- అనారోగ్యంతో చనిపోతున్న గిరిజనులు
- నిధుల విడుదలలో నిర్లక్ష్యం
- ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి
మన్యాన్ని పట్టించుకోరా?
Published Sun, Jan 1 2017 11:26 PM | Last Updated on Tue, Sep 5 2017 12:08 AM
రంపచోడవరం :
రాష్ట్ర ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి ఆరోపించారు. ఇక్కడి గిరిజనులు అనేక సమస్యలతో నలిగిపోతున్నారని ఆవేదన చెందారు. స్థానిక పీఎంఆర్‌సీలో ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. గత రెండున్నరేళ్లలో నియోజకవర్గ అభివృద్థికి ప్రభుత్వం నిధులు కేటాయించలేదన్నారు. ఏజెన్సీలో విద్య, వైద్యంపై ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. విలీన మండలాల్లో కాళ్లవాపు వ్యాధితో గిరిజనులు చనిపోతే పూర్తి స్థాయిలో వైద్య సేవలు మెరుగుపరిచేందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. గర్భిణులు, చిన్నారులకు పౌష్టికాహారం అందడం లేదన్నారు. ముసురుమిల్లి ప్రాజెక్టు ద్వారా శివారు పొలాలకు సాగు నీరు అండం లేదని చెప్పారు. ఆ ప్రాజెక్టు ఏరియాను సందర్శించి రైతులకు మేలు జరిగేందుకు కృషి చేస్తానని చెప్పారు.
మన్యంలో అటవీ శాఖ అభ్యంతరాలతో నిలిచిపోయిన రోడ్ల నిర్మాణానికి అనుమతులు కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. పోలవరం నిర్వాసితులకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్యాకేజీ అందించేందుకు వరకూ పోరాడతానన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా రంపచోడవరంలో క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేశామన్నారు. 11 మండలాల నుంచి వచ్చే సమస్యల పరిష్కారం కోసం వచ్చే ఫిర్యాదులు నమోదు చేస్తున్నట్టు తెలిపారు. నియోజకరవ్గంలో సమస్యల పరిష్కారానికి తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నానని చెప్పారు. చింతూరు కేంద్రంగా త్వరలో క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశంలో జెడ్పీటీసీ సభ్యులు పత్తిగుళ్ల భారతి, మట్టా రాణి, ఎంపీపీ పండా జయలక్ష్మి, సర్పంచ్ పండా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఎస్టీయూ డైరీ ఆవిష్కరణ
స్టేట్ టీచర్స్ యూనియ¯ŒS (ఎస్టీయూ) నూతన సంవత్సర డైరీని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఇ¯ŒSచార్జి డీడీ సుజాత, ఎస్టీయూ ఎస్టీ సెల్ రాష్ట్ర కన్వీనర్ లండా వేణుగోపాల్, రాష్ట్ర కౌన్సిలర్ ఎల్ లక్ష్మయ్య, కాటం రెడ్డి, జిల్లా కార్యదర్శులు గెచ్చా నాగభూషణం, శ్రీనివాసులు, పీఎంఆర్‌సీ ఏఓ బి.ఎస్.కుమార్ పాల్గొన్నారు.
Advertisement