చదువంటే చావబాదడమేనా...?
సందర్భం
మొన్న హైదరాబాద్లోని శ్రీచైతన్య జూనియర్ కాలేజీలో పిల్లలను రక్తం చిందేలా బాదుతున్న వీడియో బయటపడటంతో, ఇది జాతీయ స్థాయి వార్తలకెక్కినా ఈ విషయం మన విద్యాశాఖ చెవికెక్కలేదు.
పిల్లలు విద్యాబుద్ధులు నేర్చుకోవడానికి పాఠశాల లకు వెళ్లాలంటే, చెరసాల లకు వెళ్తున్నట్లు బిక్క మొహం వేసి భయపడు తున్నారు. ఈ పరిస్థితి నర్సరీ తరగతి నుండి ఇంటర్మీడియెట్ వరకు ఉంది. ‘‘దొరకొడుకునైననూ, తొడ పాశములు పెట్టి, బుగ్గలు నులుమంది బుద్ధిరాదు’’ అన్న అభిప్రా యాన్నే ఈ కంప్యూటర్ యుగంలో సహితం మన అయ్యవార్లు తు.చ. తప్పకుండా పాటిస్తున్నట్లు ఉంది. కానీ, శాస్త్రీయ విద్యా విధానం, పిల్లల మనసు, వారి ఇష్టాయిష్టాలు ఎరిగి బోధన చేయా లనే సంస్కారాన్ని ఇంకా ఆకళింపు చేసుకోకపోవడం విద్యా వ్యవస్థ దౌర్భాగ్యంగానే చెప్పుకోవాలి. పిల్లలకు జ్ఞానం నేర్పుతున్నారా లేదా చదువు యంత్రాలను తయారు చేస్తున్నారా అన్న విషయాన్ని ఇటు గురువులు అటు తల్లిదండ్రులు తీవ్రంగా ఆలోచించాల్సిన సమయం ఇప్పటికే మించిపోయినా ఇకనైనా ఆలోచించాలి.
చదివి, సంస్కారవంతులై, సంపాదనపరులై తమ బాగోగులు చూసుకుంటారని కార్పొరేటు విద్యాలయాలకు లక్షలు గుమ్మరించి హాస్టళ్లకు పంపిస్తే, ఆ బిడ్డలు శవాలుగా తిరిగి వస్తుంటే ఆ తల్లిదండ్రుల ఆవేదనను ఎవరు అర్థం చేసుకో గలం? దేని ద్వారా ఆ లోటును భర్తీ చేయగలం? నిన్నగాక మొన్ననే వెళ్లిపోయిన సంవత్సరం 2016ను చూసుకుంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు పిల్లలను దండించిన ఘటనలు 385 కేవలం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నమోదు కాగా అందులో తీవ్రమైనవి 85 ఘటనలు, 28 ఆత్మ హత్యలు.
ఎనిమిదో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు స్కూళ్లలోనే చిన్నారులపై పండితులు, వాచ్ మెన్ల అత్యాచారాలు ఎనిమిది. ఈ స్థాయిలో పిల్ల లపై దౌర్జన్యాలు జరుగుతుంటే, విద్యాశాఖ మాత్రం ఇవి అన్నీ తనకు సంబంధించిన విషయాలుగా పరిగణించకుండా, ఎలాంటి చర్యలు తీసుకోకుండా కేవలం ఆ శాఖలోని అధికారులు ఎవరిస్థాయిలో వారు, ఎంత దొరికితే అంతకు రాజీ పడుతూ, నేరాలు చేసిన పాఠశాలలకు కొమ్ముకాస్తూ, కార్పొ రేట్ విద్యా సంస్థలకు జీ హుజూర్ అంటూ నిల్చుంటున్నారు.
రోజు దాదాపు అన్ని కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఇదే దిన చర్య అయినప్పటికీ, మొన్న హైదరాబా ద్లోని శ్రీచైతన్య జూనియర్ కాలేజీలో పిల్లలను రక్తాలు చిందేలా బాదుతున్న వీడియో బయటప డటంతో, ఇది జాతీయ స్థాయి వార్తలకెక్కినా ఈ విషయం మన విద్యాశాఖ చెవికెక్కలేదు. ఆ విద్యా సంస్థపై శాఖాపరంగా చర్యలు తీసుకున్న దాఖ లాలు లేవు. చివరకు బాలల హక్కుల సంఘం.. నిందితుడు దొరబాబు పనిచేస్తున్న విద్యా సంస్థ యాజమాన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే తప్ప వారిపై క్రిమినల్ కేసులు నమోదు కాలేదు.
ఎల్కేజీ, యూకేజీ పిల్లలపై సహితం బడుల్లో య«థేచ్ఛగా దౌర్జన్యాలు జరుగుతుంటే బాధ్యత గల మీడియా వాటిని బహిర్గతపరుస్తున్నా, మహా రాజశ్రీ మన పోలీసు వారు ఎవరూ ఫిర్యాదు చేయ లేదు కదా అని కూర్చుంటున్నారే తప్ప, ఇది శిక్షార్హమైన నేరం, మనకు మనంగా కేసు నమోదు చేయవచ్చన్న విచక్షణతో వ్యవహరించడంలేదు సరికదా ఎవరైనా బాలల హక్కుల సంఘాలు కేసులు నమోదు చేయండి. మేము ఫిర్యాదు ఇస్తామంటే, తల్లిదండ్రులు ఫిర్యాదు చేయాలి అనే స్థాయిలో ఉన్నారు. కానీ కేసు పెట్టదగినæనేరంలో దారిన పొయ్యే దానయ్య కూడా ఫిర్యాదు చేయ వచ్చన్న చట్టాన్ని పిల్లల విషయంలో అమలు చేయడం లేదు సరికదా పిల్లల తరఫున స్కూలు యాజమాన్యం, తల్లిదండ్రులు రాజీ కుదుర్చుకున్నా రని కేసు మూసేస్తూ చట్టాలకే వక్ర భాష్యం చెబు తున్నారు.
‘‘విప్పి చెప్ప లేక వీపు బద్దలు చేయు
గురువు, గురువు కాడు కొరివి గానీ.....
అనే విషయాన్ని మన గురువులు, విద్యా సంస్థల నిర్వాహకులు, పిల్లల తల్లిదండ్రులు గుర్తిం చిన రోజే, చావబాదనిదే చదువు రాదు అనే రాక్షస భావనపోయి, పిల్లలు చదువులు కొనసాగించే పరిస్థితి ఉంటుంది. లేకుంటే ఈ శిక్షలు భరిం చలేక స్కూళ్లు వదిలి, ఊరువదిలి పారిపోవడమో, సీలింగ్ ఫ్యాన్లే ఉరికంబాలు అవడమో లేదా ఎదుగుతున్నా పిల్లలు అసాంఘిక శక్తులుగా తయారు అవడమో తప్పదు. అలాగే విద్యాశాఖ అధికారులు కార్పొరేటు సంస్థలకు ఊడిగం చేయడానికి మాకు ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చిందనే భావన మానుకొని, మేము విద్యార్థుల పక్షాన నిలవాలన్నా నిజాయితీతో పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే విద్యార్థులకు చదువు గరళంగా కాకుండా మధు రంగా అ నిపిస్తుంది.
అచ్యుతరావు,
వ్యాసకర్త రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు ‘ 93910 24242