కలెక్టరేట్ ఏఓగా కృష్ణమోహన్
హన్మకొండ అర్బన్: వరంగల్ కలెక్టరేట్ పరిపాలన అధికారిగా కృష్ణమోహన్ నియామకమయ్యారు. ఇప్పటివరకు ఏఓగా విధులు నిర్వర్తించిన మార్గం కుమారస్వామి ఇటీవల ఉద్యోగ విరమణ పొందడంతో ఆయన స్థానంలో కృష్ణమోహన్‌ను నియమిస్తూ కలెక్టర్ వాకాటి కరుణ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, కృష్ణమోహన్ గతంలో సుదీర్ఘకాలంపాటు కలెక్టర్ క్యాంపు కార్యాలయం సూపరింటెండెంట్‌గా పనిచేశారు. 2009లో అప్పటి కలెక్టర్ జనార్దన్‌రెడ్డి బదిలీ తర్వాత ఆయన పర్వతగిరి తహసీల్దార్‌గా బదిలీపై వెళ్లారు. అనంతరం రఘునాథపల్లి, భూ పా లపల్లిలో కొంతకాలం పనిచేశారు. ప్రస్తుతం డిప్యూటేషన్‌పై డ్వామాలో మహబూబాబాద్ ఏపీడీగా పనిచేస్తున్నారు.
అనూహ్యంగా తెరపైకి
ఏఓ కుమారస్వామి ఉద్యోగ విరమణ పొం దుతారనే విషయం తెలుసుకున్న ప్రోడీటీలు, ప్రోమోటీల్లో కొంతకాలం వరకు హైడ్రామా నెలకొంది. ప్రస్తుతం కలెక్టరేట్లో సీ సెక్షన్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న ఓ అధికారి పేరును కొందరు ప్రతిపాదించారు. అదే సమ యంలో తహసీల్దార్ల సంఘం నాయకులు ప్రసుత్తం జనగామ తహసీల్దార్‌గా పనిచేస్తున్న చెన్నయ్య పేరును కూడా ఏఓగా ప్రతి పాదించారు. ఈ రెండు పేర్లతోపాటు మరి కొందరి పేర్లు కూడా కలెక్టర్ పరిశీలనకు పంపగా.. అనూహ్యంగా కృష్ణమోహన్ పేరు ను ఉన్నతాధికారులు ఫైనల్ చేశారు. ఇదిలా ఉండగా, కలెక్టర్ క్యాంపు కార్యాలయం సూపరింటెండెంట్‌గా పనిచేసిన కాలంలో సుమారు 18 మంది ఐఏఎస్ అధికారుల వద్ద కృష్ణమోహన్ పనిశారు. భూపాలపల్లిలో పనిచేస్తున్న సమయంలో రాజకీయ ఇబ్బందులతో డిప్యూటేషన్‌పై డ్వామాకు వెళ్లారు. ప్రస్తుతం మాతృశాఖలో చేరి కలెక్టరేట్‌కు ఏఓగా వస్తున్నారు.