affair with others
-
రెండో భార్య మోజులో పడి.. మొదటి భార్యను పొలం దగ్గరకి తీసుకెళ్లి..
మెదక్: రెండో భార్య మోజులో పడి మొదటి భార్యకు బలవంతంగా పురుగు మందు తాగించాడు. ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించాడు. ఆమె ఐదురోజుల పాటు ఆస్పత్రిలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ బుధవారం మృతి చెందింది. మృతురాలి తండ్రి కథనం ప్రకారం.. మెదక్ మండలం తిమ్మక్కపల్లి తండాకు చెందిన కాట్రోత్ రమేశ్‌కు కౌడిపల్లి మండలం మహబూబ్‌నగర్ తండాకు చెందిన స్వరూపను (30) పదేళ్ల కిత్రం ఇచ్చి వివాహం చేశారు. వారికి ఒక బాబు జన్మించాడు. కాగా రమేశ్ ఇటీవల తిమ్మక్కపల్లి తండాకు చెందిన మరో మహిళను వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి మొదటి భార్య స్వరూపకు, రమేశ్‌కు తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో ఎలాగైనా మొదటి భార్యను చంపాలని పన్నాగం పన్నాడు. ఈనెల 6వ తేదీన సాయంత్రం పొలం వద్దకు వెళ్లి వద్దామని తీసుకెళ్లాడు. పథకం ప్రకారం ముందే పురుగు మందు డబ్బా తీసుకొచ్చి బలవంతంగా స్వరూపకు తాగించాడు. అపస్మారక స్థితికి చేరుకోగానే ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి పురుగు మందు తాగిందని చెప్పాడు. అనంతరం ఆమెను మెదక్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందింది. రెండో భార్య మంజుల, అల్లుడు రమేశ్ వేధింపులకు గురి చేసి తన కూతురును పొట్టనపెట్టుకున్నారని మృతురాలి తల్లిదండ్రులు బోరున విలపించారు. గురువారం సాయంత్రం ఫిర్యాదు తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రియుడితో ఉండగా చూశాడని.. కొడుకు హత్య
సాక్షి, తిరువళ్లూరు(కర్ణాటక): వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని.. కన్న కొడుకునే హత్య చేయించిన తల్లి, ఆమె ప్రియుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. తిరువళ్లూరు జిల్లా పొన్నేరి నెడువరంపాక్కంకి చెందిన సెల్వంభార్య దుర్గ. వీరికి సూర్య(14), శృతి(12), సంతోష్(8) అనే ముగ్గురు పిల్లలున్నారు. గత 9న అన్నామలై(17), గోపాలకృష్ణన్(21) సూర్యను తీసుకెళ్లి హత్య చేశారు. సూర్య తాత ఫిర్యాదు మేరకు చోళవరం పోలీసులు గోపాలకృష్ణన్‌ను ప్రశ్నించారు. ఈక్రమంలో సూర్య తల్లిదుర్గకు, గోపాలకృష్ణన్‌కు మధ్య అక్రమ సంబంధం ఉన్నట్లు తెలిసింది. దుర్గ, గోపాలకృష్ణన్ ఏకాంతంగా ఉన్నప్పుడు సూర్య చూశాడనే కారణంతోనే హత్య చేసినట్లు వెల్లడైంది. చదవండి: karnataka: బస్సులో యువతి పట్ల అసభ్య ప్రవర్తన -
ప్రియురాలి మోజులో పడి పట్టించుకోవడం లేదు..
సాక్షి, శాయంపేట(వరంగల్): ప్రియురాలి మోజులోపడి భర్త తనను పట్టించుకోవడం లేదని భార్య మౌన పోరాటానికి దిగింది. ఈ సంఘటన వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండలం కొప్పుల గ్రామంలో ఆదివారం జరిగింది. బాధితురాలి కథనం ప్రకారం.. కొప్పులకు చెందిన కొలిపాక మల్లికాంబ– బాపురావుల రెండో కూతురు హర్షితను అదే గ్రామానికి చెందిన సామల సరోజన– మధుసూదన్ దంపతుల పెద్ద కుమారుడు వేణుమాధవ్‌కు ఇచ్చి గత ఏడాది ఆగస్టు 5న వివాహం జరిపించారు. ఆ సమయంలో 10 తులాల బంగారం, రూ.15 లక్షల నగదు, 1.16 ఎకరాల భూమిని కట్నంగా ఇచ్చారు. అయితే, పెళ్లైన నాటి నుంచి భర్త తనతో కాపురం చేయడం లేదని హర్షిత ఆరోపించింది. హన్మకొండలో సాత్విక చిట్‌ఫండ్ నడిపేవాడని, అందులో పనిచేసే ఓ యువతితో వివాహానికి ముందు నుంచే వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు చెప్పింది. చిట్‌ఫండ్‌లో నష్టాలు రావడంతో అదనపు కట్నం కోసం భర్తతోపాటు అతడి కుటుంబ సభ్యులు వేధింపులకు గురి చేశారని, దీంతో రెండుసార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిపింది. ఇదే విషయమై స్థానిక పెద్ద మనుషుల సమక్ష్యంలో ఐదుసార్లు పంచాయితీ సైతం జరిగిందని, అయినప్పటికీ విడాకుల నోటీసు పంపించినట్లు ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు వివరించింది. అయినా ఫలితం లేకపోవడంతో న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం భర్త ఇంటి ఎదుట మౌన పోరాటానికి దిగింది. గ్రామానికి చెందిన పలువురు మహిళలు సైతం హర్షితకు అండగా నిలిచారు. విషయం తెలుసుకున్న పీఎస్సై సుమలత సిబ్బందితో చేరుకొని బాధితురాలితో మాట్లాడారు. న్యాయం చేస్తామని హామీ ఇచ్చి మౌన పోరాటాన్ని విరమింపజేశారు. అనంతరం ఆమె భర్తతోపాటు కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. -
6 ఏళ్లుగా వివాహేతర సంబంధం.. పక్కా స్కెచ్.. ప్రియునితో కలిసి...
సాక్షి, ఖానాపురం(వరంగల్): రెండు నెలల క్రితం అదృశ్యమైన ట్రాక్టర్ డ్రైవర్ హత్య మిస్టరీ వీడింది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కారణంతో ప్రియుడితో కలిసి భర్తను భార్య హత్య చేయించిన సంఘటన వరంగల్ రూరల్ జిల్లా ఖానాపురం మండలంలోని బుధరావుపేట పరిధిలో గల బోడియాతండాలో చోటుచేసుకుంది.ఎస్సై నండృ సాయిబాబు తెలిపిన వివరాల ప్రకారం.. బోడియాతండాకు చెందిన కున్సోతు రవి(35) బుధరావుపేట గ్రామానికి చెందిన దావూద్ వద్ద ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఇదే క్రమంలో దావూద్‌కు రవి భార్య భారతితో ఆరు సంవత్సరాలుగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. డ్రైవర్‌గా పని చేస్తున్న క్రమంలో దావూద్ రవి ఇంటికి వెళ్లి వివాహేతర సంబంధం కొనసాగిస్తూ ఉండేవాడు. ఆరు నెలల క్రితం రవి దావూద్ వద్ద డ్రైవర్ పని మానేశాడు. గతంలో అక్రమ సంబంధం కొనసాగించడానికి నిరంతరం భారతి ఇంటికి వెళ్లగా ఎలాంటి అనుమానం రాలేదు. డ్రైవర్‌గా మానేయడంతో దావూద్ భారతి ఇంటికి వెళ్లే క్రమంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దీంతో రవిని ఎలాగైనా అడ్డు తొలగించుకుంటేనే అక్రమ సంబంధం కొనసాగుతుందని ఇరువురు భావించి హత్యకు పథకం ఎంచుకున్నారు. ఏప్రిల్ 23న రవితో ఫుల్‌బాటిల్ మందు తెప్పించుకుని బుధరావుపేట గ్రామ శివారులోకి వెళ్లి మద్యం సేవించారు. మద్యం మత్తులో ఉన్న రవిని కర్రతో దావూద్ బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని సమీపంలో ఉన్న బావి వద్దకు తీసుకెళ్లి బావిలో పడేసి భారతికి విషయం తెలియజేసి ఏమీ తెలియనట్లు ఇంటికి వెళ్లిపోయాడు. మరుసటి రోజున అనుమానంతో బావి వద్దకు వెళ్లిన దావూద్‌కు మృతదేహం నీటిపై తేలియాడటాన్ని గమనించి రెండు బండరాళ్లను కట్టి బావిలోకి వదలడంతో నీటిలో మునిగిపోయింది. రెండు నెలల నుంచి ఇరువురు తమకేమీ తెలియనట్లుగానే ఎవరి పనులు వారు సాగించుకుంటున్నారు. రెండు నెలల నుంచి కొడుకు ఇంటికి రాకపోవడంతో తల్లి ఈరమ్మ ఈనెల 23న ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు విచారణ చేపట్టగా రవి హత్య విషయం బయటపడింది. మృతుడికి ఇరువురు కుమారులు ఉండగా సంంఘటన స్థలం వద్దే ఖననం చేసే క్రమంలో కుమారులు రోదించిన తీరు స్థానికులను కలచివేసింది. చిన్నారులు ఇరువురు అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటామని తెలపడంతో అక్కడికే పంపారు. దీంతో దావూద్, భారతిలను నర్సంపేట ఏసీపీ ఫణీందర్, ఏసీపీ, నెక్కొండ సీఐ తిరుమల్, ఖానాపురం, నల్లబెల్లి ఎస్సైలు నండృ సాయిబాబు, బండారి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్సై సాయిబాబుకు అభినందనలు అదృశ్య కేసు నమోదు చేసుకున్న ఎస్సై సాయిబాబు కేసు చేదించడంతో ఉన్నతాధికారులు అభినందించారు. విచారణ జరిపి బావిలో మృతదేహాన్ని పడేశారనే విషయం తెలియగానే సర్పంచ్ కాస ప్రవీణ్‌కుమార్ సహకారంతో రెండు రోజుల నుంచి బావిలోని నీటిని తొలగించారు. వర్షంలో పూర్తిగా తడుస్తూ మృతదేహాన్ని బయటకు తీయడానికి శ్రమించారు. రెండు రోజుల తర్వాత ఎట్టకేలకు మృతదేహాన్ని బయటకు తీసి వైద్యుల సమక్షంలో పోస్టుమార్టం చేసే ప్రక్రియను పూర్తి చేయించడంతో ఎస్సై సాయిబాబుతో పాటు సర్పంచ్ ప్రవీణ్‌కుమార్, గ్రామ పంచాయతీ సిబ్బందికి ఉన్నతాధికారులతో పాటు స్థానికులు అభినందనలు తెలిపారు. రెండు నెలలుగా కనిపించకుండా పోయిన రవి హత్య మిస్టరీ వీడడంతో కుటుంబంలో విషాదం అలుముకుంది. చదవండి: సెల్ఫీలు దిగితే క్రిమినల్ కేసు.. నోటిఫికేషన్ విడుదల -
భర్తను హత్యచేసి కనిపించలేదని ఫిర్యాదు
వేలూరు, న్యూస్‌లైన్: స్నేహితుడి మోజులోపడి భర్తను కడతేర్చి, కనిపించలేదని పోలీసులకు ఫిర్యాదు చేసిన సంఘటన వేలూరు జిల్లాలో చోటుచేసుకుంది. వేలూరు జిల్లా గుడియాత్తం సమీపంలోని ఆలయం వద్ద ఈనెల 9న మృతదేహం కనిపించింది. పోలీసుల విచారణలో మృతు డు క్రిష్ణగిరి జిల్లా చిన్నరామనూర్ గ్రామానికి చెందిన సోమసుందరం(37)అని తెలిసింది. ఇతనికి భార్య కస్తూరి, నలుగురు పిల్లలున్నారు. సోమసుందరం కమ్మీ మేస్త్రీగా పనిచేసి ప్రతిరోజూ మద్యం సేవించే వాడు.ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన గోవిందరాజ్‌తో కస్తూరికి వివాహేత ర సంబంధం ఏర్పడింది. ఈ విషయం విషయం తెలిసి సోమసుందరం ప్రతిరోజూ మద్యం సేవిం చి కస్తూరితో గొడవపడేవాడు. దీంతో గోవిందరా జ్, కస్తూరి కలిసి సోమసుందరాన్ని హత్య చేసేం దుకు ప్రణాళిక సిద్ధ్దం చేసుకున్నారు. మద్యం మానిపించేందుకు గుడియాత్తంలో మందులు ఇస్తారని కస్తూరి, సోమసుందరాన్ని ఒంటరిగా తీసుకొచ్చింది. అనంతరం గుడియాత్తం చిత్తాతూర్ వద్దనున్న కొబ్బరి తోపునకు తీసుకెళ్లింది. అప్పటికే గోవింద్రాజ్ అక్కడ ఉన్నాడు. కస్తూరి, గోవింద్రాజ్ ఇద్దరు కలిసి సెల్‌ఫోన్ చార్జర్‌తో గొంతు బిగించి హత్యచేసినట్లు కస్తూరి పోలీసులకు తెలిపింది. పోలీసులు కస్తూరి, గోవిందరాజ్‌ను అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు.