ఢిల్లీ/ఒట్టావా: కెనడాలో భారత వ్యతిరేక కలాపాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. అక్కడి భారతీయులను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులు ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. అక్కడ ఉంటున్న భారతీయులకు హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ తాజాగా ప్రత్యేక మార్గదర్శకాలకు విడుదల చేసింది.
కెనడాలో ఉంటున్న భారత పౌరులు, విద్యార్థులకు ప్రత్యేక గైడ్‌లైన్స్ రిలీజ్ చేసింది భారత విదేశాంగ శాఖ. హింసల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని అందులో హెచ్చరించింది. ప్రయాణాలపై ఆచితూచి వ్యవహరించాలని సూచిస్తూ ప్రత్యేక ట్రావెల్ అడ్వయిజరీని విడుదల చేసింది. అలాగే.. ఆందోళనలు జరిగే ప్రాంతాలకు వెళ్లకుండా ఉండాలని కోరింది. అంతేకాదు.. కెనడా వెళ్లే భారతీయులూ కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది కేంద్రం. కెనడా వెళ్లాలనుకునేవాళ్లు.. అవసరమైతే ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని కోరింది.
మరోవైపు ప్రపంచ దేశాలు కెనడా-అమెరికా వివాదంపై దృష్టిసారించాయి. ఇప్పటికే అగ్రదేశం అమెరికా స్పందన కోరింది కెనడా. అయితే.. అమెరికా మాత్రం ఇంతదాకా స్పందించలేదు. ఖలిస్థానీ సానుభూతిపరుల ఆగడాలతో భారత్, కెనడాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే.ఖలిస్థానీ సానుభూతిపరుడు హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనక భారత్ (India) హస్తం ఉండొచ్చని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (Canada PM Justin Trudeau) తీవ్ర ఆరోపణలు చేయడంతో ఇరు దేశాల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి.
Advisory for Indian Nationals and Indian Students in Canada:https://t.co/zboZDH83iw pic.twitter.com/7YjzKbZBIK
— Arindam Bagchi (@MEAIndia) September 20, 2023
ఇదీ చదవండి: భారత్‌పై కెనడా ప్రధాని ఆరోపణల వెనక ఆంతర్యం ఇదే!
Comments
Please login to add a commentAdd a comment