Agency region
-
ఏజెన్సీలో రుణమాఫీ
భద్రాచలం: జిల్లాలో ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన, గిరిజనేతరులకు రుణమాఫీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని ఏపీ గ్రామీణ వికాస బ్యాంకు రీజనల్ మేనేజర్ జె. రాజగోపాల్ తెలిపారు. శుక్రవారం భద్రాచలంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. భద్రాచలం ఏబీజీవీబీ రీజనల్ పరిధిలోని 36 మండలాల్లో 42,135 మంది రైతులకు రూ.240 కోట్లు రుణాలను మాఫీ చేయనున్నట్లు చెప్పారు. ఇందులో తొలివిడతగా రూ.58.59 కోట్లు మంజూరయ్యాయని, 25 శాతం చొప్పున త్వరలోనే రైతుల ఖాతాలలో వీటిని జమ చేస్తామని తెలిపారు. రుణమాఫీకి అర్హులైన రైతుల జాబితాను అన్ని గ్రామీణ బ్యాంకుల పరిధిలో ఉంచామన్నారు. వీటిని రైతులు పరిశీలించుకోవచ్చన్నారు. అయితే రుణాలు రీషెడ్యూల్ చేసుకుంటేనే మాఫీకి అర్హత ఉంటుందని, ఈ విషయాన్ని రైతులు గమనించాలని సూచించారు. రైతు రుణాలను ఏడాది కాలవ్యవధితోనే ఇస్తామని, ప్రస్తుతం కాలపరిమితి దాటినందను తీసుకున్న రుణంపై 14 శాతం వరకూ వడ్డీ లెక్కిస్తున్నామని తెలిపారు. సక్రమంగా రుణాలను చెల్లించిన వారికే ప్రభుత్వ రుణమాఫీ పథకంలో భాగంగా మూడు దఫాలుగా మంజూరయ్యే మాఫీ మొత్తాన్ని వర్తింపజేస్తామని చెప్పారు. రైతులకు దీనిపై అవగాహన కల్పించేందుకు గ్రామాలలో టమాకా వేయించాలని రెవెన్యూ అధికారులను కోరారు. డిసెంబర్ 31లోపు రీషెడ్యూల్ చేసుకోండి... రీజియన్ పరిధిలోని 36 మండలాల్లో గల 65 శాఖలలో మొత్తం 54,856 మంది రైతులకు గాను 42,135 మంది రుణమాఫీకి అర్హత ఉందని, రెండవ దఫాగా మరో 9 వేల మందికి కూడా వర్తింపజేసేందుకు కసరత్తు చేస్తున్నామని అన్నారు. రుణమాఫీకి అర్హులైన రైతులు డిసెంబర్ 31 లోగా రుణాలు రీషెడ్యూల్ చేసుకోవాలని కోరారు. ముంపు మండ లాల్లో వర్తింపు లేదు... ఏపీకి బదలాయించిన ముంపు మండలాల్లో రుణమాఫీ వర్తింపు ఆ ప్రభుత్వమే చెల్లించాల్సి ఉన్నందున, తాము వారి జాబితాను వేరు చేశామని చెప్పారు. ఏపీకి బదలాయించిన 7 మండలాల్లో 10 బ్రాంచీలు పూర్తిగా, 1 బ్రాంచి పాక్షికంగా ఆంధ్రలోకి వెళ్తున్నాయని, వీటిలో సుమారు రూ.10 కోట్ల వరకు రైతు రుణాలు ఉంటాయని చెప్పారు. వీటిపై ఏపీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మేరకే తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.ఎస్‌హెచ్‌జీ గ్రూపులు తీసుకున్న రుణాలకు మాఫీ వర్తించదని, మహిళలు తీసుకున్న రుణాలను వెంటనే చెల్లించాలని కోరారు. -
టూరిజం పేరుతో ఏజెన్సీపై కుట్ర
