Advanced supplementary exams
-
AP SSC Supplementary 2022: సప్లిమెంటరీలో పాసైనా 'రెగ్యులరే'
సాక్షి, అమరావతి: పదోతరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులు కాలేకపోయామని ఆవేదన, ఆందోళన చెందాల్సిన పనిలేకుండా రాష్ట్రంలోని టెన్త్ 2022 బ్యాచ్ విద్యార్థులకు ఉపశమనం కలిగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. తదుపరి విద్యాభ్యాసానికి ఆటంకం కలగకుండా ఉండేందుకు వీరికి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను నెలరోజుల్లోనే నిర్వహించి ఫలితాలను ప్రకటించనుంది. అంతకన్నా ముఖ్యంగా సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారిని 2022–ఏప్రిల్ రెగ్యులర్ బ్యాచ్ విద్యార్థులతో సమానంగా పరిగణించనుంది. నిబంధనల ప్రకారం రెగ్యులర్ పరీక్షల్లో ఉత్తీర్ణులకు వారికి వచ్చిన మార్కులను అనుసరించి ఫస్ట్, సెకండ్, థర్డ్ డివిజన్లలో పాసైనట్లుగా సర్టిఫికెట్లు ఇస్తారు. సప్లిమెంటరీలో పాసైన వారికి మాత్రం ఎన్ని మార్కులు వచ్చినా కంపార్టుమెంటల్ పాస్‌గానే పరిగణిస్తుంటారు. ఆమేరకు ధ్రువపత్రాలు జారీచేస్తారు. అయితే కరోనా కారణంగా రెండేళ్లుగా స్కూళ్లు లేక చదువులు కుంటుపడిన విద్యార్థులు టెన్త్ పరీక్షల్లో కొంతవరకు ఇబ్బందులకు గురైనందున వారికి మేలు చేకూరేలా సప్లిమెంటరీ పరీక్షలకు వర్తించే ‘కంపార్టుమెంటల్ పాస్’ను ఈ విద్యాసంవత్సరం వరకు మినహాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు విద్యాశాఖ దీనిపై ఉత్తర్వులు జారీచేయనుంది. ఈసారి సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులను కంపార్టుమెంటల్‌గా కాకుండా రెగ్యులర్ విద్యార్థులతో సమానంగా పరిగణిస్తారు. వారు సాధించిన మార్కులను అనుసరించి ఫస్ట్‌క్లాస్, సెకండ్‌క్లాస్, థర్డ్‌క్లాస్‌లుగా డివిజన్లను ప్రకటిస్తారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ టెన్త్ ఫలితాల విడుదల సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు కూడా. గ్రేస్ మార్కులు కలపాలని పలువర్గాల నుంచి అందుతున్న వినతులపైనా ప్రభుత్వంలో ఉన్నతస్థాయిలో చర్చించింది. అయితే ఫెయిలైన సబ్జెక్టులకు పదివరకు గ్రేస్ మార్కులు కలిపినా మరో ఐదుశాతం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యే అవకాశముంది తప్ప అందరికీ ప్రయోజనం కలగదు. ప్రస్తుతం టెన్త్ ఉత్తీర్ణత శాతం 67.26 శాతం కాగా అది 73 శాతానికి చేరుతుందని అధికారులు పేర్కొంటున్నారు. దీనికన్నా సప్లిమెంటరీ పరీక్షల్లో విద్యార్థులకు వచ్చిన మార్కుల ఆధారంగా డివిజన్లు ఇవ్వడం వల్ల అత్యధిక శాతం మందికి మేలు జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. విద్యార్థులు గ్రేస్ మార్కులతో పాస్ అయినట్లుగా కాకుండా సొంతంగా పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించినట్లు అవుతుందని వివరిస్తున్నారు. ఈసారి టెన్త్ పరీక్షల్లో 2 లక్షలమంది విద్యార్థులు ఫెయిలైన నేపథ్యంలో వారిని అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఈ విద్యార్థులు తప్పిన సబ్జెక్టులపై పాఠశాలల్లో ఈనెల 13వ తేదీ నుంచి ప్రత్యేక తర్ఫీదు ఇవ్వనుంది. సప్లిమెంటరీలో వారు తప్పనిసరిగా ఉత్తీర్ణులయ్యేలా బోధన సాగించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఆయా సబ్జెక్టు టీచర్లను అన్ని స్కూళ్లలోను సన్నద్ధం చేయిస్తోంది. పరీక్షలు పూర్తయ్యేవరకు ఈ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోనున్నారు. తప్పిన విద్యార్థులు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేలా వారికి ప్రత్యేక తర్ఫీదు ఇవ్వనున్నామని అధికారులు చెప్పారు. 20 వరకు సప్లిమెంటరీ ఫీజు గడువు రాష్ట్రంలో టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను జూలై 6 నుంచి 15వ తేదీవరకు నిర్వహించనున్నారు. మంగళవారం నుంచే ఈ పరీక్షలకు ఫీజుల చెల్లింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఫీజు చెల్లింపు గడువు ఈనెల 20వ తేదీవరకు ఉంది. రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ సమాచారంతో సంబంధం లేకుండా ఫెయిలైన వారంతా గడువులోగా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఎక్కువ వచ్చిన మార్కుల పరిగణన పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను.. ఉత్తీర్ణులైనవారు కూడా (ఇంప్రూవ్మెంట్ కోసం) రాసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. పాసైనా.. తమకు తక్కువ మార్కులు వచ్చాయని భావించే విద్యార్థులు, మరిన్ని మార్కులు సాధించాలనుకున్నవారు కూడా ఈ పరీక్షలు రాయవచ్చు. రెండింటిలో ఎక్కువ వచ్చిన మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. -
AP: నేటి నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
మచిలీపట్నం: ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు అంతా సిద్ధమైంది. బుధవారం నుంచి ప్రారంభమయ్యే పరీక్షలకు మొదటి, రెండో సంవత్సరం కలిపి జిల్లాలో 1,13,538 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. వీరి కోసం 142 కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొదటి సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, రెండో సంవత్సరం వారికి మధ్యాహ్నం 2.30 నుంచి 5.30గంటల వరకు టైం టేబుల్ మేరకు ప్రతి రోజూ పరీక్ష ఉంటుంది. నేడు సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష పేపర్ -1కి 2వ సెట్ ప్రశ్న పత్రాన్ని లాటరీ ద్వారా ఎంపిక చేశారు. బుధవారం నుంచి 23 వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయి. పరీక్షలకి హల్ టిక్కెట్స్ 4 లక్షల మంది విద్యార్ధులు డౌన్ లోడ్ చేసుకున్నారు. కోవిడ్ కారణంగా ఈ ఏడాది జులైలో జరగాల్సిన ఇంటర్ పరీక్షలు సుప్రీంకోర్టు ఆదేశాల నేపద్యంలో రద్దు అయిన విషయం తెలిసిందే. ఇంటర్ బోర్డు ప్రకటించిన ఫలితాలపై అసంతృప్తి ఉన్న విద్యార్దులెవరైనా ఈ సప్లిమెంటరీ పరీక్షలకి హాజరుకావచ్చు. రేపు(గురువారం) ఇంగ్లీష్, 17న మేథమెటిక్స్- A, బోటనీ, సివిక్స్ పేపర్లు, 18న మేథమెటిక్స్-B, జువాలజీ, హిస్టరీ పరీక్షలు, 20 న ఫిజిక్స్, ఎకనామిక్స్ పరీక్షలు, 21 న కెమిస్ట్రీ, కామర్స్, సోషయాలజీ, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పరీక్షలు, 22న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్, బ్రిడ్జి కోర్స్ మేద్స్, 23వ తేదీన మోడర్న్ లాంగ్వేజ్, జాగ్రఫీ పరీక్షలు, ఈ నెల 27 న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష, 28న ఎన్విరాన్ మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలు జరగనున్నాయి. పరీక్షా కేంద్రాల వద్ద కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. విద్యార్ధులు మాస్కులు