advertising revenue
-
పాపం ట్విటర్! సగానికి సగం పడిపోయింది..
సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్విటర్ కష్టాల నుంచి కోలుకోలేకపోతోంది. సంస్థ ప్రకటనల ఆదాయంలో దాదాపు సగం కోల్పోయింది. ఈ విషయాన్ని ట్విటర్ అధినేత ఎలాన్ మస్క్ స్వయంగా తెలిపారు. సంస్థకు ఫైనాన్సింగ్ విషయాన్ని ఓ యూజర్ ప్రస్తావించగా ఆయన స్పందించారు. ప్రకటనల ఆదాయం దాదాపు సగం మేర పడిపోవడంతోపాటు భారీగా అప్పుల కారణంగా నగదు లోటుతో సతమవుతున్నట్లు మస్క్ ఒక పోస్ట్‌లో తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో కొత్తగా ఏదైనా చేయాలంటే ముందుగా నగదు లోటును అధిగమించి మిగులుకు చేరుకోవాల్సి ఉంటుందని పేర్కొన్న ఎలాన్ మస్క్ దీనిపై ఎక్కువ వివరాల జోలికి వెళ్లలేదు. 2023లో ట్విటర్ 3 బిలియన్ డాలర్ల కంటే తక్కువ ఆదాయాన్ని పొందుతుందని, 2022 కంటే మూడింట ఒక వంతు తగ్గుతుందని ‘ఇన్సైడర్ ఇంటెలిజెన్స్’ నివేదించింది. ట్విటర్‌ను కొనుగోలు చేసిన తన ఆధీనంలోకి తెచ్చుకున్న మస్క్ అందులో అనేక మార్పులు తీసుకొచ్చారు. వీటి కారణంగానే యూజర్లతో పాటు ప్రకటనదారుల సంఖ్య కూడా తగ్గిపోయినట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి ➤ ఎలాన్ మస్క్‌పై కోర్టులో దావా: ఇష్టమొచ్చినట్లు తొలగించడం కాదు.. కట్టు రూ. 4వేల కోట్లు! ట్విటర్ వీక్షణలపై ఈ నెల ప్రారంభంలో పరిమితిని విధిస్తున్నట్లు ప్రకటించారు మస్క్. వెరిఫైడ్ యూజర్లు రోజుకు 10,000 ట్వీట్లు, అన్‌వెరిఫైడ్ యూజర్లు అంటే ఉచిత అకౌంట్ ఉన్నవారు రోజుకు 1,000 ట్వీట్లను మాత్రమే చూడగలిగేలా పరిమితిని పెట్టారు. అలాగే కొత్తగా చేరిన అన్‌వెరిఫైడ్ యూజర్లు 500 ట్వీట్లను మాత్రమే చూసేందుకు అనుమతించారు. ట్విటర్‌కు పోటీగా ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా ప్రారంభించిన థ్రెడ్స్ అనే యాప్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. మొదటి ఐదు రోజుల్లో దానికి 100 మిలియన్లకు పైగా యూజర్లు వచ్చారు. దాదాపు 200 మిలియన్ల యూజర్లు ఉన్న ట్విటర్ మస్క్ ఆధీనంలోకి వెళ్లి వేలాది మంది సిబ్బందిని తొలగించినప్పటి నుంచి పదే పదే సాంకేతిక వైఫల్యాలను ఎదుర్కొంది. వ్యాపార రహస్యాలు, మేధో సంపత్తిని దొంగిలించినందుకు మెటాపై దావా వేస్తానని మస్క్.. మెటా థ్రెడ్స్‌ను హెచ్చరించడం తెలిసిందే. -
చైనాకు ఎదురుదెబ్బ: భారత్‌లో జోరు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో ప్రకటనల రంగం 2023లో 16.8 శాతం వృద్ధి నమోదు చేస్తుందని గ్రూప్-ఎం నివేదిక వెల్లడించింది. దీని ప్రకారం.. ప్రపంచ మార్కెట్‌తో పోలిస్తే 15.8 శాతం వృద్ధితో భారత విపణి ప్రస్తుత సంవత్సరం రూ.1,21,882 కోట్లకు చేరుతుంది. డిజిటల్ అడ్వైర్టైజ్మెంట్లే ఈ రంగాన్ని ముందుండి నడిపిస్తాయి. 2022లో ఈ విభాగం వాటా మొత్తం పరిశ్రమలో ఏకంగా 48.8 శాతం ఉండనుంది. మహమ్మారి ముందస్తు కాలంతో పోలిస్తే మరింత జోరు కొనసాగనుంది. ఈ ఏడాది రిటైల్ మీడియా పరిశ్రమ విలువ రూ.4,507 కోట్లు నమోదు కానుంది. 2027 నాటికి ఇది రెండింతలు అవుతుంది. 36 శాతం వాటా కలిగిన టీవీ ప్రకటనల వ్యాపారం 10.8 శాతం అధికం కానుంది. సంప్రదాయ, కనెక్టెడ్ టీవీల జోరుతో టీవీ అడ్వర్టైజ్మెంట్ సెగ్మెంట్ రెండంకెల వృద్ధి కొనసాగిస్తుంది. మరోవైపు భారత ఆర్థిక వ్యవస్థ విస్తృత భౌగోళిక రాజకీయ పరిణామాల మధ్య అనిశ్చితిని ఎదుర్కొంటోంది. బలహీన కరెన్సీ, అధిక నిరుద్యోగం, అధిక వడ్డీ రేట్ల నుండి ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను తట్టుకుంటోంది. (చదవండి: సామాజిక భద్రత, మెటర్నీటీ బెనిఫిట్స్‌పై ఆర్థిక వేత్తల కీలక లేఖ) చైనాతో పోలిస్తే భారత్‌కే.. కోవిడ్-సంబంధిత లాక్డౌన్లు ఉన్నప్పటికీ 2022లో రూ.11,27,204 కోట్ల చైనా ప్రకటనల ఆదాయంతో పోల్చినప్పుడు, భారత పరిశ్రమ పరిమాణం చాలా చిన్నది. అయితే చైనా ఈ ఏడాది 0.6 శాతం తిరోగమన వృద్ధిని చవిచూడబోతోంది. 2023లో డ్రాగన్ కంట్రీలో పరిశ్రమ 6.3 శాతం పెరుగుతుందని అంచనా. చైనాతో పోలిస్తే భారత్‌కు అవకాశాలు మరింత మెరుగ్గా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రకటనల రంగం 2022లో 6.5 శాతం, 2023లో 5.9 శాతం నమోదయ్యే చాన్స్ ఉంది’ అని నివేదిక వెల్లడించింది. ఈ-కామర్స్, ఫ్యాషన్, ప్రీమియం ఎలక్ట్రానిక్స్, బ్యూటీ, వెల్నెస్, వినోదం, ఆభరణాల సంస్థలు అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికం కోసం తమ ప్రకటనల బడ్జెట్‌ను 20 శాతం వరకు పెంచాయని జాన్‌రైజ్ అడ్వర్టైజింగ్, బ్రాండింగ్ డైరెక్టర్ సుమన్ గద్దె గుర్తుచేశారు. (రెండేళ్లలో 10వేల సినిమా హాళ్లు..సినిమా చూపిస్త మామా!) -
మీడియాకు భారీగా ప్రభుత్వ బకాయిలు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ప్రకటనల విభాగం, పలు రాష్ట్రాల ప్రకటనల విభాగాలు మీడియా సంస్థలకు రూ. 1500 కోట్ల నుంచి రూ. 1800 కోట్ల వరకు బకాయి ఉన్నాయని ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ(ఐఎన్ఎస్) సుప్రీంకోర్టుకు తెలిపింది. ఆ బకాయిలు వారు ఇప్పట్లో చెల్లించకపోవచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. మీడియా రంగం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను ఒక అఫిడవిట్లో ఐఎన్ఎస్ సుప్రీంకోర్టు ముందు ఉంచింది. ‘మీడియా ఇండస్ట్రీ అంచనాల ప్రకారం..వివిధ మీడియా సంస్థలకు డీఏవీపీ(డైరెక్టరేట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ అండ్ విజువల్ పబ్లిసిటీ) సుమారు రూ. 1500 కోట్ల నుంచి రూ. 1800 కోట్ల వరకు బకాయి ఉంది. ఇందులో రూ. 800 కోట్ల నుంచి రూ. 900 కోట్ల వరకు ప్రింట్ మీడియా వాటా’ అని వివరించింది. -
సోనికి ఐపీఎల్9 ఆదాయం రూ.1,200 కోట్లు
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 9వ సీజన్లో సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్(ఎస్పీఎన్) ఇండియా కంపెనీ రూ.1,200 కోట్ల ప్రకటనల ఆదాయం ఆర్జించింది. గతేడాది ఆదాయం(రూ.1,000 కోట్లు)తో పోల్చితే 20% వృద్ధి చెందింది. ప్రకటనల రేట్లు 15% పెరగడం వల్ల ఈ స్థాయి ఆదాయం సాధించామని ఎస్పీఎన్ ఇండియా ప్రెసిడెంట్ రోహిత్ గుప్తా చెప్పారు.