సర్కారుపై ధ్వజమెత్తిన వైఎస్సార్సీపీ గిరిజన ఎమ్మెల్యేలు సాక్షి, హైదరాబాద్: పర్యాటకరంగం అభివృద్ధి పేరుతో ఏజెన్సీ ప్రాంతంలోని భూముల్ని డీ నోటిఫై చేసి బాక్సైట్ తవ్వకాలే రహస్య ఎజెండాగా ప్రభుత్వం ముందుకెళుతోందని వైఎస్సార్సీపీ గిరిజన ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వానికి గిరిజనులంటే చిన్న చూపని, గిరిజనులంతా వైఎస్సార్సీపీకి అండగా నిలిచి టీడీపీని ఆదరించనందునే వారి పట్ల కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. రాష్ట్రం మొత్తం ఏడు గిరిజన అసెంబ్లీ సెగ్మెంట్లుంటే, ఆరు సెగ్మెంట్లలో వైఎస్సార్సీపీని గెలిపించినందునే ఏజెన్సీలోని సమస్యల పట్ల వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో శుక్రవారం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, కిడారి సర్వేశ్వరరావు, పీడిక రాజన్నదొర, రాజేశ్వరి, పుష్పశ్రీవాణి, విశ్వాసరాయి కళావతిలు విలేకరులతో మాట్లాడారు. గిరిజన ఎమ్మెల్యేలమైన తమపట్ల ఉదారంగా వ్యవహరించాల్సిన స్పీకర్ తమకు అవకాశం కూడా ఇవ్వడం లేదని ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర ఆవేదన వ్యక్తంచేశారు. అరకు, లంబసింగిలను టూరిజం కేంద్రాలుగా ఎలా అభివృద్ధి చేస్తారో చెప్పాలని కోరితే సభలో అధికారపక్షం వ్యవహరించిన తీరు అవమానకరం గా ఉందన్నారు. గిరిజన ప్రాంతాల్లోని ప్రకృతిని ధ్వంసం చేసి బాక్సైట్ తవ్వకాల కోసం ప్రభుత్వం రహస్య ఎజెండాతో ముందుకెళ్తుందని ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు ఆరోపించారు. అరకుపై అసెంబ్లీలో గొడవ, సభ వాయిదా అంతకుముందు శాసనసభలో అరకును పర్యాటక కేంద్రంగా మార్చే వ్యవహారమై వాడివేడి చర్చ జరిగింది. గిరిజన ప్రాంతంగా ఉన్న అరకును డీ నోటిఫై చేసే ప్రతిపాదన లేదంటూనే పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామంటూ ప్రభుత్వం చేసిన ప్రకటనపై వివాదం చెలరేగింది. దీనిపై మాట్లాడనీయకపోవడంతో వై సీపీ గిరిజన ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తంచేయగా స్పీకర్ సభను కొద్దిసేపు వాయిదా వేశారు. -
తెలంగాణతో నక్సలిజం పెరగదు: డీజీపీ
పోలీసు శాఖలో రాజకీయ జోక్యాన్ని అధిగమిస్తాం: డీజీపీ ఏటూరునాగారం, న్యూస్‌లైన్: అభివృద్ధి చెందిన చోట నక్సలిజం ఉండదని డీజీపీ బి.ప్రసాదరావు అన్నారు. వరంగల్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో పర్యటించటంతోపాటు ఆయన జిల్లా కేంద్రంలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాగునీటి వనరులు, యువతకు చేతినిండా పని లభిస్తే నక్సలిజం అనేది ఉండదన్నారు. నక్సల్స్ గోదావరి అవతలి వైపు అభయారణ్యంలో అడుగు పెట్టవచ్చని, వారు పూర్తిగా లేరని చెప్పలేమన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నక్సల్స్ వ్యవస్థ పెరగకపోవచ్చని, ఒకవేళ ఎక్కువగా ఉంటే అణచివేసేందుకు పోలీస్‌శాఖ సిద్ధంగా ఉందని తెలిపారు. పోలీసు శాఖలో రాజకీయ ప్రమేయం సాధారణమేనని, దానిని అధిగమించే దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా ఆయన సమ్మక్క సారలమ్మను దర్శించుకున్నారు.