29 నుంచి జాతీయస్థాయి సింపోజియం
కొణిజర్ల : మండల పరిధిలోని తనికెళ్ల సమీపంలో ఉన్న విజయ ఇంజనీరింగ్ కళాశాలలో ఈ నెల 29, 30 తేదీలలో జాతీయ స్థాయి టెక్నికల్ సింపోజియం యంగ్ స్ప్రింగ్స్–2016 నిర్వహిస్తున్నట్లు కళాశాల కరస్పాడెంట్ నెల్లూరి బుచ్చిరామారావు, ప్రిన్సిపాల్ డాక్టర్ పి.ఏ అబ్దుల్ సలీమ్ తెలిపారు. గురువారం కళాశాలలో ఇందుకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 14 రకాల అంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని కళాశాలల విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొంటారని చెప్పారు. వైస్ ప్రిన్సిపాల్ చిన్నయ్య, సీఎస్సీ హె చ్ఓడీ పి.అశోక్‌కుమార్ పాల్గొన్నారు.