Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today

Top Stories

ప్రధాన వార్తలు

We Are Ready Mamata Banerjees Poll Battle' Dare For PM Modi1
‘మోదీ జీ.. ఎవరి సత్తా ఏంటో ఎన్నికల్లో చూస్కుందాం’

కోల్‌కతా: ప్రధాని నరేంద్ర మోదీ పశ్చిమబెంగాల్ పర్యటనలో మమతా బెనర్జీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మమతా బెనర్జీ ప్రభుత్వం ఒక అవినీతి ప్రభుత్వమని, హింసాత్మక ప్రభుత్వమని ప్రధాని మోదీ ఘాటుగా విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం పశ్చిమబెంగాల్ ప్రజలు.. మమతా బెనర్జీ ప్రభుత్వం అరాచకాలపై కన్నీళ్లు పెట్టుకుంటున్నారంటూ మోదీ వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్ లో ప్రభుత్వాన్ని మార్చాల్సిన సమయం ఆసన్నమైందని కూడా ప్రజల భావనగా ఉందని మోదీ తెలిపారు.దీనికి సీఎం మమతా బెనర్జీ తనదైన శైలిలో జవాబిచ్చారు. తాను ప్రధాని మోదీ తరహాలో వ్యాఖ్యానించలేనంటూనే వచ్చే ఎన్నికల్లో ఎవరి సత్తా ఏమిటో తెలుస్తుందన్నారు. రాబోవు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారో అనేది తేలుతుందని మోదీకి సవాల్ విసిరారు. మోదీ వ్యాఖ్యలపై కౌంటర్ రిప్లై ఇచ్చిన మమతా.. ‘ ఎన్నికలు రానివ్వండి. చూద్దాం.. ఎవరి సత్తా ఏమిటో తేలుతుంది. ప్రజలు ఎవరు పక్షాన ఉన్నారో చూద్దాం. మా వెంట, మా పార్టీ వెంట రాష్ట్ర ప్రజలు ఉన్నారని నేను బలంగా నమ్ముతున్నా. ఎవరి సత్తా ఏమిటో ఎన్నికల్లో చూస్కుందాం’ అని మోదీకి మమతా సవాల్‌ విసిరారు.ఈరోజు(గురువారం) ప్రధాని మోదీ పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని అలీపుర్దౌర్ బహిరంగ సభలో మాట్లాడుతూ.. మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని తూర్పార బట్టారు. పశ్చిమ బెంగాల్ ఎక్కడ చూసినా అవినీతి, అల్లర్లు, హింస ఇవే కనిపిస్తున్నాయంటూ విమర్శలు చేశారు. పశ్చిమ బెంగాల్ లో ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం కూడా లేదు. వచ్చే ఏప్రిల్ నెలలో పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ తరుణంలో ప్రధాని మోదీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

India GDP Growth Projected At 6 5 Percent In FY 2025 26 RBI2
ఆర్‌బీఐ వార్షిక నివేదిక: భారత్ జీడీపీ వృద్ధి ఇలా..

