం: భార్యను పరుల పడకలోకి వెళ్లాలని వేధించడమే కాక.. కన్న కుమార్తెపై అత్యాచారయత్నం చేసిన ఓ కీచక భర్తను భార్యే హత్యచేసి మృతదేహాన్ని ముక్కలుగా నరికి మాయం చేసిన ఘటన కర్ణాటకలో తీవ్ర సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. బెళగావి జిల్లా చిక్కోడి తాలూకా ఉమరాణి గ్రామ నివాసి శ్రీమంత ఇట్నాళ (35), భార్య సావిత్రి కూలి పనులు చేస్తూ జీవిస్తుంటారు. వారికి ఇద్దరు కుమార్తెలు. డబ్బుల కోసం సావిత్రిని పరాయి పురుషులతో పడుకోవాలని శ్రీమంత బలవంతం చేసేవాడు. దీంతో ఆమె భర్త దూరం పెట్టసాగింది.తనను నిత్యం అదే తరహాలో వేధించడమే కాకుండా.. ఇటీవల కన్న కూతురిపైనే శ్రీమంత అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన సావిత్రి బండరాయితో బాది భర్తను హత్య చేసింది. తరువాత మృతదేహాన్ని ముక్కలుగా చేసి చిన్న డ్రమ్ములో వేసి ఊరి బయటకు తీసుకెళ్లి విసిరేసింది. ఇంట్లో రక్తపు మరకలను శుభ్రం చేసింది. భర్త దుస్తులను కాల్చివేసింది. హత్యకు ఉపయోగించిన బండరాయిని కడిగి షెడ్లో దాచిపెట్టింది. కాగా గురువారం శ్రీమంత మృతదేహం ముక్కలు లభించడంతో పోలీసులు దర్యాప్తు చేయగా విషయం బయటపడింది. తానే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సావిత్రి ఒప్పుకుంది.
డామిట్.. కథ అడ్డం తిరిగింది..!
సాక్షి ప్రతినిధి, కడప: 2024 డిసెంబర్ 6వతేదీ సమయం అర్ధరాత్రి ఒంటిగంట. నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో ఖాళీగా ఉన్న మంచంపై నిద్రిస్తున్న 75 ఏళ్ల వృద్ధుడిని టీడీపీ కార్యకర్తలైన ఇద్దరు యువకులు ఊపిరి ఆడకుండా తలపై దిండు అదిమిపెట్టి హత్య చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి జారుకున్నారు. వృద్ధుడు అనారోగ్యంతో చనిపోయాడని గ్రామస్తులు, బంధువులు భావించి, అంత్యక్రియలు చేశారు. ఆ తర్వాత సీసీ టీవీ ఫుటేజిలో ఆ యువకుల దాష్టీకం బయటపడింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. వైఎస్సార్ జిల్లా మైదుకూరు మున్సిపాలిటీలోని శెట్టివారిపల్లె గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో అల్లాడుపల్లె వీరారెడ్డి (75) డిసెంబర్ 6న మృతి చెందాడు. మరునాడు ఉదయం మంచంపైనే వీరారెడ్డి మరణించినట్లు గమనించిన భవనం యజమాని అతని బంధువులకు తెలిపారు. అనారోగ్యంతో చనిపోయినట్లు బంధువులు, గ్రామస్తులు భావించారు. అంత్యక్రియలు చేశారు. రెండు రోజుల క్రితం నిర్మాణంలో ఉన్న ఇంటి సీసీ కెమెరాల ఫుటేజిని పరిశీలించగా వీరారెడ్డిది సహజ మరణం కాదని, హత్య అన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఇద్దరు యువకులు వీరారెడ్డి మొఖంపై దిండు అదిమి పెట్టి, ఊపిరాడకుండా చేసినట్లు అందులో కనిపించింది. కొద్దిసేపు కాళ్లు కొట్టుకున్న వృద్ధుడు ఆ తర్వాత చలనం లేకుండా ఉండిపోయాడు. చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత ఆ యువకులిద్దరూ వెళ్లిపోయారు. ఈ విషయం పోలీసులకు చేరింది. అయితే, ఫిర్యాదు లేకపోవడంతో పోలీసులు మిన్నకుండిపోయారు. గ్రామస్తులంతా ఈ విషయాన్ని బాహాటంగా చర్చించుకోవడంతో పోలీసులు విచారణ చేపట్టారు. అల్లాడుపల్లె హరినాథరెడ్డి, కాల్వపల్లె నరసింహాలు అనే ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వారిలో హరినాథరెడ్డి వీరారెడ్డికి స్వయానా మనుమడు కావడం విశేషం. హత్యతో ఆగని ఆ యువకులు ఓ యువతిని చెరబట్టేందుకు ప్రయత్నించారు. దాంతో వ్యవహారం మరింతగా ప్రచారంలోకి వచ్చింది. వీరిద్దరూ టీడీపీ కార్యకర్తలు కావడం, ఫిర్యాదు లేకపోవడంతో పోలీసులు వారిపై చర్యలకు వెనక్కి తగ్గినట్లు సమాచారం. వృద్ధుడి హత్యకు కారణాలు తెలియరాలేదు.
గోవాలో తాడేపల్లిగూడెం యువకుడి హత్య
తాడేపల్లిగూడెం: నూతన సంవత్సర వేడుకలను మిత్రులతో సంతోషంగా జరుపుకుందామని గోవా వెళ్లిన పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం యువకుడు హత్యకు గురయ్యాడు. వివరాలు.. తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన బొల్లా రవితేజ(28) హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. రవితేజతో పాటు మరో నలుగురు యువకులు, ముగ్గురు యువతులు నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు శనివారం గోవా వెళ్లారు. రెండు రోజుల పాటు గోవాలోని పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించి.. డిసెంబర్ 30వ తేదీ అర్ధరాత్రి నార్త్‌గోవా జిల్లా కలంగూట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఒక రెస్టారెంట్‌కు వెళ్లారు. అర్ధరాత్రి అయినందున బిల్లు మీద అధికంగా చెల్లించాలని రెస్టారెంట్ యజమాని డిమాండ్ చేయడంతో.. అక్కడి సిబ్బందికి, రవితేజ స్నేహితులకు మధ్య గొడవ జరిగింది. ఈ సమయంలో తన స్నేహితురాలితో అక్కడి సిబ్బంది అసభ్యంగా ప్రవర్తించడంతో రవితేజ జోక్యం చేసుకున్నాడు. వెంటనే రెస్టారెంట్ సిబ్బంది కర్రలతో రవితేజతో పాటు అతని స్నేహితులపై విచక్షణారహితంగా దాడి చేశారు. వెదురు కర్ర విరిగి గుచ్చుకోవడంతో రవితేజ తలకు తీవ్ర గాయమైంది. మిగిలినవారు స్వల్పంగా గాయపడ్డారు. రవితేజను ఆస్పత్రికి తరలిస్తుండగా.. ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. రవితేజ స్నేహితులను విచారించారు. దాడి చేసిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.