action drama
-
సెప్టెంబరులో స్టార్ట్?
మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ ఫిల్మ్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఆఫ్రికన్ ఫారెస్ట్ నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచరస్ డ్రామాగా రూపుదిద్దుకోనున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. షూటింగ్‌ను సెప్టెంబరులో ఆరంభించాలని రాజమౌళి అనుకుంటున్నారట. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్‌బాబు ఓ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ సెప్టెంబరుకల్లా దాదాపు పూర్తవుతుందట. ఆ తర్వాత రాజమౌళి సినిమా చిత్రీకరణలో పాల్గొనేలా మహేశ్‌బాబు ప్లాన్ చేసుకుంటున్నారట. ఇక త్రివిక్రమ్‌తో మహేశ్‌బాబు చేస్తున్న సినిమా వచ్చే జనవరి 13న విడుదల కానుంది. -
వచ్చేస్తున్నాడు తొలి సూపర్ సోల్జర్..
-
ఆన్లైన్ క్లాసులతో బిజీ కాబోతున్న నాగ్
ఐదు పదుల వయసు పైబడినప్పటికీ రొమాంటిక్ కథలతో హిట్ కొట్టగలడు టాలీవుడ్ మన్మథుడు నాగార్జున. ఈ క్రమంలోనే ‘సోగ్గాడే చిన్నినాయినా’ తో కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అయితే ఇటీవల నాగ్ ఎక్కువగా ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్ వైపు ఆస్తక్తి చూపుతున్నాడనే చెప్పాలి. ఈ మధ్య ఆయన నటించిన ‘ఆఫీసర్’, ‘వైల్ట్ డాగ్’ చిత్రాలు యాక్షన్ డ్రామాగా తెరకెక్కినవే. ప్రస్తుతం నాగ్.. ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో నటించాల్సి ఉంది. ఈ చిత్రం కూడా యాక్షన్ నేపథ్యంలోనే తెరకెక్కనుంది. ఇప్పటికే కొన్ని సినిమాల్లో పోలీస్ ఆఫీసర్, ఎన్ఐఏ ఆఫీసర్ రోల్స్‌లో నటించిన నాగార్జున ఈ సినిమాలో రా ఏజెంట్ గా కనిపిస్తారని సమాచారం. కాజల్ అగర్వాల్ ఇతడితో జోడీ కడుతున్నట్లు తెలుస్తోంది. అయితే నాగార్జున ఈ సినిమా కోసం క్రవ్ మగా (ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ అభివృద్ధి చేసిన ఆత్మరక్షణ సాంకేతికత) పేరుతో పిలవబడే యుద్ధకళను నేర్చుకుంటున్నారని తెలుస్తోంది. కరోనా వల్ల మార్షల్ ఆర్ట్స్ నిపుణుడు ఇండియాకు రాలేకపోవడంతో ఆన్ లైన్ క్లాసుల ద్వారా నాగ్ ఈ యుద్ధ విద్యను నేర్చుకుంటున్నారని తెలుస్తోంది. ఈ యుద్ధకళతో పాటు కటానా అనే మరో యుద్ధకళను కూడా నాగార్జున నేర్చుకుంటున్నారట. తన పాత్ర కోసం అంతలా కష్టపడుతున్నారంటే ఈ చిత్రాన్ని హాలీవుడ్ యాక్షన్ స్టంట్స్ రేంజ్లో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ( చదవండి: సినిమా షూటింగ్‌లకు ‘సెకండ్ బ్రేక్’ ) -
ఆ రకంగా చూస్తే ఇది ఇండియాలోనే తొలి చిత్రం!