భారత్ ఇటీవలే జపాన్‌ను అధిగమించి.. ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ఇక మన ముందు ఉన్న లక్ష్యం జర్మనీని అధిగమించడమే. ఈ తరుణంలో 'రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (RBI) వచ్చే ఆర్ధిక సంవత్సరంలో దేశ ఆర్ధిక వ్యవస్థ ఎలా ఉంటుందనే విషయాన్ని'2024-2025 వార్షిక నివేదిక'లో వెల్లడించింది.2025-26 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ జీడీపీ వృద్ధి 6.5 శాతంగా ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తెలిపింది. అంతే కాకుండా.. దేశ ఆర్థిక వ్యవస్థ.. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని.. తద్వారా స్థిరమైన వృద్ధి సాధ్యమవుతుందని నివేదికలో వెల్లడించింది.మార్కెట్ అస్థిరతలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య విచ్ఛిన్నం, సరఫరా గొలుసుల అంతరాయాలు, వాతావరణ ప్రేరిత అనిశ్చితులు మొదలైనవన్నీ ద్రవ్యోల్బణంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని ఆర్‌బీఐ పేర్కొంది. అయితే ఆర్థిక ఏకీకరణ మార్గంలో ప్రభుత్వం నిరంతరం మూలధనంపై దృష్టి పెట్టడం, వినియోగదారులు & వ్యాపార ఆశావాదాన్ని బలోపేతం చేయడం, బలమైన స్థూల ఆర్థిక ప్రాథమిక అంశాలన్నీ సజావుగా ముందుకు సాగితే.. 2025-26లో భారత ఆర్థిక వ్యవస్థ దృక్పథం ఆశాజనకంగానే ఉందని స్పష్టం చేసింది.2025-26లో వ్యవసాయ రంగానికి అవకాశాలు అనుకూలంగా కనిపిస్తున్నాయి. దీనికి కారణం నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే ఎక్కువగా ఉండటం మాత్రమే కాకుండా.. ఉత్పాదకతను పెంచే ప్రభుత్వ విధానాలు కూడా అని ఆర్‌బీఐ పేర్కొంది. 2025-26 కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడానికి వివిధ కొత్త చొరవలను ప్రకటించారని కూడా వెల్లడించింది.ఇదీ చదవండి: ఇక భారత్ టార్గెట్ జర్మనీ: 2027 నాటికి..టారిఫ్ విధానాలలో మార్పులు ఆర్థిక మార్కెట్లలో అప్పుడప్పుడు అస్థిరతలకు దారితీయవచ్చు. అయితే ఈ ఏడాది కేంద్ర బడ్జెట్​లో ప్రకటించిన నేషనల్ మాన్యుఫ్యాక్చరింగ్ మిషన్.. మేక్ ఇన్ ఇండియా వంటివి తయారీ రంగాన్ని మరింత బలపరుస్తాయి. తద్వారా.. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.భారత్ ఇప్పటికే అనేక దేశాలతో వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుంటోంది. ఇందులో యూఎస్ఏ మాత్రమే కాకుండా.. ఒమన్, పెరూ, ఈయూ మొదలైన దేశాలు ఉన్నాయి. ఈ వాణిజ్య ఒప్పందాలు ఆర్ధిక వృద్ధికి దోహదపడతాయి. 2024-25లో దేశంలో అనేక ఆర్ధిక ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ.. ఆర్ధిక వ్యవస్థ బలంగానే ఉందని రిజర్వ్ బ్యాంక్ స్పష్టం చేసింది. డిజిటల్ చెల్లింపులు కూడా దేశంలో అధికంగా ఉన్నాయి. మొత్తం మీద భారత్ ఆర్ధిక వ్యవస్థలో పురోగతి ఉంటుందని ఆర్‌బీఐ వెల్లడించింది.वर्ष 2024-25 के लिए वार्षिक रिपोर्ट Annual Report for the Year 2024-255thhttps://t.co/vTNI6w2xnz pic.twitter.com/rqo7ZV6HnD— ReserveBankOfIndia (@RBI) May 29, 2025

YS Jagan Family Participated In Raja Reddy Jayanthi Celebrations3
వైఎస్‌ రాజారెడ్డి శత జయంతి.. నిర్మలా శిశు భవన్‌కు వైఎస్‌ జగన్‌ దంపతులు

సాక్షి, విజయవాడ: నేడు దివంగత మహానేత వైఎస్సార్‌ తండ్రి, దివంగత వైఎస్‌ రాజారెడ్డి శత జయంతి. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు వైఎస్‌ రాజారెడ్డి శత జయంతి వేడుకల్లో పాల్గొన్నారు.వైఎస్‌ రాజారెడ్డి జయంతి నేపథ్యంలో సతీసమేతంగా వైఎస్‌ జగన్‌ గురువారం.. విజయవాడలోని నిర్మల శిశు భవన్‌కు విచ్చేశారు. ఈ సందర్బంగా నిర్మల శిశు భవన్‌లో ఉన్న పిల్లలతో వైఎస్‌ జగన్‌, భారతి దంపతులు ముచ్చటించారు. వారితో సరదాగా గడిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌ సోదరి వైఎస్‌ విమలారెడ్డి కూడా పాల్గొన్నారు. అంతకుముందు.. పార్టీ అధినేత విజయవాడకు వస్తున్నారన్న విషయం తెలిసి వైఎస్సార్‌సీపీ పార్టీశ్రేణులు అక్కడికి భారీ సంఖ్యలో విచ్చేసి వైఎస్‌ జగన్‌కు ఘన స్వాగతం పలికారు.మరోవైపు.. పులివెందులలో రాజారెడ్డి శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పులివెందులలోని సీఎస్‌ఐ చర్చిలో వైఎస్‌ విజయమ్మ సహా కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.తన తాత వైఎస్ రాజారెడ్డి శత జయంతి కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ జగన్.. శిశు భవన్‌లో దివ్యంగ చిన్నారులతో గడిపిన వీడియో, ఫోటోలను ఎక్స్‌లో షేర్ చేశారు. Cherishing and honouring the 100th anniversary of my late grandfather's memory. pic.twitter.com/CS6IyD08pi— YS Jagan Mohan Reddy (@ysjagan) May 29, 2025

