నేడు కాంగ్రెస్ అనుబంధ సంఘాల సమావేశం
చేవెళ్ల: జిల్లా కాంగ్రెస్ అనుబంధ సంఘాల సమీక్షా సమావేశం బుధవారం చేవెళ్లలో నిర్వహిస్తున్నట్లు జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పి.గోపాల్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మండల కేంద్రంలోని కేజీఆర్ ఫంక్షన్ హాలులో సమావేశం ఉంటుందని పేర్కొన్నారు.
సమావేశానికి టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టి విక్రమార్క, మాజీ హోంమంత్రి పి.సబితారెడ్డి, రాష్ట్ర, జిల్లాలనుంచి కాంగ్రెస్, యువజన కాంగ్రెస్, అనుబంధ సంస్థల ముఖ్య నాయకులు హాజరవుతారని చెప్పారు. జిల్లాలోని అన్ని మండలాలనుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని డీసీసీ ప్రధాన కార్యదర్శి పి.గోపాల్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.