యాక్షన్ సన్నివేశాలను ఒకే షాట్లో చిత్రీకరించామని దర్శకుడు శ్యామ్ ఆంటన్ తెలిపారు. నటుడు అధర్వ మురళి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రానికి శ్యామ్ దర్శకత్వం వహిస్తున్నారు. దీన్ని ప్రమోద్ ఫిలింస్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సంస్థ నిర్మిస్తున్న 25వ చిత్రం ఇది. నిర్మాణ దశలో ఉన్న ఈ చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఒకే షాట్లో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించాలన్నది తన చిరకాల కల అని చెప్పారు. తాను, ఫైట్ మాస్టర్ దిలీప్ సుబ్బరాయన్ చాలాకాలం క్రితమే ఇలాంటి సన్నివేశాలను చిత్రీకరించాలని అనుకున్నామన్నారు. అది ఇప్పుడు అధర్వ మురళి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ద్వారా నెరవేరిందన్నారు. ఈ చిత్రంలోని ఒక యాక్షన్ సన్నివేశాలు ఒకే షాట్లో చిత్రీకరించాలని భావించమన్నారు. దీంతో ఆ యాక్షన్ సన్నివేశం కోసం ఒక్కరోజు మాత్రమే రిహార్సల్స్ చేశామని, చిత్ర యూనిట్ అంకితభావం, అపార కృషితోనే ఆ సన్నివేశం అద్భుతంగా వచ్చిందని చెప్పారు. ఈ చిత్రం తర్వాత నటుడు అధర్వ మురళి జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంటారన్నారు. కాగా ఇలా ఒకే షాట్లో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించడం అన్నది కొరియా చిత్రం ఓల్డ్ బాయ్, మూడు ఆస్కార్ అవార్డులు సాధించిన 1917, ది రెవనంట్, ది రైడ్ వంటి చిత్రాల్లో జరిగిందన్నారు. ఇండియాలో మాత్రం ఇలా ఒకే షాట్లో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించిన తొలి చిత్రం తమదే అవుతుందని దర్శకుడు పేర్కొన్నారు. చదవండి: కరోనా గుప్పిట్లో సెలబ్రిటీలు.. బాలీవుడ్లో టెన్షన్! చెక్ మేట్.. సూటిగా సొల్లు లేకుండా! -
విశాల్‌కు షాక్: నష్టాన్ని అతడే భరించాలి
ముంబై: నటుడు విశాల్, తమన్నా జంటగా నటించిన చిత్రం ‘యాక్షన్’. సుందర్ సి దర్శకత్వం వహించిన ఈ సినిమాను టైడెంట్ ఆర్ట్స్ పతాకంపై తెరకెక్కించారు. గతేడాది నవంబర్‌లో విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. తాజాగా యాక్షన్ సినిమా వల్ల నష్టపోయిన సినీ నిర్మాతలకు హీరో విశాలే డబ్బులు చెల్లించాలని శుక్రవారం మద్రాస్ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ క్రమంలో నిర్మాతలు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారణ జరిపింది. నష్టాలను భర్తీ చేసే విధంగా రూ. 8.29 కోట్లకు విశాల్ గ్యారెంటీ ఇవ్వాలని విశాల్‌ను న్యాయమూర్తి కోరారు. చదవండి: విశాల్ తండ్రి ఫిట్నెస్ చూస్తే షాకే! ముందుగా యాక్షన్ సినిమాను తక్కువ బడ్జెట్లో తెరకెక్కించాలని నిర్మాతలు భావించారు. అయితే ఈ సినిమా కనీసం రూ.20 కోట్లు వసూలు చేయకపోతే ఆ నష్టాన్ని తను భరిస్తానని విశాల్ నిర్మాతలకు చెప్పడంతో చివరికి రూ.44 కోట్లతో యాక్షన్ సినిమాను నిర్మించారు. కాగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తాపడటంతో తమిళనాడులో రూ.7.7 కోట్లు, రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.4 కోట్లు మాత్రమే వసూలు చేసింది. దీంతో రూ. 20 కోట్లు వసూలు చేయడంలో విఫలమవడంతో నష్ట పరిహారాన్ని పూడ్చేందుకు తన తరువాత చిత్రం ‘చక్ర’ను ట్రైడెంట్ బ్యానర్‌పైనే నిర్మిస్తానని విశాల్ నిర్మాతలకు మాటిచ్చాడు. చదవండి: బీజేపీలోకి హీరో విశాల్? కానీ ప్రస్తుతం ఈ సినిమాను విశాల్ తన సొంత బ్యాన్‌లో నిర్మించారని, చక్ర సినిమాను ఓటీటీలో విడుదల చేయడాన్ని నిలిపివేయాలని కోరుతూ యాక్షన్ సినిమా నిర్మాతలు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై నేడు విచారణ జరిపిన హైకోర్టు యాక్షన్ సినిమా వల్ల నష్టపోయిన సినీ నిర్మాతలకు హీరో విశాలే డబ్బులు చెల్లించాలని వ్యాఖ్యానించింది. అలాగే చక్ర సినిమాను ఓటీటీలో విడుదల చేసేందుకు అనుమతినిచ్చింది. విశాల్, శ్రద్ధా శ్రీనాథ్,రెజీనా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. చదవండి: హీరో తండ్రిపై ప్రముఖ కమెడియన్ ఫిర్యాదు -
అలాంటి చిత్రాలు ఇష్టమే కానీ..
సినిమా: యాక్షన్ కథా చిత్రాల్లో నటించడం ఇష్టమే కానీ అంటోంది నటి రితికాసింగ్. రియల్ బాక్సర్ అయిన ఈ ఉత్తరాది బ్యూటీ రీల్ హీరోయిన్గా మారి ఇరుదు చుట్రు చిత్రంతో దక్షిణాదికి పరిచయమైంది. ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో పాటు రితికాసింగ్‌కు మంచి పేరును తెచ్చి పెట్టింది. ఇరుదుచుట్రు తెలుగు రీమేక్ గురు చిత్రంలోనూ ఈ అమ్మడే నటించింది. ఆ తరువాత లారెన్స్‌తో శివలింగ, విజయ్‌సేతుపతికి జంటగా ఆండవన్ కట్టళై వంటి సక్సెస్ఫుల్ చిత్రాల్లో నటించింది. అయినా ఎందుకనో ఆ తరువాత కోలీవుడ్‌కు దూరమైంది. అలాంటిది ఇప్పుడు కోలీవుడ్‌లో రెండు చిత్రాల్లో నటిస్తోంది. వాటిలో ఒకటి ఓ మై కడవులే. అశోక్‌సెల్వన్‌తో జతకట్టిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నెల 14వ తేదీన తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా నటి రితికాసింగ్‌ను ఇటీవల సాక్షి పలకరించింది ఓ మై కడవులే చిత్రంలో నటించిన అనుభవం గురించి చెప్పమనగా దర్శకుడు చెప్పిన కథ నచ్చింది. వెంటనే నటించడానికి అంగీకరించాను, నటుడు అశోక్‌సెల్వన్ చిత్ర యూనిట్ ఎంతగానో సహకరించారు. ఇందులో నటుడు విజయ్‌సేతుపతి ముఖ్య పాత్రలో నటించారు. ఆయన చాలా స్వీట్ పర్సన్, ఇది చాలా రొమాంటిక్ ప్రేమ కథా చిత్రం. కోలీవుడ్‌లో కనిపించి చాలా కాలమైంది. ఈ గ్యాప్‌నకు కారణం ఏమిటన్న ప్రశ్నకు నిజం చెప్పాలంటే చాలా అవకాశాలు వస్తున్నాయని, అయితే అన్నీ అంగీకరించడం లేదని చెప్పింది. మంచి కథ అనిపిస్తేనే నటించడానికి ఒప్పుకుంటున్నానని చెప్పింది. తనకు కథ నచ్చాలని చెప్పింది. ఇరుదుచుట్రు లాంటి యాక్షన్ కథా చిత్రాల్లో నటిస్తారా? అన్న ప్రశ్నకు ఇప్పట్లో అలాంటి చిత్రాలు చేయనని అంది. ప్రస్తుతానికి ప్రేమ కథా చిత్రాల్లోనే నటించాలని అనుకుంటున్నట్లు చెప్పింది. మళ్లీ బాక్సింగ్ పోటీల్లో పాల్గొనే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు తాను బాక్సింగ్ ప్రాక్టీస్‌ను చేస్తూనే ఉన్నానని, అయితే ప్రస్తుతం చిత్రాలపైనే దృష్టి సారిస్తున్నట్లు రితికాసింగ్ చెప్పింది. ఈ అమ్మడు ఇప్పుడు చాలా గ్లామరస్‌గా మారిపోయింది. గ్లామర్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసి వార్తల్లో ఉండే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ అరుణ్ విజయ్‌తో బాక్సర్ చిత్రంలో నటిస్తోంది. -
‘ఈ సినిమాతో నా చిరకాల కొరిక నెరవేరింది’
యాక్షన్ సినిమాలలో నటించాలన్న తన చిరకాల కొరిక తమీళ ‘యాక్షన్’ మూవీతో తీరిందని టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా అన్నారు. తమిళ స్టార్ హీరో విశాల్, తమన్నా తాజాగా నటించిన చిత్రం ‘యాక్షన్’. ఈ సినిమా ఇటివలె ఫ్రీ రిలీజ్ ఈవేంట్ను జరుపుకున్న విషయం తెలిసిందే.ఈ వారం విడుదలకు సిద్దంగా ఉన్న ఈ సినిమా గురించి తమన్నా మీడియాతో మాట్లాడుతూ.. చాలా రోజులుగా ఫుల్ లెన్త్ యాక్షన్ మూవీలో నటించాలని చుస్తున్నానని, అవకాశం కోసం ఎదురు చుస్తున్న తరుణంలో తన మేనేజర్ ఈ సినిమా గురించి చెప్పడంతో వెంటనే ఈ ప్రాజెక్టుకు ఓకే చెప్పేశానని తెలిపింది. ‘యాక్షన్’ మూవీలో అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సీన్లు ఉన్నాయని చెప్పింది. దీంతో పూర్తి నిడివి గల యాక్షన్ సినిమాల్లో నటించాలన్న తన కొరిక ఈ సినిమాతో నెరవెరిందని తమన్నా చెప్పుకోచ్చారు. కాగా ఈ సినిమా విశేషాల గురించి తమన్నా మాట్లాడుతూ.. హీరో విశాల్, తాను బాడి డబుల్స్‌తో స్టంట్స్ సీన్స్ చేశామని, రోప్‌పై చేసే యాక్షన్ సీన్లో తాను చాలా సేపు గడిపానని తమన్నా భాటియా పేర్కొన్నారు. అలాగే విశాల్‌తో కలిసి చాలా యాక్షన్ సీన్లలో నటించానని, ఈ అనుభూతి నాకు ఎంతో అనందాన్నిచ్చిందని ఆమె అన్నారు. సుమారు రూ. 65 కోట్ల బడ్జెట్‌తో ‘ట్రైడెంట్ ఆర్ట్స్’ బ్యానర్లో నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటి ఐశ్వర్య లక్ష్మీ, విలక్షన నటుడు జగతిబాబులు ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు. కాగా సుందర్.సి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో భారీ యాక్షన్ చాలా ఉన్నాయి. సినిమాలో కొన్ని ముఖ్యమైన యాక్షన్ సీన్లను టర్కిలో చిత్రీకరించారు. అయితే హీరో విశాల్ భారీ యాక్షన్ సీన్లో తానే స్వయంగా నటించి గాయాలపాలైన సంగతి తెలిసిందే. -
‘ఆఫీసర్’ రెండు గంటల్లోపే..!
వరుస ఫెయిల్యూర్స్‌తో కష్టాల్లో పడ్డ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం నాగార్జున హీరోగా ఆఫీసర్ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం క్లైమాక్స్ చిత్రీకరణ తోపాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుపుకుంటోంది. ఇటీవల ఫస్ట్‌లుక్ పోస్టర్ తో పాటు టైటిల్‌ను కూడా ఎనౌన్స్ చేశారు చిత్రయూనిట్. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఈ సినిమాలో నాగ్ కు హీరోయిన్ ఉన్నా.. పాటలు మాత్రం ఉండవట. మైరా సరిన్ ఈ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అవుతోంది. అంతేకాదు ఈ సినిమా రన్‌టైంను కూడా గంటా నలబై ఐదు నిమిషాలు ఉండేలా ప్లాన్ చేస్తున్నాడట వర్మ. హాలీవుడ్ స్టైల్లో పూర్తిగా యాక్షన్ డ్రామాగా ఆఫీసర్‌ను తెరకెక్కిస్తున్నాడు. మరీ ఈ ఆఫీసర్ అయిన వర్మకు హిట్ ఇస్తుందేమో చూడాలి. -
సిద్ధార్ధ్, లక్ష్మీమీనన్ జంటగా యాక్షన్ డ్రామా
'పిజ్జా'తో దర్శకునిగా తన ప్రతిభ నిరూపించుకున్న కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం 'జిగర్తండా'. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో సిద్ధార్ధ్, లక్ష్మీమీనన్ జంటగా నటిస్తున్నారు. ఎస్.కె. పిక్చర్స్, వి.ఎస్.ఆర్. ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్నితెలుగులో అందిస్తున్నాయి. ఒక షెడ్యూల్ మినహా ఈ చిత్రం పూర్తయ్యింది. తెలుగు, తమిళ ప్రేక్షకులకు నచ్చే అద్భుతమైన కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని, సిద్ధార్ధ్ పాత్ర అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుందని, ఓ ప్రముఖ తెలుగు హీరో ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర చేయనున్నారని చిత్ర నిర్మాతల్లో ఒకరైన వి.ఎస్. రామిరెడ్డి చెప్పారు. 'తొలి చిత్రం 'పిజ్జా'తో కార్తీక్ సుబ్బరాజ్ మంచి దర్శకునిగా నిరూపించుకున్నారని, మలి ప్రయత్నంగా ఓ వినూత్న కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని సురేష్ కొండేటి తెలిపారు. వేసవి కానుకగా విడుదల చేయబోతున్న ఈ చిత్రం కూడా మంచి ప్రేక్షకాదరణ పొందుతుందనే నమ్మకం ఉందన్నారు. బాబీ సింహా, కరుణ, గురు సోమసుందరం, ప్రతాప్ పోతన్, సౌందర రాజా, వినోధిని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సంతోష్ నారాయణ్, కెమెరా: గేవ్ మిక్ యు యారీ, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: కార్తీక్ సుబ్బరాజ్.