
‘రాంఝాణా, అత్రంగి రే’ చిత్రాల తర్వాత హీరో ధనుష్, దర్శకుడు ఆనంద్. ఎల్. రాయ్ కాంబినేషన్‌లో రూపొందనున్న తాజా చిత్రం ‘తేరే ఇష్క్ మే’. ఈ సినిమా చిత్రీకరణను అక్టోబరులో ప్రారంభించడానికి యూనిట్ సన్నాహాలు చేస్తోందని సమాచారం. ఈ నేపథ్యంలో నటీనటుల ఎంపికపై ఆనంద్ దృష్టి పెట్టారట.
హీరోయిన్ పాత్ర కోసం కృతీ సనన్‌ను సంప్రదించారని టాక్. త్వరలోనే ఆమె పేరుని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని బాలీవుడ్ భోగట్టా. కాగా ఈ సినిమాలోని హీరోయిన్ పాత్ర కోసం ఇప్పటికే కియారా అద్వానీ, త్రిప్తి దిమ్రీ వంటి వార్ల పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా కృతీ సనన్ పేరు వినిపిస్తోంది. మరి... కృతీ సనన్ ఖరారు అవుతారా? లేక సీన్లోకి వేరే హీరోయిన్ వస్తారా? అనేది చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment