AC Facility
-
బాబు నోట భలే మాట!
సాక్షి, హైదరాబాద్: ఓ తెలుగు సూపర్ డూపర్ హిట్ సినిమాలో ‘హైదరాబాద్‌కు సముద్రం తీసుకొస్తా’అంటూ ఎన్నికల ప్రచారంలో భాగంగా అర్థంపర్థంలేని హామీలు ఇచ్చి ఆ నాయకుడు గెలవడం చూశాం. సముద్రాన్ని హైదరాబాద్‌కు తీసుకరావడమేంటి అని బాగా నవ్వుకున్నాం. ఇప్పుడు అంతకుమించిన మాటలతో దేశంలోనే అత్యంత సీనియర్ నాయకుడు అని చెప్పుకునే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రజల ముందుకు వస్తున్నారు. గతంలో సముద్రాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నానని చెప్పి అందరినీ షాక్‌కు గురి చేసిన చంద్రబాబు.. తాజాగా ఇచ్చిన హామీతో అందరినీ ఆశ్చర్యచకితులను చేశారు. గురువారం గుంటూరులో చంద్రబాబు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన చేసిన ప్రసంగంతో సభకు వచ్చిన వారి దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయింది. రాజధానిలో ఇంటింటికి గ్యాస్, కరెంటుతో పాటు ఏసీ కూడా సరఫరా చేస్తామని చంద్రబాబు చెప్పిన మాటలు అక్కడి సభికులను విస్మయపరిచింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. ‘ఇంటింటికి ఏసీ ఏంది బాబు’.. ‘ఇంకా ఎన్ని మోసాలు చేస్తావు బాబూ’ అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. లోక్‌సభ, ఏపీ శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ చంద్రబాబు నుంచి సంభ్రమాశ్చర్యాలకు గురయ్యే మాటలు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక తెలంగాణ ఎన్నికల సమయంలోనూ ప్రపంచ పటంలో హైదరాబాద్‌ను చేర్చింది, ఆధునిక తెలంగాణ సృష్టికర్తను తానేనని చెప్పుకుని నవ్వుల పాలైన విషయం తెలిసిందే. -
బాబు నోట భలేమాట!
-
ఏసీ ఫెయిల్..ఐదుగురి మృతి
కాన్పూర్: ఇంటెన్సివ్ కేర్ యూనిట్(ఐసీయూ)లో ఎయిర్ కండీషనింగ్ పనిచేయకపోవడం వల్ల 24 గంటల వ్యవధిలో ఐదుగురు వృద్ధులు మృతిచెందారు. ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ నగరంలోని లాలా లజపతి రాయ్ ప్రభుత్వాసుపత్రిలో చోటుచేసుకుంది. ఈ కారణంగా ఇంద్రపాల్(75), గంగా ప్రసాద్ యాదవ్(75), రసూల్ భక్ష్, మురారీ లాల్(65) అనే వృద్ధులతో పాటు మరో వృద్ధుడు కూడా మృతిచెందారు. వీరిలో ఇద్దరు గుండె ఆగిపోవడం వల్ల మరణించగా..మరో ముగ్గురు దీర్ఘకాలిక వ్యాధులతో పోరాడుతూ చనిపోయారు. ఈ ఘటనపై ఆసుపత్రి వర్గాలను వివరణ కోరగా.. ఎయిర్ కండీషనింగ్(ఏసీ)లో సమస్యలు ఉన్నట్లు తమకు తెలుసునని, రెండు రోజుల క్రితమే మెడిసిన్ డిపార్ట్మెంట్ ఐసీయూలో ఏసీ ప్లాంట్‌ను మూసివేశామని ఐసీయూ ఇంచార్జ్ సౌరవ్ అగర్వాల్ తెలిపారు.