aarogyamitra
-
మీ చలవతో ఉచితంగా నాణ్యమైన వైద్యం
సాక్షి, అమరావతి: వైఎస్సార్ ఆరోగ్య శ్రీతో ఉచితంగా వైద్య చికిత్సలు అందిస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి కలకాలం సీఎంగా ఉండాలని ఆ పథకం లబ్ధిదారులు ఆకాంక్షించారు. వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ వర్తింప చేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి మంగళవారం ప్రారంభించిన సందర్భంగా పలువురు లబ్ధిదారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయనతో మాట్లాడారు. ఆ వివరాలు వారి మాటల్లోనే.. ఏడుసార్లు కీమో థెరపీ ఉచితంగా చేశారు కొంతకాలంగా నాకు ఆరోగ్యం బాగోలేకపోతే ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేయించుకునేందుకు ఆరోగ్య మిత్రను కలిశాను. ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి ఉచితంగా పరీక్షలు చేయించుకున్నాను. క్యాన్సర్ అని తేలింది. ఏడు దపాలుగా కీమో థెరపీ ఉచితంగా చేశారు. ఉచితంగా ఆపరేషన్ కూడా చేశారు. తర్వాత ఆరోగ్య ఆసరా కింద రూ.10 వేలు ఇచ్చారు. మీ మేలు మరచిపోము. – లక్ష్మీనారాయణ, గోరంట్ల గ్రామం, గుంటూరు జిల్లా మీరు చల్లగా ఉండాలి నాకు గర్భసంచిలో గడ్డ వుందని వైద్యులు చెప్పారు. ప్రైవేటు ఆసుపత్రికి వెళితే రూ.50 వేలు అడిగారు. అంత డబ్బు ఇచ్చుకునే శక్తి నాకు లేదు. కడప ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చాను. ఇక్కడ వైద్యులు నాకు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా ఆపరేషన్ చేశారు. తర్వాత ఆరోగ్య ఆసరా కింద ఆదుకున్నారు. చాలా సంతోషంగా ఉంది. మీరు చల్లగా ఉండాలి. – రమాదేవి, చక్రాయిపేట మండలం, వైఎస్సార్ కడప జిల్లా ధైర్యంగా ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లాం నాది మారుమూల గ్రామం. మా పాప వయస్సు నాలుగేళ్లు. ఆడుతూ కింద పడిపోయింది. వైద్యులకు చూపిస్తే వెంటనే ఆపరేషన్ చేయాలన్నారు. రూ.50 వేలు అవుతుందని చెప్పారు. ఆరోగ్యశ్రీ ఉండటంతో ధైర్యంగా ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లాం. వెంటనే జాయిన్ చేసుకుని, ఉచితంగా ఆపరేషన్‌కు ఏర్పాట్లు చేశారు. మా లాంటి పేదలకు ఈ పథకం ఓ వరం. మీ పేరు చెప్పుకుని మేము పెద్ద ఆస్పత్రులకు వెళ్లగలుగుతున్నాం. – మీసాల కృష్ణ, కరకవలస, జలుమూరు మండలం,శ్రీకాకుళం జిల్లా -
ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో ఆరోగ్య మిత్రలు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 670 ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో ఆరోగ్య మిత్రలను వెంటనే నియమించాలని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని సోమవారం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు రూ.1.34 కోట్లు విడుదల చేస్తూ మార్గదర్శకాలను జారీ చేశారు. అవి.. ► ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల్లో హెల్ప్ డెసు్కలు సత్వరమే ఏర్పాటు చేయాలి. ► మొత్తం ఎంపేనల్డ్ ఆస్పత్రుల్లో హెల్ప్ డెస్కులను ఏర్పాటు చేసి రోగులకు వైద్య సహాయం అందించడమే ఆరోగ్య మిత్రల లక్ష్యం. వైద్యం కోసం వచ్చే రోగులకు అవసరం మేరకు అంబులెన్స్ సౌకర్యం కల్పించడం కూడా వీరి బాధ్యతే. ► రోగులను అవసరమైతే వేరే హాస్పిటల్‌కు పంపించే బాధ్యత కూడా ఆరోగ్యమిత్రలే తీసుకోవాలి. ► ప్రతి ఆస్పత్రిలో రోజంతా వీరు సేవలు అందించాలి. దీనికి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ జీవో జారీ చేయాలి. ► ప్రతి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రిలో హెల్ప్ డెస్క్ ఏర్పాటుకు రూ.20 వేలు మంజూరు. ► అన్ని జిల్లాల కలెక్టర్ల పర్యవేక్షణలో జిల్లాల జాయింట్ కలెక్టర్లు, జిల్లా పర్చేజ్ కమిటీల ద్వారా టెండర్లను పిలిచి హెల్ప్ డెసు్కలు ఏర్పాటు చేయాలి. ► ప్రతి హెల్ప్ డెస్క్ వెనుక ఆరోగ్యశ్రీ పోస్టర్ పూర్తి వివరాలతో ఉండాలి. ► రోగులు, ఆస్పత్రుల నుంచి ఆరోగ్య మిత్రలు లంచాలు ఆశించకుండా ఉండాలని సీఎం స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. ► ప్రతి ఆరోగ్య మిత్ర రోజూ ఆస్పత్రుల్లో వైద్య సదుపాయాలు, వైద్యులు, మందుల అందుబాటు, వైద్య సేవలపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి నాలుగు అంశాలతో నివేదిక ఇవ్వాలి. ► ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రిలో ఆరోగ్య మిత్రలు, హెల్ప్ డెసు్కల ద్వారా సేవలు అందేలా జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు పర్యవేక్షించాలి. -
లక్ష్య సాధనకు కృషి చేయాలి
కలెక్టర్ అరుణ్‌కుమార్ కాకినాడ సిటీ : ఆరోగ్యమిత్రలు ఇచ్చిన లక్ష్య సాధనకు కృషి చేయాలని, లక్ష్యం సాధించని వారిపై చర్యలు ఉంటాయని కలెక్టర్ అరుణ్‌కుమార్ హెచ్చరించారు. గురువారం కలెక్టరేట్ విధానగౌతమి సమావేశ హాలులో ఆరోగ్య రక్ష కార్యక్రమంపై కార్పొరేట్ ఆసుపత్రుల వైద్యులు, ఆరోగ్యమిత్రలతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఏప్రిల్ 7వ తేదీన ఆరోగ్య రక్ష పథకం ప్రారంభిస్తోందని దీనిని అందరూ వినియోగించుకునేలా విస్తృత అవగాహన కల్పించాలన్నారు. ఏప్రిల్ 6వ తేదీలోపు ఈ పథకంలో సభ్యులుగా చేరవచ్చునని, ఇది పూర్తిగా ప్రభుత్వం నిర్వహించే ఆరోగ్య పథకమైనందున దీనిని అమలు చేయాల్సిన బాధ్యత ఆరోగ్యమిత్రలపై ఉందన్నారు. డోర్ టూ డోర్ క్యాంపైన్ నిర్వహించి అర్హులైన కుటుంబాలు నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. సంవత్సరానికి కుటుంబంలోని పిల్లల నుంచి పెద్దల వరకు ఒక్కొక్కరికి రూ.1,200 చొప్పున చెల్లించి హెల్త్‌కార్డు పొందాలన్నారు. ఈ పథకం ద్వారా 410 నెట్వర్క్ ఆసుపత్రుల్లో వైద్య చికిత్స చేయించుకోవచ్చునన్నారు. 1044 వ్యాధులకు సెమీ ప్రైవేట్వార్డు (ఏసీ)లో వైద్యం అందిస్తారన్నారు. హెల్త్‌కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ సంవత్సరానికి రూ.2లక్షల వరకు వైద్యసహాయం పొందవచ్చునన్నారు. ఈ సమావేశంలో ఎన్టీఆర్ వైద్యసేవ జిల్లా కో–ఆర్డినేటర్ డాక్టర్ కె.రాజు, డీఎంఅండ్‌హెచ్‌ఓ కె.చంద్రయ్య, డీసీహెచ్ఎస్ డాక్టర్ రమేష్‌కిషోర్ పాల్గొన్నారు.