CM Revanth Reddy Takes On PM Narendra Modi4
‘గుండెల్లో ధైర్యం ఉన్న నాయకుడే.. యుద్ధాన్ని గెలుస్తాడు’

మేడ్చల్‌ జిల్లా: పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆపరేషన్‌ సిందూర్‌కు కాంగ్రెస్‌ పూర్తి మద్దతిస్తే, యుద్ధం ఆపేసినప్పుడు అఖిలపక్షాన్ని ఎందుకు పిలవలేదంటూ ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ రోజు(గురువారం) మేడ్చల్ జిల్లా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్.. ప్రధాని మోదీని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. గుండెల్లో ధైర్యం ఉన్న నాయకుడే.. యుద్ధాన్ని గెలవగలడు అంటూ ప్రధాని మోదీని విమర్శించారు.‘ఉగ్రదాడి తర్వాత కేంద్రానికి పూర్తిగా మద్దతిచ్చాం. యుద్ధాన్ని ఆపాలనుకున్నప్పుడు అఖిల పక్షాన్ని ఎందుకు పిలవలేదు?, మన భూభాగాన్ని చైనా ఆక్రమిస్తుంటే మోదీ ఏం చేస్తున్నారు?, అమెరికా ఒత్తిడికి తలొగ్గి యుద్ధం ఆపేశారా?, మన పౌరులపై తూటాలు పేల్చిన దేశాన్ని తుడిచేయాలని ప్రధానిని కోరాం.పాక్ ను ప్రపంచ చిత్రపటంలో లేకుండా చేయాలని కోరాం. భారత్‌ను బెదిరించడానికి ట్రంప్‌ ప్రకటన చేయడం బాధాకరం​. యుద్ధాన్ని విరమించినప్పుడు మోదీ అఖిలపక్షాన్ని ఎందుకు పిలవలేదు. గతంలో అమెరికా బెదిరింపులను ఇందిరాగాంధీ పట్టించుకోలేదు. అప్పట్లో పాక్‌ను ఓడించి బంగ్లాదేశ్‌ను ఏర్పాటు చేశారు. గుండెల్లో ధైర్యం ఉన్న నాయకుడే.. యుద్ధాన్ని గెలవగలడు. పాక్‌ను ఓడించాలంటే ఇందిరాగాంధీ బాటలో మోదీ నడవాలి. ఇదే విషయాన్ని రాహుల్‌గాంధీ చెప్తే విమర్శిస్తున్నారు’ అంటూ సీఎం రేవంత్‌ స్పష్టం చేశారు. ఇది చదవండి: ‘మోదీ జీ.. ఎవరి సత్తా ఏంటో ఎన్నికల్లో చూస్కుందాం’

U16 Davis Cup: Pakistan Tennis Player Unsportsmanlike Behaviour Towards Indian Counterpart5
భారత ఆటగాడిని అవమానించిన పాక్‌ టెన్నిస్‌ ప్లేయర్‌.. వైరల్‌ వీడియో

పాకిస్తాన్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ ఒకరు భారత ఆటగాడిని అవమానించాడు. భారత్‌ చేతిలో ఓటమిని తట్టుకోలేక ఓవరాక్షన్‌ చేశాడు. మ్యాచ్‌ పూర్తయ్యాక షేక్‌ హ్యాండ్‌ ఇచ్చేందుకు వెళ్లిన భారత ఆటగాడి పట్ల దురుసుగా ప్రవర్తించాడు. కోపంతో ఊగిపోతూ కరచాలనం చేసేందుకు నిరాకరించాడు. కజకిస్థాన్‌ వేదికగా జరిగిన ఏసియా-ఓసియానియా జూనియర్‌ డేవిడ్‌ కప్‌ (అండర్‌-16) టెన్నిస్‌ టోర్నీమెంట్‌లో ఇది జరిగింది. India defeats Pakistan 2-0 in Junior Davis CupLook at the Pakistan player's attitude on handshake after loosing, Pathetic Stuff! 😡 pic.twitter.com/8twsAbDqPd— India Insights 🇮🇳 (@India_insights0) May 27, 2025ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది. పాక్‌ ఆటగాడి ప్రవర్తనను భారత క్రీడాభిమానులు ఖండిస్తున్నారు. క్రీడాస్పూర్తికి విరుద్దంగా ప్రవర్తించాడని మండిపడుతున్నారు. పాక్‌ ఆటగాళ్ల నుంచి ఇంతకంటే గొప్ప ప్రవర్తన ఆశించలేమంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. భారత్‌-పాక్‌ మధ్య యుద్దం తర్వాత జరిగిన ఘటన కావడంతో భారత అభిమానులు తీవ్రంగా స్పందిస్తున్నారు.కాగా, జూనియర్‌ డేవిడ్‌ కప్‌ టెన్నిస్‌ టోర్నీలో 11వ స్థానం కోసం జరిగిన ప్లే ఆఫ్స్‌ మ్యాచ్‌లో భారత్‌ పాక్‌ను 2-0 తేడాతో చిత్తుగా ఓడించింది. సింగిల్స్‌ మ్యాచ్‌ల్లో భారత ఆటగాళ్లు ప్రకాశ్‌ సర్రన్‌, తవిశ్‌ పహ్వా వరుస సెట్లలో పాక్‌ ఆటగాళ్లును ఓడించారు.

