‘ఆఫీసర్‌’ రెండు గంటల్లోపే..! | Nagarjuna and Varma movie Update | Sakshi
Sakshi News home page

Published Thu, Mar 1 2018 1:18 PM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

Nagarjuna and Varma movie Update - Sakshi

‘ఆఫీసర్‌’ సినిమాలో నాగార్జున

వరుస ఫెయిల్యూర్స్‌తో కష్టాల్లో పడ్డ వివాదాస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ప్రస్తుతం నాగార్జున హీరోగా ఆఫీసర్‌ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మేజర్‌ పార్ట్‌ షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం క్లైమాక్స్‌ చిత్రీకరణ తోపాటు పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు కూడా జరుపుకుంటోంది. ఇటీవల ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ తో పాటు టైటిల్‌ను కూడా ఎనౌన్స్‌ చేశారు చిత్రయూనిట్‌.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర వార్త టాలీవుడ్‌ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఈ సినిమాలో నాగ్‌ కు హీరోయిన్‌ ఉన్నా.. పాటలు మాత్రం ఉండవట. మైరా సరిన్‌ ఈ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అవుతోంది. అంతేకాదు ఈ సినిమా రన్‌టైంను కూడా గంటా నలబై ఐదు నిమిషాలు ఉండేలా ప్లాన్‌ చేస్తున్నాడట వర్మ. హాలీవుడ్‌ స్టైల్‌లో పూర్తిగా యాక్షన్ డ్రామాగా ఆఫీసర్‌ను తెరకెక్కిస్తున్నాడు. మరీ ఈ ఆఫీసర్‌ అయిన వర్మకు హిట్ ఇస్తుందేమో చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement