సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్విటర్ కష్టాల నుంచి కోలుకోలేకపోతోంది. సంస్థ ప్రకటనల ఆదాయంలో దాదాపు సగం కోల్పోయింది. ఈ విషయాన్ని ట్విటర్ అధినేత ఎలాన్ మస్క్ స్వయంగా తెలిపారు. సంస్థకు ఫైనాన్సింగ్ విషయాన్ని ఓ యూజర్ ప్రస్తావించగా ఆయన స్పందించారు.
ప్రకటనల ఆదాయం దాదాపు సగం మేర పడిపోవడంతోపాటు భారీగా అప్పుల కారణంగా నగదు లోటుతో సతమవుతున్నట్లు మస్క్ ఒక పోస్ట్‌లో తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో కొత్తగా ఏదైనా చేయాలంటే ముందుగా నగదు లోటును అధిగమించి మిగులుకు చేరుకోవాల్సి ఉంటుందని పేర్కొన్న ఎలాన్ మస్క్ దీనిపై ఎక్కువ వివరాల జోలికి వెళ్లలేదు.
2023లో ట్విటర్ 3 బిలియన్ డాలర్ల కంటే తక్కువ ఆదాయాన్ని పొందుతుందని, 2022 కంటే మూడింట ఒక వంతు తగ్గుతుందని ‘ఇన్‌సైడర్ ఇంటెలిజెన్స్’ నివేదించింది. ట్విటర్‌ను కొనుగోలు చేసిన తన ఆధీనంలోకి తెచ్చుకున్న మస్క్ అందులో అనేక మార్పులు తీసుకొచ్చారు. వీటి కారణంగానే యూజర్లతో పాటు ప్రకటనదారుల సంఖ్య కూడా తగ్గిపోయినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి ➤ ఎలాన్ మస్క్‌పై కోర్టులో దావా: ఇష్టమొచ్చినట్లు తొలగించడం కాదు.. కట్టు రూ. 4వేల కోట్లు!
ట్విటర్ వీక్షణలపై ఈ నెల ప్రారంభంలో పరిమితిని విధిస్తున్నట్లు ప్రకటించారు మస్క్. వెరిఫైడ్ యూజర్లు రోజుకు 10,000 ట్వీట్లు, అన్‌వెరిఫైడ్ యూజర్లు అంటే ఉచిత అకౌంట్ ఉన్నవారు రోజుకు 1,000 ట్వీట్‌లను మాత్రమే చూడగలిగేలా పరిమితిని పెట్టారు. అలాగే కొత్తగా చేరిన అన్‌వెరిఫైడ్ యూజర్లు 500 ట్వీట్‌లను మాత్రమే చూసేందుకు అనుమతించారు.
ట్విటర్‌కు పోటీగా ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా ప్రారంభించిన థ్రెడ్స్ అనే యాప్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. మొదటి ఐదు రోజుల్లో దానికి 100 మిలియన్లకు పైగా యూజర్లు వచ్చారు. దాదాపు 200 మిలియన్ల యూజర్లు ఉన్న ట్విటర్ మస్క్ ఆధీనంలోకి వెళ్లి వేలాది మంది సిబ్బందిని తొలగించినప్పటి నుంచి పదే పదే సాంకేతిక వైఫల్యాలను ఎదుర్కొంది. వ్యాపార రహస్యాలు, మేధో సంపత్తిని దొంగిలించినందుకు మెటాపై దావా వేస్తానని మస్క్.. మెటా థ్రెడ్స్‌ను హెచ్చరించడం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment