Alex
-
Alex Baty: బ్రిటన్‌లో పాపం పసివాడు!
అనగనగా అలెక్స్ బాటీ. ఓ 11 ఏళ్ల పాల బుగ్గల పసివాడు. సొంతూరు బ్రిటన్‌లోని గ్రేటర్ మాంచెస్టర్. తల్లి, తాతయ్య విదేశీ యాత్రకు వెళ్దామంటే సంబరంగా వాళ్లతో కలిసి స్పెయిన్ బయల్దేరాడు. ఆ యాత్ర ఏకంగా ఆరేళ్లకు పైగా సాగుతుందని అప్పుడతనికి తెలియదు పాపం! ఎందుకంటే అప్పట్నుంచీ అతను బ్రిటన్ తిరిగి రానే లేదు. సరికదా, ఆచూకీ కూడా తెలియకుండా పోయాడు! అతనే కాదు, నాటినుంచీ అతని తల్లి, తాతయ్య కూడా నేటికీ పత్తా లేరు!! ఈ ఉదంతం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బ్రిటన్ పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు కూడా చేశారు. అలెక్స్ కోసం యూరప్ అంతటా వెదికీ వెదికీ అలసిపోయారు. ఇక తమవల్ల కాదంటూ చేతులెత్తేశారు. అదుగో, అలాంటి స్థితిలో మూడు రోజుల క్రితం అనుకోకుండా ఫ్రాన్స్‌లో దొరికాడు అలెక్స్. ఈ లాస్ట్ అండ్ ఫౌండ్ స్టోరీ ఇప్పుడు బ్రిటన్ అంతటా టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారింది! ఇలా దొరికాడు... వాయవ్య ఫ్రాన్స్‌లోని టౌలోస్ అనే కొండ ప్రాంతంలో గత బుధవారం అర్ధరాత్రి దాటాక ఓ 17 ఏళ్ల కుర్రాడు హోరు వానలో తడుస్తూ, హైవే పక్కగా పేవ్‌మెంట్‌పై ఒంటరిగా నడుస్తూ పోతున్నాడు. అటుగా వెళ్తున్న ఫాబియన్ అసిడినీ అనే ఓ ట్రక్ డ్రైవర్ కంటపడ్డాడు. అది మారుమూల ప్రాంతం, పైగా ఎవరూ బయట తిరగని వేళ కావడంతో అనుమానం వచి్చన ఆ డ్రైవర్ మనవాణ్ని దగ్గరికి తీశాడు. తొలుత బెదురు చూపులతో మారుపేరు చెప్పినా, అనునయించి అడిగేసరికి అసలు పేరు, తాను తప్పిపోయిన వృత్తాంతంమొత్తం చెప్పుకొచ్చాడు. ‘కొన్నేళ్ల కింద మా అమ్మే నన్ను కిడ్నాప్ చేసింది’ అంటూ ముక్తాయించాడు. దాంతో బిత్తరపోయిన అసిడినీ వెంటనే అతన్ని స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పజెప్పాడు. వాళ్లు బ్రిటన్‌కు సమాచారమివ్వడం, ఫొటో చూసిన నానమ్మ అలెక్స్‌ను గుర్తు పట్టడం, ఇద్దరూ వీడియో కాల్లో మాట్లాడుకుని ఆనందబాష్పాలు రాల్చడం చకచకా జరిగిపోయాయి. ఏం జరిగిందంటే... అలెక్స్ అమ్మానాన్నలు చాన్నాళ్ల క్రితమే విడిపోయారు. అలెక్స్ కోరిక మేరకు కోర్టు అతన్ని నానమ్మ సంరక్షణలో ఉంచింది. ఆమె అనుమతి లేకుండానే 11 ఏళ్ల అలెక్స్‌ను తల్లి, తాతయ్య కలిసి విహారయాత్ర పేరిట 2017లో స్పెయిన్ తీసుకెళ్లారు. అప్పటినుంచీ ముగ్గురూ అయిపు లేకుండా పోయారు. పెద్దవాళ్లిద్దరూ అప్పటికి కొంతకాలంగా ఆధ్యాతి్మక బాట పట్టినట్టు దర్యాప్తులో తేలింది. తమతో పాటు అలెక్స్ కూడా ఆ ప్రత్యామ్నాయ జీవనం గడపాలనే ఉద్దేశంతో అతన్ని తీసుకుని స్పెయిన్‌లో ఓ ఆరామం వంటి ప్రదేశానికి వెళ్లినట్టు పోలీసులు ముక్తాయించారు. తాము తొలుత ఓ విలాసవంతమైన ఇంట్లో ఒక రకమైన ఆధ్యాతి్మక సమూహంతో కలిసి కొన్నేళ్ల పాటు గడిపామన్న అలెక్స్ తాజా వాంగ్మూలం కూడా దీన్ని ధ్రువీకరించింది. తర్వాత అమ్మ, తాతయ్య ఇద్దరూ అలెక్స్‌ను తీసుకుని 2021లో ఫ్రాన్స్‌లో ప్రత్యామ్నాయ జీవన శైలికి పేరున్న పైరెనీస్ ప్రాంతానికి మారినట్టు భావిస్తున్నారు. అలెక్స్ దొరికిన చోటు కూడా అక్కడికి కొద్ది దూరంలోనే ఉంది. ఆ జీవన విధానం తనకు నచ్చక నానమ్మ చెంతకు చేరేందుకు తప్పించుకుని వచ్చేశానని అలెక్స్ చెప్పుకొచ్చాడు. అతన్ని ఒకట్రెండు రోజుల్లో నానమ్మ దగ్గరికి చేర్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అతని అమ్మ, తాతయ్యలపై కిడ్నాపింగ్ కేసు ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉండటం విశేషం! తాజా వివరాల ఆధారంగా వారిని తెరపైకి తీసుకొచ్చే పనిలో పడ్డారు బ్రిటన్ పోలీసులు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
భారతీయులకు యూకే తీపి కబురు
-
కోవిషీల్డ్‌కు యూకే ఓకే!
లండన్: కోవిడ్ టీకా రెండు డోసులు తీసుకున్నా సరే భారత్ నుంచి బ్రిటన్‌కు వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా క్వారంటైన్లో ఉండాలన్న నిబంధన నుంచి యూకే వెనక్కు తగ్గింది. వ్యాక్సిన్ అర్హత ఉన్న దేశాల జాబితాలో భారత్ పేరును చేర్చింది. తాజా నిబంధనల ప్రకారం అక్టోబర్ 11 నుంచి యూకే వచ్చే భారత ప్రయాణికులు కోవిïÙల్డ్(లేదా బ్రిటన్ అనుమతించిన ఏదైనా టీకా) పూర్తి డోసులు తీసుకున్నట్లైతే క్వారంటైన్ తప్పనిసరి కాదు. భారత్, పాక్‌తో కలిపి 37 దేశాల పేర్లను వ్యాక్సిన్ అర్హత ఉన్న దేశాల జాబితాలో యూకే చేర్చింది. వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న యూకే పౌరులతో సమానంగా ఈ దేశాల నుంచి వచ్చే అర్హులైన ప్రయాణికులను(టీకా డోసులు పూర్తి చేసుకున్నవారు) పరిగణిస్తారు. సదరు ప్రయాణికులు బ్రిటన్ ప్రయాణానికి పదిరోజుల ముందు యూకే ప్రకటించిన రెడ్ లిస్ట్ జాబితాలోని దేశాలను సందర్శించి ఉండకూడదు. అలాగే ప్రయాణానికి కనీసం 14 రోజుల ముందు నిరి్ధష్ట టీకా డోసులు పూర్తి చేసుకొని ఉండాలి. వీరికి క్వారంటైన్ మినహాయింపుతో పాటు యూకేలో కాలుమోపాక చేసే తప్పనిసరి టెస్టుల నుంచి మినహాయింపు లభిస్తుంది. భారత టీకా సరి్టఫికేషన్‌ను యూకే అక్టోబర్ 11 నుంచి గుర్తించనుందని, ఇరు దేశాల మంత్రిత్వశాఖల చర్చల అనంతరం ఈ కీలక నిర్ణయం తీసుకున్నారని బ్రిటీష్ హైకమిషనర్ అలెక్స్ తెలిపారు. ఈ అంశంపై నెలరోజులుగా సహకారమందించినందుకు భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. -
భార్య కోసం రష్యా నుంచి..
