additional SPs
-
ఏపీలో పలువురు అడిషనల్ ఎస్పీల బదిలీ
సాక్షి, విజయవాడ: ఏపీలో పలువరు అడిషనల్ ఎస్పీలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 37 మంది అడిషనల్ ఎస్పీలను బదిలీ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. వీరిలో 18 మందికి పదోన్నతులు లభించాయి. -
20 మంది అదనపు ఎస్పీలకు ఎస్పీలుగా పదోన్నతి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 20 మంది అదనపు ఎస్పీలకు ఎస్పీలుగా ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. ఇటీవల ప్రభుత్వం 20 మంది పోలీసు అధికారులకు నాన్ క్యాడర్ ఐపీఎస్‌లుగా పదోన్నతి కల్పిస్తూ ప్యానల్‌ను ఆమోదించింది. వారికి నాన్ క్యాడర్ ఎస్పీలుగా పోస్టింగులు ఇవ్వడంతోపాటు మరో ఎస్పీని బదిలీ చేస్తూ హోం శాఖ ముఖ్య కార్యదర్శి హరీశ్ కుమార్‌గుప్తా బుధవారం ఉత్తర్వులిచ్చారు. బదిలీ అయిన 21 మంది నాన్ క్యాడర్ ఎస్పీల జాబితా ఇదీ.. (1) బి.లక్ష్మీనారాయణ.. ఎస్పీ(ఇంటెలిజెన్స్), (2) కేఎం మహేశ్వరరాజు.. ఎస్పీ(స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో), పల్నాడు జిల్లా, (3)ఎ.సురేశ్‌బాబు.. ఎస్పీ(విజిలెన్స్–ఎన్ఫోర్స్మెంట్), (4)కె.శ్రీనివాసరావు.. డీసీపీ(ట్రాఫిక్), విజయవాడ (5) కె.శ్రీధర్.. ఎస్పీ(ఎస్ఐబీ), (6) కె.తిరుమలేశ్వరరెడ్డి.. ఎస్పీ(విజిలెన్స్–ఎన్ఫోర్స్మెంట్), (7) ఎం.సత్తిబాబు.. డీసీపీ, విజయవాడ, (8) ఎంవీ మాధవరెడ్డి.. ఎస్పీ(విజిలెన్స్–ఎన్ఫోర్స్మెంట్), (9) జె.రామమోహన్‌రావు.. జాయింట్ డైరెక్టర్, ఏసీబీ, (10) ఎన్.శ్రీదేవిరావు.. ఎస్పీ(ఇంటెలిజెన్స్), (11) ఇ.అశోక్‌కుమార్.. ఎస్పీ(ఇంటెలిజెన్స్), (12) ఎ.రమాదేవి.. జాయింట్ డైరెక్టర్, ఏసీబీ (13)కేజీవీ సరిత.. ఎస్పీ, సీఐడీ (14) కె.ఆనందరెడ్డి.. డీసీపీ, విశాఖపట్నం (15) కె.చక్రవర్తి.. ఎస్పీ, ఆర్ఎస్ఏఎస్టీఎఫ్, తిరుపతి (16) కె.ఈశ్వరరావు.. ఏడీసీ, గవర్నర్ (17) కె.చౌడేశ్వరి.. ఎస్ఆర్పీ, గుంతకల్(18) ఇ.సుప్రజ.. జాయింట్ డైరెక్టర్, ఏసీబీ(19) కేవీ శ్రీనివాసరావు.. ఎస్పీ, ఇంటెలిజెన్స్, (20) కె.లావణ్యలక్ష్మి.. ఎస్పీ, ట్రాన్స్‌కో (21) ఎం.సుందరరావు.. ఎస్పీ, ఇంటెలిజెన్స్ -
Andhra Pradesh: పోలీస్‌శాఖలో పునర్వ్యవస్థీకరణ
సాక్షి, అమరావతి: రాష్ట్ర పోలీస్‌శాఖలో పునర్వ్యవస్థీకరణ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 26 జిల్లాలకు 48 అడిషనల్ ఎస్పీలను కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. కొత్త జిల్లాలతో రాష్ట్రంలో సరికొత్త శకానికి వైఎస్ జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు పరిపాలనా సౌలభ్యం, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఇప్పుడున్న 13 జిల్లాలను 26 కొత్త జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించింది. అలాగే 21 కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసింది. దీంతో డివిజన్ల సంఖ్య 51 నుంచి 72కు చేరింది. ఈ మేరకు శనివారం తుది గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేసింది. చదవండి: AP: కొత్త జిల్లాల స్వరూపమిదే.. పెద్ద జిల్లా ఏదంటే? కొత్త రెవెన్యూ డివిజన్లకు ఆర్డీవోలు నియామకం కొత్త రెవెన్యూ డివిజన్లకు ఆర్డీవోలను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు 47 మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ సీఎస్ సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే పలువురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో 51 మంది ఐపీఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో మొత్తం 26 జిల్లాలకు ఎస్పీలను నియమిస్తూ ఉత్తర్వులిచ్చింది. -
AP: 36 మంది డీఎస్పీలకు అదనపు ఎస్పీలుగా పదోన్నతి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 36 మంది డీఎస్పీ (సివిల్)లకు అదనపు ఎస్పీలు (సివిల్)గా ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. వీరిలో ఐదుగురు 2020 నుంచి అడ్హాక్ పద్ధతిలో అదనపు ఎస్పీలుగా విధులు నిర్వర్తిస్తున్నారు. అదనపు ఎస్పీలుగా పదోన్నతి పొందిన 36 మందిని మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశిస్తూ రాష్ట్ర హోం శాఖ బుధవారం ఉత్తర్వులిచ్చింది. -
నలుగురు అడిషనల్ ఎస్పీల బదిలీ
సాక్షి, హైదరాబాద్ : పోలీసుశాఖలో అడిషనల్ ఎస్పీలు (నాన్‌కేడర్)గా విధులు నిర్వర్తిస్తున్న పలువురు అధికారులు బదిలీ అయ్యారు. రా మగుండం అడిషనల్ డీసీపీ (ఆపరేషన్స్)గా ఉన్న పి.శోభన్‌కుమార్‌ను జయశంకర్ భూపాలపల్లి జిల్లా అడిషనల్ ఎస్పీ (ఆపరేషన్స్)గా బదిలీ చేశారు. ప్రస్తుతం ఆ స్థానంలో ఉన్న కె.సురేశ్‌కుమార్‌ను డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయమన్నారు. వరంగల్‌లో అడిషనల్ డీసీపీ (క్రైమ్స్ అండ్ ఆపరేషన్స్)గా వి.తిరుపతిని భద్రాద్రి కొత్తగూడెం అడిషనల్ ఎస్పీ (ఆపరేషన్స్)గా బదిలీ చేశారు. అక్కడున్న అట్ల రమణారెడ్డిని డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశాలు వెలువడ్డాయి. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్తా ఆదేశాలు జారీ చేశారు. -
ఏపీలో 8మంది అడిషనల్ ఎస్పీలకు పదోన్నతులు
సాక్షి, అమరావతి : ఏపీ పోలీసుశాఖకు చెందిన ఎనిమిది మంది అడిషనల్ ఎస్పీలకు నాన్ కేడర్ ఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ ట్రాఫిక్ డీసీపీగా టీవీ నాగరాజు, ఏసీబీ ఎస్పీగా జె.భాస్కర్‌రావు, విజయవాడ ఇంటలిజెన్స్ ఎస్పీగా కె. బాల వెంకటేశ్వరరావులను నియమించింది. ప్రస్తుతం టాస్క్‌ఫోర్స్ ఏసీపీగా పనిచేస్తున్న కె. సూర్యచంద్రరావును పదోన్నతిపై విజయవాడ లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీసీపీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 2018 జూన్ 18 నుంచి 2019 జూలై 16వ తేదీ వరకే విధి నిర్వహణలో మృతి చెందిన హోంగార్డులకు నష్ట పరిహారం విడుదల చేస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు 13 జిల్లాల్లో 63 మంది హోంగార్డు కుటుంబాలకు రూ. 3కోట్ల 15 లక్షల పరిహారం అందించేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. -
