Katherine B. Hadda
-
ఫలక్నామా ప్యాలెస్‌లో క్యాథరిన్ హడ్డాకు వీడ్కోలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సులెట్ జనరల్ క్యాథరిన్ హడ్డాకు తెలంగాణ ప్రభుత్వం తరఫున వీడ్కోలు సమావేశాన్ని ఘనంగా ఏర్పాటు చేశారు. నగరంలోని ఫలక్నామా ప్యాలెస్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ వీడ్కోలు సమావేశానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో సహా వందమందికి పైగా ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అందమైన ప్యాలెస్‌లో వీడ్కోలు పలుకుతున్నందుకు సంతోషంగా ఉందంటూ క్యాథరిన్ హడ్డా తన సంతోషాన్ని ట్విటర్లో పంచుకున్నారు. సమావేశానికి తెలంగాణ ప్రభుత్వం తరఫున ముఖ్య అతిథిగా హాజరయిన కేటీఆర్.. ఆమెకు చేనేత చీరను బహుకరించారు. రాష్ట్రానికి ఆమె చేసిన సేవలను కొనియాడారు. తెలంగాణ ఐటీ, పెట్టుబడుల శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ కూడా ఈ విందులో పాల్గొన్నారు. -
గేమ్స్‌తో సామాజిక చైతన్యం
సాక్షి, హైదరాబాద్ : ప్రజా జీవనాన్ని ప్రభావితం చేసేలా, సామాజిక చైతన్యాన్ని పెంచేలా ఆధునిక పద్ధతిలో గేమ్స్ రూపొందించాలని అమెరికన్ కాన్సులేట్ జనరల్ కేథరిన్ హడ్డా అన్నారు. గురువారం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలోని టీహబ్‌లో 4 రోజులపాటు జరగనున్న ‘గేమ్స్ ఫర్ గుడ్’కార్యక్రమాన్ని ఐటీ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్‌తో కలసి ఆమె ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. గేమింగ్ కోసం కార్యక్రమం నిర్వహించడం 30 ఏళ్ల అమెరికన్ కాన్సులేట్ చరిత్రలో ఇదే తొలిసారని వెల్లడించారు. ‘గేమ్స్ ఫర్ గుడ్’మంచి సామాజిక మార్పుకు శ్రీకారం చుట్టాలని ఆశాభావం వ్యక్తం చేశారు. స్మార్ట్ఫోన్లు పెరుగుతున్న దరిమిలా అంతర్జాతీయంగా గేమింగ్‌కు చక్కటి ఆదరణ ఏర్పడిందన్నారు. సామాజిక మార్పుకు ఇవి ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. ప్రపంచాన్ని వేధిస్తోన్న శరణార్థులు, వాతావరణ మార్పులు, మానవ అక్రమ రవాణా, వ్యాధులు తదితర సామాజిక సమస్యలపై ప్రజల్లో చైతన్యం పెంచేలా గేమ్స్ ఉండాలని సూచించారు. వినోదం, సృజనాత్మకతతోపాటు సామాజిక చైతన్యానికి గేమింగ్ రంగం చక్కటి వేదిక కావాలని ఆకాంక్షించారు. ఇరు దేశాల సంస్కృతి, సంబంధాలను పెంపొందించేలా గేమ్‌లు రూపొందించాలని యువ గేమ్ డిజైనర్లకు ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం హైదరాబాద్‌లో జరగడం చాలా సంతోషకరమని, ఇక్కడ అత్యున్నత విద్యాసంస్థలకు తోడు అమెరికాకు చెందిన 130 కంపెనీలు ఉన్నాయని గుర్తు చేశారు. టీ హబ్ అద్భుతాలకు చిరునామాగా.. నూతన ఆవిష్కరణలకు నిలయంగా మారిందని ప్రశంసించారు. భారత సవాళ్లను దృష్టిలో ఉంచుకోండి ‘భారత్ చాలా వైవిధ్యమున్న దేశం. ఇక్కడి జీవనశైలి, ఆచార వ్యవహారాలు, సవాళ్లను దృష్టిలో ఉంచుకుని గేమ్‌లు రూపొందించాలి. భారతీయులు ఇంటిని అత్యంత పరిశుభ్రంగా ఉంచుకుంటారు. కానీ బయటికెళ్లగానే ఆ విషయాన్ని మర్చిపోతారు. ఇక్కడి ప్రభుత్వాలు పారిశుద్ధ్యం కోసం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపడుతున్నాయి. నీటి ఎద్దడి, పర్యావరణంపై చైతన్యం పెంచేలా గేమ్స్ ఉండాలి. గేమింగ్ రంగానికి మంచి భవిష్యత్తు ఉంది. డిజిటల్ రంగంలో హైదరాబాద్ దూసుకుపోతూ.. 20 వేల మందికి ఉపాధి కల్పిస్తోంది. ఇప్పటిదాకా హైదరాబాద్ కంపెనీలు విదేశీ గేమ్‌ల రూపకల్పన కోసం పనిచేశాయి. గత రెండు, మూడేళ్లుగా ఆ పరిస్థితిలో మార్పువచ్చి.. మనవాళ్లే కొత్త పాత్రలు రూపొందిస్తున్నారు. చోటా భీమ్, బాహుబలి పాత్రలకు ప్రాణం పోసి వినూత్న ఆవిష్కరణలకు చిరునామాగా నిలవడమే దీనికి నిదర్శనం. యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్‌లోనూ హైదరాబాద్ ఇప్పటికే తన ఘనతను చాటుకుంది’అని హడ్డా వెల్లడించారు. అంతకుముందు కార్యక్రమంలో గేమింగ్ నిపుణులు శాన్ బుచర్డ్, విజయ్ లక్ష్మణ్, కవితా వేమూరి తదితరులు పాల్గొని ప్రసంగించారు. -
ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం
సాక్షి, అమరావతి: ఏపీ ప్రభుత్వంతో కలసి పని చేయడానికి అమెరికా ప్రభుత్వం సిద్ధంగా ఉందని హైదరాబాద్‌లోని అమెరికా కాన్సుల్ జనరల్ కేథరిన్ బీ హడ్డా తెలిపారు. మంగళవారం సచివాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో కేథరిన్ మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు అభినందనలు తెలిపారు. ఏపీ వారు పెద్దసంఖ్యలో అమెరికాలో ఉన్నారని చెప్పారు. రెండు ప్రభుత్వాల మధ్య సంబంధాలు బలోపేతం కావాలని తాను కోరుకుంటున్నానన్నారు. విశాఖ నగరాన్ని స్మార్ట్ సిటీగా రూపొందించేందుకు అమెరికా సాంకేతిక సహకారాన్ని అందిస్తోందని, భవిష్యత్తులో మరింత సహకారం అందిస్తామని తెలిపారు. మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ న్యూయార్క్ 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించనున్న వేడుకల్లో భాగంగా గుంటూరు జిల్లా అమరావతిలో బౌద్ధుల సంస్కృతిని తెలియజేస్తూ ప్రదర్శనలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. కాగా విశాఖను ఆర్థికంగా, అభివృద్ధి పరంగా తీర్చిదిద్దే విషయంలో తనకు కొన్ని ఆలోచనలు ఉన్నాయని సీఎం వైఎస్ జగన్ చెప్పారు. రాష్ట్రంలో తాను అమలు చేస్తున్న సామాజిక అభివృద్ధి అజెండాను, నవరత్నాల్లో భాగంగా చేపడుతున్న కార్యక్రమాలను అమెరికా కాన్సుల్ జనరల్‌కు వివరించారు. సీఎం వైఎస్ జగన్ ఆలోచనా ధృక్పథం తనను ఎంతో ఆకట్టుకుందని కేథరిన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి పీవీ రమేష్ పాల్గొన్నారు. -
సీఎం జగన్‌ను కలిసిన అమెరికా కాన్సూల్ జనరల్
సాక్షి, అమరావతి: అమెరికా కాన్సూల్ జనరల్ క్యాథరీన్ బీ హడ్డా మంగళవారం ఉదయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. అమరావతిలోని సచివాలయంలో వీరి భేటీ జరిగింది. ఈ సందర్భంగా పలు అంశాలపై ఇరువురు చర్చించుకున్నట్టు తెలుస్తోంది. లోక్‌సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి హైదరాబాద్‌లోని అమెరికా కాన్సూల్ జనరల్ కాథరీన్ హడ్డా ట్విటర్లో అభినందనలు తెలిపిన సంగతి తెలిసిందే. ‘‘ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించిన వైఎస్ జగన్‌కు అభినందనలు. భవిష్యత్తులో అమెరికా, ఆంధ్రప్రదేశ్ మధ్య మంచి సంబంధాలు కొనసాగాలని ఆశిస్తున్నా’’ అని ఆమె ట్వీట్ చేశారు. గతంలో వైఎస్ జగన్‌తో దిగిన ఫోటోను ఆమె ట్విటర్లో ఈ సందర్భంగా షేర్ చేశారు. (చదవండి: వైఎస్ జగన్‌కు యూఎస్ కాన్సులేట్ అభినందనలు) -
వైఎస్ జగన్‌కు యూఎస్ కాన్సులేట్ అభినందనలు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి అభినందనలు వెల్లువెత్తుత్తున్నాయి. రాష్ట్రంలోని ప్రముఖులతో పాటు దేశ వ్యాప్తంగా ప్రధానితో సహా పలువురు జాతీయ నేతలు కూడా వైఎస్ జగన్‌ను అభినందించిన విషయం తెలిసిందే. తాజాగా అమెరికా కాన్సులేట్ జనరల్ కాథరీన్ హడ్డా వైఎస్ జగన్‌కు అభినందనలు తెలిపారు. ‘‘ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించిన వైఎస్ జగన్‌కు అభినందనలు. భవిష్యత్తులో అమెరికా, ఆంధ్రప్రదేశ్ మధ్య మంచి సంబంధాలు కొనసాగాలని ఆశిస్తున్నా’’ అని ట్వీట్ చేశారు. గతంలో వైఎస్ జగన్‌తో దిగిన ఫోటోను ఆమె ట్విటర్లో షేర్ చేశారు. కాగా నిన్న వెలువడిన ఏపీ ఎన్నికల ఫలితాల్లో వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్సీపీ అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. Congratulations on your victory, @ysjagan! We at @USAndHyderabad look forward to working with you to further build U.S.-AP ties. pic.twitter.com/AjX5PfJACc — Katherine Hadda (@USCGHyderabad) 23 May 2019 -
వైఎస్ జగన్‌తో అమెరికన్ కాన్సూల్ జనరల్ భేటీ
-
భారత్‌తో సంబంధం మరింత బలోపేతం
యూఎస్ కాన్సుల్ జనరల్ కేథరిన్ హడ్డా సాక్షి, హైదరాబాద్: తమ దేశానికి కొత్త అధ్యక్షుడి ఎన్నిక తర్వాత కూడా అమెరికా-ఇండియాల మధ్య సంబంధాల బలోపేతానికి చర్యలు యథాతథంగా కొనసాగుతాయని హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సుల్ జనరల్ కేథరిన్ హడ్డా పేర్కొన్నారు. వాతావరణ మార్పులు, ఆర్థిక, రక్షణ కొనుగోళ్లు తదితర రంగాల్లో భారత దేశంలో భాగస్వామ్యాన్ని అమెరికా కోరుకుంటోందన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల పరిశీలన కోసం హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం బుధవారం నగరంలోని ఓ హోటల్లో అధికార, వ్యాపార రంగ ప్రముఖులకు అల్పాహార విందు ఇచ్చింది. ఈ కార్యాక్రమంలో కేథరిన్ హడ్డా మాట్లాడారు. వచ్చే ఏడాది ఇరు దేశాల మధ్య పర్యాటక అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని, వీసాల జారీని సరళీకృతం చేస్తామన్నారు. అమెరికాలో 1.2 లక్షల మంది భారత విద్యార్థులు నివాసముంటున్నారని తెలిపారు. అర్హులైన విద్యార్థులు సైతం వీసా కోసం తప్పుడు ధ్రువ పత్రాలు సమర్పిస్తుండటంతోనే సమస్యలు వస్తున్నాయన్నారు.