abstains
-
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం: కీలక ఓటింగ్‌కు భారత్, చైనా దూరం
కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం నిర్వహించింది. ఈ యుద్ధాన్ని రష్యా తక్షణమే ముగించాలని, బలగాలను వెనక్కిమళ్లించాలని సభ్య దేశాలు తీర్మానించాయి. ఉక్రెయిన్‌లో శాంతి నెలకొలపాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పాయి. ఐరాస జనరల్ అసెంబ్లీలో మొత్తం 193 సభ్య దేశాలున్నాయి. అయితే రష్యాకు వ్యతిరేకంగా తీర్మానం ఆమోదం కోసం జరిగిన ఓటింగ్‌లో 141 దేశాలు అనుకూలంగా ఓటు వేశాయి. 7 దేశాలు మాత్రం వ్యతిరేకించాయి. భారత్, చైనా సహా 32 దేశాలు మాత్రం ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. ఐరాస జనరల్ అసెంబ్లీలో రష్యాకు వ్యతిరేకంగా తీర్మానాలు జరిగిన ప్రతిసారి భారత్ ఓటింగ్‌కు దూరంగానే ఉంటోంది. ఇరు దేశాలు దౌత్యపరమైన చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని, శాంతి స్థాపనకు కృషి చేయాలని సూచిస్తోంది. అటు చైనా కూడా రష్యాకు అనుకూలం కాబట్టి ప్రతిసారి ఆ దేశానికి సానుకూలంగా వ్యవహరిస్తోంది. ఫిబ్రవరి 24న మొదలై.. ఐరోపా దేశాల కూటమి నాటోలో చేరాలనుకున్న ఉక్రెయిన్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రష్యా.. 2022 ఫిబ్రవరి 24న ఆ దేశంపై దండయాత్రకు దిగింది. లక్షల మంది సైన్యం, క్షిపణులు, బాంబులతో విరుచుకుపడింది. యుద్ధాన్ని మూడు రోజుల్లోనే ముగిస్తామని అతివిశ్వాసం ప్రదర్శించింది. అయితే ఉక్రెయిన్ తీవ్రంగా ప్రతిఘటించడంతో రష్యాకు ఊహించని ఎదురుదెబ్బలు తగిలాయి. ఉక్రెయిన్‌కు ఇతర దేశాలు మద్దతుగా నిలిచి ఆయుధాలు సమకూర్చడంతో రష్యాకు కూడా యుద్ధంలో తీవ్ర నష్టం వాటిల్లింది. ఏడాదిగా జరుగుతున్న ఈ యుద్ధంలో ఇరు దేశాలకు చెందిన 42,295 మంది ప్రాణాలు కోల్పోయారు. 56,576 మంది తీవ్రంగా గాయపడ్డారు. 15,000 మంది గల్లంతయ్యారు. 1.4కోట్ల మంది నిరాశ్రయులయ్యారు. 1,40,000 భవనాలు ధ్వంసం అయ్యాయి. లక్షల కోట్ల ఆస్తి నష్టం జరిగింది. అయినా ఇరు దేశాలు వెనక్కి తగ్గడం లేదు. యుద్ధాన్ని ఆపే ప్రయత్నాలు కూడా చేయడం లేదు. చదవండి: సూపర్మార్కెట్లలో కూరగాయలు, పండ్లపై పరిమితులు.. ఒక్కరికి మూడే! -
Russia-Ukraine War: ‘రష్యా రిఫరెండం’పై ఓటింగ్‌కు భారత్ దూరం
