agitaion
-
పంజాబ్- హరియాణా సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం?
ప్రస్తుతం హరియాణా-పంజాబ్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. సరిహద్దు జిల్లాల బార్డర్లను ప్రభుత్వం సీల్ చేసింది. మొబైల్ ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేసింది. పోలీసుల నిఘా కూడా మరింతగా పెరిగింది. రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) సంబంధిత ప్రాంతాల పోలీసు కెప్టెన్లతో నిరంతరం ఫోన్లో టచ్‌లో ఉంటున్నారు. డీజీపీ స్వయంగా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అయితే ఇదంతా ఎందుకు జరుగుతోంది? రైతుల ‘ఛలో ఢిల్లీ’ పిలుపును దృష్టిలో ఉంచుకుని పోలీసులు భద్రతను మరింతగా పెంచారు. పలు డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఫిబ్రవరి 13న ‘ఛలో ఢిల్లీ’కి పలు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హర్యానా యంత్రాంగం నిఘా పెంచింది. ఈ రైతుల ఆందోళన కార్యక్రమంలో 200 రైతు సంఘాలు పాల్గొంటాయని సమాచారం. కనీస మద్దతు ధర (ఎంఎస్పి)ని తప్పనిసరి చేసేందుకు చట్టాన్ని రూపొందించి అమలు చేయాలన్నది రైతు సంఘాల ప్రధాన డిమాండ్. రైతుల పిలుపును దృష్టిలో ఉంచుకున్న హర్యానాలోని మనోహర్‌లాల్ ఖట్టర్ ప్రభుత్వం సరిహద్దుల్లో ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేసింది. హర్యానాలోని ఏడు జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. బల్క్ ఎస్ఎంఎస్లను పంపడాన్ని నిషేధించారు. అంబాలా, కురుక్షేత్ర, కైతాల్, జింద్, హిసార్, ఫతేహాబాద్, సిర్సాలలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. హర్యానా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శత్రుజిత్ కపూర్ అంబాలా పక్కనే ఉన్న శంభు సరిహద్దు ప్రాంతాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. హర్యానా పోలీసులు కూడా ట్రాఫిక్ అడ్వైజరీని జారీ చేశారు. తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ‘ఛలో ఢిల్లీ’ మార్చ్‌కు సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా పిలుపునిచ్చాయి. ఈ రెండు రైతు సంఘాల డిమాండ్లకు 200కు పైగా రైతు సంఘాలు మద్దతుగా నిలిచాయి. 2024 ఫిబ్రవరి 13న ఢిల్లీకి పాదయాత్ర చేస్తామని కూడా రైతుల సంఘాలు ప్రకటించారు. రైతుల పిలుపును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వంతో పాటు పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. -
ఢిల్లీలో రెండో రోజు స్టీల్ ప్లాంట్ కార్మికుల ఆందోళన
-
ఢిల్లీలో హైఅలర్ట్
-
ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద రైతు నిరసన
-
రైతు ఉద్యమానికి మద్దతుగా పార్లమెంట్ ప్రాంగణంలో రాహుల్ ఆందోళన
-
సుష్మా ఇంటిని ముట్టడించేందుకు యత్నం
న్యూఢిల్లీ: మాజీ ఐపిఎల్ చీఫ్ లలిత్ మెదీ వీసా వివాదంలో విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు శనివారం హస్తినలో ఆందోళనకు దిగారు. ఢిల్లీలోని సుష్మా ఇంటిని ముట్టడిం చేందుకు ఆప్ శ్రేణులు ప్రయత్నించాయి. భారీ ర్యాలీగా వెళ్లిన కార్యకర్తలు సుష్మా ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించాయి. ఈ ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. గత ఆందోళనల నేపథ్యంలో సుష్మా ఇంటి వద్ద బందోబస్తు పెంచిన పోలీసులు బారికేడ్లు కూడా ఏర్పాటు చేశారు. ఈ బారికేడ్లను తోసుకొని సుష్మా ఇంటి ముట్టడికి ఆప్ కార్యకర్తలు ప్రయత్నించారు. మంత్రి పదవికి సుష్మా స్వరాజ్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. లలిత్ మోదీ వీసా వ్యవహారంలో చిక్కుల్లో పడిన కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ మానవతా దృక్పథంతోనే ఈ సాయం చేశానని వివరణ ఇచ్చినా.. ఈ వ్యవహారంలో ఆమెకు లబ్ధి చేకూరిందని కాంగ్రెస్ సహా విపక్షాలు విమర్శిస్తున్నాయి. తక్షణమే ఆమె రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. మరోవైపు సుష్మా స్వరాజ్ న్యూయార్క్ బయల్దేరి వెళ్లిపోయారు. అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనేందుకు ఆమె న్యూయార్క్ వెళ్లారు. లలిత్ మోదీ వివాదం మరింత ముదురుతున్న నేపథ్యంలో ఆమె న్యూయార్క్ వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
నేడు ప్రకాశం బ్యారేజి వద్ద ధర్నా
చిలకలూరిపేట,న్యూస్‌లైన్ :కర్ణాటకలోని ఆలమట్టి డ్యామ్ ఎత్తు పెంచుకునేందుకు అవకాశం కల్పిస్తూ బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పునకు నిరసనగా శనివారం ఉదయం 10 గంటలకు ప్రకాశం బ్యారేజి వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ చెప్పారు. శుక్రవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.ట్రిబ్యునల్ తీర్పుతో రాష్ట్ర రైతాంగానికి తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. కృష్ణాడెల్టా, సాగర్ కుడి, ఎడమ కాల్వల పరిధిలో ఉన్న సాగు భూములకు నీరు అందని పరిస్థితి నెలకొంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ తీర్పు ప్రభావం సాగర్ నుంచి హైదరాబాద్‌కు ఏర్పాటు చేస్తున్న పైపులైన్ నిర్మాణం, ప్రకాశం జిల్లాలో వెలుగొండ ప్రాజెక్ట్, రాయలసీమలో హంద్రీ నీవా తదితర ప్రాజెక్టులపై పడే ప్రమాదం ఉందన్నారు. రాష్ట్రానికి వచ్చే జలాలను చె న్నైకు పంపిణీ చేయాల్సి ఉంటుందని ఇది రాష్ట్రంలో తీవ్రప్రభావం చూపుతుందన్నారు. చంద్రబాబు హయాంలోనే ఆలమట్టి డ్యామ్ ఎత్తు నిలిపి ఉంటే ఈ పరిస్థితి దాపురించేది కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాదనలు వినిపించటంలో విఫలమైందని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తీర్పు నిలుపుదలకు ప్రయత్నాలు చేయాలని డిమాండ్ చేశారు. కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లే తీర్పుపై సమైక్యంగా పోరాటం చేయాలని సూచించారు. శనివారం ప్రకాశం బ్యారేజి వద్ద జరిగే ధర్నా కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, రైతులు, మేధావులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆ ఇద్దరివల్లే రాష్ట్రానికి ఈ దుస్థితి వైఎస్సార్సీపీ నేత ఆర్కే సాక్షి ప్రతినిధి, గుంటూరు: కృష్ణానది నీటి కేటాయింపులపై ఏర్పాటైన బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట సరైన విధంగా వాదనలు వినిపించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కృష్ణా, గుంటూరు జిల్లాల సమన్వయకర్త ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) అభిప్రాయపడ్డారు. అసమర్థుడైన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, సత్తా లేని ప్రతిపక్షనేత చంద్ర బాబు నాయుడుల చేతగాని తనం వల్లనే రాష్ట్రానికి ఈ దుస్థితి ఏర్పడిందని ఆయన విమర్శించారు. బ్రజేశ్‌కుమార్ తీర్పుపై వ్యాఖ్యానించడం సబబు కాకపోయినా, ఈ విషయంలో బాబు, కిరణ్ ఇద్దరూ తీవ్ర అలసత్వాన్ని కనబరిచారని అన్నారు. ఆల్మట్టి డ్యాం నిర్మాణ సమయంలో కేంద్రంలో చక్రం తిప్పానని గొప్పలు చెప్పుకున్న చంద్రబాబు రాష్ట్రానికి వ్యతిరేకంగా తిప్పారని అర్థమైందన్నారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వరకు బస్ తీసుకున్నట్లు పదేపదే సోనియా దగ్గరకు రాకపోకలు సాగించే సీఎం రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేలు వాయించిన నీరో చక్రవర్తి మాదిరిగా వ్యవహరించడం రాష్ట్రానికి చేటు తెచ్చిందన్నారు. ఈ పరిస్థితుల్లో మనం సుప్రీంకోర్టుకు అప్పీలు చేసుకోవడం ఒక్కటే మార్గమన్నారు