నిన్న ఏసీ ప్లాంట్‌లో సమస్యలు ఉన్న మాట వాస్తవమేనని, కానీ ఉన్న సమస్యను పరిష్కరించామని, కానీ మళ్లీ సమస్య ఉత్పన్నమైందని ఆసుపత్రి పిన్సిపల్ నవనీత్ కుమార్ తెలిపారు. పరిస్థితి విషమించిన రోగులు మాత్రమే ఐసీయూలో ఉన్నారని, కేవలం ఏసీ ఫెయిల్ కావడం వల్లే రోగులు చనిపోలేదని ఆయన అన్నారు. ఈ సంఘటన గోరఖ్ పూర్ బాబా రాఘవ్ దాస్ మెడికల్ కాలేజీ ఘటనను తలపిస్తోంది. గత సంవత్సరం ఆక్సిజన్ కొరత వల్ల సుమారు 60 మంది శిశువులు వారం వ్యవధిలో చనిపోయారు. దీంతో ప్రజాగ్రహం పెల్లుబికింది. వెంటనే ప్రభుత్వం చర్యలు చేపట్టంతో ఈ గొడవ సద్దుమణిగింది.ఏసీ ఫెయిల్ సంఘటనపై నలుగు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసి విచారణకు ఆదేశిస్తున్న కాన్పూర్ జిల్లా మెజిస్ట్రేట్ సురేంద్ర సింగ్ తెలిపారు. -
మార్కెట్లకు మహర్దశ
- ఆధునిక హంగులతో నిర్మాణం - ప్రతిపాదనల తయారీకి ప్రభుత్వం ఆదేశాలు బెల్లంపల్లి : కూరగాయలు, మాంసం మార్కెట్లకు మహర్దశ రాబోతోంది. ఆధునిక హంగులతో మా ర్కెట్లను నిర్మించి ఏసీ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. రైతు బజార్, పాత మా ర్కెట్లను ఆధునికీకరించి పరిశుభ్రమైన వాతావరణంలో నాణ్యమైన కూరగాయలు, మాంసం విక్రయాలు చేపట్టేలా కసరత్తు చేస్తోంది. పక్షం రోజు ల్లోగా ప్రతిపాదనలు పంపించాలని పురపాలక, ప ట్టణాభివృద్ధి శాఖ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించింది. వీరు సంబంధిత ప్రతిపాదనలు కలెక్టర్‌కు అందించాల్సి ఉంది. జిల్లాలో ఆదిలాబాద్, నిర్మల్, భైంసా, మంచిర్యాల, మందమర్రి, బెల్లంపల్లి, కాగజ్‌నగర్ మున్సిపాలిటీలు ఉండగా.. వీటి పరిధిలో ఏడు మార్కెట్లు ఉన్నాయి. దశాబ్దాల క్రితం కూరగాయలు, మాంసం మార్కెట్లను నిర్మించారు. పాలకుల నిర్లక్ష్యంతో ఆయా మున్సిపాలిటీల్లోని మార్కెట్లలో కనీస సదుపాయాలు లేకుండాపోయాయి. భవనాలు శిథిలావస్థకు చేరుకుని, కనీస సదుపాయాలు కరువయ్యాయి. వీటికి ఎప్పటికప్పుడు మరమ్మతు చేయించక కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు, అంతర్గత రహదారులు తదితర మౌలిక సదుపాయాలు లేకుండాపోయాయి. మార్కెట్లలో సదుపాయాలు కల్పించడంలో ఏళ్ల తరబడి నుంచి నిర్లక్ష్యం జరుగుతోంది. ప్రతిపాదించాల్సిన అంశాలు.. మార్కెట్ల ఏర్పాటుకు తగిన ఫార్మాట్లో ప్రతిపాదించాలని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మున్సిపాలిటీలకు సూచించింది. ప్రస్తుతం ఉన్న కూరగాయల మార్కెట్ల సంఖ్య, ఆయా మార్కెట్ల విస్తీర్ణం, కొత్తగా ప్రతిపాదించే మార్కెట్లు, ఆధునికీకరణకు ప్రతిపాదన చేసే మార్కెట్ల సంఖ్య, ఇందుకు సంబంధించి అవసరమయ్యే నిధులు, ఇతర మౌలిక అంశాలతో మున్సిపాలిటీలకు నిర్దేశించిన ఫార్మాట్‌ను మున్సిపల్ శాఖ పంపించింది. రెవెన్యూ శాఖతో సమన్వయం చేసుకుని మార్కెట్ల నిర్మాణానికి అనువైన స్థలాలను గుర్తించాలని సూచించింది. ఒక్కో మున్సిపాలిటీ తరఫున మూడేసి ప్రతిపాదనల సెట్లను పంపించాలని ఆదేశించింది. మున్సిపాలిటీల నుంచి వచ్చిన ప్రతిపాదనలను నిశితంగా పరిశీలించి నెల రోజుల వ్యవధిలో ప్రభుత్వానికి పంపాలని ఆదేశించింది. క్రయవిక్రయాలకు సూచనలు పాత కూరగాయలు, మాంసం మార్కెట్లు, రైతు బజార్లు ఆధునికీకరించే