Additional dowry case Suicide
-
అల్లుని దాష్టీకం.. కుటుంబం ఛిన్నాభిన్నం
మైసూరు: ఓ అల్లుని ధన దాహానికి కుటుంబం ఛిన్నాభిన్నమైంది. అల్లుని చేతిలో కుమారుడిని కోల్పోయిన ఒక మాతృమూర్తి ఆ ఆవేదనతో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మైసూరులోని కోర్గళ్లిలో జరిగింది. మృతురాలు భాగ్యమ్మ (46). గత నెల 9న ఆమె కుమారుడు అభిషేక్‌ను ఆమె అల్లుడు రవిచంద్రన్ కత్తితో పొడిచి హత్య చేశాడు. రామకృష్ణనగరలో ఉండే రవిచంద్రన్ అదనపు కట్నం తేవాలని భార్యను వేధిస్తూ తరచూ కొట్టేవాడు.చెల్లిని వేధించవద్దన్నందుకుతన చెల్లిని వేధించవద్దని బావకు నచ్చజెప్పేందుకు వెళ్లిన అభిషేక్‌ను బావ గొడవపడి కత్తితో పొడిచి హత్య చేశాడు. ఆనాటి నుంచి కొడుకు చనిపోయాడు, కూతురి జీవితం భగ్నమైందని బాధపడుతూ ఉన్న భాగ్యమ్మ జీవితంపై విరక్తి చెంది ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై విజయనగర పోలీసు స్టేషన్లో కేసు నమోదు అయింది. ఒకే కుటుంబంలో తల్లీ కొడుకు మరణించడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. -
అప్పుడు ప్రాణాలు తీశాడు.. ఇప్పుడు ప్రాణం తీసుకున్నాడు
హైదరాబాద్: అదనపు కట్నం కోసం భార్య, కుమారుడిని హత్య చేసిన నిందితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని అనాజ్‌పూర్ గ్రామానికి చెందిన ధన్‌రాజ్ (35) ఆదివారం మధ్యాహ్నం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ధన్‌రాజ్ మార్చి 15న భార్య లావణ్య (28), కుమారుడు క్రియాన్స్(రెండు నెలలు)ను హత్య చేయడంతో పోలీసులు రిమాండ్‌కు తరలించారు. రెండు నెలల క్రితం బెయిల్‌పై వచ్చిన నిందితుడు బంధువులు వద్ద ఆశ్రయం పొందాడు. వారం రోజుల క్రితం సొంత గ్రామం అనాజ్‌పూర్‌కు వచ్చి తండ్రితో పాటు నివాసం ఉంటున్నాడు. ఆదివారం మధ్యాహ్నం ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అనాథగా మారిన కుమార్తె తండ్రి చేతిలో తల్లి, తమ్ముడు ప్రాణాలు కోల్పోగా, తండ్రి ధన్‌రాజ్ ఆత్మహత్య చేసుకోవడంతో కుమార్తె ఆధ్య అనాథగా మారింది. ఆరు నెలలుగా బండరావిరాలలోని తన అమ్మమ్మ ఇంటి దగ్గరే ఉంటోంది. తండ్రి కూడా తనువు చాలించడంతో ఆధ్య ఇప్పుడు ఒంటరి అయ్యిందని స్థానికులు, బంధువులు కంటతడి పెట్టారు. -
జైలు నుంచి వచ్చిన రెండు రోజులకే...
కుల్కచర్ల : అదనపు కట్నం కేసులో ఆరునెలలు జైలు శిక్ష అనుభవించి రెండు రోజుల క్రితం బెయిల్‌పై వచ్చిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా కుల్కచర్ల మండలం చాకల్‌పల్లిలో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పెద్దబావి శేఖర్ (24)కు గండేడ్ మండలం దేశాయిపల్లికి చెందిన రాణికి గతేడాది వివాహం జరిగింది. అదనపు కట్నం వేధింపుల కారణంగా వివాహం జరిగిన మూడు నెలలకే రాణి ఆత్మహత్య చేసుకుంది. తన కుమార్తె ఆత్మహత్యకు భర్త శేఖర్, అత్తమామలే కారణమని మృతురాలి తండ్రి నారాయణ అప్పట్లో పోలీ సులకు ఫిర్యాదు చేశాడు. దీంతో శేఖర్‌తో పాటు అతడి తండ్రి యాదయ్య, తల్లి మంగమ్మలను రిమాండ్‌కు పంపారు. తల్లిదండ్రులకు నెల రోజుల కిందట, శేఖర్‌కు ఏప్రిల్ 30న బెయిల్ రావడంతో గ్రామానికి వచ్చి రెండు రోజులున్నాడు. భార్య మృతి చెందడం.. తల్లిదండ్రులు జైలుకు పోవడం.. భార్య ఇంటి నుంచి బెదిరింపులు రావడంతో మనస్తాపం చెందిన శేఖర్ సోమవారం రాత్రి ఇంట్లో పురుగుమందు తాగాడు. విషయాన్ని గమనిం చిన కుటుంబ సభ్యులు శేఖర్‌ను చికిత్స నిమిత్తం మహబూబ్‌నగర్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.