advisory to indians
-
కెనడాలోని భారతీయులకు కేంద్రం హెచ్చరికలు
ఢిల్లీ/ఒట్టావా: కెనడాలో భారత వ్యతిరేక కలాపాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. అక్కడి భారతీయులను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులు ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. అక్కడ ఉంటున్న భారతీయులకు హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ తాజాగా ప్రత్యేక మార్గదర్శకాలకు విడుదల చేసింది. కెనడాలో ఉంటున్న భారత పౌరులు, విద్యార్థులకు ప్రత్యేక గైడ్‌లైన్స్ రిలీజ్ చేసింది భారత విదేశాంగ శాఖ. హింసల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని అందులో హెచ్చరించింది. ప్రయాణాలపై ఆచితూచి వ్యవహరించాలని సూచిస్తూ ప్రత్యేక ట్రావెల్ అడ్వయిజరీని విడుదల చేసింది. అలాగే.. ఆందోళనలు జరిగే ప్రాంతాలకు వెళ్లకుండా ఉండాలని కోరింది. అంతేకాదు.. కెనడా వెళ్లే భారతీయులూ కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది కేంద్రం. కెనడా వెళ్లాలనుకునేవాళ్లు.. అవసరమైతే ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని కోరింది. మరోవైపు ప్రపంచ దేశాలు కెనడా-అమెరికా వివాదంపై దృష్టిసారించాయి. ఇప్పటికే అగ్రదేశం అమెరికా స్పందన కోరింది కెనడా. అయితే.. అమెరికా మాత్రం ఇంతదాకా స్పందించలేదు. ఖలిస్థానీ సానుభూతిపరుల ఆగడాలతో భారత్, కెనడాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే.ఖలిస్థానీ సానుభూతిపరుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనక భారత్ (India) హస్తం ఉండొచ్చని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (Canada PM Justin Trudeau) తీవ్ర ఆరోపణలు చేయడంతో ఇరు దేశాల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. Advisory for Indian Nationals and Indian Students in Canada:https://t.co/zboZDH83iw pic.twitter.com/7YjzKbZBIK — Arindam Bagchi (@MEAIndia) September 20, 2023 ఇదీ చదవండి: భారత్‌పై కెనడా ప్రధాని ఆరోపణల వెనక ఆంతర్యం ఇదే! -
‘ఉక్రెయిన్ నుంచి వెంటనే వెళ్లిపోండి’.. భారత పౌరులకు హెచ్చరిక
కీవ్: రష్యాలోని కీలకమైన కెర్చ్ వంతెన పేల్చివేతతో ఉక్రెయిన్‌పై భీకర దాడులు చేస్తున్నాయి మాస్కో సేనలు. ఇరాన్ ఆత్మాహుతి డ్రోన్లతో విరుచుకుపడుతుండటంతో భయానక పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా దేశవ్యాప్తంగా దాడులు కొనసాగుతున్నాయి. పరిస్థితులు తీవ్రంగా మారడం వల్ల కీవ్‌లోని ఇండియన్ ఎంబసీ హెచ్చరికలు జారీ చేసింది. ఉక్రెయిన్‌లో ఇంకా ఎవరైనా భారత పౌరులు ఉంటే వీలైనంత త్వరగా దేశం విడిచి వెళ్లాలని ట్విటర్ వేదికగా వెల్లడించింది. ‘ఉక్రెయిన్‌లో భద్రతా పరిస్థితులు మరింద దిగజారుతున్నాయి. పెరుగుతున్న దాడుల దృష్ట్యా భారత పౌరులెవరూ ఇక్కడికి రావొద్దు. భారత పౌరులు, విద్యార్థులు ఎవరైనా ఇంకా ఉక్రెయిన్‌లోనే ఉండి ఉంటే వీలైనంత త్వరగా అందుబాటులోని మార్గాల ద్వారా దేశాన్ని విడిచి వెళ్లండి’ అని భారత రాయబార కార్యాలయం బుధవారం అడ్వైజరీ జారీ చేసింది. ఉక్రెయిన్‌లోని నాలుగు నగరాలను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించిన రష్యా.. బుధవారం అక్కడ మార్షల్ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ చట్టానికి భయపడి ఖేర్సన్లో కొంతమంది పడవల్లో ఇతర ప్రాంతాలకు పారిపోతున్నారు. ఈ నాలుగు ప్రాంతాలను యుద్ధ కేంద్రాలుగా చేసుకుని రష్యా తమ దాడులను మరింత పెంచే అవకాశముందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో భారత ఎంబసీ తాజా అడ్వైజరీ జారీ చేసింది. ఇదీ చదవండి: బ్రిటన్‌లో తీవ్రమైన సంక్షోభం.. తిండికి దూరంగా లక్షల మంది! -
భారతీయులూ.. వెంటనే వెనక్కి వచ్చేయండి!!
యెమెన్ దేశంలో విపరీతంగా ఘర్షణలు జరుగుతుండటంతో అక్కడున్న భారతీయులంతా వెంటనే స్వదేశానికి వచ్చేయాలని భారత ప్రభుత్వం కోరింది. ఏ రకమైన రవాణా సాధనాలు అందుబాటులో ఉన్నా వెంటనే వాటిని పట్టుకుని వెనక్కి వచ్చేయాలని భారతీయును కోరుతున్నట్లు విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. యెమెన్‌లో ఉన్న భారతీయుల్లో చాలామంది నర్సింగ్ వృత్తిలోనే ఉన్నారు. వాళ్లంతా పరిస్థితి తీవ్రతను గుర్తించి.. వెనక్కి వస్తారని భావిస్తున్నట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి చెప్పారు. సుమారుగా అక్కడ 3 వేల నుంచి 3,500 మంది వరకు భారతీయులు ఉంటారన్నారు. యెమెన్ అధ్యక్షుడితో పాటు అక్కడి ప్రభుత్వంలో ఉన్న పెద్దవాళ్లపై షియా మిలిషియా వర్గలు దాడులకు తెగబడుతున్నాయి. సనాలో ఉన్న భారతీయ రాయబార కార్యాలయం భారతీయులకు సాయం చేసేందుకు ప్రత్యేకంగా హెల్ప్లైన్లు ఏర్పాటుచేసింది.