TDP Mahanadu Day 3 Updates: Even Police Faced Troubles In Mahanadu6
మహానాడు ఎఫెక్ట్‌.. బస్టాండ్లలో ప్రయాణికుల అవస్థలు

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: తెలుగు దేశం పార్టీ మహానాడు(TDP Mahanadu) కార్యక్రమం మాటేమోగానీ.. జనాలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరోవైపు జనాల్ని తరలించలేక, సభకు వచ్చినవాళ్లను నిలువరించలేక టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. తొలిరెండు రోజులు ఖాళీ కుర్చీలు దర్శనం ఇవ్వడం, నేతలు మాట్లాడుతుండగానే మధ్యలో జనాలు వెళ్లిపోవడాన్ని సాక్షి హైలైట్‌ చేసిన సంగతి తెలిసిందే. దీంతో మూడోరోజు మహానాడు బహిరంగ సభనైనా జనంతో నింపేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో.. మహానాడు సభ కోసం ఆర్టీసీ నుంచి భారీగా టీడీపీ బస్సులను వినియోగించుకుంటోంది. చాలా గ్రామాలకు ఉదయమే బస్సులు చేరుకుని జనాల్ని తరలిస్తున్నాయి. దీంతో డిపోల్లో బస్సుల్లేక.. సరిపడా బస్సుల్లేక గమ్యస్థానాలకు చేరేందుకు ప్రయాణికులు అగచాట్లు పడుతున్నారు. చాలా బస్టాండుల్లో బస్సుల్లేవ్‌ అనే బోర్డులు సైతం దర్శనమిస్తుండడం గమనార్హం. నంద్యాల జిల్లా నుంచి, శ్రీశైలం నుంచి మహానాడు కోసం బస్సులు తరలించారు. ఆత్మకూరు డిపోలో బస్సుల్లేక ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరోవైపు.. కడప మహానాడు (Kadapa Mahanadu)ను ఎలాగైనా ‘సక్సెస్‌’ చేసుకోవాలని టీడీపీ భావిస్తోంది. రాష్ట్రం నలుమూలల నుంచి జనసేకరణ చేపట్టింది. అన్నమయ్య జిల్లాలో మహానాడు కోసం ఓబులవారిపల్లి హరిజన వాడ నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు. అయితే.. అది బలవంతపు తరలింపు అని ఇప్పుడు తేలింది. డ్వాక్రా మహిళలు మహానాడుకు కచ్చితంగా రావాలని, సమావేశానికి రాకపోతే లోన్లు ఇవ్వమంటూ బెదిరించిన ఆడియో ఒకటి బయటకు వచ్చింది.మహానాడు కారణంగా చివరకు పోలీసులు(AP Police) సైతం పడుతున్న కష్టాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కార్యక్రమాల కోసం ప్రత్యేకంగా పోలీస్‌ బందోబస్తును ఏర్పాటు చేయించుకుంది టీడీపీ. అయితే కనీసం తిండి కూడా పెట్టడం లేదంటూ ఓ ఎస్సై పడిన ఆవేదన వీడియో రూపేణా బయటకు వచ్చింది. మహానాడులో రకరకాల రుచులతో భోజనాలు ఘనంగా పెడుతున్నారంటూ టీడీపీ అనుకూల మీడియా ఎంతలా ప్రచారం చేసుకుందో తెలిసిందే. కానీ, తాము ఏ పూట వెళ్లినా తమకు తిండి మాత్రం దొరకడం లేదని ఆయన అక్కడికి వచ్చిన వాళ్లకు చెప్పుకుంటూ వాపోయారు. ఇదీ చదవండి: మహానాడులో ఎన్టీఆర్‌ స్పీచ్‌.. నవ్వుకున్న టీడీపీ కార్యకర్తలు

Police complaint filed against Kamal Haasan by pro Kannada organisation7
కన్నడ భాషపై కమల్ కామెంట్స్‌.. పోలీసులకు ఫిర్యాదు!

