AARAA Mastan
-
EVM కౌంటింగ్లో ప్రతి రౌండు 20 నుంచి 25 నిమిషాల సమయం
-
బీజేపీ అందుకే వెనకపడింది
-
ఏపీలో వైఎస్ఆర్ సీపీదే విజయం..
-
జగన్ అనే నేను..
-
తెలంగాణ ఎన్నికలు ఆరా సంస్థ ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇవే
-
ప్రజా యుద్ధ నౌక ఆగిపోయింది..
ప్రజా యుద్ధ నౌక ఆగిపోయింది నిత్యం ప్రజల కోసం, పీడిత - తాడిత వర్గాల కోసం పాటుపడిన గుమ్మడి విఠల్ రావు ఉరఫ్ గద్దర్ గారు ఈరోజు శివైక్యం చెందారు. తాను నమ్మిన సిద్ధాంతం వేలాది మందిని, ఉద్యమాల వైపు నడిపించినా, చివర్లో తాను నమ్మిన సిద్ధాంతం బుల్లెట్ కంటే, బ్యాలెట్ మాత్రమే ప్రజల తలరాతలను మార్చుతుందని... నమ్మిన అతి అరుదైన ఉద్యమ నాయకుడు. తన కమ్యూనిస్ట్ సిద్ధాంతాలకు తీవ్ర వ్యతిరేకమైన…దేవతారాధనను, తన జీవిత చరమాంకంలో... నమ్మిన, కనపడని ఆధ్యాత్మికవాది శ్రీ గద్దర్ గారు. గడిచిన 15 సంవత్సరాల పరిచయంలో ప్రతి నిత్యం నా శ్రేయస్సును కాంక్షించారు. తన కుమారుడు సూర్యం ద్వారా, నేను ఆ కుటుంబానికి దగ్గరయ్యాను. అనేక సందర్భాల్లో శ్రీ గద్దర్ గారిని కలుస్తూ, అనేక విషయాలపై చర్చిస్తూ.. “అరే నాన్న” అని పిలిచే వారు. తన జీవితంలో అత్యంత కీలకమైన దశలో కుమారుడిని రాజకీయ రంగ ప్రవేశం చేయించాలనుకున్నప్పుడు... తనను నమ్ముకున్న, తనతో ఉద్యమ సహచర్యం చేసిన అనేక మంది వ్యక్తులను ఇంటికి పిలిచి వారితో ప్రజాస్వామ్యం మీద, పార్టీ రాజకీయాలపైనా, తన కుమారుడి భవిష్యత్తు పై నాతో గంటల పాటు చర్చించి, చివరకు తన కుమారుడిని రాజకీయరంగ ప్రవేశం చేయించిన వ్యక్తి శ్రీ గద్దర్. చివరిసారిగా కాంగ్రెస్ శాసనసభాపక్షనాయకుడు మల్లు భట్టివిక్రమార్కతో కలిసి సంగీత దర్శకుడు మణిశర్మ గారి ఆఫీసులో వారిని కలిశాను. అప్పుడు కూడా ఆయన సామాజిక, రాజకీయ అంశాలు ఎన్నో చర్చించారు. వెన్నులో బుల్లెట్ తనను నిత్యం ఇబ్బందిపెడుతున్నా, హైదరాబాద్ నగరం దాటి రాలేని పరిస్థితుల్లో నా తమ్ముడి వివాహం కోసం ఒకరోజు ముందుగానే “మే నెల” ఎండల్లో హైదరాబాద్ నుంచి గుంటూరు వచ్చి రెండ్రోజులుపాటు మా ఆతిధ్యం స్వీకరించి, మా ఇంట్లో శుభకార్యానికి హాజరైన వ్యక్తి ఈ రోజు లేకపోవడం నన్నెంతో వేదనకు గురిచేస్తోంది. కానీ పుట్టిన వారికి మరణం తప్పదు… శ్రీ గద్దర్ గారు, ఏ లోకంలో ఉన్న వారి ఆత్మ శాంతించాలని … తిరిగి పీడిత, తాడిత జనుల కోసం, ఇదే గడ్డపై జన్మించాలని మనసారా కోరుకుంటా... -మీ ఆరా మస్తాన్, సెఫాలజిస్ట్ -
AARAA Mastan Survey Report: తెలంగాణ ఎన్నికలపై ‘ఆరా’ రిపోర్టు.. స్పందించిన కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్కు వస్తున్న ఆదరణ తట్టుకోలేక టీఆర్ఎస్, బీజేపీ కలిసి ‘ఆరా’సంస్థతో సర్వే రిపోర్టు ఇప్పించారని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఆరోపించారు. గాంధీభవన్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాజకీయ ఎత్తుగడల్లో భాగంగా సర్వే సంస్థ రిపోర్టు మార్చిందన్నారు. ఆరా సంస్థ చైర్మన్ తనతో వస్తే నిరూపిస్తానని సవాల్ చేశారు. రాష్ట్రంలో బీజేపీకి బలం లేదని, టీఆర్ఎస్, బీజేపీలను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. తమ అంతర్గత సర్వే ప్రకారం కాంగ్రెస్ 90 నుంచి 99 సీట్లు గెలుస్తుందని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి చెప్పారని వెల్లడించారు. అయినా కాంగ్రెస్ కేడర్ ఇలాంటి సర్వేలను నమ్మదని, వచ్చే ఎన్నికల్లో తమ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఆయన చెప్పిన వివరాలు అబద్ధం మరోవైపు కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై ‘ఆరా’పోల్ స్ట్రాటజీస్ సంస్థ అధినేత ఆరా మస్తాన్ స్పందించారు. తమ సంస్థ సర్వే పేరుతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ప్రకటించిన వివరాలు అబద్ధమని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికిప్పుడు తెలంగాణ శాసనసభకు ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్ 38.88 శాతం ఓట్లతో మొదటి స్థానంలో ఉంటుందని తెలిపారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 46.87 శాతంఓట్లతో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్కు 2019 పార్లమెంటు ఎన్నికల నాటికి ఓట్ల శాతం 41.71కి తగ్గిందని, ఇప్పుడు ఎన్నికలు జరిగితే 38.88 శాతానికి పడిపోయినా, అత్యధిక శాతం ప్రజల మద్దతున్న పార్టీగా నిలుస్తుందని చెప్పారు. కాంగ్రెస్కు 2018 అసెంబ్లీ ఎన్నికల తరువాత జరిగిన ప్రతి ఎన్నికలోనూఓట్ల శాతం తగ్గుతూ వచ్చిందని, ఇప్పుడు ఎన్నికలు జరిగితే కేవలం 23.71 శాతం ఓట్లు మాత్రమే లభిస్తాయని తమ సర్వేలో తేలినట్లు చెప్పారు. 2018 అసెంబ్లీ ఎన్నికల తరువాత జరిగిన పార్లమెంటు ఎన్నికల నుంచి పుంజుకుంటూ వచ్చిన బీజేపీకి 30.48 శాతం ఓట్లు లభిస్తాయన్నారు. ఇతరులకు 6.91 శాతం ఓట్లు దక్కుతాయని తెలిపారు. ప్రతి మూడు నెలలకోసారి 119 నియోజకవర్గాల్లోని మూడో వంతు నియోజకవర్గాల్లో 2021 నవంబర్, ఈ ఏడాది మార్చి, ప్రస్తుత నెలలో సర్వేలు నిర్వహించినట్లు తెలిపారు. -
టీఆర్ఎస్ పడిపోయి.. మా గ్రాఫ్ పెరుగుతోంది
-
AARAA Mastan: తెలంగాణ ఎన్నికలపై సర్వే ఫలితాలు.. స్పందించిన బండి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలన, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ చేస్తున్న పోరాటాలను ప్రజలు నమ్ముతున్నారని, అందుకే బీజేపీ గ్రాఫ్ పెరుగుతోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఆరు శాతం నుంచి 30 శాతానికి బీజేపీ ఓట్ల శాతం పెరుగుదల మామూలు విషయం కాదన్నారు. బుధవారం కోరుట్లకు చెందిన కొందరు పార్టీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఓప్రైవేట్ సంస్థ సర్వే నివేదికను మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా.. ‘బీజేపీ గ్రాఫ్ పెరిగితే టీఆర్ఎస్ గ్రాఫ్ తగ్గిపోయింది. దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజూరాబాద్ ఎన్నికల్లో గెలిచాం. మూడేళ్లుగా బీజేపీ గ్రాఫ్ పెరుగుతూనే ఉంది. ప్రజలు బీజేపీని విశ్వసిస్తున్నారు. మరో 8 శాతం ఓట్లను పెంచుకోవడం బీజేపీకి కష్టమే కాదు. ప్రజలు మా పోరాటాలను గమనిస్తున్నారు’అని అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన వ్యాపారవేత్త మహిపాల్ రెడ్డి, అలాగే లోక్సత్తా సహా ఇతర పార్టీలకు చెందిన పలువురు కార్యకర్తలు బీజేపీలో చేరారు. ఇకనైనా కేసీఆర్ మొద్దు నిద్ర వీడాలి.. సీఎం కేసీఆర్ ఇకనైనా మొద్దు నిద్ర వీడి, ప్రజలను ఆదుకోవాలని సంజయ్ డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో కేసీఆర్ ఇచ్చిన రుణమాఫీ హామీ నెరవేరకపోవడంతో రైతులకు బ్యాంకులు కొత్తగా రుణాలివ్వడం లేదన్నారు. ఇచ్చిన హామీ మేరకు రూ.లక్ష రుణమాఫీని వెంటనే అమలు చేయడంతోపాటు తక్షణమే బ్యాంకర్లతో సమావేశం నిర్వహించి కొత్తగా రుణాలిచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.