Advanced surgery
-
ఆ పుర్రే పురాతన కాలం నాటి అడ్వాన్స్డ్ సర్జరీకి ప్రతీక!
2,000-year-old skull of a Peruvian warrior fused together by metal: మన సైన్స్ చాలా అత్యధునికంగా అభివృధి చెందింది అని చెబుతుంటాం. పైగా ప్రస్తుతం ఉన్న టెక్నాలజీని చూసి మనకు మనమే మురిసిపోతాం. కానీ ఎలాంటి కనీస సదుపాయలు అందుబాటులో లేని పురాతన కాలంలోనే మన పూర్వీకులు అత్యధునిక టెక్నాజీని ఉపయోగించారు అనడానికి ఎన్నో విషయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అసలు విషయంలోకెళ్తే... 2,000 సంవత్సరాల నాటి పెరువియన్ యోధుడి పుర్రె లోహంతో కలిసి ఉంది. యూఎస్ మ్యూజియంలో ఉన్న ఈ పుర్రెని నాటి అధునాతన శస్త్రచికిత్సకు ఇది ఒక ఉదాహరణ చెబుతారు. ఆ పుర్రె యుద్ధంలో గాయపడిన పెరువియన్‌ది. పైగా ఆ వ్యక్తికి తలకు పెద్ద గాయం అయ్యిందని, అందువల్ల తలలోని ఎముకలను జాయింట్ చేయడానికి ఒక లోహపు (ఐరన్ ప్లేట్) ముక్కును ఉపయోగించి శస్త్ర చికిత్స చేశారని నిపుణులు చెబుతున్నారు. అంతేగాదు ఆ శస్త్ర చికిత్స చేయడం వల్లే ఆ మనిషి ప్రాణాలతో బయటపడ్డాడని చెప్పారు. అయితే ఆ సమయంలో అనస్థీషియా ఇచ్చారో లేదో అనేది కచ్చితంగా చెప్పలేం అని అన్నారు. పురాతన కాలంలోనే అధునాతన శస్త్రచికిత్సలు చేయగల నైపుణ్యం కలిగి ఉన్నారని చెప్పడానికి ఈ పుర్రె ఇప్పుడు కీలకమైన సాక్ష్యంగా పేర్కొనవచ్చు అని ఆస్టియాలజీ మ్యూజియం ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. అంతేకాదు ఈ శస్త్ర చికిత్సను ట్రెఫినేషన్ అని పిలుస్తారని, పైగా లోహాన్ని కరిగించి పోయేలేదని కూడా సోషల్ మీడియాలో పేర్కొంది. (చదవండి: రైలు రావడం చూసి మరీ ఆమెను పట్టాలపై తోసేశాడు.. ఆపై ఏం జరిగిందో చూడండి) -
28 ఏళ్ల చీకటికి సెలవ్
తమిళనాడులో సంగీత దర్శకుడు గణేశ్‌కు మళ్లీ చూపు అన్నానగర్ (చెన్నై), న్యూస్‌లైన్: ఎన్నో దక్షిణాది సినిమాలకు సంగీతాన్నందించిన శంకర్-గణేశ్ ద్వయంలో ఒకరైన గణేశ్ జీవితంలో ఓ అద్భుతం జరిగింది. 28 ఏళ్ల కిందట బాంబు పేలుడులో చూపు కోల్పోయిన ఆయన చెన్నైకు చెందిన ప్రముఖ నేత్ర నిపుణుడైన డాక్టర్ అగర్వాల్ చేసిన అత్యాధునిక శస్త్రచికిత్సతో ఇప్పుడు మళ్లీ చూడగలుగుతున్నారు. 1986లో అభిమాని పేరుతో వచ్చిన పార్సిల్ బాక్సును గణేశ్ తెరుస్తుండగా అందులోని బాంబు పేలింది. దీంతో గణేశ్ ఒక కన్ను పూర్తిగా చూపు కోల్పోయింది. రెండో కన్ను పాక్షికంగా కనిపించేది. నాటి నుంచి ఆయన సంగీతానికి దూరంగా ఉంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో డాక్టర్ అగర్వాల్ మూడు వారాల క్రితం గణేశ్ కళ్లకు శస్త్ర చికిత్స చేశారు. శనివారం అగర్వాల్ ఐ ఇన్స్టిట్యూట్లో విలేకరుల సమావేశంలో గణేశ్ మాట్లాడుతూ.. ఉద్వేగానికి లోనయ్యారు. డాక్టర్ అగర్వాల్ దృష్టి దాత అని ప్రశంసలు గుప్పించారు. అప్పటికప్పుడు ఆయన ‘దానం సేవో... కన్నె దానం సేవో’ అన్న పాటను కట్టి దానిని అగర్వాల్‌కు అంకితమిచ్చారు. 28 ఏళ్ల పాటు తాను ఏక నేత్ర అంధత్వంతో బాధపడ్డానన్నారు. నేడు కళ్లజోడు లేకుండానే అన్నీ చదవగలుగుతున్నట్లు తెలిపారు. ఐవోఎల్ కటకం పెట్టాను: అగర్వాల్ ‘‘బాంబు పేలిన సంఘటనలో గణేశ్ కంటిలోని కార్నియా పొర దెబ్బతింది. ఎక్కువ మొత్తంలో దుమ్ము, ధూళి కార్నియా పొరను చీల్చుకొని లోపల ఉన్న కటకాన్ని (లెన్స్‌ను) ఛిద్రం చేశాయి. దీంతో ఆయన దృష్టిని కోల్పోయారు. రెండు కళ్లల్లోకి చేరిన బాంబు శకలాలను శస్త్రచికిత్స ద్వారా పూర్తిగా శుభ్రం చేశాం. అనంతరం ఐవోఎల్ (ఇంట్రా ఆక్యులర్ లెన్స్) కటకాన్ని ఫైబ్రిన్ గ్లూ ద్వారా అతికించి గణేశ్‌కు స్పష్టమైన దృష్టిని ఇచ్చాం. శస్త్ర చికిత్సకు ముందు గణేశ్ ఒక కంటితో మాత్రమే చూడగలిగేవారు. రంగులు ఆయనకు మసకగా కన్పించేవి. ఆపరేషన్ తర్వాత గణేశ్ పూర్తిగా పూర్ణమైన, స్పష్టమైన దృష్టిని పొందారు’’ అని డాక్టర్ అగర్వాల్ విలేకరుల సమావేశంలో వివరించారు.