Aanand L Rai
-
ధనుష్‌కి జోడీగా..?
‘రాంఝాణా, అత్రంగి రే’ చిత్రాల తర్వాత హీరో ధనుష్, దర్శకుడు ఆనంద్. ఎల్. రాయ్ కాంబినేషన్లో రూపొందనున్న తాజా చిత్రం ‘తేరే ఇష్క్ మే’. ఈ సినిమా చిత్రీకరణను అక్టోబరులో ప్రారంభించడానికి యూనిట్ సన్నాహాలు చేస్తోందని సమాచారం. ఈ నేపథ్యంలో నటీనటుల ఎంపికపై ఆనంద్ దృష్టి పెట్టారట.హీరోయిన్ పాత్ర కోసం కృతీ సనన్‌ను సంప్రదించారని టాక్. త్వరలోనే ఆమె పేరుని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని బాలీవుడ్ భోగట్టా. కాగా ఈ సినిమాలోని హీరోయిన్ పాత్ర కోసం ఇప్పటికే కియారా అద్వానీ, త్రిప్తి దిమ్రీ వంటి వార్ల పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా కృతీ సనన్ పేరు వినిపిస్తోంది. మరి... కృతీ సనన్ ఖరారు అవుతారా? లేక సీన్లోకి వేరే హీరోయిన్ వస్తారా? అనేది చూడాలి. -
హీరోహీరోయిన్లకు మధ్య 28 ఏళ్ల వ్యత్యాసం! స్పందించిన డైరెక్టర్
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్, కోలీవుడ్ స్టార్ ధనుష్, అందాల తార సారా అలీఖాన్ కలిసి నటించిన చిత్రం ఆత్రంగి రే. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ రిలీజవగా నటీనటుల వయసు తేడాపై విమర్శలు వెల్లువెత్తాయి. నిజానికి 2018లో సారా ఇండస్ట్రీలో అడుగుపెట్టేనాటికి ఆమె వయసు 26. ధనుష్ 2002లో నటనారంగంలో ఎంట్రీ ఇచ్చే సమయానికి అతడి వయసు 38 ఏళ్లు. 1991లో కెరీర్ ఆరంభించిన అక్షయ్ కుమార్ ఈ సెప్టెంబర్‌లో 54వ పుట్టినరోజు జరుపుకున్నాడు. తనకంటే 25-28 ఏళ్ల వ్యత్యాసం ఉన్న హీరోల సరసన సారా నటించడంపై నెటిజన్లు సెటైర్లు విసురుతున్నారు. తాజాగా దీనిపై ఆత్రంగి రే డైరెక్టర్ ఆనంద్ ఎల్ రాయ్ స్పందించాడు. 'ఆత్రంగి అంటే విచిత్రం అని అర్థం. సినిమా తీయడంలో దర్శకుడు ఎంత ఓపికగా ఉంటాడో, ఆ నటీనటులను ఎందుకు ఎంపిక చేసుకున్నాడో తెలుసుకోవడానికి ప్రేక్షకులు వెయిట్ చేస్తుంటారని ఫిల్మ్ మేకర్ భావిస్తాడు. మనుషులను అంచనా వేయడం మనకు అలవాటు. ప్రజలు రెండు గంటలపాటు సినిమా చూసి ఆ తర్వాత స్పందించాలని కోరుకుంటున్నాను 'అని చెప్పుకొచ్చాడు. ఈ కామెంట్లు చూసి బాధపడటం లేదన్న ఆనంద్ తన జయాపజాయల నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉన్నానని పేర్కొన్నాడు. కాగా ఆనంద్ తను వెడ్స్ మను: రిటర్న్స్, రంజానా వంటి హిట్ చిత్రాలను అందించాడు. షారుఖ్ ఖాన్, అనుష్క శర్మ, కత్రినా కైఫ్‌తో కలిసి తీసిన జీరో డిజాస్టర్‌గా నిలిచింది. ఆత్రంగి రే సినిమా డిసెంబర్ 24న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో రిలీజవుతోంది. View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95) -
రూ.25 కోట్ల డూప్లెక్స్ ఇల్లు కొన్న స్టార్ డైరెక్టర్
ముంబై: సాధారణంగా హీరోలకే పారితోషికం ఎక్కువగా ఉంటుందనుకుంటాం. కానీ కొందరు స్టార్ డైరెక్టలకు వారికంటే ఎక్కువ రెమ్యునరేషన్ ఉంటుంది. ఈ లిస్ట్‌లో బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ ముందు వరుసలో ఉంటాడు. 'తను వెడ్స్ మను' వంటి బాక్సాఫీస్ హిట్ చిత్రాలను అందించిన ఆయన తాజాగా ముంబైలో ఓ డూప్లెక్స్‌ను కొనుగోలు చేశారట. తన భార్య యోగితతో కలిసి ఈ భవనాన్ని తన సొంతం చేసుకున్నారట. ఇది బాలీవుడ్ తార సన్నీలియోన్ ఇంటి సమీపంలో ఉందని సమాచారం. 5,761 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న ఈ విలాసవంతమైన డూప్లెక్స్ ఖరీదు అక్షరాలా రూ.25.3 కోట్లుగా ఉంది. గత నెల మార్చి 8న స్టాంప్ డ్యూటీ కింద రూ.75.9 లక్షలు సైతం చెల్లించాడట. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఈ భవనంలో 34 అపార్ట్మెంట్లు ఉంటాయని తెలుస్తోంది. ఇదిలా వుంటే ఆనంద్ ఎల్ రాయ్ ప్రస్తుతం అక్షయ్ కుమార్, ధనుష్, సారా అలీఖాన్‌లతో 'ఆత్రంగిరే' సినిమా తీస్తున్నాడు. ఈ మధ్యే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 6న థియేటర్లలో విడుదల కానుంది. రెహమాన్ సంగీతం అందించిన ఈ సినిమాలో ధనుష్ స్వయంగా ఓ పాట కూడా పాడాడు. చదవండి: సుకుమార్-రౌడీ సినిమాపై రూమర్లు.. వాస్తవమేంటంటే! మళ్లీ మాల్దీవుల్లో వాలిపోయిన బాలీవుడ్ కపుల్స్ దర్శకుడికి కరోనా: టెన్షన్లో ధనుష్ ఫ్యాన్స్ -
జీరో కోసం కలిశారు
మూడేళ్ల క్రితం హిందీలో రిలీజైన ‘తను వెడ్స్ మను: రిటర్న్స్’ చిత్రంలో మాధవన్ హీరోగా నటించారు. ఆ చిత్రానికి ఆనంద్ ఎల్. రాయ్ దర్శకుడు. ఇప్పుడు మళ్లీ వీళ్లు కలిశారు. ఆల్రెడీ ‘తను వెడ్స్ మను’ చిత్రానికి ‘తను వెడ్స్ మను: రిటర్న్స్’ చిత్రం సీక్వెల్. ఇప్పుడు మళ్లీ..‘తను వెడ్స్ మను’ ఫ్రాంచైజీలో మరో సీక్వెల్ రాబోతుందా? అంటే.. కానే కాదు. ఆనంద్–మాధవన్ కలిసింది ‘జీరో’ కోసం. షారుఖ్ ఖాన్, అనుష్కా శర్మ, కత్రినా కైఫ్ ముఖ్య తారలుగా ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘జీరో’. ప్రజెంట్ యూఎస్‌లో షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర చేస్తున్నారు మాధవన్. ‘‘తను వెడ్స్ మను: రిటర్న్స్’ మూవీ వచ్చి మూడేళ్లు అయ్యింది. మళ్లీ మ్యాడీ (మాధవన్)తో సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది’’ అని పేర్కొన్నారు దర్శకుడు ఆనంద్. ‘జీరో’ ఈ ఏడాది డిసెంబర్లో రిలీజ్ కానుంది. -
'ఆ హీరోయిన్ కష్టాలు ఎవరూ పడలేదు'
న్యూఢిల్లీ: బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఏదో ఓ వివాదంలో చిక్కుకోవడం ఆమెకు అలవాటు. అయితేనేం, ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ స్థాయికి ఎదగడమే కాదు ఒక్క జాతీయఅవార్డు అంటూ ఎంతోమంతి ఎదురుచూసే ఆ అవార్డును మూడుసార్లు కొల్లగొట్టేసింది. ఈ విషయాలను బట్టి ఆ హీరోయిన్ మరెవరో కాదు కంగనా రనౌత్ అని తేలికగా చెప్పేవచ్చు. ఆమె ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకుందని డైరెక్టర్ ఆనంద్ ఎల్ రాయ్ పేర్కొన్నారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన 'తను వెడ్స్ మను', 'తను వెడ్స్ మను రిటర్స్స్' మూవీలు కంగనాకు చాలా పేరు తీసుకొచ్చాయి. ఆ హీరోయిన్ లో ఆయన గమనించిన విషయాలను పేర్కొన్నాడు. గత ఐదారేళ్లలో ఆమె ఎంతో పరిణతి చెందిందని, ఇతర హీరోయిన్ ఎవరైనా ఈ స్థాయిలో పైకి ఎదగలేకపోయేవారని చెప్పుకొచ్చాడు. కంగనాపై హీరో హృతిక్ రోషన్ వ్యాఖ్యలు చేయడంలో కూడా సీరియస్ గా స్పందించాడు. ఒకరి వ్యక్తిగత జీవితంపై మరొకరు కామెంట్లు చేయడం ఏంటని హృతిక్ ను ఉద్దేశించి మాట్లాడాడు. ఈ వివాదంపై తాను కంగనాతో ఎప్పుడూ టచ్ లో ఉండేవాడినని కానీ సలహాలు ఇవ్వలేదన్నాడు. కంగనా చాలా తెలివైన హీరోయిన్ అని, స్వతహాగా తాను నిర్ణయాలు తీసుకోగలదని డైరెక్టర్ ఆనంద్ రాయ్ అభిప్రాయపడ్డాడు. ఇద్దరు సెలబ్రిటీల మధ్య మాత్రమే కాదు సాధారణ వ్యక్తుల మధ్య కూడా వివాదాలు తలెత్తుతాయని, అయితే సమస్యలను ఎదుర్కోవాలని... వాటి నుంచి తప్పించుకోలేమని కంగనా ఈ విషయాన్ని డీల్ చేస్తుందని ఆశాభావం వ్యక్తంచేశాడు.