Address Proof
-
AP: కొత్త జిల్లాల పేర్లతో అడ్రస్ సర్టిఫికెట్లు రెడీ..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో కొత్త జిల్లాల పేర్లతో చిరునామా సర్టిఫికెట్లు జారీ చేయడానికి ఆ శాఖ ఏర్పాట్లు చేసింది. ఆధార్ కార్డుల్లో కొత్త జిల్లాల పేర్లను చేర్చుకోవడానికి వీలుగా ఈ నిర్ణయం తీసుకుంది. ఆధార్‌కార్డు జారీ సంస్థ యూఐడీఏఐ సూచించిన ఫార్మాట్లో సోమవారం నుంచే అడ్రస్ సర్టిఫికెట్లు జారీ చేయనున్నారు. రాష్ట్రంలో అంతకు ముందు 13 జిల్లాలు ఉండగా.. వైఎస్ జగన్ ప్రభుత్వం ఆ సంఖ్యను 26కు పెంచింది. ఈ నేపథ్యంలో ప్రజలు తమ ఆధార్ కార్డులలో కొత్త జిల్లా పేరుతో చిరునామా మార్చుకోవాలంటే.. ఆ వివరాలతో కూడిన ఏదో ఒక ధ్రువీకరణ పత్రం దాఖలు చేయాల్సి ఉంటుంది. దీంతో ప్రజలు ఇబ్బంది పడకుండా.. కొత్త జిల్లాల పేర్లతో కూడిన అడ్రస్ సర్టిఫికెట్లను సచివాలయాల ద్వారా జారీ చేసేందుకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఏర్పాట్లు చేసింది. అడ్రస్ సర్టిఫికెట్ల జారీ బాధ్యతను సంబంధిత గ్రామ, వార్డు సచివాలయ రెవెన్యూ అధికారులకు అప్పగించారు. ఇందుకనుగుణంగా సచివాలయాల సేవలకు సంబంధించిన ఆన్లైన్ పోర్టల్‌లో కొత్తగా ఈ సేవను కూడా చేర్చారు. ఈ ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు జరగకుండా క్యూఆర్ కోడ్‌తో కూడిన ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని నిర్ణయించారు. ఈ ధ్రువీకరణ పత్రాల పై సంబంధిత వ్యక్తి ఫోటో.. దానిపై గ్రామ, వార్డు రెవెన్యూ అధికారుల సంతకం, సచివాలయ స్టాంప్ ముద్ర వేసి అందజేయనున్నట్లు గ్రామ, వార్డు సచివాలయ శాఖ అధికారులు వెల్లడించారు. కాగా, ఆధార్ జారీకి ఉద్దేశించిన పోర్టల్‌లో కొత్త జిల్లాల పేర్లను చేర్చినట్టు యూఐడీఏఐ హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయ డిప్యూటీ డైరక్టర్ జనరల్ పి.సంగీత మార్చి 16న సీఎస్ జవహర్‌రెడ్డికి లేఖ రాశారు. కొత్త జిల్లాల పేర్లను ఎవరికి వారు తమ ఆధార్‌లో అప్డేట్ చేసుకునేందుకు అడ్రస్ సర్టిఫికెట్ల అవసరముంటుందని అందులో పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: తమ్ముడి వివాహేతర సంబంధం.. అన్నకు శాపమైంది -
ఆధార్ కార్డుదారులకు అలర్ట్.. ఆ సేవలు నిలిపివేత
మీ ఆధార్ కార్డులోని చిరునామాను అప్ డేట్ చేయాలని అనుకుంటున్నారా? అయితే ఈ విషయం గురుంచి తప్పక తెలుసుకోండి. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యుఐడిఎఐ) ఇక నుంచి ఎలాంటి ఆధారాలు/రుజువు లేకుండా చిరునామాను అప్ డేట్ చేయడం సాధ్యపడదు అని ట్విటర్ లో ఒక యూజర్ అడిగిన ప్రశ్నకు బదులు ఇచ్చింది. యుఐడిఎఐ చేసిన ట్వీట్ ప్రకారం అడ్రస్ వాలిడేషన్ లేటర్ సేవలను నిలిపివేసింది. యూజర్ అహ్మద్ మెమోన్ చేసిన ట్వీట్ కు సమాధానమిస్తూ యుఐడిఎఐ జూన్ 14న ఇలా ట్వీట్ చేసింది.. "ప్రియమైన రెసిడెంట్, తదుపరి నోటీసు వచ్చేవరకు అడ్రస్ వాలిడేషన్ లేటర్ సదుపాయం నిలిపివేయబడింది. ఈ జాబితాలో చెల్లుబాటు అయ్యే PAA డాక్యుమెంట్ ఉపయోగించి దయచేసి మీ చిరునామా అప్ డేట్ ని చేసుకోవచ్చు" అని ట్వీట్ లో పేర్కొంది. Dear Resident, the Address Validation Letter facility has been discontinued until further notice. Kindly request your address update using another valid PoA document from the list https://t.co/BeqUA0pkqL — Aadhaar (@UIDAI) June 14, 2021 ఆన్లైన్ లో ఆధార్ కార్డు చిరునామాను మార్చుకోండి ఇలా? ఆధార్ అడ్రస్ అప్డేట్ పోర్టల్ ssup.uidai.gov.in/ssup/ ఓపెన్ చేయండి 'Proceed to Update Aadhaar' మీద క్లిక్ చేయండి 12 అంకెల యుఐడి నెంబరు నమోదు చేయండి సెక్యూరిటీ కోడ్ లేదా క్యాప్చా కోడ్ నమోదు చేయండి 'సెండ్ ఓటీపీ' ఆప్షన్ మీద క్లిక్ చేయండి మీ ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబరుపై ఓటిపి వస్తుంది రిజిస్టర్డ్ మొబైల్ కు వచ్చిన ఓటీపీ నమోదు చేసి 'లాగిన్' మీద క్లిక్ చేయండి మీ ఆధార్ వివరాలు చూపిస్తుంది. చిరునామాను మార్చండి, అలాగే చిరునామా రుజువుగా ఆధార్ పేర్కొన్న 32 డాక్యుమెంట్ ల్లో దేనినైనా స్కాన్ కాపీని అప్ లోడ్ చేసి సబ్మిట్ చేయండి -
పాస్‌పోర్టులు.. ఇక అందుకు పనికిరావు
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ పాస్‌పోర్టుల జారీ విషయంలో కొత్త నిర్ణయం తీసుకుంది. ఇకపై పాస్‌పోర్టు చివరి పేజీలో చిరునామా వివరాలను పొందుపరచకుండా ఖాళీగా వదిలేయాలని నిర్ణయించింది. అది అమలులోకి వస్తే గనుక పాస్‌పోర్టులు ఇక అడ్రస్ ప్రూఫ్‌లుగా పనికి రావు. ఈ మేరకు విదేశాంగ శాఖ అధికారికంగా స్పందించకపోయినా.. సంబంధిత శాఖ అధికారుల నుంచి స్పష్టమైన సంకేతాలు అందుతున్నాయి. త్వరలో ఈ నిర్ణయం అమలు చేయబోతున్నట్లు ఎంఏఈ అధికారి సురేంద్ర కుమార్(న్యాయ విభాగం) ఓ జాతీయ మీడియా ఛానెల్ తో చెప్పారు. వచ్చే దఫా నుంచి జారీ చేయబోయే పాస్‌పోర్టుల నుంచే ఈ నిర్ణయం అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. పాతవి గడువు ముగిసేవరకు వినియోగించుకోవచ్చని.. రెన్యువల్ సమయంలో వాటికి ఈ మార్పులు వర్తిస్తాయని ఆయన వెల్లడించారు. ఇక పాస్‌పోర్టు విధానంలో మార్పులు రాబోతున్నాయన్న విషయాన్ని పుణే ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి జేడీ వైశంపయన్ కూడా దృవీకరించారు. ప్రస్తుతం పాస్‌పోర్టు మొదటి పేజీలో ఫోటోతో కూడిన వివరాలు.. చివరి పేజీలో చిరునామా వివరాలు పేర్కొంటున్న విషయం తెలిసిందే. ఇక పాస్‌పోర్టు రంగును కూడా మార్చే ఉద్దేశంలో కూడా ఎంఈఏ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వాధికారులు, అధికారిక పనుల మీద విదేశాలకు వెళ్లేవారికి తెలుపు రంగు, దౌత్యవేత్తలకు ఎరుపు, మిగతా వారికి నీలి రంగు పాస్‌పోర్టులు జారీ చేయనున్నారని సమాచారం. -
పాన్, అడ్రస్ ప్రూఫ్ దుర్వినియోగం కాకుండా చూసుకోండి..
ప్రస్తుతం ప్రతిదానికి ఆధార్ తప్పనిసరి అవుతోంది. ఇక ఆర్థిక లావాదేవీలకు వచ్చేసరికి ఆధార్ సహా పాన్, బ్యాంక్ అకౌంట్ వంటి పలు వివరాలు అవసరమౌతున్నాయి. ఈ విధంగా మనం మన విలువైన వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులతో పంచుకుంటున్నాం. ఇది తప్పనిసరి. ఇలా చేయడం వల్ల కొన్ని సందర్భాల్లో డేటా తస్కరణ జరిగే ప్రమాదమూ ఉంది. మన అకౌంట్ ద్వారా మనకు తెలియకుండానే ఏదో ఒక ఆర్థిక లావాదేవీ జరిగితే తప్ప మనకు మన వివరాలను ఎవరో దొంగలించారని తెలియదు. ఇలాంటి సంఘటనలు ఈ మధ్య కాలంలో చాలానే జరుగుతున్నాయి. అకౌంట్ నుంచి పెద్ద మొత్తంలోనే డబ్బులు మాయమౌతున్నాయి. వ్యక్తిగత వివరాలను, విలువైన సమాచారాన్ని సాధ్యమైనంత వరకు పబ్లిక్‌గా ఎవరితోనూ పంచుకోకూడదు. మరీముఖ్యంగా ఫేస్బుక్, ట్వీటర్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లోనూ, ఆన్‌లైన్‌లోనూ వ్యక్తిగత వివరాలను ఉంచడం కానీ, షేర్ చేయడం కానీ చేయకూడదు. తెలియని నెంబర్ నుంచి వచ్చే కాల్స్‌కి, వివరాలు తెలుసుకునేందుకు చేసే కాల్స్‌కు సమాధానమివ్వకూడదు. మీ బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నామని కొందరు ఫోన్ చేస్తుంటారు. వీటి పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఇతర దేశాల్లోని స్నేహితుల నుంచి డబ్బులు పంపమని వచ్చిన ఈ–మెయిల్స్‌కు రిప్లయ్ ఇవ్వకండి. ఎవ్వరికైనా పాన్, బ్యాంక్ అకౌంట్, ఆధార్ డాక్యుమెంట్లను ఇచ్చేటప్పుడు, ఏ పనికోసమైతే వాటిని ఇస్తున్నారో ఆ వివరాలను పత్రాలపై రాయండి. దీని ద్వారా డాక్యుమెంట్లు మిస్యూజ్ కాకుండా చూసుకోవచ్చు.