ఐక్యరాజ్యసమితి: ఉక్రెయిన్‌లోని 4 కీలక ప్రాంతాలను వీలినం చేసుకోవడమే లక్ష్యంగా రష్యా నిర్వహించి ‘చట్టవిరుద్ధ రిఫరెండం’పై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఓటింగ్ జరిగింది. భారత్ ఈ ఓటింగ్‌లో పాల్గొనకుండా దూరంగా ఉండిపోయింది. రష్యా మాత్రం వీటో చేసింది. రష్యా రిఫరెండాన్ని వ్యతిరేకిస్తూ అమెరికా, ఆల్బేనియా దేశాలు భద్రతా మండలిలో ముసాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. దీనిపై శుక్రవారం ఓటింగ్ నిర్వహించారు. ఉక్రెయిన్‌లోని లుహాన్స్క్, డొనెట్స్క్, ఖేర్సన్, జపొరిజాజియాలను రష్యాలో విలీనం చేస్తూ ఒప్పంద పత్రాలపై పుతిన్ సంతకాలు చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే ఈ ఓటింగ్ జరగడం గమనార్హం. అయితే, భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశమైన రష్యా వీటో చేయడంతో అమెరికా, ఆల్బేనియా తీర్మానం ఆమోదం పొందలేదు. భద్రతా మండలిలో మొత్తం 15 సభ్యదేశాలు ఉండగా, 10 దేశాలు ఈ తీర్మానానికి మద్దతు పలికాయి. భారత్, చైనా, గబాన్, బ్రెజిల్ మాత్రం ఓటింగ్‌లో పాల్గొనలేదు. ఓటింగ్ ప్రక్రియ పూర్తయిన అనంతరం ఐరాసలో భారత ప్రతినిధి రుచిరా కాంబోజ్ మాట్లాడారు. ఉక్రెయిన్ పరిణామాలు భారత్‌కు అందోళన కలిగిస్తున్నాయని చెప్పారు. ప్రజల ప్రాణాలను బలిపెట్టి శాంతిని సాధించలేరని తెలిపారు. హింసకు స్వస్తి పలికితేనే ఉక్రెయిన్–రష్యా సమస్యకు పరిష్కార మార్గం లభిస్తుందని సూచించారు. ఉక్రెయిన్‌లో రష్యా చేపట్టిన రిఫరెండం చెల్లదని ఐరాసలోని అమెరికా ప్రతినిధి లిండా థామస్–గ్రీన్‌ఫీల్డ్ తేల్చిచెప్పారు. -
ఎల్జీబీటీ వివక్ష పరిశీలనకు నిపుణుడి నియామకం
ఐరాస తీర్మానం ఓటింగ్‌కు భారత్ గైర్హాజరు జెనీవా/న్యూఢిల్లీ: ఎల్జీబీటీ(గే, లెస్బియన్, ద్విలింగ సంపర్కం, ట్రాన్స్‌జెండర్ ) వర్గం ఎదుర్కొంటున్న హింస, వివక్ష సంఘటనల పరిశీలనకు స్వతంత్ర నిపుణుడ్ని ఏర్పాటు చేయాలని ఐరాస మానవ హక్కుల కౌన్సిల్ నిర్ణయించింది. ఇందుకోసం జెనీవాలో నిర్వహించిన ఓటింగ్‌లో తీర్మానం తక్కువ ఓట్ల తేడాతో ఆమోదం పొందింది. 23 దేశాలు అనుకూలంగా, 18 దేశాలు వ్యతిరేకంగా ఓటు వేయగా మూడు దేశాలు గైర్హాజరయ్యాయి. తీర్మానంపై ఓటింగ్‌కు భారత్ గైర్హాజరైంది. మూడేళ్ల కాల వ్యవధితో పనిచేసే ఈ స్వతంత్ర నిపుణుడు గే, లెస్బియన్, ట్రాన్స్జెండర్లపై హింస వివరాల్ని పరిశీలిస్తారు. భారత్ నిర్ణయాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ సమర్థించుకున్నారు. ఎల్జీబీటీ అంశంలో భారత్‌లో న్యాయపరంగా ఉన్న వాస్తవం ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఎల్జీబీటీ హక్కుల అంశం సుప్రీం పరిధిలో ఉందని, వివిధ సంస్థలు క్యూరేటివ్ పిటిషన్లు దాఖలు చేశాయని, వాటిపై నిర్ణయం వెల్లడవాల్సి ఉందన్నారు.