కన్నడ భాషపై కమల్ హాసన్‌ చేసిన కామెంట్స్ పెద్ద ఎత్తున వివాదానికి దారి తీశాయి. థగ్ లైఫ్ సినిమా ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలపై కన్నడ నాయకులతో పాటు పలువురు మండిపడుతున్నారు. కమల్ హసన్‌ తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. కన్నడ భాషను ఉద్దేశించిన కమల్‌ చేసిన ‍వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు. మరోవైపు తాను మాత్రం క్షమాపణ చెప్పేది లేదని కమల్‌ కౌంటరిస్తున్నారు.ఈ నేపథ్యంలోనే కమల్ ‍హాసన్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని కర్ణాటక రక్షణ వేదిక బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బెంగళూరులోని ఆర్టీ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆయన కన్నడిగుల మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా.. తమిళులకు, మాకు విష బీజాలు నాటారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమిళ సినిమా విడుదలైన ప్రతిసారీ కన్నడిగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. కాగా.. థగ్ లైఫ్ ఆడియో లాంచ్ సందర్భంగా తమిళం నుంచే కన్నడ పుట్టిందని కమల్ హాసన్ చేసిన కామెంట్స్ వివాదానికి కారణమయ్యాయి. అయితే ఈ ఫిర్యాదుపై ఇంకా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదని ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.కాగా.. కమల్ హాసన్‌ వ్యాఖ్యలతో అనేక కన్నడిగుల్లో ఆగ్రహాన్ని రేకెత్తించాయి. బెళగావి, మైసూరు, హుబ్బళ్లి, బెంగళూరుతో సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో కమల్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. బెళగావి మరికొన్ని ప్రదేశాలలో కార్యకర్తలు కమల్ పోస్టర్లను తగలబెట్టి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. క్షమాపణ చెప్పకపోతే రాష్ట్రంలో ఆయన సినిమా థగ్ లైఫ్ ప్రదర్శనను అడ్డుకుంటామని కూడా బెదిరించారు.

Saifullah Kasuri at Anti India Rally in pakistan8
ప్రపంచం మొత్తం నేనెందుకు ఫేమసో తెలుసా.. పాక్‌ ర్యాలీలో ఉగ్రవాది

ఇస్లామాబాద్‌: మిని స్విట్జర్లాండ్‌గా పేర్కొందిన పహల్గాంలో టూరిస్టులపై జరిగిన ఉగ్రదాడి వెనుక మాస్టర్‌ మైండ్‌ లష్కరే తోయిబా కమాండర్‌ సయిఫుల్లా కసూరి హస్తం ఉన్నట్లు తేలింది. సైఫుల్లా కసూరి మరోవెరో కాదు లష్కరే తోయిబా చీఫ్‌,భారత మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాది హఫీజ్ సయీద్ కొడుకే.పాకిస్తాన్ తన అణు పరీక్షల వార్షిక స్మారకోత్సమైన యూమ్-ఎ-తక్బీర్‌ను పురస్కరించుకుని పాకిస్తాన్ మర్కజీ ముస్లిం లీగ్ (PMML) నిర్వహించిన ఈ ర్యాలీలో రాజకీయ నాయకులే కాదు సయిఫుల్లా కసూరి, ఇతర మోస్ట్‌ వాంటెండ్‌ టెర్రరిస్టులు సైతం పాల్గొన్నారు.Lashkar-e-Taiba (LeT) chief Hafiz Saeed's son with Pak Punjab Assembly MLAs openly inciting violence against India.Does anyone need more proof that Pakistan is a rogue state ? pic.twitter.com/NCtLXJTtxd— Zubair Alvi (@Alvi_Zubair45) May 29, 2025పంజాబ్ ప్రావిన్స్‌లోని కసూర్‌లో జరిగిన ర్యాలీలో కసూరి మాట్లాడుతూ,‘పహల్గామ్ ఉగ్ర దాడి సూత్రదారి నేనేనని అందరూ నన్ను నిందిస్తున్నారు. ఇప్పుడు నా పేరు ప్రపంచం మొత్తం మార్మోగుతోంది’ అంటూ భారత్‌కు వ్యతిరేకంగా స్లోగన్లు వినిపించారు.ఈ ర్యాలీలో భారతదేశ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ జాబితాలో 32వ స్థానంలో ఉన్న తల్హా సయీద్ సైతం ఉన్నారు. నిఘా వర్గాల సమాచారం ప్రకారం.. పహల్గాం ఉగ్రదాడిపై భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌తో పాక్‌ను చావుదెబ్బ తీసింది. పాకిస్తాన్‌లో ఉగ్రమూకలకు ట్రైనింగ్‌ ఇచ్చే సెంటర్లను భూస్తాపింతం జరిగింది. ఆపరేషన్‌ సిందూర్‌లో హతమైన హై-ప్రొఫైల్ ఉగ్రవాదుల్లో ముదస్సిర్ అహ్మద్ ఒకరు.తాజాగా, కసూర్‌ ర్యాలీలో మాట్లాడిన సైఫుల్లా కసూరి పంజాబ్‌ ప్రావిన్స్‌లోని అల్హాఅబాద్‌లో ఆస్పత్రులు, భవనాలు నిర్మిస్తామని చెప్పడం గమనార్హం.

