ప్రస్తుతం హరియాణా-పంజాబ్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. సరిహద్దు జిల్లాల బార్డర్లను ప్రభుత్వం సీల్ చేసింది. మొబైల్ ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేసింది. పోలీసుల నిఘా కూడా మరింతగా పెరిగింది. రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) సంబంధిత ప్రాంతాల పోలీసు కెప్టెన్లతో నిరంతరం ఫోన్‌లో టచ్‌లో ఉంటున్నారు. డీజీపీ స్వయంగా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అయితే ఇదంతా ఎందుకు జరుగుతోంది?
రైతుల ‘ఛలో ఢిల్లీ’ పిలుపును దృష్టిలో ఉంచుకుని పోలీసులు భద్రతను మరింతగా పెంచారు. పలు డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఫిబ్రవరి 13న ‘ఛలో ఢిల్లీ’కి పలు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హర్యానా యంత్రాంగం నిఘా పెంచింది. ఈ రైతుల ఆందోళన కార్యక్రమంలో 200 రైతు సంఘాలు పాల్గొంటాయని సమాచారం.
కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)ని తప్పనిసరి చేసేందుకు చట్టాన్ని రూపొందించి అమలు చేయాలన్నది రైతు సంఘాల ప్రధాన డిమాండ్. రైతుల పిలుపును దృష్టిలో ఉంచుకున్న హర్యానాలోని మనోహర్‌లాల్ ఖట్టర్ ప్రభుత్వం సరిహద్దుల్లో ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేసింది. హర్యానాలోని ఏడు జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. బల్క్ ఎస్‌ఎంఎస్‌లను పంపడాన్ని నిషేధించారు. అంబాలా, కురుక్షేత్ర, కైతాల్, జింద్, హిసార్, ఫతేహాబాద్, సిర్సాలలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.
హర్యానా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శత్రుజిత్ కపూర్ అంబాలా పక్కనే ఉన్న శంభు సరిహద్దు ప్రాంతాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. హర్యానా పోలీసులు కూడా ట్రాఫిక్ అడ్వైజరీని జారీ చేశారు. తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ‘ఛలో ఢిల్లీ’ మార్చ్‌కు సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా పిలుపునిచ్చాయి. ఈ రెండు రైతు సంఘాల డిమాండ్లకు 200కు పైగా రైతు సంఘాలు మద్దతుగా నిలిచాయి. 2024 ఫిబ్రవరి 13న ఢిల్లీకి పాదయాత్ర చేస్తామని కూడా రైతుల సంఘాలు ప్రకటించారు. రైతుల పిలుపును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వంతో పాటు పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment