యాక్షన్ సన్నివేశాలను ఒకే షాట్‌లో చిత్రీకరించామని దర్శకుడు శ్యామ్ ఆంటన్ తెలిపారు. నటుడు అధర్వ మురళి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రానికి శ్యామ్ దర్శకత్వం వహిస్తున్నారు. దీన్ని ప్రమోద్ ఫిలింస్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సంస్థ నిర్మిస్తున్న 25వ చిత్రం ఇది. నిర్మాణ దశలో ఉన్న ఈ చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఒకే షాట్‌లో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించాలన్నది తన చిరకాల కల అని చెప్పారు. తాను, ఫైట్ మాస్టర్ దిలీప్ సుబ్బరాయన్ చాలాకాలం క్రితమే ఇలాంటి సన్నివేశాలను చిత్రీకరించాలని అనుకున్నామన్నారు. అది ఇప్పుడు అధర్వ మురళి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ద్వారా నెరవేరిందన్నారు.
ఈ చిత్రంలోని ఒక యాక్షన్ సన్నివేశాలు ఒకే షాట్లో చిత్రీకరించాలని భావించమన్నారు. దీంతో ఆ యాక్షన్ సన్నివేశం కోసం ఒక్కరోజు మాత్రమే రిహార్సల్స్ చేశామని, చిత్ర యూనిట్ అంకితభావం, అపార కృషితోనే ఆ సన్నివేశం అద్భుతంగా వచ్చిందని చెప్పారు. ఈ చిత్రం తర్వాత నటుడు అధర్వ మురళి జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంటారన్నారు. కాగా ఇలా ఒకే షాట్‌లో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించడం అన్నది కొరియా చిత్రం ఓల్డ్ బాయ్, మూడు ఆస్కార్ అవార్డులు సాధించిన 1917, ది రెవనంట్, ది రైడ్ వంటి చిత్రాల్లో జరిగిందన్నారు. ఇండియాలో మాత్రం ఇలా ఒకే షాట్‌లో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించిన తొలి చిత్రం తమదే అవుతుందని దర్శకుడు పేర్కొన్నారు.
చదవండి: కరోనా గుప్పిట్లో సెలబ్రిటీలు.. బాలీవుడ్‌లో టెన్షన్!
Comments
Please login to add a commentAdd a comment