abdul bari siddiqui
-
‘ఇండియాలో పరిస్థితులు బాగాలేవు’.. ఆర్జేడీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
పాట్నా: రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) సీనియర్ నాయకుడు, బిహార్ మాజీ మంత్రి అబ్దుల్ బారీ సిద్దిఖీ తాజాగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. భారత్‌లో పరిస్థితులు ఏమాత్రం బాగాలేవని, విదేశాల్లోనే స్థిరపడాలని తన పిల్లలకు చెప్పానంటూ వారం క్రితం ఆయన చేసిన వ్యాఖ్యల వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘‘నా కుమారుడు అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకుంటున్నాడు. కుమార్తె లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో చదువు పూర్తిచేసింది. అక్కడే ఉద్యోగాలు వెతుక్కోవాలని, సాధ్యమైతే అక్కడే స్థిరపడి, పౌరసత్వం కూడా సంపాదించుకోవాలని చెప్పాను. ఎందుకంటే భారత్‌లో పరిస్థితులు బాగాలేవు. వారు ఇక్కడి వాతావరణాన్ని తట్టుకుంటారో లేదో తెలియదు. ఒక తండ్రి తన పిల్లలకు ఇలాంటి మాటలు చెప్పాల్సి వచ్చిందంటే అర్థం చేసుకోండి’’ అని సిద్దిఖీ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను బీజేపీ బిహార్ అధికార ప్రతినిధి నిఖిల్ ఆనంద్ ఖండించారు. సిద్దిఖీ లాంటి వ్యక్తులు జాతి వ్యతిరేక అజెండాను మోస్తున్నారని మండిపడ్డారు. దేశం పట్ల, రాజ్యాంగం పట్ల విశ్వాసం లేని సిద్దిఖీ కుటుంబంతో సహా పాకిస్తాన్‌కు వెళ్లిపోవాలన్నారు. ఈ దేశం ఎవరి జాగీరూ కాదంటూ దీనిపై సిద్దిఖీ ఆగ్రహం వెలిబుచ్చారు. -
మంజీ సర్కారుకు ఆర్జేడీ మద్దతు
సోనియాతో లాలూ భేటీ... బీజేపీతో పోరాడతానని బాస పాట్నా/న్యూఢిల్లీ: బీహార్‌లో జితన్‌రామ్ మంజీ నేతృత్వంలో ఏర్పడిన జేడీయూ కొత్త ప్రభుత్వానికి ఆర్జేడీ గురువారం మద్దతు ప్రకటించింది. ఇప్పటికే తగినంత మెజారిటీ ఉన్న జేడీయూ సర్కారు మనుగడకు తమ మద్దతు అవసరం కాకున్నా, తొలిసారిగా మహాదళిత వర్గానికి చెందిన మంజీకి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టినందున జేడీయూ ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్నామని ఆర్జేడీ శాసనసభాపక్ష నేత అబ్దుల్బరీ సిద్దిఖీ గురువారం తెలిపారు. మతతత్వ శక్తులతో పోరాటంలో భాగంగానే మంజీ నేతృత్వంలోని జేడీయూ సర్కారుకు తాము మద్దతు ఇస్తున్నామని ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ చెప్పారు. తాజా పరిణామాలతో బీహార్‌లో బీజేపీ వ్యతిరేక రాజకీయ శక్తుల పునరేకీకరణ జరగనున్నట్లు సూచనలు కనిపిస్తున్న నేపథ్యంలో లాలూ గురువారం ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలుసుకున్నారు. సర్వశక్తులనూ ఒడ్డి బీజేపీతో పోరాటం సాగిస్తానని ఆయన సోనియాకు హామీ ఇచ్చారు. ‘ఇది తుపాను. ఎంతోకాలం ఉండదు. మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా సర్వశక్తులనూ ఒడ్డి పోరాటం సాగిస్తాం’ అని లాలూ అన్నారు. ఇందులో భాగంగానే బీహార్‌లోని జేడీయూ ప్రభుత్వానికి బేషరతుగా మద్దతు ఇస్తున్నామని చెప్పారు.