దర్శకుని తండ్రి, సోదరుడి కిడ్నాప్.. హత్య | Mexican film director's kidnapped father, brother killed | Sakshi
Sakshi News home page

దర్శకుని తండ్రి, సోదరుడి కిడ్నాప్.. హత్య

Sep 22 2015 2:06 PM | Updated on Sep 3 2017 9:47 AM

దర్శకుని తండ్రి, సోదరుడి కిడ్నాప్.. హత్య

దర్శకుని తండ్రి, సోదరుడి కిడ్నాప్.. హత్య

సంచలన చిత్రాల దర్శకుడు అలెజాండ్రో గోమెజ్ కు తీరని విషాదం మిగిలింది.

మెక్సికో: కిడ్నాప్ లు, హత్యలు ఎక్కువగా జరిగే మెక్సికోలో మరో విషాదం చోటు చేసుకుంది. సంచలన చిత్రాల దర్శకుడు అలెజాండ్రో గోమెజ్ కు తీరని విషాదం మిగిలింది. ఈ నెలారంభంలో కిడ్నాప్ అయిన ఆయన తండ్రి, సోదరుడు హత్యకు గురయ్యారు. వెరాక్రూజ్ రాష్ట్రంలోని నగరంలో శనివారం సాయంత్రం వారి మృతదేహాలను పోలీసులు గుర్తించారు. వాటిని అలెజాండ్రో కుటుంబీకుల మృతదేహాలుగా ఆదివారం ధ్రువీకరించారు.

అలెజాండ్రో తండ్రి, సోదరుడిని  కొంతమంది దుండగులు ఈ నెల 4న కిడ్నాప్ చేశారు. దుండగులు డిమాండ్ చేసిన సొమ్మును చెల్లించినప్పటికీ వారిని విడిచిపెట్టలేదని, చివరికి వారిని పొట్టన పెట్టుకున్నారని స్థానిక మీడియా రిపోర్టు చేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement