అజ్మాపురం ఘాట్‌ను పరిశీలించిన ఆర్డీఓ
అధికారులు సమన్వయంతో పని చేయాలి
– దేవరకొండ ఆర్డీఓ గంగాధర్
పెద్దఅడిశర్లపల్లి : మండలంలోని అజ్మాపురం పుష్కరఘాట్‌ను శుక్రవారం ఆర్డీఓ గంగాధర్ వివిధ శాఖల అదికారులతో కలిసి సందర్శించారు. అనంతరం సమావేశం ఏర్పాటు చేసి పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారులు సమన్వయంతో పని చేయాలని కోరారు. వివిధ శాఖల నుంచి 33 సిబ్బందికి డ్యూటీ వేసినట్లు తెలిపారు. వీరందరూ ఘాట్ వద్ద మూడు షిఫ్టుల్లో పని చేయాల్సి ఉంటుందన్నారు. రెండు మూడు రోజుల్లో పనులన్నీ పూర్వవుతాయని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో అజ్మాపురం పుష్కర ఘాట్ ఇన్చార్జి, సెరికల్చర్ ఏడీ అశోక్, తహసీల్దార్ ధర్మయ్య, ఎంపీడీఓ జావేద్‌అలీ, వైద్యాధికారి హిమబిందు,వలిగొండ తహసీల్దార్ అరుణ, పీఆర్ ఏఈ, ఆర్ఐ ముఖ్తార్ తదితరులున్నారు.