గూడెంలోనూ ‘సంత్రాగచ్చి’
Published Fri, Jan 17 2014 12:35 AM | Last Updated on Sat, Sep 2 2017 2:40 AM
తాడేపల్లిగూడెం, న్యూస్‌లైన్ :కోల్‌కతా-చెన్నై మధ్య ప్రయూణించే ‘పశ్చిమ’ వాసులకు మరో సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు అందుబాటులోకి రాబోతోంది. సంత్రాగచ్చి ఎక్స్‌ప్రెస్‌గా పిలిచే ఈ రైలు ఆ రెండు ప్రాంతాల మధ్య ఇప్పటికే వారానికి రెండుసార్లు నడుస్తోంది. దీనికి ఈనెల 22 నుంచి తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్‌లో ఒక నిమిషంపాటు హాల్టు కల్పిస్తున్నారు.
పత్యేకతలివీ..ఙఞ్చట22807, 22808 నంబర్లతో పిలిచే ఈ రైలులో 18 కోచ్‌లు ఉంటాయి. అన్నిటిలోనూ ఏసీ సౌకర్యం ఉం టుంది. కోల్‌కతాలోని సంత్రాగచ్చి స్టేషన్ నుంచి చెన్నైలోని సెంట్రల్ రైల్వే స్టేషన్ మధ్య 1,654 కిలోమీటర్ల మేర ప్రయూణించే ఈ రైలు 27 గంటల 45 నిమిషాల్లోగమ్యానికి చేరుకుంటుంది. దీనికి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ఖరగ్‌పూర్‌లో ఒక హాల్టు, ఒడిశాలో ఐదు హాల్టులు, ఆంధ్రప్రదేశ్‌లో 10 హాల్టులు ఉన్నాయి. ఇందులో ఏసీ ఫస్ట్ క్లాస్ కోచ్ 1, సెకండ్ ఏసీ కోచ్‌లు 4, త్రీటైర్ ఏసీ కోచ్‌లు 10, ఒక పాంట్రీకార్, రెండు లగేజీ కం బ్రేక్ వ్యాన్లు ఉంటాయి. విశాఖపట్టణంలో 25 నిమిషాలు, విజయవాడలో 20 నిమిషాలు, ఖుర్దా రోడ్‌లో 10 నిమిషాలు హాల్టుతో కలుపుకుని మొత్తం 16 స్టేషన్లలో 89 నిమిషాల పాటు ఆగుతుంది.
ప్రతి మంగళవారం, శుక్రవారం రాత్రి ఏడు గంటలకు సంత్రాగచ్చిలో బయలుదేరే ఈ రైలు మర్నాడు రాత్రి 10.45 గంటలకు చెన్నై చేరుతుంది. చె న్నైలో ప్రతి ఆదివారం, గురువారం రాత్రి 7.55 గంటలకు బయలుదేరి మర్నాడు రాత్రి 10.25 గంటలకు సంత్రాగచ్చి చేరుతుంది. ఈ నెల 22న మధ్యాహ్నం 12.11కు చెన్నై వెళుతూ తాడేపల్లిగూడెంలో ఒక నిమి షం ఆగుతుంది. కోల్‌కతా వెళ్లే రైలు ఇక్కడికి మధ్యాహ్నం 3.39 నిమిషాలకు వస్తుంది. కోల్‌కతా నుంచి చెన్నైకు పెద్దలకు త్రీ టైర్ కోచ్‌లో రూ.1,520, టూ టైర్ రూ.2,210, ఫస్ట్‌క్లాస్ రూ.3,800, పిల్లలకు వరుసగా రూ.805, రూ.1,155, రూ.1,970 చొప్పున చార్జీలు వసూలు చేస్తారు. సీని యర్ సిటిజన్లకు రూ.950, రూ.1,365, రూ.2,335 చొప్పున చార్జీలు వసూలు చేస్తారు. తత్కాల్‌కు వేరే ధరలు ఉంటాయి.
ఇది మూడో రైలు
ప్రయాణికులకు, వ్యాపారులకు అనుకూలంగా ఉండే దూరప్రాంత రైళ్లకు తాడేపల్లిగూడెంలో హాల్టు కల్పించాలనే డిమాండ్ చాలాకాలంగా ఉంది. ప్రజల అభ్యర్థనలు, చాంబర్ ఆఫ్ కామర్స్ వంటి సంస్థల వినతుల నేపథ్యంలో ఎమ్మెల్యే ఈలి నాని, నరసాపురం ఎంపీ కనుమూరి బాపిరాజు సంత్రాగచ్చి రైలు హాల్టుకు కృషి చేశారు. ఈ కృషిలో భాగంగానే ఇటీవల గరీబ్థ్,్ర కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లకు ఇక్కడ హాల్టులు వచ్చాయి. తాజాగా సంత్రాగచ్చి రైలుకు హాల్టు ఇస్తున్నారు.
Advertisement