ధరించి పరీక్షలకి హాజరుకావాల్సి ఉంటుంది. నిమిషం నిబందనని అమలు చేయడం లేదని అధికారులు పేర్కొన్నారు. అనివార్య కారణాల వల్ల పరీక్షా కేంద్రాలకి ఆలస్యంగా హాజరైనా విద్యార్ధులని అనుమతించాలని ఇంటర్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. పరీక్షా కేంద్రాల వద్ద థర్మల్ స్కానింగ్ ద్వారా తనిఖీలు చేయనున్నారు. పరీక్షల నిర్వహణకి ప్రతీ జిల్లాకి ఒక కోవిడ్ ప్రోటోకాల్ అధికారిని నియామించారు. పరీక్షల నిర్వహణ కోసం ఇంటర్ బోర్డు కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. విద్యార్ధుల సౌకర్యార్ధం టోల్ ఫ్రీ నంవర్ 18002749868 ఏర్పాటు చేశారు. వాట్సప్ ద్వారా ఫిర్యాదుకి 9391282578 నంబర్ని అధికారులు అందుబాటులో ఉంచారు. ఈ పరీక్ష ఎందుకంటే.. కోవిడ్ కారణంగా పరీక్షలు రద్దు చేసి, అంతా కనీస మార్కులతో ఉత్తీర్ణులైనట్లు ప్రభుత్వం ప్రకటించింది. విద్యార్థుల భవిష్యత్ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వారి మార్కుల శాతాన్ని పెంచుకునేందుకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పేరిట మరో అవకాశం ఇచ్చింది. దీంతో పరీక్షల నిర్వహణపై ఇంటర్మీడియెట్ బోర్డు అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. పరీక్షలకు సంబంధించిన మెటీరియల్, ఓఎంఆర్ షీట్స్, నామినల్ రోల్స్ షీట్స్, డీ–ఫామ్స్‌ను ఇప్పటికే పరీక్ష కేంద్రాలకు పంపించారు. జంబ్లింగ్ విధానంలోనే విద్యార్థులకు పరీక్ష కేంద్రాలను కేటాయించారు. మండల, డివిజన్, జిల్లా స్థాయిలో ప్రత్యేకంగా తనిఖీ బృందాలను పర్యవేక్షణకు ఏర్పాటు చేశారు. జిల్లా స్థాయిలో హైపవర్ కమిటీ కూడా కేంద్రాలను తనిఖీ చేయనుంది. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. కేంద్రాలకు ముందుగానే చేరుకోవాలి.. ఇంటర్ పరీక్షలు ప్రతి రోజు ఉదయం 9గంటలకు ప్రారంభమవుతాయి. అయితే నిమిషం లేటు అయినా పరీక్షలకు విద్యార్థులను అనుమతించరు. పరీక్షకు అరగంట ముందుగానే ఉదయం 8.30లకు కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతించనున్నారు. ఇదే రీతిన సెకండ్ ఇయర్ విద్యార్థులను మధ్యాహ్నం 2 గంటల నుంచే కేంద్రాల్లోకి అనుమతిస్తారు. పరీక్షలు ముగిసేంత వరకూ కేంద్రాల్లో వైద్య సిబ్బందితో శిబిరాలు నిర్వహిస్తారు. కట్టుదిట్టంగా కోవిడ్ నిబంధనలు.. పరీక్షా కేంద్రాల్లో కోవిడ్ నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చేయాలని కలెక్టర్ నివాస్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. కేంద్రంలోకి ప్రవేశించేటప్పుడు ప్రతి ఒక్క విద్యారి్థనీ థర్మల్ స్క్రీనింగ్ చేయాలని సూచించారు. ప్రతి కేంద్రంలోనూ ప్రత్యేకంగా ఐసోలేషన్ గది ఏర్పాటు చేశారు. కోవిడ్ అనుమానిత లక్షణాలు ఉన్న వారిని ఆ గదిలో కూర్చొబెట్టి పరీక్ష రాయించనున్నారు. ఏర్పాట్లు పూర్తి చేశాం.. కోవిడ్ నిబంధనల మేరకు ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. విద్యార్థులకు ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలి. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కు ధరించి రావాలి. కేంద్రాల్లో మాస్ కాపీయింగ్‌కు తావులేకుండా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాం. ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు జరిగేలా నిర్వాహకులు శ్రద్ధ తీసుకోవాలి. – పెదపూడి రవికుమార్, ఆర్ఐఓ -
ఇంటర్ అడ్వాన్స్డ్ పరీక్షలు రద్దు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు చేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. శనివారం ఉన్నత స్థాయిలో జరిగిన ఓ కీలక సమావేశంలో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. వచ్చే నెల 12వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష లను నిర్వహించాలని ముందుగా నిర్ణయించినప్పటికీ ప్రస్తుతం రోజురోజుకూ పెరిగిపోతున్న కరోనా కేసుల సంఖ్య నేపథ్యంలో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను రద్దు చేసేందుకే ప్రభుత్వం మొగ్గు చూపింది. ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో కలిపి 3,29,340 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. వారంతా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల కోసం ఎదురుచూస్తున్న వారే. ఇప్పుడు వారి విషయంలో ఏం చేయాలన్న అంశంపైనే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే వారందరినీ పాస్ చేయడం ద్వారా సమస్యలు లేకుండా ముందుకు సాగవచ్చని అధికారులు భావిస్తున్నారు. 10 నుంచి 20 మార్కుల వరకు కలిపితే మెజారిటీ విద్యార్థులు పాస్ అవుతారని, కొందరు మాత్రమే ఫెయిల్ అవుతారన్న అంచనాలు ఉన్నాయి. అయితే పరీక్షలు రద్దు చేసినపుడు అందరిని పాస్ చేయాల్సి ఉంటుందని, కొందరిని పాస్ చేసి, మరికొందరిని ఫెయిల్ చేస్తే అది న్యాయ వివాదాలకు తావిచ్చినట్లు అవుతుందని అంటున్నారు. అందుకే అందరిని పాస్ చేస్తే సమస్యలు ఉండకపోవచ్చన్న నిర్ణయానికి వచ్చారు. దీనిపై అడ్వొకేట్ జనరల్‌తో ఉన్నతాధికారులు చర్చించి రెండు మూడు రోజుల్లో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల రద్దును అధికారికంగా ప్రకటించనున్నారు. మరోవైపు డిగ్రీ, పీజీ ఫైనల్ సెమిస్టర్ పరీక్షలను కూడా రద్దు చేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. వెయిటేజీని తొలగించేద్దాం! ప్రస్తుతం ఎంసెట్ ర్యాంకుల ఖరారులో ఇంటర్మీడియట్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉంది. ఇప్పుడు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను రద్దు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ఎంసెట్‌లో ఇంటర్మీడియట్ మార్కుల వెయిటేజీని తొలగించేలా నిర్ణయం తీసుకోవాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. -
మే14 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ను శుక్రవారం ఇంటర్ బోర్డు విడుదల చేసింది. మే 14 నుంచి మే 22 వరకు పరీక్షలు నిర్వహించనుంది. ప్రథమ సంవత్సరం పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యా హ్నం 12 గంటల వరకు, ద్వితీయ సంవత్సరం పరీక్షలు మధ్యాహ్నం 2.30 నుంచి సాయం త్రం 5.30 గంటల వరకు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ప్రాక్టికల్ పరీక్షలు మే 24 నుంచి 28 వరకు నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష మే 29న, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష మే 30న నిర్వహిస్తామంది. పరీక్ష ఫీజును 20లోగా చెల్లించాలి సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులు పరీక్ష ఫీజును ఈనెల 20లోగా చెల్లించాలని బోర్డు కార్యదర్శి అశోక్ సూచించారు. గడువు తర్వాత అపరాధ రుసుముతో చెల్లించే అవకాశం ఉండదన్నారు. ఫస్టి యర్ విద్యార్థులు ఇంప్రూవ్మెంట్ రాసుకోవ చ్చని, సాధారణ పరీక్ష ఫీజుకు అదనంగా ఒక్కో సబ్జెక్టుకు రూ.150 చెల్లించాలని చెప్పా రు. ప్రైవేటు విద్యార్థులకు సైతం ఈ నిబంధనలే వర్తిస్తాయని, వారు ఆయా కాలేజీ ప్రిన్సిపాల్స్‌కే ఫీజు చెల్లించాలని వివరించారు. -
వాసవి కాలేజీ విద్యార్థులకు ‘అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ’ అవకాశం
ఉప ముఖ్యమంత్రి కడియం సాక్షి, హైదరాబాద్: వాసవి జూనియర్ కాలేజీ విద్యార్థులు మే/జూన్‌లో జరిగే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసేందుకు అవకాశం కల్పిస్తామని బుధవారం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. తద్వారా విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా చూస్తామని పేర్కొన్నారు. మార్చిలో పరీక్షలు రాయకపోయినా ఆ కాలేజీ విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఆ విద్యార్థులు ఎంసెట్ పరీక్షకు హాజరయ్యేందుకు కూడా వెసులుబాటు కల్పిస్తామని పేర్కొన్నారు. విద్యార్థులని, ప్రభుత్వాన్ని మోసం చేసిన యాజమాన్యంపై కఠిన చర్యలు చేపట్టాలని ఇంటర్ బోర్డు కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. యాజమాన్యంపై వెంటనే క్రిమినల్ కేసు నమోదు చేయాలని పేర్కొన్నారు. పిల్లలను కాలేజీల్లో చేర్పించే ముందు కాలేజీలకు గుర్తింపు ఉందా? లేదా? కాలేజీ ట్రాక్ రికార్డు మంచిదా? కాదా? చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులు తీసుకోవాలని సూచించారు. ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన పర్యావరణ విద్య, ఎథిక్స్, హ్యూమన్‌వ్యాల్యూస్ పరీక్షలకు ఆ విద్యార్థులు హాజరు కాలేదని పేర్కొన్నారు. ప్రాక్టికల్స్ కూడా చేయలేదన్నారు. ఈ రెండు చేయలేదని తెలిసిన వెంటనే స్పందించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, విద్యార్థులకు ఉందన్నారు. వీటిని అప్పుడే ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తే ఇలాంటి పరిస్థితి రాకుండా చర్యలు తీసుకునేవాళ్లమని తెలిపారు. -
ఫస్టియర్ విద్యార్థులూ జాగ్రత్త!
ఇప్పటికే పాసైన సబ్జెక్ట్‌ను ఇంప్రూవ్‌మెంట్‌లో ఫెయిలైతే ఫెయిలే సాక్షి, హైదరాబాద్: ఫస్టియర్‌లో కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిలై, కొన్ని సబ్జెక్టుల్లో పాసయ్యారా? ఫెయిలైన సబ్జెక్టులతోపాటు పాసైన సబ్జెక్టుల్లో మార్కులు పెంచుకునేందుకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాయాలనుకుంటున్నారా? అయితే జాగ్రత్త! ప్రస్తుతం పాసైన సబ్జెక్టుల్లో.. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలో ఫెయిల్ అయ్యారో ఫెయిల్ కిందే లెక్క! అంతకుముందుకు ఆ సబ్జెక్టులో పాస్ అయినా చివరి ఫలితాలనే పరిగణనలోకి తీసుకుంటారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు అధికారులు వెల్లడించారు. ఇక ప్రథమ సంవత్సర విద్యార్థులు అన్ని సబ్జెక్టుల్లో ఉతీర్ణులైన వారు ఇంప్రూవ్మెంట్ రాసుకోవచ్చు. వీరికి మాత్రం ఎందులో ఎక్కువ మార్కులు వస్తే దాన్నే పరిగణనలోకి తీసుకుంటారు. వీరు సాధారణ ఫీజుతోపాటు ప్రతి పేపరుకు రూ.100 చొప్పున చెల్లించాలి. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కమ్ ఫొటోకాపీకి అవకాశం రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కమ్ ఫొటో కాపీ కోసం విద్యార్థులు ఈ నెల 30లోగా ఆన్లైన్లో ఫీజు చెల్లించాలి. రీకౌంటింగ్ కోసం ఒక్కో పేపరుకు రూ.100 చెల్లించాలి. రీ వెరిఫికేషన్, మూల్యాకనం చేసిన జవాబు పత్రాల జిరాక్స్ కాపీ (ఫొటో కాపీ) పొందేందుకు ఒక్కో సబ్జెక్టుకు రూ.600 చొప్పున మీసేవా, ఏపీ ఆన్లైన్ కేంద్రాల్లో ఫీజు చెల్లించాలి. ఇంప్రూవ్మెంట్ రాయాలనుకునే వారు, రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఇంటర్ బోర్డు అధికారులు సూచించారు. జేఈఈ మెయిన్‌లో వార్షిక పరీక్షలే లెక్క ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్ తుది ర్యాం కుల ఖరారులో (జేఈఈ స్కోర్‌కు 60%, ఇంటర్ మార్కులకు 40%) ఇంటర్ వార్షిక పరీక్ష ఫలితాలనే పరిగణనలోకి తీసుకుంటారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో టాప్ ర్యాంకు విద్యార్థులు ఐఐటీల్లో ప్రవేశాలకోసం రాష్ట్ర బోర్డు నుంచి పరీక్షకు హాజరైన విద్యార్థుల్లో టాప్-20 పర్సంటైల్‌లో ఉండాలి. లేదా బోర్డు పరీక్షలో 75% మార్కులు సాధించి ఉండాలి. ఎంసెట్‌లో ఇలా.. ఇంటర్ వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థుల మార్కులకు 25% వెయిటేజీ ఇచ్చి ఎంసెట్ తుది ర్యాంకును ఖరారు చేస్తారు. ఎవరైనా విద్యార్థి వార్షిక పరీక్షల్లో ఫెయిల్ అయి, అడ్వాన్స్డ్ సప్లిమెంటరీలో పాస్ అయితే ఆ మార్కులను పరిగణలోకి తీసుకుంటారు. వాటి ఆధారంగానే ఆ విద్యార్థికి ఎంసెట్ తుది ర్యాంకును ఖరారు చేస్తారు. -
ఏపీలో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల
సాక్షి, హైదరాబాద్: అడ్వాన్సుడ్ సప్లమెంటరీ పరీక్షలు వచ్చే నెల18 నుంచి జులై 1వ తేది వరకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య జరుగుతాయని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ డైరెక్టర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చే నెల18న ఫస్ట్ ల్వాంగ్వేజీ పేపర్-1(గ్రూప్-ఎ), ఫస్ట్ ల్వాంగ్వేజీ పేపర్-1(కాంపోజిట్ కోర్సు), 19న ఫస్ట్ ల్వాంగ్వేజీ పేపర్-2(గ్రూప్-ఎ),ఫస్ట్ ల్వాంగ్వేజీ పేపర్-2(కాంపోజిట్ కోర్సు), ఓఎస్ఎస్సీ మెయిన్ ల్వాంగ్వేజ్ పేపర్-1(సంస్కృతం, ఆరబిక్, పెర్షియన్)లకు పరీక్షలు నిర్వహిస్తారు. 20న సెంకడ్ ల్వాంగ్వేజీ, 22న ఇంగ్లీష్ పేపర్-1, 23న ఇంగ్లీష్ పేపర్-2, 24న గణితం పేపర్-1, 25న గణితం పేపర్-2, 26న జనరల్ సైన్సు పేపర్-1,27న జనరల్ సైన్సు పేపర్-2, 29న సోషల్ స్టడీస్ పేపర్-1,30న సోషల్ స్టడీస్ పేపర్-2, జులై1న ఓఎస్ఎస్సీ మెయిన్ ల్వాంగ్వేజీ పేపర్-2(సంస్కృతం, ఆరబిక్, పెర్షియన్)లకు ఆధునిక అనుబంధ పరీక్షలను నిర్వహిస్తారు. వచ్చే నెల2లోపు పరీక్ష ఫీజు చెల్లించండి అడ్వాన్సుడ్ సప్లమెంటరీ పరీక్షకు హాజరయ్యే విద్యార్ధులు వచ్చే నెల2వ తేది లోపు ఆయా హైస్కూల్ ప్రధానోపాధ్యాయులకు ఫీజు చెల్లించాలని పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సబ్ ట్రెజరీ, ఎస్బీహెచ్, ఎస్బీఐల ద్వారా చెల్లించేందుకు వచ్చే నెల4వ తేది, డీఈవో ఆఫీసు ద్వారా చెల్లించేందుకు వచ్చే నెల6వ తేది, ఏపీ డీజీఈ ద్వారా చెల్లించేందుకు వచ్చే నెల9వ తేది లోపు చెల్లించాలి. ఈ ఆధునిక అనుబంధ పరీక్షకు మూడు సబ్జెక్ట్‌లకు లోపు అయితే రూ.110లు, మూడు సబ్జెక్ట్లకన్నా ఎక్కువ ఉంటే రూ.125లు చెల్లించాలని డైరెక్టర్ పేర్కొన్నారు. -
టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీకి విభజన గండం!
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు రాష్ర్ట విభజన కొత్త సమస్యను తెచ్చిపెడుతోంది. ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 15 వరకు పదో తరగతి వార్షిక పరీక్షలు జరుగనున్నాయి. వెంటనే ఫలితాలు ప్రకటించి, అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. జూన్ 15 నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలి. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లో భాగంగా జూన్ 2 అపాయింటెడ్ డే నాటికే పాఠశాల విద్యా డైరె క్టరేట్ను రెండుగా చేయడంతోపాటు పరీక్షల విభాగాన్నీ విభజించాలని ఆదేశాలున్నాయి. ఈ క్రమంలో జూన్ 2 తర్వాత రెండు రాష్ట్రాలు, రెండు పరీక్షల విభాగాలు ఏర్పాటవుతాయి. ఇక్కడి వరకు బాగానే ఉన్నా... సమైక్య రాష్ట్రంలో వార్షిక పరీక్షలను నిర్వహించి, ఆంధ్రప్రదేశ్ పేరుతో విద్యార్థులకు సర్టిఫికెట్లను ఇస్తారు. మరి వేర్వేరు రాష్ట్రాలు ఏర్పడిన తరువాత అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను ఎవరు నిర్వహించాలి? నిర్వహణ ఏదో ఒక ప్రభుత్వం చేపట్టినా.. విద్యార్థులకు ఏ రాష్ట్రం పేరుతో సర్టిఫికెట్లను జారీ చేయాలన్న గందరగోళం నెలకొంది. దాదాపు 2.50 లక్షల మంది విద్యార్థుల విషయంలో ఈ సమస్య ఎదురుకానుంది. బోర్డు ఉంటే బాగుండేది: ప్రస్తుతం రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు బోర్డు లేదు. ఎస్ఎస్సీ (సెకండరీ స్కూల్ సర్టిఫికెట్) బోర్డు ఉండాల్సిన స్థానంలో ప్రభుత్వ పరీక్షల నిర్వహణ విభాగం వీటిని చూసుకుంటోంది. సాధారణంగా దేశంలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు అటానమస్ బోర్డులు ఉంటాయి. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం పదో షెడ్యూల్లో కార్పొరేషన్లు, సొసైటీలు, బోర్డులను చేర్చారు. ప్రభుత్వ పరీక్షల విభాగం ప్రభుత్వ శాఖలో భాగంగా ఉండడంతో ఈ అంశాన్ని బిల్లులో చేర్చలేదు. అందువల్ల రాష్ట్ర విభజన తర్వాత ఏడాది వరకు ఉమ్మడిగా సేవలు అందించే అవకాశం లేకుండా పోయింది. 1976 వరకు ఈ విభాగంలో ఉండి విడిపోయిన ఇంటర్ బోర్టు అటానమస్‌గా ఏర్పాటయ్యింది. కానీ, ఎస్ఎస్సీ బోర్డును పునరుద్ధరించకపోవడంతో సమస్య వచ్చిపడింది.