భారీ స్కోరు దిశగా పాక్
షెహజాద్ సెంచరీ న్యూజిలాండ్తో టెస్టు
అబుదాబి: ఓపెనర్లు అహ్మద్ షెహజాద్ (126 బ్యాటింగ్), మహ్మద్ హఫీజ్ (96)లు సత్తా చాటడంతో న్యూజిలాండ్తో జరుగుతున్న టెస్టులో పాకిస్థాన్ జట్టు భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. మూడు టెస్టుల సిరీస్లో భాగంగా ఆదివారం ప్రారంభమైన మొదటి టెస్టు తొలి రోజు ఆటముగిసే సమయానికి... పాకిస్థాన్ వికెట్ నష్టానికి 269 పరుగులు చేసింది.
టాస్ గెలిచిన పాక్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. మొదటి వికెట్కు 178 పరుగులు జోడించిన ఓపెనర్లు పాక్కు అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. 96 పరుగులు చేసిన హఫీజ్ అండర్సన్ బౌలింగ్లో ఆవుటై కొద్దిలో సెంచరీని కోల్పోయాడు. షెహజాద్తో పాటు అజహర్ అలీ (46 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు.