జైలు నుంచి వచ్చిన రెండు రోజులకే... | Youngman commit to suicide After release of two days from the jail | Sakshi
Sakshi News home page

జైలు నుంచి వచ్చిన రెండు రోజులకే...

Published Wed, May 4 2016 6:47 AM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

Youngman commit to suicide After release of two days from the jail

కుల్కచర్ల : అదనపు కట్నం కేసులో ఆరునెలలు జైలు శిక్ష అనుభవించి రెండు రోజుల క్రితం బెయిల్‌పై వచ్చిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా కుల్కచర్ల మండలం చాకల్‌పల్లిలో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పెద్దబావి శేఖర్ (24)కు గండేడ్ మండలం దేశాయిపల్లికి చెందిన రాణికి గతేడాది వివాహం జరిగింది. అదనపు కట్నం వేధింపుల కారణంగా వివాహం జరిగిన మూడు నెలలకే రాణి ఆత్మహత్య చేసుకుంది.

తన కుమార్తె ఆత్మహత్యకు భర్త శేఖర్, అత్తమామలే కారణమని మృతురాలి తండ్రి నారాయణ అప్పట్లో పోలీ సులకు ఫిర్యాదు చేశాడు. దీంతో శేఖర్‌తో పాటు అతడి తండ్రి యాదయ్య, తల్లి మంగమ్మలను రిమాండ్‌కు పంపారు. తల్లిదండ్రులకు నెల రోజుల కిందట, శేఖర్‌కు ఏప్రిల్ 30న బెయిల్ రావడంతో గ్రామానికి వచ్చి రెండు రోజులున్నాడు. భార్య మృతి చెందడం.. తల్లిదండ్రులు జైలుకు పోవడం.. భార్య ఇంటి నుంచి బెదిరింపులు రావడంతో మనస్తాపం చెందిన శేఖర్ సోమవారం రాత్రి ఇంట్లో పురుగుమందు తాగాడు. విషయాన్ని గమనిం చిన కుటుంబ సభ్యులు శేఖర్‌ను చికిత్స నిమిత్తం మహబూబ్‌నగర్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement