agency problems
-
బైడెన్‌కు కరోనా
మిల్వాకీ: ఓవైపు అమెరికా అధ్యక్ష ఎన్నికలు శరవేగంగా సమీపిస్తున్నాయి. ప్రత్యర్థి అసలే డొనాల్డ్ ట్రంప్. ఆదినుంచీ దూకుడుగా దూసుకెళ్తున్నారు. అది చాలదన్నట్టు హత్యా యత్నంతో ఆయన గ్రాఫ్ మరింత పెరిగింది. దాన్ని వీరోచితంగా ఎదుర్కొన్న తీరుతో మరింత ఫేవరెట్‌గా మారారు. అలాంటి ట్రంప్‌ను దీటుగా ఎదుర్కోవాల్సిన డెమొక్రాట్లు మాత్రం ఇంకా కాలూ చెయ్యీ కూడదీసుకునే ప్రయత్నంలోనే ఉన్నారు. వయోభారం, మతిమరుపుతో రోజుకో రకంగా తడబడుతున్న అధ్యక్షుడు జో బైడెన్ ఎలా చూసినా ట్రంప్‌కు పోటీ ఇవ్వలేరని దాదాపుగా తేలిపోయింది. అయినా పోటీ నుంచి తప్పుకునేందుకు, మరొకరికి చాన్సిచ్చేందుకు 81 ఏళ్ల బైడెన్ ససేమిరా అంటున్నారు. ఇవి చాలవన్నట్టు బైడెన్ తాజాగా కరోనా బారిన పడ్డారు! దాంతో కీలక దశలో ఎన్నికల ప్రచారానికి విరామం ఇవ్వాల్సి వచ్చింది. ఈ వరుస పరిణామాలతో డెమొక్రాట్లు తల పట్టుకుంటున్నారు. పోటీకి ముందే ఓటమి ఖాయమయ్యేలా ఉందని వాపోతున్నారు. బైడెన్‌ను ఎలాగోలా బుజ్జగించి తప్పించేందుకు చివరి నిమిషం ప్రయత్నాలను ముమ్మరం చేశారు. లాస్‌వెగాస్‌లో ప్రచార ఈవెంట్లో మాట్లాడాల్సి ఉండగా బైడెన్‌కు కరోనా సోకినట్టు తేలింది. దాంతో డెలావెర్ నివాసంలో ఐసోలేషన్‌లో ఉన్నారు.ట్రంప్‌ను మీరు ఓడించలేరు: పెలోసీ బైడెన్ తప్పుకోవాలంటున్న డెమొక్రాట్ల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. పార్టీ కీలక నేత, ప్రతినిధుల సభ మాజీ స్పీకర్ నాన్సీ పెలోసీ ఇటీవల బైడెన్‌తో ఫోన్లో మాట్లాడినట్టు సీఎన్ఎస్ వార్తా సంస్థ వెల్లడించింది. ట్రంప్‌ను ఓడించడం ఆయన వల్ల కాదని ఆమె స్పష్టం చేసినట్టు చెప్పుకొచి్చంది. ‘‘పోల్స్ కూడా మీరు గెలవలేరనే చెబుతున్నాయి. కనుక తప్పుకుంటే మంచిది. కాదని మొండికేస్తే మీరు ఓడటమే గాక ప్రతినిధుల సభలో డెమొక్రాట్ల విజయావకాశాలను కూడా చేజేతులా నాశనం చేసిన వారవుతారు’’ అంటూ పెలోసీ కుండబద్దలు కొట్టారట. -
అమ్మ ఒడిలోనే.. ఆఖరి ఊపిరి
సాక్షి, తూర్పు గోదావరి : ఈ చిత్రంలో ఆమెను చూస్తే ఏమనిపిస్తోంది? దూర ప్రయాణంలో భాగంగా బస్టాండులో బస్సు కోసం ఒడిలో చిన్నారితో మండుటెండలో ఎదురుచూస్తున్నట్టుగా ఉంది కదా! కానీ గుండెలు పిండేసే నిజం ఏమిటంటే...ఆ పసిబిడ్డకు అనారోగ్యంగా ఉండడంతో దగ్గర్లోని పీహెచ్‌సీకి తీసుకువెళ్లారు... పరిస్థితి విషమించడంతో రంపచోడవరం ఆసుపత్రిలో చేర్పించగా అక్కడి వైద్యులు రాజమహేంద్రవరం ఆసుపత్రికి తీసుకువెళ్లాలని సూచించారు. కానీ రాజమహేంద్రవరం పెద్దాసుపత్రికి తీసుకువెళ్లే ప్రయత్నంలోనే ఆ శిశువు తల్లి ఒడిలోనే కన్నుమూసింది. ఎతైన కొండలు... ఆ కొండలతో పోటీ పడుతున్నట్టుగా పొడవాటి చెట్లు ... ఈ రెంటింటి మధ్య గలగలా పారే సెల ఏళ్లు పక్షుల కిలకిలారావాలు, ఎటు చూసినా పచ్చదనమే ... అప్పుడప్పుడు వెళ్లే పర్యాటకులకు కనువిందే..మానసిక ఆనందమే...ఆహ్లాదమే...కానీ.. ఆ గూడెంలో ఉండే గిరిజనుల గుండెల నిండా ఉండే వ్యధ... కన్నతల్లుల కన్నీటి వెత ఎందరికి తెలుసు? వైద్యం అందక కన్నుమూస్తున్న మాతా, శిశు దేహాలను తీసుకువెళ్లేందుకు నానా చావు చావాలి. ఎత్తైన కొండలు, రవాణా సదుపాయాల లేని కుగ్రామాలు, వైద్యం కోసం రోగులను తీసుకుని కాలినడకన ఆస్పత్రులకు వెళ్లడం గిరిజనులకు సర్వసాధారణ అయింది. రెండు నెలల చిన్నారికి అస్వస్థతగా ఉండడంతో తల్లిదండ్రులు పరుగుపరుగున ఆస్పత్రుల చుట్టూ తిరిగినా.. విషమంగా ఉన్న శిశువు ప్రాణాలు దక్కలేదు. పుట్టేడు దుఃఖంతో శిశువు మృతదేహంతో కన్నీరుమున్నీరుగా వారు విలపించారు. అచేతన స్థితిలో ఉన్న వారిద్దరూ.. శిశువు మృతదేహాన్ని గ్రామానికి తీసుకువెళ్లేందుకు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకూ అంబులెన్స్ కోసంస్థానిక ఏరియా ఆస్పత్రిలో విలపిస్తూ కూర్చుండిపోయారు. వారి వేదన అందరినీ కంటతడిని పెట్టించింది. వై.రామవరం మండలం పలకజీడి గ్రామానికి చెందిన సాదల అమ్మాజీ, రాంబాబు రెండు నెలల శిశువు అనారోగ్యంతో రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో శుక్రవారం మృతి చెందాడు. జ్వరం, న్యూమోనియాతో బాధపడుతోన్న శిశువును పలకజీడి నుంచి వై.రామవరం ఆస్పత్రికి తల్లిదండ్రులు తీసుకువచ్చారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి వైద్య సిబ్బంది శిశువును రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి రిఫర్ చేశారు. అతడి పరిస్థితి అలాగే ఉండడంతో రంపచోడవరం ఆస్పత్రి వైద్యులు అత్యవసర వైద్యం రాజమహేంద్రవరం ఆస్పత్రికి రిఫర్ చేశారు. అంతలోనే శిశువు మృతి చెందాడు. అంబులెన్స్ లేక నిరీక్షణ రంపచోడవరం ఏరియా ఆస్పత్రి నుంచి మృతదేహాన్ని సొంత గ్రామానికి తరలించేందుకు అంబులెన్స్ లేక సాయంత్రం ఆరు గంటల వరకు తల్లిదండ్రులు నిరీక్షించారు. ఆస్పత్రి అంబులెన్స్ మోతుగూడెంలో నిర్వహిస్తున్న రక్తదాన శిబిరానికి వెళ్లింది. ఐటీడీఏకు చెందిన రెండు అంబులెన్స్‌లు.. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులతో రాజమహేంద్రవరం వెళ్లాయి. రక్తదాన శిబిరానికి వెళ్లిన వాహనం తిరిగి రావడంతో సాయంత్రం ఆరు గంటలకు శిశువు మృతదేహాన్ని తరలించారు. -
మన్యాన్ని పట్టించుకోరా?
అనారోగ్యంతో చనిపోతున్న గిరిజనులు నిధుల విడుదలలో నిర్లక్ష్యం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి రంపచోడవరం : రాష్ట్ర ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి ఆరోపించారు. ఇక్కడి గిరిజనులు అనేక సమస్యలతో నలిగిపోతున్నారని ఆవేదన చెందారు. స్థానిక పీఎంఆర్సీలో ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. గత రెండున్నరేళ్లలో నియోజకవర్గ అభివృద్థికి ప్రభుత్వం నిధులు కేటాయించలేదన్నారు. ఏజెన్సీలో విద్య, వైద్యంపై ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. విలీన మండలాల్లో కాళ్లవాపు వ్యాధితో గిరిజనులు చనిపోతే పూర్తి స్థాయిలో వైద్య సేవలు మెరుగుపరిచేందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. గర్భిణులు, చిన్నారులకు పౌష్టికాహారం అందడం లేదన్నారు. ముసురుమిల్లి ప్రాజెక్టు ద్వారా శివారు పొలాలకు సాగు నీరు అండం లేదని చెప్పారు. ఆ ప్రాజెక్టు ఏరియాను సందర్శించి రైతులకు మేలు జరిగేందుకు కృషి చేస్తానని చెప్పారు. మన్యంలో అటవీ శాఖ అభ్యంతరాలతో నిలిచిపోయిన రోడ్ల నిర్మాణానికి అనుమతులు కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. పోలవరం నిర్వాసితులకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్యాకేజీ అందించేందుకు వరకూ పోరాడతానన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా రంపచోడవరంలో క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేశామన్నారు. 11 మండలాల నుంచి వచ్చే సమస్యల పరిష్కారం కోసం వచ్చే ఫిర్యాదులు నమోదు చేస్తున్నట్టు తెలిపారు. నియోజకరవ్గంలో సమస్యల పరిష్కారానికి తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నానని చెప్పారు. చింతూరు కేంద్రంగా త్వరలో క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశంలో జెడ్పీటీసీ సభ్యులు పత్తిగుళ్ల భారతి, మట్టా రాణి, ఎంపీపీ పండా జయలక్ష్మి, సర్పంచ్ పండా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఎస్టీయూ డైరీ ఆవిష్కరణ స్టేట్ టీచర్స్ యూనియ¯ŒS (ఎస్టీయూ) నూతన సంవత్సర డైరీని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఇ¯ŒSచార్జి డీడీ సుజాత, ఎస్టీయూ ఎస్టీ సెల్ రాష్ట్ర కన్వీనర్ లండా వేణుగోపాల్, రాష్ట్ర కౌన్సిలర్ ఎల్ లక్ష్మయ్య, కాటం రెడ్డి, జిల్లా కార్యదర్శులు గెచ్చా నాగభూషణం, శ్రీనివాసులు, పీఎంఆర్సీ ఏఓ బి.ఎస్.కుమార్ పాల్గొన్నారు.