ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో ఆరోగ్య మిత్రలు | Aarogya Mitras In Aarogyasri Hospitals Says Alla Nani | Sakshi
Sakshi News home page

ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో ఆరోగ్య మిత్రలు

Published Tue, Oct 27 2020 3:26 AM | Last Updated on Tue, Oct 27 2020 3:26 AM

Aarogya Mitras In Aarogyasri Hospitals Says Alla Nani - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 670 ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో ఆరోగ్య మిత్రలను వెంటనే నియమించాలని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని సోమవారం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు రూ.1.34 కోట్లు విడుదల చేస్తూ మార్గదర్శకాలను జారీ చేశారు. అవి.. 

► ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో హెల్ప్‌ డెసు్కలు సత్వరమే ఏర్పాటు చేయాలి. 
► మొత్తం ఎంపేనల్డ్‌ ఆస్పత్రుల్లో హెల్ప్‌ డెస్కులను ఏర్పాటు చేసి రోగులకు వైద్య సహాయం అందించడమే ఆరోగ్య మిత్రల లక్ష్యం. వైద్యం కోసం వచ్చే రోగులకు అవసరం మేరకు అంబులెన్స్‌ సౌకర్యం కల్పించడం కూడా వీరి బాధ్యతే. 
► రోగులను అవసరమైతే వేరే హాస్పిటల్‌కు పంపించే బాధ్యత కూడా ఆరోగ్యమిత్రలే తీసుకోవాలి. 
► ప్రతి ఆస్పత్రిలో రోజంతా వీరు సేవలు అందించాలి. దీనికి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ జీవో జారీ చేయాలి. 
► ప్రతి ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రిలో హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటుకు రూ.20 వేలు మంజూరు. 
► అన్ని జిల్లాల కలెక్టర్ల పర్యవేక్షణలో జిల్లాల జాయింట్‌ కలెక్టర్లు, జిల్లా పర్చేజ్‌ కమిటీల ద్వారా టెండర్లను పిలిచి హెల్ప్‌ డెసు్కలు ఏర్పాటు చేయాలి. 
► ప్రతి హెల్ప్‌ డెస్క్‌ వెనుక ఆరోగ్యశ్రీ పోస్టర్‌ పూర్తి వివరాలతో ఉండాలి. 
► రోగులు, ఆస్పత్రుల నుంచి ఆరోగ్య మిత్రలు లంచాలు ఆశించకుండా ఉండాలని సీఎం స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. 
► ప్రతి ఆరోగ్య మిత్ర రోజూ ఆస్పత్రుల్లో వైద్య సదుపాయాలు, వైద్యులు, మందుల అందుబాటు, వైద్య సేవలపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి నాలుగు అంశాలతో నివేదిక ఇవ్వాలి. 
► ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రిలో ఆరోగ్య మిత్రలు, హెల్ప్‌ డెసు్కల ద్వారా సేవలు అందేలా జిల్లాల కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు పర్యవేక్షించాలి.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement