adishesha giri rao
-
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును కలిసిన FNCC సభ్యులు
భారత మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్య నాయుడు గారికి పద్మ విభూషణ్ వచ్చిన సందర్భంగా ఫిల్మ్ నగర్ కల్చర్ సెంటర్ (FNCC) ప్రెసిడెంట్ జి. ఆదిశేషగిరిరావు, వైస్ ప్రెసిడెంట్ టి. రంగారావు, సెక్రటరీ ముళ్ళపూడి మోహన్, జాయింట్ సెక్రెటరీ వి. వి. ఎస్. ఎస్. పెద్దిరాజు, ట్రెజరర్ బి. రాజశేఖర్ రెడ్డి, కమిటీ మెంబర్స్ కాజా సూర్యనారాయణ, జే. బాలరాజు, ఏ. గోపాలరావు గార్లు వెంకయ్య నాయుడు గారిని కలిసి అభినందించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా FNCC ప్రెసిడెంట్ జి. ఆదిశేషగిరిరావు గారు మాట్లాడుతూ.. గతంలో వెంకయ్య నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే గా, ఎంపీగా ఉండటమే కాకుండా వివిధ శాఖల మంత్రిగా అలాగే మాజీ ఉపరాష్ట్రపతిగా ఎన్నో సేవలు అందించారు. వెంకయ్య నాయుడు గారు చెప్పే విషయాలు చాలా విలువైనవిగా ఉంటాయి. ఆయన మాటల్ని అందరూ స్ఫూర్తిగా తీసుకుంటారు. అలాంటి ఉన్నత వ్యక్తికి పద్మ విభూషణం రావడం చాలా ఆనందాన్ని కలిగిస్తోంది. అలాగే సినిమా ఇండస్ట్రీకి కూడా ఎంతో సన్నిహితంగా ఉంటారని ఆయన తెలియ చేశారు. FNCC సెక్రటరీ మోహన్ ముళ్ళపూడి గారు మాట్లాడుతూ.. ఈ రోజున వెంకయ్య నాయుడు గారి లాంటి ఉన్నత వ్యక్తికి పద్మ విభూషన్ రావడం అనేది చాలా ఆనందకరమైన విషయం. తెలుగువారిగా ఉపరాష్ట్రపతి స్థానానికి ఎదిగిన వ్యక్తి. తెలుగు సంప్రదాయ కార్యక్రమాలాకు హాజరవుతూ ప్రోత్సహించడంలో ముందుంటారు. అలాంటి వ్యక్తికి భారతరత్న రావాలని నా అభిప్రాయం అని తెలియజేశారు. మాకు సమయాన్ని కేటాయించినందుకు వెంకయ్య నాయుడు గారికి ధన్యవాదాలు అన్నారు -
‘మోసాలకు, కుట్రలకు బాబు పెట్టింది పేరు’
సాక్షి, గుంటూరు : కుట్రలు, మోసాలకు చంద్రబాబు నాయుడు పెట్టింది పేరని వైఎస్సార్ సీపీ నేత ఘట్టమనేని ఆదిశేషగిరి రావు విమర్శించారు. నవ నిర్మాణ దీక్షల పేరిట చంద్రబాబు మళ్లీ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. తన అసరమర్థతను కప్పిపుచ్చుకునేందుకే కేంద్రంతో పాటు ప్రతిపక్షంపై చంద్రబాబు విమర్శలు చేస్తున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ సీపీ చేస్తోన్న పోరాటం చూసి చంద్రబాబులో అభద్రతా భావం నెలకొందన్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా పోలవరం ప్రాజెక్టు సాధించిన ఘనత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికే దక్కుతుందని ఆదిశేషగిరి రావు వ్యాఖ్యానించారు. -
చంద్రబాబుపై ఆదిశేషగిరిరావు ధ్వజం
సాక్షి, విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఘట్టమనేని ఆదిశేషగిరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు సర్కార్ అన్ని రంగాల్లో విఫలమైందని, ప్రజా సమస్యలు గాలికి వదిలేసి ఈవెంట్ మేనేజ్మెంట్లతో కాలం గడుపుతోందని ఆయన మండిపడ్డారు. ఆదిశేషగిరిరావు బుధవారం విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ... కృష్ణా, గోదావరి డెల్టాలు పూర్తిగా ఎండిపోయాయని, వాటి గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ప్రతి పనికి ప్రతిపక్షం అడ్డుపడుతుందంటూ నెపం నెడుతున్నారన్నారు. టీడీపీ లేఖ ఇవ్వకపోతే రాష్ట్రం విడిపోయేది కాదని ఆదిశేషగిరిరావు అన్నారు. హైదరాబాద్‌లో ఆరోగ్యశ్రీని ఎందుకు ఉపయోగించుకోకూడదని, హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కాదా? అని ఆయన సూటిగా ప్రశ్నించారు. రాష్ట్ర విభజన తర్వాత మిగులు విద్యుత్ ఉన్నా...కరెంట్ ఛార్జీలు పెంచుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. బీజేపీ, టీడీపీ నేతలు సంకీర్ణ ప్రభుత్వంలో ఉంటూ..ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ తన గొప్పేనని గతంలో చంద్రబాబు చెప్పారని, ఇప్పుడు బీజేపీపై నెపం మోపే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఏపీ డీజీపీ నియామకంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని అన్నారు. -
చంద్రబాబుపై ధ్వజమెత్తిన ఆదిశేషగిరిరావు
-
‘చేతి’లో జాబితా!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : జిల్లాలో పోటీ చేయనున్న కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాపై అధిష్టానం జయనామ సంవత్సరం తొలిరోజున కొలిక్కొచ్చింది. గెలుపు గుర్రాల జాబితాను వడపోసిన ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ.. అభ్యర్థుల ఎంపికపై కసరత్తును పూర్తిచేసింది. జిల్లాలోని 14 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి జాబితాకు తుది మెరుగులు దిద్దింది. పార్లమెంటు స్థానాల విషయంలో ఇంకా స్పష్టత రానప్పటికీ, శాసనసభ నియోజకవర్గాల అభ్యర్థులను మాత్రం ఖరారు చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. సిట్టింగ్ ఎమ్మెల్యేల విషయంలో స్వల్ప మార్పులు మినహా మెజార్టీ శాసనసభ్యులకు టికెట్లు దక్కినట్లు సమాచారం. ఉప్పల్ శాసనసభ్యుడు బండారి రాజిరెడ్డి స్థానే సోదరుడు లక్ష్మారెడ్డిని బరిలోకి దించేందుకు అధిష్టానం అంగీకరించింది. మరోవైపు ప్రముఖ సినీ నిర్మాత ఆది శేషగిరిరావును కూకట్పల్లి నుంచి బరిలో దించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణేతరులు, సినీ పరిశ్రమకు సంబంధించిన ఓటర్లు ఈ ప్రాంతంలో అధికంగా ఉన్నందున ఈయన అభ్యర్థిత్వాన్ని ఓకే చేసింది. మల్కాజిగిరి ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడంతో అక్కడ నందికంటి శ్రీధర్ వైపు అధిష్టానం మొగ్గు చూపుతోంది. ఈయనకు టికెట్ ఇవ్వాల్సిందేనంటూ సిట్టింగ్ ఎంపీ సర్వే సత్యనారాయణ పట్టుబడుతున్నారు. ఇదిలావుండగా, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అభ్యర్థిత్వంపై సర్వే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సుధీర్‌కు టికెట్ ఇవ్వకుండా ప్రయత్నాలు సాగిస్తున్నారు. మేడ్చల్‌పై జైపాల్ పట్టు తన అనుచరుడు ఉద్దెమర్రి నరసింహారెడ్డికి మేడ్చల్ టికెట్ ఇప్పించడానికి కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి తనదైన శైలిలో పావులు కదుపుతున్నారు. అధిష్టానం పెద్దలతో నేరుగా సంప్రదింపు లు జరుపుతున్న ఆయన ఉద్దెమర్రి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసేలా లాబీ యింగ్ చేస్తున్నారు. ఈ పరిణామం సిట్టింగ్ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డిని ఇరకాటంలో పడేస్తోంది. సిట్టింగ్‌లకు స్థాన మార్పిడి ఉండదనే ధీమాతో ఉన్న ఆయనకు జైపాల్ వ్యవహారశైలి మింగుడు పడడంలేదు. ఎంపీ రేసులో శశిధర్ మరోవైపు చేవెళ్ల లోక్‌సభ స్థానానికి ఎన్డీఆర్ఎఫ్ వైస్ చైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని అధిష్టానం చురుగ్గా పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈసారి మహబూబ్‌నగర్ నుంచి బరిలో దిగాలని నిర్ణయించుకున్న జైపాల్‌రెడ్డి తన స్థానంలో శశిధర్‌ను ఇక్కడి నుంచి పోటీ చేయించేందుకు వ్యూహారచన చేస్తున్నారు. ఒకవేళ శశిధర్ కనుక పోటీకి విముఖత చూపితే మేడ్చల్ ఎమ్మెల్యే కేఎల్లార్ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని అధిష్టానానికి సూచించారు. తద్వారా తన అనుయాయుడు ఉద్దెమర్రికి లైన్‌క్లియర్ అవుతుందని అంచనా వేస్తున్నారు. కాగా, కేఎల్లార్ మాత్రం సిట్టింగ్ స్థానాన్ని వదిలేందుకు ససేమిరా అంటున్నారు. రాజేంద్రనగర్‌కు సబిత కుటుంబసభ్యులకు ఒక సీటే అనే హైకమాండ్ నిబంధన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫ్యామిలీని ఆత్మరక్షణలో పడేసింది. చేవెళ్ల ఎంపీ బరిలో సబితను దింపాలని అధిష్టానం భావించినా.. ఆమె మాత్రం రాజేంద్రనగర్ నుంచి తిరిగి అసెంబ్లీకి పోటీచేయాలని యోచిస్తున్నారు. ఇదే విషయాన్ని హైకమాండ్ చెవిన వేశారు. దీనికి సానుకూలంగా స్పందించిన అగ్ర నాయకత్వం మహేశ్వరం నుంచి రాజేంద్రనగర్‌కు మారేందుకు అంగీకరించారు. అయితే, కుటుంబంలో ఒకరికే సీటు నిబంధన సబిత ఫ్యామిలీని ఇరకాటంలో పడేసింది. తనయుడు కార్తీక్‌రెడ్డి చేవెళ్ల ఎంపీగా, తాను రాజేంద్రనగర్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించారు. అయితే, అధిష్టానం షరతు ఆమెకు ప్రతికూలంగా మారింది. దీనికితోడు కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి వ్యతిరేకంగా పావులు కదుపుతుండడం సబిత వర్గీయులను ఆందోళనకు గురిచేస్తోంది. ఆమె అవకాశాలను దెబ్బతీయాలనే ఆలోచనతో శశిధర్ పేరును తెరమీదకు తెచ్చారనే వాదనలు వినిపిస్తున్నాయి.