శ్రీశైలంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
శ్రీశైలం: శ్రీశైలంలో మంగళవారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. రద్దీ దృష్ట్యా ఆదివారం, సోమవారాలు అభిషేకాలు నిలిపివేశారు. మంగళవారం ఉదయం 4: 30 నుంచి అభిషేకాలు ప్రారంభమయ్యాయి. అభిషేకాల కోసం భారీగా భక్తులు వేచివున్నారు. అయితే స్వామివారి సర్వదర్శనం ఉదయం 7 గంటల నుంచి ప్రారంభం అవుతుందని ఆలయం అధికారులు తెలిపారు.