MLC Kavitha Serious Comments On BRS Party9
కేటీఆర్‌పై విరుచుకుపడ్డ కవిత.. నాతో పెట్టుకోవద్దు..

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్‌లో ఉన్న కోవర్టులే తనను ఓడించారని చెప్పుకొచ్చారు. కేసీఆర్‌ ఇంటి ఆడ బిడ్డపైనే పేయిడ్‌ వార్తలు రాయిస్తున్నారు. లేఖ ఎవరు బయటపెట్టారో చెప్పమంటే నాపై దాడి చేస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో కేటీఆర్‌ను టార్గెట్‌ చేసి విమర్శలు చేశారు. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా చేయాల్సిన పనులు చేయాలి.. కేవలం ట్వీట్లకే పరిమితం అయితే ఎలా? అని ప్రశ్నించారు. తనది బీఆర్‌ఎస్‌ పార్టీనే. కొత్త పార్టీలు ఎందుకు?. ఉన్న పార్టీని, కేసీఆర్‌ను కాపాడుకుంటే సరిపోతుంది. లీక్ వీరులను బయట పెట్టండి అంటే గ్రీక్ వీరులు నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ కవిత తాజాగా చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. ఏది ఉన్నా నేను సూటిగానే మాట్లాడతాను. వెన్నుపోటు రాజకీయాలు చేయను. నేను కేసీఆర్‌ లాగే నేను ఏదైనా సూటిగానే మాట్లాడతాను. తిక్క తిక్కగానే ఉంటాను. పార్టీని నడిపించే సత్తా మీకు లేదు.. నాకు నీతులు చెబుతున్నారా?. వరంగల్‌ మీటింగ్‌ సక్సెస్‌ అయ్యిందని చెప్పుకుంటున్న వాళ్లను చూసి జనం నవ్వుకుంటున్నారు. ఏమైనా ఉంటే.. పార్టీ ఫోరమ్‌ లోపల మాట్లాడాలి అన్నారు. నేను బయటే మాట్లాడతాను. తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ సోయితో పరిపాలన జరగట్లేదు అని అన్నారు. నాకు వెన్నుపోటు రాజకీయాలు తెలియదు.. ఏది ఉన్నా నేను ముక్కు సూటిగానే మాట్లాడతాను.ట్వీట్లకే పరిమితం అయితే ఎలా?..అంతర్గత విషయాలపై లేఖ రాస్తే ఎందుకు బయటపెట్టారు. నేను రాసిన లేఖను ఎవరు బయటపెట్టారు. బీఆర్‌ఎస్‌లో నాకు ఒకే నాయకుడు కేసీఆర్‌.. నాకు ఇంకెవరూ నాయకులు లేరు. పార్టీలో ఇంకెవరి నాయకత్వాన్ని నేను అంగీరించను. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా చేయాల్సిన పనులు చేయాలి.. కేవలం ట్వీట్లకే పరిమితం అయితే ఎలా?. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఆయన చేసే కార్యచరణ చేయనివ్వండి. నాది బీఆర్‌ఎస్‌ పార్టీనే. కొత్త పార్టీలు ఎందుకు?. ఉన్న పార్టీని, కేసీఆర్‌ను కాపాడుకుంటే సరిపోతుంది. నేను కాంగ్రెస్‌తో 2013లోనే మాట్లాడాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు మాట్లాడలేదు. కాంగ్రెస్‌ మునిగిపోయే నావ అని సెటైర్లు వేశారు. బీజేపీ వాళ్లు కట్టిన ఆసుపత్రి ఓపెనింగ్‌కి వెళ్ళిన వాళ్ళు బీఆర్‌ఎస్‌ పార్టీలో ఉన్నారని అన్నారు. నేను అసలే మంచి దాన్ని కాదు..డబ్బులు ఇచ్చి నాపై తప్పుడు వార్తలు రాయిస్తున్నారు. నన్ను అరెస్ట్ చేసే సమయంలో కేసీఆర్‌ వద్దకు వెళ్లి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తా అని అడిగితే కేసీఆర్‌ వద్దని చెప్పినట్టు తెలిపారు. పార్టీ చేయలేని పనులను జాగృతి తరఫున నేను చేసి చూపించాను. కేసీఆర్ తప్ప ఇప్పుడు నన్ను విమర్శిస్తున్న వారు ఏం చేశారో చెప్పాలి. నేను ఎప్పుడూ పదవులు అడగలేదు. కేసీఆరే నాకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. పార్టీ నడిపించే సత్తా లేదు.. నాకు నీతులు చెబుతున్నారా అని మండిపడ్డారు. నేను కడుపులో బిడ్డను పెట్టుకుని తెలంగాణ కోసం పోరాటం చేశాను. నేను మంచి దాన్ని కాదు.. నాతో పెట్టుకోవద్దు అంటూ వార్నింగ్‌ ఇచ్చారు. బీఆర్‌ఎస్‌ను బీజేపీలో కలిపే ప్లాన్‌.. అలాగే, పార్టీ చేసే పనులు నేను సగం చేస్తున్నాను. అందుకే తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుంది. కేసీఆర్‌కి కాళేశ్వరం నోటీసులు ఇస్తే.. పార్టీ పరంగా ఏం చేశారు?. తెలంగాణ తల్లి విగ్రహం మారిస్తే.. ఈ బీఆర్‌ఎస్‌ పార్టీ ఏం చేసింది?. అదానీ టీ షర్ట్స్ వేసుకొని హంగామా చేసి వదిలేశారు.పార్టీ కోసం కేసీఆర్‌కు వంద లేఖలైనా రాస్తాను. నేను 25 ఏళ్ల నుంచి కేసీఆర్‌కు లేఖలు రాస్తున్నాను. ప్రతీసారి లేఖలు చూడగానే కేసీఆర్‌ వాటిని చించేస్తారు.. కానీ, ఈసారి ఏమైందో లేఖ బయటకు వచ్చింది. అలాంటి లేఖను ఎందుకు బయట పెట్టారు. నేను జైలులో ఉన్న సమయంలో బీఆర్‌ఎస్‌ను బీజేపీలో కలపాలనే ప్రతిపాదన వచ్చింది. కానీ, నేను బీజేపీలో​ కలపవద్దని చెప్పాను. వందకు 101 శాతం బీఆర్‌ఎస్‌ను బీజేపీలో కలిపే ప్రయత్నం జరుగుతోంది. నేను పార్టీలో ఉంటే బీఆర్‌ఎస్‌.. బీజేపీలో కలిసే అవకాశం ఉండదు. నేను ఉంటే అది కుదరని పని.. అందుకే నన్ను కేసీఆర్‌కు దూరం చేయాలని చూస్తున్నారు. నేను కేసీఆర్‌ నాయకత్వంలోనే పనిచేస్తాను. ఇవాళ తెలంగాణ వ్యతిరేకులు పనిచేస్తున్నారు. అది అడ్డుకునే ప్రయత్నం పార్టీ చేయట్లేదు. కేసీఆర్‌ను ఎప్పుడు కలిసేది ఇప్పుడు చెప్పలేను.. డెడ్‌లైన్‌ అంటూ ఏమీ లేదు’ అని చెప్పుకొచ్చారు.

My husband not driver : Polish woman slams stereotypes faced in India10
గైడో, డ్రైవరో కాదు నా భర్త.. మహిళ అసహనం : బై డిఫాల్ట్‌ భర్తలందరూ డ్రైవర్లేగా!

సాధారణంగా ఒక యువతి, యువకుడు కనిపించగానే వాళ్లిద్దరూ, భార్యాభర్తలనో లేదా లవర్స్ అనో అనేసుకుంటారు చాలామంది. అయితే పోలిష్ మహిళ ఇతను నా భర్త మొర్రో మొత్తుకుంటోంది. అదేంటో తెలుసుకుందాం రండి!పోలెండ్‌ దేశానికి చెందిన గాబ్రియెలా డూడా (Gabriela Duda) ఉత్తర ప్రదేశ్‌కు చెందిన హార్దిక్ వర్మా (Hardik Varma)ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2023 నవంబర్ 29న ఉత్తరప్రదేశ్ లోని ఫతేపూర్ జిల్లాలో హిందూ ఆచారాల ప్రకారం సాంప్రదాయ బద్ధంగా వీరు పెళ్లి చేసుకున్నారు. భారతదేశంలోని పలు ప్రదేశాల్లో, ఇతర దేశాల్లో ప్రయాణం చేస్తూ, భారతీయ సంస్కృతిని తెలుసుకుంటూ , అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకుంటారు. అయితే ఏంటి.. అనుకుంటున్నారా? ఈ పయనంలో తమ కెదురవుతున్న ఒక వింత అనుభవాన్ని గురించి సోషల్‌మీడియాలో ఒక వీడియోను షేర్‌ చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారింది. కంటెంట్‌ క్రియేటర్‌ అయిన గాబ్రియేలా భర్త హార్దిక్ వర్మతో కలిసి టూరిస్టులుగా ఆనందంగా గడుపుతున్న క్షణాలను సోషల్‌ మీడియాలో పంచుకుంటూ ఉంటంది. ఇద్దరూ అనేక ప్రదేశాల్లో పర్యటిస్తున్న క్రమంలో ప్రజలు తన భర్తను తన టూర్ గైడ్ లేదా డ్రైవర్‌గా తరచుగా తప్పుగా భావిస్తుంటారు అంటూ అసహనం వ్యక్తం చేసింది. View this post on Instagram A post shared by Gabriela & Hardik Varma | Travel & Indian Culture (@hardikandgabi) "భారతదేశంలో కొత్త ప్రదేశానికి వచ్చినప్పుడల్లా అత్యంత ఇబ్బందికరమైన క్షణం. ఎప్పుడో ఒకసారి జరిగేదికాదు. ప్రతీ షాపు వాడు, లేదా ఆటో/టాక్సీ డ్రైవర్ హార్దిక్ నా టూర్ గైడ్ అని అనుకుంటారు. అవునబ్బా కొన్నిసార్లు అతను నా నా డ్రైవర్ కూడా.. అయితే ఏంటి’’ ప్రశ్నించింది. ఏ అమ్మాయైనా డ్రైవర్‌ చేతులు పట్టుకుని తిరుగుతుందా? లేదంటే, తన టూర్ గైడ్‌తో వేల ఫోటోలు తీసుకుంటుంది, లిప్ లాప్‌ ఇస్తుంది... ఆ మాత్రం అర్థం చేసుకోలేరా అంటూ చికాకు పడింది. అంతేకాదు తన భర్తతో వీడియోను షేర్‌ చేసింది. ఈ వీడియో నాలుగు లక్షలకు పైగా వ్యూస్‌ సాధించింది. అయితే ఆమె అసహనంపై నెటిజన్లు మిశ్రమంగా స్పందించారు. "గైడ్ అని పిలవడంలో తప్పేముంది’’, ‘‘మీ మోటార్‌ లాగా మీరు మళ్లీ గ్రాండ్‌గా పెళ్లి చేసుకోవాలి’’, నిజం చెప్పాలంటే.. ఆయన అలాగే కనిపిస్తున్నాడు.. నీట్‌గా షేవ్‌ చేసుకుంటే బెటర్‌’’, ‘‘ పెళ్లాం పిల్లలకు, భర్తలందరూ బై డిఫాల్ట్‌ టూర్‌ గైడ్లు, డ్రైవర్లే ఇలా రకరకాల కమెంట్లు, జోక్స్‌ వెల్లువెత్తాయి."నేను నా భార్యపిల్లలతో కలిసి నా స్వస్థలాన్ని సందర్శించినప్పుడు నాకు కూడా అదే జరిగింది. కొంతమంది స్థానికులు నన్ను వారి టూర్ గైడ్ అని అనుకున్నారు" అని మరొక వినియోగదారు వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement