సాక్షి, హైదరాబాద్: అడ్వాన్సుడ్ సప్లమెంటరీ పరీక్షలు వచ్చే నెల18 నుంచి జులై 1వ తేది వరకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య జరుగుతాయని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ డైరెక్టర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చే నెల18న ఫస్ట్ ల్వాంగ్వేజీ పేపర్-1(గ్రూప్-ఎ), ఫస్ట్ ల్వాంగ్వేజీ పేపర్-1(కాంపోజిట్ కోర్సు), 19న ఫస్ట్ ల్వాంగ్వేజీ పేపర్-2(గ్రూప్-ఎ),ఫస్ట్ ల్వాంగ్వేజీ పేపర్-2(కాంపోజిట్ కోర్సు), ఓఎస్‌ఎస్‌సీ మెయిన్ ల్వాంగ్వేజ్ పేపర్-1(సంస్కృతం, ఆరబిక్, పెర్షియన్)లకు పరీక్షలు నిర్వహిస్తారు. 20న సెంకడ్ ల్వాంగ్వేజీ, 22న ఇంగ్లీష్ పేపర్-1, 23న ఇంగ్లీష్ పేపర్-2, 24న గణితం పేపర్-1, 25న గణితం పేపర్-2, 26న జనరల్ సైన్సు పేపర్-1,27న జనరల్ సైన్సు పేపర్-2, 29న సోషల్ స్టడీస్ పేపర్-1,30న సోషల్ స్టడీస్ పేపర్-2, జులై1న ఓఎస్‌ఎస్‌సీ మెయిన్ ల్వాంగ్వేజీ పేపర్-2(సంస్కృతం, ఆరబిక్, పెర్షియన్)లకు ఆధునిక అనుబంధ పరీక్షలను నిర్వహిస్తారు.
వచ్చే నెల2లోపు పరీక్ష ఫీజు చెల్లించండి
అడ్వాన్సుడ్ సప్లమెంటరీ పరీక్షకు హాజరయ్యే విద్యార్ధులు వచ్చే నెల2వ తేది లోపు ఆయా హైస్కూల్ ప్రధానోపాధ్యాయులకు ఫీజు చెల్లించాలని పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సబ్ ట్రెజరీ, ఎస్‌బీహెచ్, ఎస్‌బీఐల ద్వారా చెల్లించేందుకు వచ్చే నెల4వ తేది, డీఈవో ఆఫీసు ద్వారా చెల్లించేందుకు వచ్చే నెల6వ తేది, ఏపీ డీజీఈ ద్వారా చెల్లించేందుకు వచ్చే నెల9వ తేది లోపు చెల్లించాలి. ఈ ఆధునిక అనుబంధ పరీక్షకు మూడు సబ్జెక్ట్‌లకు లోపు అయితే రూ.110లు, మూడు సబ్జెక్ట్‌లకన్నా ఎక్కువ ఉంటే రూ.125లు చెల్లించాలని డైరెక్టర్ పేర్కొన్నారు.
ఏపీలో అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల
Published Thu, May 28 2015 10:40 PM | Last Updated on Sat, Mar 9 2019 4:19 PM
Advertisement
Advertisement