వరకు ఆహార పదార్థాల అమ్మకాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేసింది. నేలపై ఉంచి కూరగాయలు, మాంసం విక్రయాలు జరపరాదని స్పష్టం చేసింది. తప్పనిసరి పరిస్థితుల్లో అలా చేయాల్సి వస్తే టేబుల్, ప్లాట్‌ఫాంపై సురక్షిత పద్ధతిలో విక్రయాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్లకు మార్గదర్శకాలు జారీ చేసింది. యథాప్రకారం కాకుండా ఇకపై వధించే జంతువుల ఆరోగ్య స్థితిని వెటర్నరీ వైద్యులతో పరీక్షించి ధ్రువీకరణ పత్రం తీసుకోవాలని పేర్కొంది. మాంసం మార్కెట్లలో పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని, మాంసాన్ని నైలాన్ నెట్స్‌తో కప్పి ఉంచాలని, గాలి, వెలుతురు సరిపడా వచ్చేలా చూడాలని, మాంసం వ్యర్థపదార్థాలను ఎక్కడపడితే అక్కడ వేయకుండా ప్రత్యేకంగా చెత్తబుట్టలో వేసి పారిశుధ్య సిబ్బందికి అప్పగించేలా చూడాలంది. 40 మైక్రన్ల కంటే తక్కువ మందం కలిగిన పాల్తిన్ కవర్ల అమ్మకాలు జరగకుండా నిరోధించాలని, వస్త్రం, కాగితంతో తయారు చేసిన బ్యాగ్‌ను ప్రోత్సహించాలని, స్థలం అందుబాటులో ఉంటే కూరగాయల మార్కెట్లోనే వ్యర్థపదార్థాలతో వర్మికంపోస్టు యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు మార్కెట్ కమిటీలకు మార్గదర్శకం చేయాలని, వర్షం నీరు మార్కెట్లో నిల్వ ఉండకుండా ప్రత్యేక డ్రెయినేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని పేర్కొంది. ఈ విషయంపై బెల్లంపల్లి మున్సిపాలిటీకి చెందిన ఏఈ రాజ్‌కుమార్ ను వివరాలు కోరగా.. రెండు రోజుల క్రితమే దీనికి సంబంధించి ఉత్తర్వులు ఆన్లైన్లో వచ్చినట్లు తెలిపారు. -
డబుల్ డెక్కర్ రైలు ప్రారంభం
తిరుపతి అర్బన్, న్యూస్‌లైన్ : తిరుపతి-కాచిగూడ మధ్య కొత్తగా ఏర్పాటు చేసిన డబుల్ డెక్కర్ రైలును గురువారం ఉదయం ప్రారంభించారు. ఈనెల చివరలో రిటైర్డ్ అవుతున్న రైల్వే సిబ్బంది చేత ఉదయం 5:45 గంటలకు రైలును ప్రారంభించారు. అనంతరం స్థానిక లైజాన్ ఆఫీసర్ కుప్పాల సత్యనారాయణ మాట్లాడుతూ 2014 రైల్వే బడ్జెట్లో ప్రకటించిన డబుల్ డెక్కర్ రైలును తిరుపతి నుంచి నడపడం జిల్లా వాసులకే కాకుండా రాయలసీమ జిల్లాల ప్రజలకు ఎంతో సౌకర్యవంతం అన్నారు. ఈ రైలులో మూడు అంచెల కుషన్ సీట్లు, ఫుల్ ఏసీ సౌకర్యం ఉంటుందన్నారు. ఈ రైలు ప్రతి గురు, ఆదివారాల్లో తిరుపతి నుంచి కాచిగూడ వెళ్తుందని లైజాన్ ఆఫీసర్ తెలిపారు. కాగా గురువారం తొలిరోజు ఈ రైలులో గుంతకల్ సీనియర్ డీసీఎం స్వామినాయక్, ఇతర ఇంజనీరింగ్ అధికారులు వెళ్లారు. ఈ కార్యక్రమంలో ఈనెల చివరలో రిటైర్డ్ అవుతున్న రైల్వే టీటీఐలు మోహన్‌రావు, మహబూబ్ బాషా, సిరాజ్, గార్డు వరప్రసాద్, కలాసీ చిన్నబ్బ, టెక్నీషియన్ అంజనయ్యతో పాటు చీఫ్ రిజర్వేషన్ ఇన్స్పెక్టర్ దాసరి రాధాకృష్ణ, స్టేషన్ మేనేజర్ మాదిన గంగులప్ప, సీడీవో రామ్మోహన్, సీనియర్ సెక్షన్ ఇంజినీర్ ప్రభాకర్‌రావు, ఏఈ కృపానంద్, స్క్వాడ్ ఇన్స్పెక్టర్లు టీవీ రావు, వేణుమాధవ్, రైల్వే ఎంప్లాయిస్ సంఘ్ సెక్రటరీ కుప్పాల గిరిధర్‌కుమార్ పాల్గొన్నారు. -
గూడెంలోనూ ‘సంత్రాగచ్చి’
తాడేపల్లిగూడెం, న్యూస్‌లైన్ :కోల్‌కతా-చెన్నై మధ్య ప్రయూణించే ‘పశ్చిమ’ వాసులకు మరో సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు అందుబాటులోకి రాబోతోంది. సంత్రాగచ్చి ఎక్స్‌ప్రెస్‌గా పిలిచే ఈ రైలు ఆ రెండు ప్రాంతాల మధ్య ఇప్పటికే వారానికి రెండుసార్లు నడుస్తోంది. దీనికి ఈనెల 22 నుంచి తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్లో ఒక నిమిషంపాటు హాల్టు కల్పిస్తున్నారు. పత్యేకతలివీ..ఙఞ్చట22807, 22808 నంబర్లతో పిలిచే ఈ రైలులో 18 కోచ్‌లు ఉంటాయి. అన్నిటిలోనూ ఏసీ సౌకర్యం ఉం టుంది. కోల్‌కతాలోని సంత్రాగచ్చి స్టేషన్ నుంచి చెన్నైలోని సెంట్రల్ రైల్వే స్టేషన్ మధ్య 1,654 కిలోమీటర్ల మేర ప్రయూణించే ఈ రైలు 27 గంటల 45 నిమిషాల్లోగమ్యానికి చేరుకుంటుంది. దీనికి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ఖరగ్‌పూర్‌లో ఒక హాల్టు, ఒడిశాలో ఐదు హాల్టులు, ఆంధ్రప్రదేశ్‌లో 10 హాల్టులు ఉన్నాయి. ఇందులో ఏసీ ఫస్ట్ క్లాస్ కోచ్ 1, సెకండ్ ఏసీ కోచ్‌లు 4, త్రీటైర్ ఏసీ కోచ్‌లు 10, ఒక పాంట్రీకార్, రెండు లగేజీ కం బ్రేక్ వ్యాన్లు ఉంటాయి. విశాఖపట్టణంలో 25 నిమిషాలు, విజయవాడలో 20 నిమిషాలు, ఖుర్దా రోడ్లో 10 నిమిషాలు హాల్టుతో కలుపుకుని మొత్తం 16 స్టేషన్లలో 89 నిమిషాల పాటు ఆగుతుంది. ప్రతి మంగళవారం, శుక్రవారం రాత్రి ఏడు గంటలకు సంత్రాగచ్చిలో బయలుదేరే ఈ రైలు మర్నాడు రాత్రి 10.45 గంటలకు చెన్నై చేరుతుంది. చె న్నైలో ప్రతి ఆదివారం, గురువారం రాత్రి 7.55 గంటలకు బయలుదేరి మర్నాడు రాత్రి 10.25 గంటలకు సంత్రాగచ్చి చేరుతుంది. ఈ నెల 22న మధ్యాహ్నం 12.11కు చెన్నై వెళుతూ తాడేపల్లిగూడెంలో ఒక నిమి షం ఆగుతుంది. కోల్‌కతా వెళ్లే రైలు ఇక్కడికి మధ్యాహ్నం 3.39 నిమిషాలకు వస్తుంది. కోల్‌కతా నుంచి చెన్నైకు పెద్దలకు త్రీ టైర్ కోచ్‌లో రూ.1,520, టూ టైర్ రూ.2,210, ఫస్ట్‌క్లాస్ రూ.3,800, పిల్లలకు వరుసగా రూ.805, రూ.1,155, రూ.1,970 చొప్పున చార్జీలు వసూలు చేస్తారు. సీని యర్ సిటిజన్లకు రూ.950, రూ.1,365, రూ.2,335 చొప్పున చార్జీలు వసూలు చేస్తారు. తత్కాల్‌కు వేరే ధరలు ఉంటాయి. ఇది మూడో రైలు ప్రయాణికులకు, వ్యాపారులకు అనుకూలంగా ఉండే దూరప్రాంత రైళ్లకు తాడేపల్లిగూడెంలో హాల్టు కల్పించాలనే డిమాండ్ చాలాకాలంగా ఉంది. ప్రజల అభ్యర్థనలు, చాంబర్ ఆఫ్ కామర్స్ వంటి సంస్థల వినతుల నేపథ్యంలో ఎమ్మెల్యే ఈలి నాని, నరసాపురం ఎంపీ కనుమూరి బాపిరాజు సంత్రాగచ్చి రైలు హాల్టుకు కృషి చేశారు. ఈ కృషిలో భాగంగానే ఇటీవల గరీబ్థ్,్ర కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లకు ఇక్కడ హాల్టులు వచ్చాయి. తాజాగా సంత్రాగచ్చి రైలుకు హాల్టు ఇస్తున్నారు.