దర్శకుని తండ్రి, సోదరుడి కిడ్నాప్.. హత్య
మెక్సికో: కిడ్నాప్ లు, హత్యలు ఎక్కువగా జరిగే మెక్సికోలో మరో విషాదం చోటు చేసుకుంది. సంచలన చిత్రాల దర్శకుడు అలెజాండ్రో గోమెజ్ కు తీరని విషాదం మిగిలింది. ఈ నెలారంభంలో కిడ్నాప్ అయిన ఆయన తండ్రి, సోదరుడు హత్యకు గురయ్యారు. వెరాక్రూజ్ రాష్ట్రంలోని నగరంలో శనివారం సాయంత్రం వారి మృతదేహాలను పోలీసులు గుర్తించారు. వాటిని అలెజాండ్రో కుటుంబీకుల మృతదేహాలుగా ఆదివారం ధ్రువీకరించారు.
అలెజాండ్రో తండ్రి, సోదరుడిని కొంతమంది దుండగులు ఈ నెల 4న కిడ్నాప్ చేశారు. దుండగులు డిమాండ్ చేసిన సొమ్మును చెల్లించినప్పటికీ వారిని విడిచిపెట్టలేదని, చివరికి వారిని పొట్టన పెట్టుకున్నారని స్థానిక మీడియా రిపోర్టు చేసింది.