పోలీసు వెబ్సైట్లో సీనియారిటీ లిస్టు
800 మంది డీఎస్పీ, అదనపు ఎస్పీల లిస్టులో.. నేడు పదోన్నతులపై నిర్ణయం సాక్షి,హైదరాబాద్: డీఎస్పీలు, అదనపు ఎస్పీలకు సంబంధించి సమగ్ర సీనియారిటీ ప్రొవిజినల్ జాబితాను ఏపీ డీపీసీ రూపొం దించింది. జాబితాను పోలీసు వెబ్‌సైట్‌తోపాటు హోంశాఖ సైట్లో ఉంచినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 800 మంది వరకు డీఎస్పీలు, అదనపుఎస్పీల సీనియారిటీ జాబితాను రూపొందించినట్లు అధికారులు చెప్పారు. ఏపీ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి, హోంశాఖ ముఖ్యకార్యదర్శి ప్రసాదరావు, డీజీపీ జేవీ రాముడులతోపాటు మరో ఇద్దరు అధికారులున్న డీపీసీ జాబితాను రూపొం దించింది. రాష్ట్ర విభజన జరిగినా ఇంకా డీఎస్పీలు, అదనపు ఎస్పీ లు, నాన్‌కేడర్ ఎస్పీల కేటాయింపులు జరగలేదు. మున్ముందు పదోన్నతుల సీనియారిటీపై వివాదాలు తలెత్తకుండా జాబితాను రూపొందించినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర విభజన జరిగాక కూడా ఉమ్మడి రాష్ట్రానికి చెందిన అధికారుల లిస్టును పరిగణన లోకి తీసుకుని తయారు చేసిన ఈ సీనియారిటీ జాబితా వల్ల ఇకపై ఏ సమస్య ఉత్పన్నం కాదని అధికారులంటున్నారు. దీన్ని అనుసరించే ఇరు రాష్ట్రాలు అధికారుల సీనియారిటీని కొనసాగించవచ్చని సీనియర్ ఐపీఎస్ అధికారి ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. అందుబాటులో ఉంచిన ఈ జాబితాపై ఎవరికైనా అభ్యంతరాలుంటే తెలపాలన్నారు. అభ్యంతరాల పరిశీలన జరిగాక బుధవారం పదోన్నతులను కూడా నిర్ణయిస్తామని చెప్పారు. రెండు రాష్ట్రాలవి కలిపి మొత్తం 100 వరకు అదనపు ఎస్పీల పోస్టులు, మరో 25 వరకు నాన్‌కేడర్ ఎస్పీల పోస్టులు ఖాళీగా ఉన్నాయని అధికారవర్గాలు తెలిపాయి. జాబితాలో మరణించిన అధికారులతోపాటు పదవీ విరమణ చేసినవారి పేర్లు కూడా ఉన్నాయని, పదోన్నల వేళ తొలగిస్తామని అధికారులు అంటున్నారు. -
ఎనిమిది మంది అదనపు ఎస్పీల బదిలీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా 8 మంది అదనపు ఎస్పీలను బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎం.వెంకటేశ్వరరావు-అప్పా, కె.రామ్‌చంద్రన్-అప్పా, ఎన్.కోటిరెడ్డి-హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్, ఎల్.ఎస్. చౌహాన్-ఆక్టోపస్, డి.పాపయ్య-హైదరాబాద్ ట్రాఫిక్, మీర్జా రియాజ్ బేగ్-ఎస్.ఎ.ఆర్. సీపీఎల్, మూసా బిన్ ఇబ్రహీం-కర్నూలు హోంగార్డ్స్, కె.ప్రేమ్జీత్-గ్రేహౌండ్స్‌కు బదిలీ అయ్యారు.