mla fight
-
గుజరాత్లో బీజేపీ ఎమ్మెల్యే దాష్టీకం
ఆహ్మదాబాద్: పట్టపగలు, నడిరోడ్డు మీద ఒక మహిళ అని చూడకుండా బీజేపీ ఎమ్మెల్యే ఒకరు దాష్టీకానికి పాల్పడ్డారు. ఇష్టమొచ్చినట్లు కొట్టారు. ముఖాన్ని బూటు కాలుతో తొక్కారు. ఇంతకీ ఆమె చేసిన నేరం ఏమిటంటే తమ ప్రాంతానికి నీటి సరఫరా ఎప్పట్నుంచి పునరుద్ధరిస్తారని ప్రశ్నించడమే. సంబంధిత వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో క్షమాపణలు చెప్పాడు. గుజరాత్లోని నరోదా పట్టణంలో స్థానిక ఎన్సీపీ మహిళా నేత తేజ్వని తమ సమస్యపై తొలుత అక్కడి కార్పొరేటర్, బీజేపీ ఎమ్మెల్యే బలరామ్ థావాని సోదరుడు కిశోర్ థావానీని సంప్రదించారు. ఈ మేరకు ఒక వినతి పత్రాన్ని కూడా సమర్పించారు. ఆయన పట్టించుకోలేదు. పైగా దుర్భాషలాడారు. ఐదారు రోజులు గడిచినా పరిస్థితిలో మార్పు లేకపోవడంతో తేజ్వని అహ్మదాబాద్లో మేఘాని నగర్లో ఉన్న ఎమ్మెల్యే ఇంటికి తమ ప్రాంతంలోని ఇతర మహిళలతో కలసి వెళ్లారు. ఆ సమయంలో ఎమ్మెల్యే ఆఫీసులో లేరు. అయితే ఆయన మద్దతుదారులు వారిని దుర్భాషలాడటంతో మహిళలు కిశోర్ థావానీకి వ్యతిరేకంగా నినాదాలు మొదలు పెట్టారు. ఇంతలో ఎమ్మెల్యే బలరామ్ వచ్చారు. ‘వస్తూ వస్తూనే ఆవేశంగా నా చేతిలో మొబైల్ ఫోన్ లాక్కున్నాడు. నా కడుపులో తన్నాడు. నేను కింద పడిపోతే కాళ్లతో నా ముఖం మీద కొట్టడం మొదలు పెట్టాడు. చివరికి కర్రతో కూడా కొట్టాడు. నా భర్త అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో అతని అనుచులు ఆయనను అక్కడ నుంచి గెంటేశారు‘‘అని తేజ్వని వివరించారు. ఈ ఘటన వీడియో యూ ట్యూబ్లో వైరల్గా మారింది. దీనిపై బీజేపీ అధిష్టానం సీరియస్ అయ్యింది. దీంతో ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పారు. కాగా ఎమ్మెల్యేని వెంటనే అరెస్ట్ చేయాలని ఎన్సీపీ డిమాండ్ చేసింది. -
నీచ సంస్కృతికి తెరలేపారు
టీడీపీ నేతలు గలాటా ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఆగ్రహం చొప్పెల్ల (ఆలమూరు) : ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తుంటే తమను మాట్లాడనీయకుండా టీడీపీ నేతలు మైక్ కట్ చేసి నీచ సంస్కృతికి తెర లేపారని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆరోపించారు. మండలంలోని చొప్పెల్లలో మంగళవారం జరిగిన జన్మభూమి–మాఊరు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన తొలుత ప్రజా సమస్యలపై అధికారులను ప్రశ్నించారు. దీనిపై ఆందోళన చెందిన అధికార పార్టీ నాయకులు ఎమ్మెల్యే జగ్గిరెడ్డిని మాట్లాడనీయకుండా మైక్ కట్ చేశారు. దీంతో ఆయన బయటకు వచ్చి ప్రజల మధ్యలో నిలబడి ప్రసంగించి టీడీపీ వైఖరిపై తమ నిరసనను తెలియజేశారు. ఈసందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాలని కోరుతున్నా పట్టించుకోకుండా టీడీపీ నేతలు పక్షపాత వైఖరిని అవలంబిస్తూ అనర్హులను ఎంపిక చేస్తున్నారన్నారు. ప్రజల సమక్షంలో పింఛ¯ŒS లబ్ధిదారుల ఎంపిక చేయాలని ప్రతిపక్ష పార్టీగా తాము డిమాండు చేస్తుంటే నెలాఖరున జాబితాను ప్రకటిస్తామని అధికారుల చేత చెప్పించడం ఎంత వరకూ భావ్యమని ఆయన ప్రశ్నించారు. టీడీపీ నేతలంతా ఆయా గ్రామాల్లో జన్మభూమి–మాఊరు ముగిసిన తరువాత తమకు అనుకూలమైన జాబితాను తయారు చేసుకునేందుకే ఇలాంటి చౌకబారు పనులు చేస్తున్నారన్నారు. టీడీపీ అధికారం చేపట్టి రెండున్నరేళ్లు గడిచినా ఇంత వరకూ ఒక్క ఇంటికి రుణం మంజూరు చేయలేదన్నారు. అ««ధికార పార్టీ నేతల మాటలు నమ్మి ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులు అప్పులు పాలయ్యారన్నారు. అలాగే అగ్నిప్రమాద బాధితులకు కూడా గృహ రుణాలు మంజూరు చేయడం లేదన్నారు. జన్మభూమి కమిటీలతో ప్రజాకంటక పాలన సాగిస్తున్న అధికార పార్టీకి ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ప్రజా ప్రతినిధులను పట్టించుకోకుండా అ«ధికార పార్టీ మాజీలతో జన్మభూమి– మాఊరు చేపట్టి ప్రోటోకాల్ ఉల్లంఘనకు పాల్పడుతున్నారన్నారు. -
మన్యాన్ని పట్టించుకోరా?
అనారోగ్యంతో చనిపోతున్న గిరిజనులు నిధుల విడుదలలో నిర్లక్ష్యం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి రంపచోడవరం : రాష్ట్ర ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి ఆరోపించారు. ఇక్కడి గిరిజనులు అనేక సమస్యలతో నలిగిపోతున్నారని ఆవేదన చెందారు. స్థానిక పీఎంఆర్సీలో ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. గత రెండున్నరేళ్లలో నియోజకవర్గ అభివృద్థికి ప్రభుత్వం నిధులు కేటాయించలేదన్నారు. ఏజెన్సీలో విద్య, వైద్యంపై ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. విలీన మండలాల్లో కాళ్లవాపు వ్యాధితో గిరిజనులు చనిపోతే పూర్తి స్థాయిలో వైద్య సేవలు మెరుగుపరిచేందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. గర్భిణులు, చిన్నారులకు పౌష్టికాహారం అందడం లేదన్నారు. ముసురుమిల్లి ప్రాజెక్టు ద్వారా శివారు పొలాలకు సాగు నీరు అండం లేదని చెప్పారు. ఆ ప్రాజెక్టు ఏరియాను సందర్శించి రైతులకు మేలు జరిగేందుకు కృషి చేస్తానని చెప్పారు. మన్యంలో అటవీ శాఖ అభ్యంతరాలతో నిలిచిపోయిన రోడ్ల నిర్మాణానికి అనుమతులు కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. పోలవరం నిర్వాసితులకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్యాకేజీ అందించేందుకు వరకూ పోరాడతానన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా రంపచోడవరంలో క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేశామన్నారు. 11 మండలాల నుంచి వచ్చే సమస్యల పరిష్కారం కోసం వచ్చే ఫిర్యాదులు నమోదు చేస్తున్నట్టు తెలిపారు. నియోజకరవ్గంలో సమస్యల పరిష్కారానికి తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నానని చెప్పారు. చింతూరు కేంద్రంగా త్వరలో క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశంలో జెడ్పీటీసీ సభ్యులు పత్తిగుళ్ల భారతి, మట్టా రాణి, ఎంపీపీ పండా జయలక్ష్మి, సర్పంచ్ పండా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఎస్టీయూ డైరీ ఆవిష్కరణ స్టేట్ టీచర్స్ యూనియ¯ŒS (ఎస్టీయూ) నూతన సంవత్సర డైరీని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఇ¯ŒSచార్జి డీడీ సుజాత, ఎస్టీయూ ఎస్టీ సెల్ రాష్ట్ర కన్వీనర్ లండా వేణుగోపాల్, రాష్ట్ర కౌన్సిలర్ ఎల్ లక్ష్మయ్య, కాటం రెడ్డి, జిల్లా కార్యదర్శులు గెచ్చా నాగభూషణం, శ్రీనివాసులు, పీఎంఆర్సీ ఏఓ బి.ఎస్.కుమార్ పాల్గొన్నారు. -
మంత్రులకు నియంత్రించే శక్తీ లేదు
-
మంత్రులే ఉసిగొలిపారు