Active Telugu Film Producers Guild
-
ప్రొడ్యూసర్స్ గిల్డ్‌తో ‘మా’ కీలక భేటీ.. ‘అవసరమైతే స్ట్రయిక్ తప్పదు’
‘యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్’, ‘తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి’ నిర్ణయాల మేరకు తెలుగు పరిశ్రమలో షూటింగ్‌లు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. సమస్యల పరిష్కారం దిశగా తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఇప్పటికే వీపీఎఫ్ (వర్చువల్ ప్రింట్ ఫీ) సమస్యల గురించి ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్లతో చర్చలు జరిపారు. బుధవారం ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్)తో ప్రొడ్యూసర్స్ గిల్డ్ కీలక సభ్యులు సమావేశమై పలు సమస్యల గురించి చర్చించారు. ఈ సమావేశానికి ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు, ‘మా’ జనరల్ సెక్రటరీ రఘుబాబు, కోశాధికారి శివబాలాజీ హాజరయ్యారు. ఇటు నిర్మాతలు ‘దిల్’ రాజు, మైత్రీ నవీన్, నాగవంశీ, శరత్ మరార్, బాపినీడు, వివేక్, నటి-దర్శకురాలు జీవిత తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో నటీనటుల పారితోషికాలు, ‘మా’ సభ్యత్వం వంటి అంశాల గురించి చర్చలు జరిగినట్లుగా తెలిసింది. నూతన నటీనటులను సినిమాల్లోకి తీసుకోవాలంటే వాళ్లు కచ్చితంగా ‘మా’లో అసోసియేట్ లేదా లైఫ్ మెంబర్షిప్ అయినా ఉండాలని, వేరే భాషల నటులను ఇక్కడి సినిమాలకు తీసుకుంటే వాళ్లకు కూడా ‘మా’లో మెంబర్షిప్ ఉండాలనే నిర్ణయాలను ‘మా’ ప్రతిపాదించిందట. ఓటీటీల్లో నటించే ఆర్టిస్టులకూ ‘మా’లో సభ్యత్వం ఉండాలనే అంశాన్ని కూడా చర్చించారట. ‘మా’లో సభ్యత్వం ఉన్నవారిలో దాదాపు వందమంది సీనియర్ నటీనటుల పేర్లు సూచించి, వారికి అవకాశాలు ఇవ్వాలని నిర్మాతలను ‘మా’ కోరినట్లు తెలిసింది. షూటింగ్ బంద్‌కు సంబంధించిన సమస్యలు పరిష్కారం అయ్యేలోపు ‘మా’లో సభ్యత్వం ఉన్న నటీనటులనే తీసుకోవాలన్నట్లుగా నిర్మాతలు నిర్ణయించుకోవాలని కూడా ‘మా’ కోరిందని భోగట్టా. అలా కాని పక్షంలో ‘మా’నే స్ట్రైక్‌కు పిలుపునివ్వాలనే ఆలోచనలో ఉన్నట్లుగా సమాచారం. -
'మా'తో ముగిసిన ప్రొడ్యూసర్స్ గిల్డ్ భేటీ
సాక్షి, హైదరాబాద్: ప్రొడ్యూసర్స్ గిల్డ్ సభ్యులతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) సమావేశం ముగిసింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో దిల్ రాజు, జీవిత రాజశేఖర్, రఘుబాబు, మంచు విష్ణు, తదితరులు పాల్గొన్నారు. సినిమా షూటింగుల నిలుపుదల, ఆర్టిస్టుల పారితోషికం విషయాలపై చర్చించారు. కాగా పారితోషికం తగ్గింపు విషయంలో ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఇదివరకే ప్రత్యేక కమిటీని వేసింది. మరోవైపు ఇదే విషయంపై ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో 33 మందితో ఓ కమిటీ ఏర్పాటైన విషయం తెలిసిందే! చదవండి: అందం కోసం సర్జరీకి సిద్ధమైన ‘బేబమ్మ’.. ఆ బాడీ పార్ట్‌కు మెరుగులు ఆ హీరోయిన్‌తో డేటింగ్ వార్తలపై నోరు విప్పిన చై, ఏమన్నాడంటే.. -
షూటింగ్ సంక్షోభం.. దిగొచ్చిన అగ్ర హీరోలు.. చిరు లేఖ
టాలీవుడ్ నిర్మాతల చర్చలు ఫలిస్తున్నట్లు తెలుస్తోంది. బడ్జెట్ సంక్షోభంలో భాగంగా పలువురు అగ్ర హీరోలు తమ రెమ్యునరేషన్ తగ్గించుకునే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం టాలీవుడ్లో బడ్జెట్ సంక్షోభం నెలకొంది. సినిమాల బడ్జెట్, టికెట్ ధరలపై మంగళవారం కీలక భేటీ అయిన ప్రొడ్యుసర్స్ గిల్డ్ సినిమా షూటింగ్‌ల బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. సినిమా నిర్మాణల బడ్జెట్ వ్యయం, హీరోల రెమ్యునరేషన్ అంశాలు ఓ కొలిక్కి వచ్చేంత వరకు తాత్కాలికంగా షూటింగ్ నిలివేస్తున్నట్లు నిన్న నిర్మాతల గిల్డ్ సంచలన నిర్ణయం తీసుకుంది. చదవండి: Tollywood: టాలీవుడ్ నిర్మాతల సంచలన నిర్ణయం, కొత్త నిబంధనలివే! దీంతో షూటింగ్ దశలో ఉన్న పెద్ద హీరోల సినిమాలతో పాటు చిన్న సినిమాల షూటింగ్ నిలిచిపోయే పరిస్థితి నెలకొనడంతో ప్రముఖ నిర్మాత దిల్ రాజు రంగంలోకి దిగాడు. ఇదే ఇదే అంశంపై పలువురు టాలీవుడ్ అగ్ర హీరోలతో ఆయన సమావేశమైనట్లు సమాచారం. నీ సందర్భంగా స్టార్ హీరోలైన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్‌తో పాటు పలువురు తమ రెమ్యునరేషన్ తగ్గించుకుంటామని దిల్ రాజుకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే మిగతా హీరోలతో కూడా ఈ విషయమై చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామని ప్రొడ్యుసర్స్ గిల్డ్ తెలిపింది. షూటింగ్ సంక్షోభంపై నిర్మాతల గిల్డ్‌కు చిరంజీవి లేఖ రాసినట్లు సమాచారం అందింది. ఇక దీనిపై ఈ రోజు మధ్యాహ్నం నిర్మాతలు భేటీకి సిద్ధం అవుతున్నట్లు కూడా తెలుస్తోంది. చదవండి: ఫ్యాన్స్‌కి షాక్.. ఏడాదికే బ్రేకప్ చెప్పుకున్న ‘బిగ్‌బాస్’ జోడీ