adulterated petrol
-
పెట్రోల్‌లో నీరు..!
జయపురం : ఒక పక్క కేంద్రప్రభుత్వం పెంచుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో అదనపు భారం మోస్తున్న వినియోగ దారులు తాము పెట్రోల్ బంకులలో పోయించుకుంటున్న పెట్రోల్ కల్తీది అని తెలిస్తే వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించ నక్కరలేదు. అటువంటి సంఘటన జయపురం పెట్రోల్ వినియోగదారులకు అనుభవ పూర్వకంగా తెలియవచ్చింది. జయపురంలోని మహారాణిపేటకు చెందిన కె.కోటేశ్వర రావు అనే వ్యక్తి జయపురంలోని మహాత్మాగాంధీ జంక్షన్లో గల ఒక పెట్రోల్ బంక్‌లో రూ.200 పెట్రోల్ తన స్కూటీలో పోయించి వెళ్లాడు. ఆ వ్యక్తి కొంతదూరం వెళ్లేసరికి వాహనం ముందుకు కదిలేందుకు మొరాయించింది. ఎంత ప్రయత్నించినా స్కూటీ కదలక పోవడంతో మరో మార్గంలేక మెకానిక్ దగ్గరకు తీసుకువెళ్లాడు. స్కూటీని పరీక్షించిన మెకానిక్ స్కూటీ పెట్రోల్ ట్యాంక్‌లో నీరు ఉందని అందుచేతనే కదలడం లేదని తెలిపాడు. అదేమిటి ఇప్పడే కదా రెండు వందలు ఇచ్చి పెట్రోల్ పోయించింది. అది నీరుగా ఎలా మారిందని పెట్రోల్ బంక్‌కు వెళ్లి వాహన చోదకుడు అడిగాడు. అది విని అక్కడ ఉన్నవారు అనుమానించి ఒక బాటిల్లో పెట్రోల్ వేయించి చూడగా అందులో నీరు ఉన్నట్లు వెల్లడైంది. ఆ బంక్‌లో పెట్రోల్ పోయించుకున్న వారు తమతమ వాహనాలను పరీక్షించగా వాటి ట్యాంక్‌లలో కూడా కల్తీ పెట్రోల్ బండారం బయటపడింది. ఈ విషయమై బాధితులు జయపురం జిల్లా పౌరసరఫరాల విభాగ అధికారులకు తెలియజేయగా ఆ విభాగ అధికారి రవినారాయణ నందో తన సిబ్బందితో వచ్చి పెట్రోల్‌ను పరీక్షించారు. పెట్రోల్‌లో నీరు కలిసి ఉందని వెల్లడి కావడంతో ఆ బంక్‌ను మూసి వేయించారు. తనిఖీ చేయనున్న బీపీసీఎల్ పెట్రోలులోకి నీరు ఎలా వచ్చిందన్నది తమకు తెలియదని బంక్ యజమాని తెలపగా ఈ విషయం బీపీసీఎల్ అధికారులకు పౌరసరఫరాల విభాగ అధికారి తెలియ జేశారు.అక్కడి నుంచి ఇంజినీర్లు వచ్చిన తరువాత పెట్రోలులోకి నీరు ఎలా వచిందో కనుగొంటారని పౌరసరఫరాల అధికారి వెల్లడించారు. భూమిలోగల పెట్రోల్ ట్యాంక్ లీక్ అయిందా లేక కల్తీ పెట్రోల్ వస్తోందా? లేదంటే బంకులోనే కల్తీ చేస్తున్నారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా పెట్రోలులో నీరు కల్తీ జరగడం వల్ల తమ డబ్బు పోవడమే కాకుండా వాహనాలు పాడవుతాయని వినియోగ దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
కల్తీ పెట్రోల్.. బంక్ సీజ్
గొల్లప్రోలు : తూర్పుగోదావరి జిల్లాలో కల్తీ పెట్రోల్ అమ్ముతున్న ఓ పెట్రోల్ బంక్‌ను అధికారులు సీజ్ చేశారు. జిల్లాలోని గొల్లప్రోలులోని ఓ పెట్రోల్ బంక్‌లో కల్తీ పెట్రోల్ విక్రయిస్తున్నారనే సమాచారంతో కాకినాడ ఆర్డీవో అంబెద్కర్ శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. కల్తీ విషయం నిజమేనని తేలడంతో పెట్రోల్‌బంక్‌ను సీజ్ చేశారు. కల్తీ పెట్రోల్ అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్డీవో హెచ్చరించారు. -
కల్తీ పెట్రోల్‌పై వినియోగదారుల కన్నెర్ర
♦ పెట్రోల్ బంకు వద్ద రెండు గంటల పాటు ఆందోళన ♦ స్టాక్‌ను విక్రయించరాదని తహశీల్దార్ ఆదేశం ♦ టెస్టింగ్ కోసం పెట్రోల్, డీజిల్ నమునాల సేకరణ ఉప్పునుంతల : ఉప్పునుంతలలోని బాలాజీ ఫిల్లింగ్ స్టేషన్లో కల్తీ పెట్రోల్ విక్రయిస్తున్నారని మంగళవారం ఉదయం వినియోగదారులు ఆందోళన చేశారు. పెట్రోలు పోయించుకొని కొద్దిదూరం వెళ్లగానే వాహనాలు ఆగిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. పెట్రోల్‌లో నీళ్లు కలిపారని వారు ఆరోపించారు. తాము పోయించుకున్న పెట్రోల్‌ను బైక్‌ల నుంచి తీసి బాటిళ్లలో పట్టి నీటిలా పేరుకుకోవడం చూపించారు. మొదటగా సిద్దాపూర్‌కు చెందిన బాలునాయక్ అనే కానిస్టేబుల్ ఉప్పునుంతలలోని బాలాజీ పెట్రోల్ బంకులో పెట్రోల్ పోయించుకొన్నాడు. కిలోమీటర్ దూరం వెళ్లగానే బైక్ ఆగిపోయింది. దీంతో అనుమానంతో అతను బైక్ మెకానిక్‌ను పిలిపించి చూపగా పెట్రోల్‌ను బాటిల్లోకి తీసి చూశారు. అందులో 30 నీరులా కిందకు పేరుకుకోవడంతో బంకు దగ్గరకు వచ్చి నిలదీశాడు. ఆ తర్వాత వరుసగా అంతకుముందు బంకులో పెట్రోల్ పోయించుకొని వెళ్తే తమ బైక్‌లు ఆగిపోయావని మరికొంతమంది వాహనదారులు అక్కడకు వచ్చి ఆందోళన వ్యక్తంచేశారు. బాధితులు ఫిర్యాదుచేయడంతో తహశీల్దార్ సైదులు పెట్రోల్‌ను పరిశీలించారు. ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. తహశీల్దార్ ఎదుటే పెట్రోల్ పరీక్ష చేయించారు. తాము ఇక్కడ ఎలాంటి కల్తీకి పాల్పడలేదని ఇండిన్ ఆయిల్ కంపెనీ నుంచి వచ్చిన పెట్రోల్‌ను యధావిధిగా అమ్ముతున్నామని నిర్వాహకుడు తెలిపారు. కొంతమందికి పెట్రోల్ డబ్బులు వాపస్చేశారు. కల్తీగా తేలితే కఠిన చర్యలు.. పెట్రోల్,డీజిల్‌లో కల్తీగా నిర్ధారణ అయితే కఠిన చర్యలు తీసుకుంటామని తహశీల్దార్ సైదులు తెలిపారు. పెట్రోల్, డీజిల్ షాంపిళ్లను బాటిళ్లలో తీయించారు. ప్రస్తుతం కల్తీగా భావిస్తున్న స్టాక్ విక్రయాన్ని నిలిపేయాలని బంకు నిర్వాహకునికి సూచించారు. షాంపిళ్లను టెస్టింగ్ కోసం ల్యాబ్‌కు పంపనున్నామని తహశీల్దార్ తెలిపారు. -
‘కల్తీ’మే సవాల్
పెట్రోల్ బంక్‌ల ఇం‘ధన’ దందా మహారాష్ట్ర ఆయిల్ మాఫియా బాటలో నగరం ట్యాంకర్ల కొద్దీ చేరుతున్న కల్తీ సరుకు ఫిర్యాదులు పరీక్షలకే పరిమితం సాదాసీదా తనిఖీలతోనే సరి మూలన పడుతున్న వాహనాలు రమేష్ దారిలో ఓ బంకులో పెట్రోల్ కొట్టించుకుని బయల్దేరిన కాసేపటికే మధ్యలో బండి మొరాయించింది. నేరుగా మెకానిక్ వద్దకు వెళ్తే.. కల్తీ పెట్రోల్ కావడం వల్ల ఇంజన్ దెబ్బతిందని చెప్పాడు. వెంటనే రమేష్ తాను పోయించుకున్న పెట్రోల్ తాలూకు శాంపిల్‌ను తీసుకెళ్లి పౌరసరఫరాల అధికారులకు, బంక్ నిర్వాహకులకు ఫిర్యాదు చేశాడు. నెలైనా ఫలితం లేదు. ఇటు కల్తీ నిర్ధారణ జరగలేదు. అటు బంక్ నిర్వాహకుల నుంచి సమాధానం లేదు. బండి మాత్రం షెడ్‌కు చేరింది. వెంకట్ నిత్యం అదే బంక్‌కు వెళ్తాడు. ఓసారి ఎందుకో అనుమానం వచ్చింది. బైక్‌లో పోసిన పెట్రోల్ శాంపిల్ తీశాడు. బంక్‌లో నిత్యం భద్రపర్చి ఉంచాల్సిన పెట్రోల్ శాంపిల్ ఇవ్వాలని నిర్వాహకులను అడిగాడు. తాము దాన్ని తీసి ఉంచలేదనే బదులొచ్చింది. రెండు శాంపిల్స్‌ను పోల్చడం ద్వారా కల్తీ కనిపెట్టాలనేది వెంకట్ ఆలోచన. కానీ అందుకు వీల్లేకుండాపోయింది. సాక్షి, సిటీబ్యూరో: గడిచిన ఐదేళ్లలో నగరంలో ఉన్న దాదాపు 330 పెట్రోలు బంకుల నుంచి పౌరసరఫరాల శాఖ సేకరించిన శాంపిళ్లు నాలుగంటే నాలుగే. వీటిని రెడ్‌హిల్స్‌లోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపగా, ఒక్కదాంట్లోనూ కల్తీ జరిగినట్లు నివేదిక అందలేదు. ఈ ఒక్క కారణంతో అధికారులు పెట్రోల్ బంక్‌ల వైపు కన్నెత్తి చూడట్లేదు. తాజాగా పెట్రోల్ బంక్‌ల్లో గప్‘చిప్’గా సాగుతున్న పంపింగ్ మోసం బయటపడిన మాదిరిగానే కల్తీ ఇంధన వ్యవహారం గుట్టు ఎప్పుడు రట్టవుతుందో?.. అప్పటి వరకు వాహన చోదకులకు ఇబ్బందులు తప్పేలా లేవు. నగరంలో ఇంధన కల్తీ తీవ్రస్థాయిలో జరుగుతోంది. పెట్రోల్, డీజిల్ బండిని పరుగెత్తించడానికి బదులు మూన్నాళ్లకే మూలన పడేలా చేస్తున్నాయి. పాడైన వాహనాల్ని బాగు చేయించుకోవడానికి మళ్లీ వాహనచోదకులకే ‘చమురు’ వదులుతోంది. మహారాష్ట్ర మాఫియా జాడలో.. మహారాష్ట్రలోని కల్తీ ఆయిల్ మాఫియా నగరంలోనూ వేళ్లూనుకుంటోంది. అక్కడ కల్తీ దందా వ్యవస్థీకృతంగా సాగిపోతోంది. నగరంలోని పెట్రోల్ బంకులు అదే బాటలో నడుస్తున్నాయి. కొన్నేళ్లుగా పెట్రోల్, డీజిల్‌తో పాటే ట్యాంకర్ల కొద్దీ టిన్నర్, నాఫ్తా ఆయిల్, కిరోసిన్ పెట్రోల్ బంకులకు యథేచ్ఛగా సరఫరా అవుతున్నట్టు సమాచారం. చాలా బంక్‌లు మానవ వనరుల నిర్వహణ ద్వారానే కొనసాగుతున్నాయి. ఇటువంటి నాన్ ఎలక్ట్రానిక్ పెట్రోల్ బంక్‌లే కల్తీ ప్రక్రియకు వేదికవుతున్నాయి. తరచూ వీటిని తనిఖీ చేయాల్సిన పౌరసరఫరా శాఖాధికారులు పట్టనట్టుగా ఉండిపోతుండటంతో బంక్ నిర్వాహకుల కల్తీ దందాకు అడ్డూఆపూ లేకుండాపోతోంది. అడపాదడపా వినియోగదారులు అనుమానించి నిలదీస్తున్నా, అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా ఫలితం లేకపోతోంది. ప్రధానంగా బంకులు రాజకీయ, పలుకుబడి గల యాజమాన్యాలు ఆధీనంలో ఉండటంతో తనిఖీలకు అధికారులు ధైర్యం చేయలేని పరిస్థితి నెలకొంది. కల్తీ దందాకు అవే అడ్డాలు నగరంలోని చాలా బంకులు ఇప్పటికీ నాన్ ఎలక్ట్రానిక్ బంకులుగానే ఉన్నాయి. ఎలక్ట్రానిక్ బంకులు చాలా తక్కువ. నగరంలోని పూర్తిస్థాయి ఎలక్ట్రానిక్ బంకులుముంబైలోని ఆయిల్ కంపెనీల ప్రధాన యూనిట్లతో అనుసంధానమై ఉంటాయి. ఇంధన కల్తీ జరిగినా, రీడింగ్, ఇంధన సాంద్రతలో తేడా ఉన్నా వెంటనే అక్కడ తెలిసిపోతుంది. దీంతో ఈ తరహా బంకుల్లో కల్తీకి అవకాశం తక్కువ. సాధారణంగా నిత్యం 25 వేల లీటర్ల పెట్రోల్, 40 వేల లీటర్ల డీజిల్‌ను విక్రయించే బంకులు పూర్తి స్థాయి ఎలక్ట్రానిక్ బంకుగా మారాలి. చాలాచోట్ల తగిన స్థాయిలో అమ్మకాలున్నా.. ఎలక్ట్రానిక్‌గా బంక్‌లుగా మారకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఇటువంటి బంకుల్లోనే కల్తీకి అవకాశాలున్నాయి. కల్తీ దందాకు అవే అడ్డాలు నగరంలోని చాలా బంకులు ఇప్పటికీ నాన్ ఎలక్ట్రానిక్ బంకులుగానే ఉన్నాయి. ఎలక్ట్రానిక్ బంకులు చాలా తక్కువ. నగరంలోని పూర్తిస్థాయి ఎలక్ట్రానిక్ బంకులుముంబైలోని ఆయిల్ కంపెనీల ప్రధాన యూనిట్లతో అనుసంధానమై ఉంటాయి. ఇంధన కల్తీ జరిగినా, రీడింగ్, ఇంధన సాంద్రతలో తేడా ఉన్నా వెంటనే అక్కడ తెలిసిపోతుంది. దీంతో ఈ తరహా బంకుల్లో కల్తీకి అవకాశం తక్కువ. సాధారణంగా నిత్యం 25 వేల లీటర్ల పెట్రోల్, 40 వేల లీటర్ల డీజిల్‌ను విక్రయించే బంకులు పూర్తి స్థాయి ఎలక్ట్రానిక్ బంకుగా మారాలి. చాలాచోట్ల తగిన స్థాయిలో అమ్మకాలున్నా.. ఎలక్ట్రానిక్‌గా బంక్‌లుగా మారకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఇటువంటి బంకుల్లోనే కల్తీకి అవకాశాలున్నాయి. మహా నగరంలో... పెట్రోల్/డీజిల్ బంకులు: 330కిపైగా మొత్తం వాహనాలు: 40 లక్షలు పెట్రోల్‌తో నడిచే వాహనాలు: 29 లక్షలు డీజిల్‌తో నడిచే వాహనాలు: 11 లక్షలు రోజూ సగటున ఇంధన వినియోగం: 30 లక్షల లీటర్ల పెట్రోల్, 33 లక్షల లీటర్ల డీజిల్ పెద్ద బంకుల్లో రోజుకు విక్రయాలు: 30 వేల లీటర్ల పెట్రోల్, 45 వేల లీటర్ల డీజీల్ ఇంధన సాంద్రత ఇలా ఉండాలి వేసవిలో పెట్రోల్ సాంద్రత సుమారు 830- 835 డిగ్రీలుగా ఉండాలి ఇతర సీజన్లలో 820- 825 వరకు ఉండాలి పెట్రోల్ సాంద్రతను నిర్ధారించే హైడ్రోమీటర్లు, థర్మామీటర్, జార్‌తో కూడిన కిట్లను బంక్ యజమానులు అందుబాటులో ఉంచాలి. కల్తీతో బండి షెడ్కే.. కల్తీ ఇంధనం కారణంగానే నగరంలో అత్యధిక వాహనాలు మరమ్మతులకు గురవుతున్నాయి కల్తీ ఇంధనం వాడిన వాహనాలు పొగను ఎక్కువగా వదులుతాయి బండి స్టార్ కావడంలో ఇబ్బందులతో పాటు, సౌండ్లోనూ స్పష్టమైన తేడా ఉంటుంది ప్రధానంగా ఇంజన్లు దెబ్బతింటాయి వాహనంలోని బోరు పిస్టన్ పనికిరాకుండా పోయి త్వరగా మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నాలుగు చక్రాల వాహనాల విషయంలో మరిన్ని సమస్యలు తలెత్తుతాయి మొక్కుబడి తనిఖీలు ఇంధన కల్తీ దందాకు అడ్డుకట్ట వేసే దిశగా పౌరసరఫరాల శాఖ నడుం బిగించట్లేదు. మొక్కుబడి తనిఖీలు, శాంపిల్స్ సేకరణతోనే సరిపెట్టుకుంటోంది ఎప్పటికప్పుడు ఇంధన శాంపిళ్లను సేకరించి ల్యాబ్‌కు పంపి పరీక్షించాలి. అధికారుల వద్ద కూడా పరీక్షలు నిర్వహించే పరికరాలు అందుబాటులో ఉండాలి పరీక్ష పరికరాలు అందుబాటులో ఉన్నా ఉపయోగిస్తున్న దాఖలాల్లేవు పౌరసరఫరాల శాఖ గత ఐదేళ్లలో నామమాత్రంగా తనిఖీలు నిర్వహించి కేవలం నాలుగు శాంపిల్స్ మాత్రమే సేకరించింది ఇలా అయితే అనుమానించాల్సిందే... ప్రధాన ఆయిల్ కంపెనీ నుంచి బంక్‌కు ఇంధనాన్ని సరఫరా చేసేటప్పుడే పెట్రోల్, డీజిల్ సాంద్రత ఎంత ఉండాలనే విషయాన్ని ధ్రువీకరిస్తారు పెట్రోల్ బంక్‌కు ఇంధనాన్ని తీసుకుని ట్యాంకర్ రాగానే ప్రత్యేకంగా శాంపిల్ తీసి ఇన్వాయిస్తో సహా వినియోగదారుల సౌకర్యార్థం అందుబాటులో ఉంచాలి వినియోగదారుడు కల్తీ జరిగిందని అనుమానిస్తే బాట్లింగ్ పేపర్, ఇంధన సాంద్రత పరీక్షలు నిర్వహించి చూపాలి పరీక్షలో ఇన్వాయిస్లో పేర్కొన్న సాంద్రతకు, బండిలో నింపిన ఇంధనం సాంద్రతకు మధ్య తేడా కనిపిస్తే కల్తీ జరిగినట్లు అనుమానించాలి ఒకవేళ ట్యాంకర్ నుంచి శాంపిల్ తీసి భద్రపర్చలేదని నిర్వాహకులు చెబితే, ఆ బంక్‌లో కల్తీ జరుగుతున్నట్లు అనుమానించాల్సిందే. -
ఇం‘ధనం’ ఆవిరి..
రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోల్ ధరలతో వినియోగదారుడు ఓ వైపు నలిగిపోతుండగా, యథేచ్ఛగా పెట్రోల్ కల్తీ చేయడం, మీటర్ పంపింగ్‌లో చేతివాటం ప్రదర్శించడం వంటివి చేస్తూ బంక్‌ల యజమానులు వారిని మరింత కుంగదీస్తున్నారు. పెట్రోల్‌లో డీజిల్, నాఫ్తలిన్ కలపడంతో ప్రతీ లీటర్‌కు 99మిల్లీలీటర్లు తక్కువగా వస్తోంది. వినియోగదారులు నిలదీసినా, అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోతోంది. రీడింగ్‌లో మోసం.. పెట్రోల్ కొలత పూర్తికాకుండానే పంపు ఆపేయడం, వేగంగా ట్యాంకు నింపడం.. అదే సమయం లో కొలతను సూచించే ఎలక్ట్రానిక్ మెషిన్‌పై చెయ్యి అడ్డుపెట్టడం వంటి మోసాలకు సిబ్బంది పాల్పడుతున్నారని పలువురు వాహనదారులు ఆరోపిస్తున్నారు. రీడింగ్‌లో కరెక్ట్‌గా చూపించినా పెట్రోల్ కొలతల్లో తేడా వస్తోందంటున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే బంకు సిబ్బంది ఎలక్ట్రానిక్ యంత్రాలతో మోసాలకు తావులేదంటూ సర్దిచెప్తున్నారు. పలు సందర్భాల్లో గొడవలకు దిగుతున్నారు. పలుకుబడి గల యాజమాన్యాల నిర్వహణలో బంక్‌లు కొనసాగుతుండడంతో తనిఖీ చేసేం దుకు అధికారులు వెనుకాడుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో సువూరు 192 బంకులున్నారుు. వీటి ద్వారా రోజుకు సరాసరి 2.50 లక్షల లీటర్ల పెట్రోల్ అవ్ము కాలు సాగుతున్నారుు. సుమారు 6 లక్షల లీటర్ల డీజిల్ అమ్మకాలు సాగుతున్నాయి. చిల్లర దోపిడీ.. ప్రస్తుతం లీటరు పెట్రోలు ధర రూ. 78.65. చిల్లర లేదనే సాకుతో వినియోగదారుల నుంచి రూ.79 వసూలు చేస్తున్నారు. డీజిల్ రూ.59.20 ఉండగా రూ.60 వరకు వసూలు చేస్తున్నారు. కొందరు లీటర్లతో సంబంధం లేకుండా రూ. 50, రూ.100 పోయించుకుంటే అక్కడా జిమ్మిక్కులు చేసి పైపులో కొంత మిగిల్చుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకేసారి నాలుగైదు లీటర్ల పెట్రోలు కొట్టిస్తే అందులో దాదాపు అర లీటరు వరకు మాయం చేస్తున్నారని వాహన చోదకులు చెబుతున్నారు. స్కూటర్లు, మోపెడ్ల వంటి వాహనాల్లో పెట్రోల్‌తోపాటు ఆయిల్ ఉపయోగిస్తారు. బంకుల్లో కొందరు సిబ్బంది ఈ ఆయిల్‌ను కూడా కల్తీ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. బంకుల్లో ధరలపట్టిక సైతం కానరాదు. ఆయిల్ కంపెనీల అధికారులు పట్టించుకోకపోవడం, తూనికలు కొలతల శాఖ అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నందునే సిబ్బంది ఆగడాలు మితిమీరిపోతున్నాయని వాహనచోదకులు విమర్శిస్తున్నారు. బంకుల్లో కల్పించాల్సిన వసతులైన ఉచిత గాలియంత్రం, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, తాగునీటి వసతి, తదితరాలేవీ కొన్ని బంకుల్లో వెతుకుదామన్న కనిపించవు. తనిఖీలు లేవు.. కేసులు లేవు.. పెట్రోల్‌లో డెన్సిటీ నిర్ధారించే హైడ్రోమీటర్లు, థర్మామీటర్లతో కూడిన కిట్లను బంక్ యాజమాన్యాలు అందుబాటులో ఉంచాలి. కానీ వాటి జాడ ఎక్కడా కనిపించదు. అడిగినా నిరాకరణే ఎదురవుతోంది. జిల్లా వ్యాప్తంగా కల్తీ, మీటర్ పంపింగ్‌లో మోసం జరుగుతున్నా సంబంధిత అధికారుల తని ఖీలు మాత్రం కనిపించవు. ఫిర్యాదులు వచ్చినప్పు డు మొక్కుబడి తనిఖీలు, శాంపిల్స్ సేకరణ, నామమాత్రపు కేసులతో సరిపెడుతున్నారు. పెట్రోల్ డీజిల్ బంకుల్లో కల్తీ, తూకం మోసం అరికట్టేందుకు పౌరసరఫరాలు, కల్తీనియంత్రణ, తూ నికల కొలతల శాఖ ఆధ్వర్యంలో పర్యవేక్షణ కొనసాగాలి. కల్తీపై ఎప్పటికప్పుడు శాంపిళ్లను సేకరించి ల్యాబ్‌లో పరీక్షించాలి. అయితే ల్యాబ్ పరీక్షల అనంతరం ఏ ఒక్కటీ కూడా నిలబడలేదు. మీ టర్ పంపింగ్ యూనిట్లను తనిఖీ చేస్తూ సీల్ వే యాల్సి ఉన్నా అధికారులు నామమాత్రంగా జరి మానాలతో సరిపెడుతున్నారు. ఇక పౌరసరఫరాల శాఖ అధికారులు నాణ్యత పరిశీలన ఆయిల్ కంపెనీలకే వదిలే శారు. అప్పుడప్పుడు మొక్కుబడిగా తనిఖీలు చేస్తున్నారు.ఏడాది కాలంగా చూస్తే కేసు ల సంఖ్య పది లోపే ఉండడం గమనార్హం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, బంకుల్లో అక్రమాలు వెలుగులోకి తెచ్చి, చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు. -
కల్తీ పెట్రోల్ పోశారు
దేవునిపల్లి, న్యూస్‌లైన్ : కామారెడ్డి పట్టణంలోని సిరిసిల్లా రోడ్‌లోని ఓ పెట్రోల్ బంక్‌లో 10 రోజుల క్రితం కల్తీ పె ట్రోల్ విక్రయిస్తున్నారని వాహనదారుల ఆందోళనతో విచారణ జరిపిన అధికారులు బంక్‌ను సీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సంఘటనను మరవక ముందే పట్టణంలోని మరో పెట్రోల్ బంకులో కల్తీ పెట్రోల్ వచ్చిందని ఓ ద్విచక్ర వా హనదారుడు శుక్రవారం ఆందోళ న చేశాడు. వాహనదారుడి వివరా ల ప్రకారం.. పట్టణానికి చెందిన గడీల బైరయ్య ఉదయం పట్టణంలోని నిజాంసాగర్ చౌరస్తా వద్ద గ ల బంకులో తన ద్విచక్ర వాహనం లో *100 పెట్రోల్ పోయించుకున్నాడు. కాస్త దూరం వెళ్లగానే బం డి ఎంతకు స్ట్రాట్ కాకుండా మొరాయించడంతో బైక్‌ను మెకానిక్ వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ బైక్‌ను పరిశీలించిన తర్వాత పెట్రోల్‌పై అనుమానం రావడంతో మెకానిక్ పెట్రోల్‌ను బాటిల్లో తీసి పరిశీలించగా రంగులో మార్పు, నీ రు కలిసిన పెట్రోలు వచ్చింది. దీంతో ద్విచక్ర వాహనదారుడు పెట్రోల్‌బంక్‌కు వెళ్లి సిబ్బంది, బంకు నిర్వాహకులతో గొడవకు దిగాడు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేస్తామని అక్కడినుంచి వెళ్లిపోయాడు. పట్టణంలోని పలు పెట్రోల్ బంకుల్లో కల్తీలు జరుగుతున్నాయని వాహనదారుల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. ఈ పెట్రోల్ వాడిన వాహనాలు దెబ్బతింటున్నాయని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కల్తీలను అరికట్టాలని కోరుతున్నారు.