- టీడీపీ నేతలు గలాటా
- ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఆగ్రహం
నీచ సంస్కృతికి తెరలేపారు
Published Tue, Jan 3 2017 10:27 PM | Last Updated on Fri, Aug 10 2018 9:46 PM
చొప్పెల్ల (ఆలమూరు) :
ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తుంటే తమను మాట్లాడనీయకుండా టీడీపీ నేతలు మైక్ కట్ చేసి నీచ సంస్కృతికి తెర లేపారని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆరోపించారు. మండలంలోని చొప్పెల్లలో మంగళవారం జరిగిన జన్మభూమి–మాఊరు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన తొలుత ప్రజా సమస్యలపై అధికారులను ప్రశ్నించారు. దీనిపై ఆందోళన చెందిన అధికార పార్టీ నాయకులు ఎమ్మెల్యే జగ్గిరెడ్డిని మాట్లాడనీయకుండా మైక్ కట్ చేశారు. దీంతో ఆయన బయటకు వచ్చి ప్రజల మధ్యలో నిలబడి ప్రసంగించి టీడీపీ వైఖరిపై తమ నిరసనను తెలియజేశారు. ఈసందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాలని కోరుతున్నా పట్టించుకోకుండా టీడీపీ నేతలు పక్షపాత వైఖరిని అవలంబిస్తూ అనర్హులను ఎంపిక చేస్తున్నారన్నారు. ప్రజల సమక్షంలో పింఛ¯ŒS లబ్ధిదారుల ఎంపిక చేయాలని ప్రతిపక్ష పార్టీగా తాము డిమాండు చేస్తుంటే నెలాఖరున జాబితాను ప్రకటిస్తామని అధికారుల చేత చెప్పించడం ఎంత వరకూ భావ్యమని ఆయన ప్రశ్నించారు. టీడీపీ నేతలంతా ఆయా గ్రామాల్లో జన్మభూమి–మాఊరు ముగిసిన తరువాత తమకు అనుకూలమైన జాబితాను తయారు చేసుకునేందుకే ఇలాంటి చౌకబారు పనులు చేస్తున్నారన్నారు. టీడీపీ అధికారం చేపట్టి రెండున్నరేళ్లు గడిచినా ఇంత వరకూ ఒక్క ఇంటికి రుణం మంజూరు చేయలేదన్నారు. అ««ధికార పార్టీ నేతల మాటలు నమ్మి ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులు అప్పులు పాలయ్యారన్నారు. అలాగే అగ్నిప్రమాద బాధితులకు కూడా గృహ రుణాలు మంజూరు చేయడం లేదన్నారు. జన్మభూమి కమిటీలతో ప్రజాకంటక పాలన సాగిస్తున్న అధికార పార్టీకి ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ప్రజా ప్రతినిధులను పట్టించుకోకుండా అ«ధికార పార్టీ మాజీలతో జన్మభూమి– మాఊరు చేపట్టి ప్రోటోకాల్ ఉల్లంఘనకు పాల్పడుతున్నారన్నారు.
Advertisement