అల్వాల్: భార్యను వెతుక్కుంటూ నగరానికి వచ్చిన ఓ విదేశీయుడికి తీవ్ర నిరాశ మిగిలింది. ప్రేమించి, పెళ్లి చేసుకున్న భార్య స్వదేశంలోని పుట్టింటికని మూడు నెలల క్రితం రష్యా నుంచి వచ్చింది. ఆమె నుంచి మూడు నెలలుగా ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఆందోళనకు గురైన భర్త నేరుగా అల్వాల్‌కు వచ్చాడు. అయితే, ఆమె ఆచూకీ లభించలేదు... బాధితుడి కథనం ప్రకారం..... రష్యాలో ఉండే అలెక్స్ కొన్నేళ్ల క్రితం పని నిమిత్తం గోవాకు వచ్చాడు. అదే సమయంలో అల్వాల్‌కు చెందిన సనమ్ కూడా గోవా వెళ్లింది. ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమకు దారి తీసింది. 2014లో ఇద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంతరం అలెక్స్ భార్య సనమ్‌ను రష్యాకు తీసుకెళ్లాడు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. కాగా.. మూడు నెలల క్రితం భార్య సనమ్ అల్వాల్‌లోని పుట్టింటికి వచ్చింది. అప్పటి నుంచి అలెక్స్ భార్య సనమ్కు ఫోన్ చేస్తే ఆమె నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో అలెక్స్ రష్యా నుంచి బుధవారం అల్వాల్‌కు వచ్చి సనమ్ ఇంటికి వెళ్లాడు. సనమ్ ఉండే ఇల్లు అద్దెది కావడంతో అక్కడి నుండి ఖాళీ చేసి వెళ్లిపోయినట్టు తెలిసింది. దీంతో ఆమె కోసం అలెక్స్ అన్ని చోట్లా వెతికినా ఆచూకీ లభించలేదు. -
నిన్ను చూసి గర్విస్తున్నా: ఒబామా
వాషింగ్టన్: ‘నువ్వు చాలా మంచివాడివి. నీలాగే అందరూ ఆలోచించాలని కోరుకుంటున్నాను. నిన్ను చూసి నేను చాలా గర్వపడుతున్నా’ అని ఆరేళ్ల బాలుడిని ఉద్దేశించిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. సిరియా అంతర్యుద్ధం బాధిత బాలుడు ఒమ్రాన్ గురించి తనకు లేఖ రాసిన అలెక్స్ అనే అమెరికా బాలుడిని ఒబామా ప్రత్యేకంగా ప్రశంసించారు. తన అధికారిక నివాసానికి ఆహ్వానించి అలెక్స్ తో మాట్లాడారు. అలెక్స్ తన కుటుంబ సభ్యులతో పాటు వైట్ హౌస్ కు వెళ్లి ఒబామాను కలిశాడు. ఒమ్రాన్ పట్ల అలెక్స్ చూపిన మానత్వానికి ఒబామా ముగ్దుడయ్యారు. చిన్నవయసులోనే అరుదైన వ్యక్తిత్వం కనబరిచిన అలెక్స్ పై పొగడ్తల వర్షం కురిపించారు. సిరియా వైమానిక దాడిలో గాయపడి అంబులెన్సులో రక్తమోడుతూ దీనంగా కూర్చున్న ఐదేళ్ల బాలుడు ఒమ్రాన్ ఫొటోను చూసి కదిలిపోయిన అలెక్స్ ఒబామాకు లేఖ రాశాడు. ఒమ్రాన్‌ను తన ఇంటికి తీసుకురావాలని, తమ్ముడిలా చూసుకుంటానని లేఖలో పేర్కొన్నాడు. ఈ ఉత్తరాన్ని ఐక్యరాజ్యసమితిలో ఒబామా చదివి వినిపించారు. -
డియర్ ఒబామా.. సిరియాకు వెళ్లు
-
డియర్ ఒబామా.. సిరియాకు వెళ్లు
ఒబామాకు లేఖ రాసిన ఆరేళ్ల బాలుడు న్యూయార్క్: సిరియా వాయుసేన దాడిలో గాయపడి అంబులెన్సులో రక్తమోడుతూ దీనంగా కూర్చున్న ఐదేళ్ల బాలుడు ఒమ్రాన్ అందరికీ గుర్తుండే ఉంటాడు. తాజాగా అమెరికాకు చెందిన అలెక్స్ అనే ఆరేళ్ల బాలుడు.. ఒమ్రాన్‌ను తన ఇంటికి తీసుకురావాలని, తమ్ముడిలా చూసుకుంటానని అధ్యక్షుడు ఒబామాకు లేఖ రాశాడు. ఈ లేఖను ఒబామా ఐక్యరాజ్యసమితిలో చదివి వినిపించారు. అలెక్స్ స్వదస్తూరీతో రాసిన లేఖలో ‘ఒబామా! వెళ్లి ఒమ్రాన్ ను మా ఇంటికి తీసుకురండి. మేం మీకోసం జెండా, పూలు, బెలూన్లతో ఎదురుచూస్తూ ఉంటాం. అతణ్ని మా కుటుంబంలో చేర్చుకుంటాం. తమ్ముడిలా చూసుకుంటా. ఇంగ్లిష్ నేర్పిస్తాం’ అని పేర్కొన్నాడు. -
అలెగ్జాండర్ ది గ్రేట్!
మాధవ్ శింగరాజు అలెగ్జాండర్ ది గ్రేట్! ‘ది గ్రేట్’ ఎందుకు? గ్రీకు వీరుడనా? గ్రీకు రాజ్యాలన్నిటినీ ఏకం చేశాడనా? పర్షియాను ఆక్రమించుకున్నాడనా? ఇండియా వరకు.. దండయాత్రలతో తనకు తెలిసిన భూభాగాలన్నిటినీ హస్తగతం చేసుకున్నాడనా? అవును. కచ్చితంగా అందుకే. గ్రేట్! కానీ ఇదంతా ఎవరికి గొప్ప?! అలె క్స్ మాతృమూర్తికి గొప్ప. అలెక్స్ తండ్రికి గొప్ప. అలెక్స్‌కి పిల్లనిచ్చిన మామగారికి గొప్ప. అలెక్స్ ఫ్రెండ్స్‌కి గొప్ప. అలెక్స్ గురువు అరిస్టాటిల్‌కి గొప్ప. మరి అలెక్స్ భార్య రొక్సానాకి? గొప్పే. అయితే.. వీళ్లందరికీ అలెగ్జాండర్ ఎందుకు గొప్ప అయ్యాడో అందుకు మాత్రం కాదు! ఆమెపై ప్రేమను రుద్దే ప్రయత్నం ఏరోజూ చెయ్యలేదట అలెగ్జాండర్.. వాళ్ల పెళ్లికి ముందు గానీ, పెళ్లి తర్వాత గానీ! అది గ్రేట్‌గా అనిపించింది రొక్సానాకు. మగాడంటే అలా ఉండాలి అంటుందట ఆవిడ. అలా అని ప్లూటార్క్ రాశాడు. క్రీ.శ. రెండో శతాబ్దపు గ్రీకు చరిత్రకారుడు ఆయన. శత్రురాజులను పాదాక్రాంతం చేసుకోవడం, స్త్రీ ముందు మోకరిల్లడం రెండూ ఒకటే అలెగ్జాండర్‌కు. శత్రువును గెలవడం అతడికి గౌరవం. స్త్రీ ఎదుట కిరీటం తీసి నిలబడడం కూడా అతడికి గౌరవమే! (ఓయ్ అలెక్స్.. ఇది కూడా ఒక యుద్ధవ్యూహం కాదు కదా.. స్త్రీ హృదయాన్ని దోచుకోడానికి?!) అంత గొప్ప చక్రవర్తి అలెక్స్ నిజంగానే ఏ స్త్రీ ముందైనా మోకరిల్లి ఉంటాడా? ఉండొచ్చు. లేదా స్త్రీ మనసు తెలుసుకుని మసులుకొని ఉండొచ్చు. స్త్రీ మనసు తెలుసుకుని మసులుకోవడం మాత్రం.. ఆమెకు మోకరిల్లడం కన్నా ఏం తక్కువని?! క్రీ.పూ. 328లో అలెక్స్ ఆస్థానంలో కూడా మోకరిల్లడం అనే సంప్రదాయం ఉండేది. మరీ పైనున్నవాళ్లకు కిందివాళ్లు నీల్ డౌన్ అయ్యేవాళ్లు. పర్షియాను ఓడించి వస్తూ వస్తూ ఆ ఆచారాన్ని తెచ్చుకున్నాడు అలెగ్జాండర్. మోకరిల్లడంలో అభ్యర్థన ఉంటుంది. అర్పణ ఉంటుంది. అఫెక్షన్ ఉంటుంది. భయము, భక్తి, గౌరవం ఉంటాయి. ఇవన్నీ కలిసిందే ‘ప్రపోజల్’! ‘ప్రపోజల్’ అంటే.. ‘నువ్వు నన్ను పెళ్లి చేసుకోగలవా?’ అని అర్థించడం. ప్రియుడు మోకరిల్లి ప్రియురాలిని కనికరించమని (పెళ్లి చేసుకొమ్మని) అడిగే ఈ సంప్రదాయం ప్రతి దేశంలోనూ ఉంది. పువ్విస్తూ ప్రపోజ్ చెయ్యడం, నవ్విస్తూ ప్రపోజ్ చెయ్యడం, పగడం తొడుగుతూ ప్రపోజ్ చెయ్యడం, ముత్యమంత ముద్దిచ్చి ప్రపోజ్ చెయ్యడం.. ఇక ఇవన్నీ మగాళ్ల తిప్పలు, తలనొప్పులు. ఎలా ప్రపోజ్ చేసినా, ఎక్కడ ప్రపోజ్ చేసినా, ఎప్పుడు ప్రపోజ్ చేసినా.. అసలంటూ ప్రపోజ్ చెయ్యడం గ్రేట్. రిప్లయ్ నెగిటివ్‌గా ఉన్నా హర్ట్ అవకుండా ఉండగలిగితే.. అలెగ్జాండర్ ది గ్రేట్. హ్యాపీ ప్రపోజ్ డే ఇవాళ ‘ప్రపోజ్ డే’. వాలెంటైన్ వీక్ మొదలైన (7-14) రెండో రోజు.. అంటే ఫిబ్రవరి 8న ప్రపోజ్ డే వస్తుంది. -
సంద్రాన నగరం... సడి లేక మాయం!
మిస్టరీ జూన్ 7, 1692... జమైకా... మధ్యాహ్నం మూడు గంటలు కావస్తోంది. కరీబియన్ సముద్రపు అలలపై ఓ నౌక అల్లనల్లన సాగిపోతోంది. నౌకలో ఉన్న ముగ్గురూ ఎవరి మానాన వాళ్లు సీరియస్‌గా ఆలోచిస్తున్నారు. అంతలో ఒకతను అన్నాడు. ‘‘అలెక్స్... నువ్వన్నదే ఫైనలా?’’ అలెక్స్ ఆలోచనల్లోంచి బయట పడ్డాడు. ‘‘అవును జేమ్స్... అదే ఫైనల్. ఇంత దూరం వచ్చాక కూడా డౌటుగా అడుగుతావే’’ అన్నాడు సీరియస్‌గా. మూడో వ్యక్తి ఆ ఇద్దరి వైపూ ఓసారి చూశాడు. తర్వాత అన్నాడు.. ‘నాకెందుకో ఇది రిస్కేమో అనిపిస్తోంది ఫ్రెండ్స్. పోర్ట్ రాయల్ సిటీకి వెళ్లడమంటే మాటలా?’’ అలెక్స్‌కి నవ్వొచ్చింది. ‘‘దొంగోడికి మరో దొంగోడి దగ్గరకు వెళ్లడానికి భయమేంట్రా బిల్లీ?’’ అన్నాడు. జేమ్స్ పకపకా నవ్వాడు. బిల్లీకి మాత్రం నవ్వు రాలేదు. అతనికి భయంగా ఉంది. పోర్ట్ రాయల్ సిటీ గురించి అతను చాలా విన్నాడు. అక్కడ కరడుగట్టిన గజదొంగలుంటారు. ఏదైనా తేడా వస్తే సొమ్ములతో పాటు ప్రాణాలను సైతం దోచుకుంటారు. జాలి, దయ అనేవి వాళ్ల డిక్షనరీలోనే ఉండవు. అలాంటి వాళ్ల దగ్గరికి వెళ్లడం అతనికి ఏమాత్రం ఇష్టం లేదు. కానీ వెళ్లక తప్పని పరిస్థితి. దాదాపు పదేళ్లుగా వాళ్లు ముగ్గురూ కలిసి దొంగతనాలు చేస్తున్నారు. కానీ మొదటిసారి ఓ చోరీ కేసులో తమ గురిం చిన ఆధారాలు పోలీసులకి దొరికాయి. వాళ్లు కచ్చితంగా తమను పట్టేస్తారు. అందుకే పారిపోయి పోర్ట్ రాయల్ నగరంలో తలదాచుకుందామని అలెక్స్ ప్లాన్ వేశాడు. ఒక రకంగా అతని ఆలోచన కరెక్టే. ఎందుకంటే ఆ పట్టణం... ఓ ప్రత్యేక ప్రపంచం. నేరస్తులకి అది స్వర్గం. అక్కడి వాళ్లు ఎవరినీ లెక్క చేయరు. ఎవరికీ భయపడరు. తమ జోలికి వస్తే ఎవరినీ వదిలిపెట్టరు. వాళ్లను మంచి చేసుకుని అక్కడ సెటిలైపోతే, ఇక తమనెవరూ పట్టు కోలేరు అంటాడు అలెక్స్. కానీ బిల్లీకి సందేహం... తాము అక్కడ ఉండటానికి వాళ్లు అనుమతిస్తారా లేదా అని. అదే అంటే కొట్టి పారేశాడు అలెక్స్. తాను వాళ్లను ఒప్పిస్తానన్నాడు. అతడు ఓసారి ఫిక్సయ్యాడంటే ఇక ఎవరి మాటా వినడు. అందుకే ఇష్టం లేకపోయినా మౌనంగా ఉండిపోయాడు బిల్లీ. ‘‘జేమ్స్, బిల్లీ... పది నిమిషాల్లో అక్కడ ఉంటాం. ఇక మనల్నెవ్వరూ పట్టుకోలేరు’’... అన్నాడు అలెక్స్ ఆనందంగా. పది నిమిషాలు గడిచాయి. పదిహేను నిమిషాలు గడిచాయి. కానీ ఎంతకీ సిటీని చేరుకోవడం లేదు పడవ. ‘‘ఏది అలెక్స్... పది నిమిషాలే అన్నావ్. ఎంత దూరం పోయినా సిటీ రావడం లేదే’’ అన్నాడు జేమ్స్ అనుమానంగా. వెంటనే చుట్టూ చూశాడు అలెక్స్. దూరంగా ఓ పక్కన కింగ్స్టన్ హార్బర్ కనిపిస్తోంది. దానికి దగ్గర్లో మరో పక్కగా ఉండే దీవి, ఆ దీవి మీద ఉండాల్సిన పోర్ట్ రాయల్ నగరం మాత్రం కనిపించడం లేదు. కళ్లు నులుముకుని మళ్లీ చూశాడు. అంతా శూన్యం. భవంతులు లేవు. రేవులో కట్టేసి ఉండే పడవలు లేవు. అసలక్కడ ఏమీ లేదు. ‘‘ఏంట్రా ఇది? సిటీ ఏది?’’ అన్నాడు అయోమయంగా. ‘‘మనం తప్పు అడ్రస్‌కి వచ్చామేమో’’ అన్నాడు బిల్లీ సందేహంగా. ‘‘నీ ముఖం. నిన్న నేను వచ్చి అన్నీ పరిశీలించాను కదా. పోర్ట్ రాయల్ నగరం ఇక్కడే ఉండాలి. కానీ ఇప్పుడు కనిపించడం లేదు. నిన్న ఇక్కడే ఉన్నది ఇవాళ ఏమైపోతుంది?’’ అలెక్స్ మాటలు విని ఆశ్చర్యపోయా రిద్దరూ. నిన్న ఉందా? ఇవాళ లేదా? అంత పెద్ద నగరం ఉన్నట్టుండి ఎలా మాయమవుతుంది? రెండువేల ఇళ్లు ఎలా మాయమైపోతాయి? అందులో ఉండే మనుషులందరూ ఏమైపోతారు? తలలు బద్దలయ్యేలా ఆలోచించారు ముగ్గురూ. కానీ ఏం అర్థం కాలేదు. దాంతో మౌనంగా వెనుదిరిగారు. నిజానికి వాళ్లకే కాదు... వాళ్ల ద్వారా పోర్ట్ రాయల్ నగరం గురించి విన్న వాళ్లెవరికీ ఏమీ అర్థం కాలేదు. పోర్ట్ రాయల్ ఒక్కసారిగా అంతర్థానమై పోయింది. మొండి గోడలు కాదు కదా, ఎక్కడా చిన్న ఇటుక ముక్క కూడా కనిపించడం లేదు. అలా ఎలా జరిగింది? అసలా పట్టణానికి ఏమయ్యింది? జమైకా దేశానికి ఈశాన్య దిశలో... కరీబియన్ సముద్ర జలాల్లో ఒక దీవి ఉంది. 1494లో కొలంబస్ ఈ దీవిని కనుక్కున్నాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు కొందరు మత్స్యకారులు ఆ దీవి మీద నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. నాటి నుంచీ మెల్లగా జనాభా పెరిగింది. అయితే 1655లో బ్రిటిష్‌వారు ఆక్రమించుకున్న తర్వాత ఈ దీవి రూపమే మారిపోయింది. ఆంగ్లేయులు ఈ ద్వీపాన్ని అందంగా మార్చాలనుకున్నారు. పెద్ద పెద్ద ఇళ్లు, చక్కని దుకాణాలతో ఓ అందమైన నగ రాన్ని నిర్మించారు. దానికి పోర్ట్ రాయల్ సిటీ అని పేరు పెట్టారు. మెల్లగా జనాభా పెరిగింది. వ్యాపారాలు వెలిశాయి. సంపద కూడా పెరిగింది. కానీ అక్కడి వారికి ప్రశాంతత మాత్రం కరువైంది. ఎందుకో తెలియదు కానీ... పోర్ట్ రాయల్‌లో తరచుగా భయంకర వ్యాధులు ప్రబలుతూ ఉండేవి. ఎంతోమంది వాటి బారిన పడి అల్లాడేవారు. అలాగే అప్పు డప్పుడూ భూకంపాలు కూడా వచ్చి ఆస్తి నష్టం సంభవిస్తూ ఉండేది. ఒక్కోసారి హరికేన్లు విరుచుకుపడి పంటల్ని నాశనం చేసేవి. ఇవన్నీ కలిసి పోర్ట్ రాయల్ ప్రజల జీవితాలను అతలాకుతలం చేసేసేవి. దాంతో మెల్లగా వారి సంపద తగ్గుతూ వచ్చింది. ఓ సమయంలో కరవు కూడా ఏర్పడింది. కానీ అప్పుడే పోర్ట్ రాయల్ నగరం మరో కొత్త రూపును సంతరించు కోవడం మొదలైంది. తమ అవసరాలను తీర్చుకోవడం కోసం అక్కడి ప్రజల్లో కొందరు సముద్రపు దొంగలుగా మారారు. సముద్ర మార్గాన వెళ్లేవారిని దోచుకోవడం మొదలుపెట్టారు. తక్కువ కష్టం, ఎక్కువ లాభం. జీవితాలు మారిపోయాయి. సంపదలో మునిగి తేల సాగారు. వారిని చూసి మిగతావారంతా కూడా అదే పనికి పూనుకున్నారు. కొన్నాళ్లు గడిచేసరికి ఒక్కొక్కరుగా అందరూ దొంగలైపోయారు. దాంతో పోర్ట్ రాయల్ సిటీ కాస్తా పైరేట్ సిటీగా మారిపోయింది. అయితే వాళ్లు దొంగతనాల దగ్గరే ఆగి పోలేదు. చేతినిండా సొమ్ము ఉండటంతో విపరీతమైన విలాసాలకు అలవాటు పడ్డారు. ఎప్పుడూ మత్తులో మునిగి తేలే వారు. వ్యభిచారులుగా తయారయ్యారు. ఓడలను అడ్డుకుని దోచుకోవడమే కాక, మహిళలను ఎత్తుకొచ్చి బంధించేవారు. అత్యాచారాలు చేసేవారు. తర్వాత వారిని చంపి సముద్రంలో పారేసేవారు. మెల్లగా వీరి అక్రమాలు బయటకు వచ్చాయి. ప్రభుత్వ అధికారులు పోర్ట్ రాయల్‌లో జరిగే దారుణాలను ఆపాలని అనుకున్నారు. కానీ వీలు కాలేదు. ఎందు కంటే అక్కడి మనుషులంతా అప్పటికే క్రూరంగా మారిపోయారు. ఎవరినీ తమ పట్టణంలో అడుగు పెట్టనిచ్చేవారు కాదు. వాళ్లు అనుకున్నదే న్యాయం, చేసిందే చట్టం. ఎవరైనా వాళ్లకు వ్యతిరేకంగా నడచుకుంటే ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడేవారు కాదు. అక్కడికి వెళ్లినవాళ్లు తిరిగి వస్తారనే నమ్మకం లేకపోవడంతో వెళ్లే ధైర్యం ఎవరూ చేసేవారు కాదు. దాంతో అడ్డూ అదుపూ లేక నగరం పూర్తిగా దుర్మార్గాలతో, అక్రమాలు అన్యాయాలతో నిండిపోయింది. అలాంటి ఆ సిటీ... 1692లో ఓ రోజు కనిపించకుండా పోయింది. రెండువేలకు పైగా ఇళ్లు... మార్కెట్లు, దుకాణాలు... ఏ ఒక్కటీ అక్కడ లేదు. వేలమంది జనాభాలో ఒక్కరి జాడ కూడా అక్కడ కనిపించలేదు. చేతితో తీసేసినట్టుగా ప్రపంచపటం నుంచి దాని ఆనవాళ్లు తుడిచి పెట్టుకుపోయాయి. ప్రపంచం అవాక్కయ్యింది. ప్రజానీకం విస్తుపోయింది. పైరేట్ సిటీకి ఏమయ్యిందా అంటూ ఎంక్వయిరీ మొదలుపెట్టింది. కానీ కారణాలు మాత్రం కనిపెట్టలేకపోయింది. భూకంపం వచ్చిందన్నారు కొందరు. సునామీ వచ్చి ఉంటుందన్నారు ఇంకొందరు. రెండూ కలిసి వచ్చి ఉంటాయి, అందుకే నామ రూపాలు లేకుండా పోయింది అన్నారు మరికొందరు. వాళ్లు అలా అనడానికి కారణం ఉంది. పోర్ట్ రాయల్ నగరం నిర్మితమైంది నిజానికి దీవి మీద కాదు. అసలు అది దీవే కాదు. పొరలు పొరలుగా ఇసుక మేట వేయడం వల్ల ఏర్పడిన నేల. దానికి బలం ఉండదు. ఆ వాస్తవాన్ని గుర్తించకుండా, దాని మీద నగరాన్ని నిర్మించారు. కాబట్టి అది సముద్రంలోకి కుంగిపోయి ఉంటుందని అంచనా వేశారు. కొందరైతే ఇదంతా దేవుడి శాపం అన్నారు. పాపంతో నిండిపోయిన పైరేట్ సిటీని చూసి దేవుడు ఆగ్రహించాడని, అందుకే ఆ నగరాన్ని రాత్రికి రాత్రే నాశనం చేశాడని అభిప్రాయపడ్డారు. అయితే ఇవన్నీ అభిప్రాయాలు మాత్రమే. ఊహల ఆధారంగా వేసిన అంచనాలు మాత్రమే. నిజంగా పైరేట్ సిటీ ఎందుకు మాయమైంది అన్నది ఇప్పటికీ ఒక ముడి వీడని మిస్టరీనే! ఒకనాటి పైరేట్ సిటీ వర్ణచిత్రం రెండు సంవత్సరాల క్రితం కరీబియన్ సముద్రపు అడుగున కొన్ని భవనాల అవశేషాలు కనిపించాయి శాస్త్రవేత్తలకు. సరిగ్గా అదే ప్రాంతంలో ఒకప్పుడు పైరేట్ సిటీ ఉండేది. దాంతో సదరు భవనాలు ఆ సిటీకి సంబంధించినవేనని, సునామీ వల్లనో భూకంపం వల్లనో పైరేట్ సిటీ సముద్రంలో కలిసిపోయిందని అన్నారు వారు. అయితే దాన్ని నిర్థారించేందుకు తగిన ఆధారాలు వారికి ఇంకా లభ్యం కాలేదు. ఒకవేళ లభ్యమైతే మిస్టరీ విడిపోతుంది. లేదంటే పైరేట్ సిటీ అంతర్థానం ఎప్పటికీ రహస్యంగానే మిగిలిపోతుంది. -
ఇది అలెక్స్ మాయ
ఇందులో మాయా లేదు.. మంత్రం లేదు.. గ్రావిటీ మహిమ అసలే లేదు.. అది నిజమైన రోడ్డే.. కారు కూడా నిజమైనదే. కాకపోతే ఈ రెంటినీ ఇలా అమర్చిన ఘనత మాత్రం అలెక్స్ చిన్నెక్ది. లండన్‌లోని సౌత్‌బ్యాంక్ సెంటర్లో వ్యాక్స్హాల్ కోర్సా కారును భూమికి 4.5 మీటర్ల ఎత్తులో ఇలా అమర్చారు. దీనిని ఈనెల 25 వరకు ఇలా ఉంచుతారు. -
మద్యం మత్తులో ఇంజినీర్ల వీరంగం
ఎర్రావారిపాళెం, న్యూస్‌లైన్: ప్రసిద్ధ పర్యాటక పుణ్యక్షేత్రమైన తలకోనలో శనివారం రాత్రి మద్యం మత్తులో వీరంగం చేసిన ఇంజినీర్లను స్థానికులు చితకబాదారు. పో లీసుల కథనం మేరకు.. శనివారం రాత్రి బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్లు భరత్ (28), మోహన్ (29), అలెక్స్ (26), ప్రీతిజిత్ (27), కృష్ణకిషోర్(31) తలకోనలోని టీటీడీ అతిథిగృహంలో గదిని అద్దెకు తీసుకున్నారు. వీరు తమ వెంట తెచ్చుకున్న మద్యం సేవించి మాంసంతో విందు చేసుకున్నారు. మత్తులో ఉన్న వీరు గదికి సైతం మద్యం తీసుకొచ్చి సే వించేందుకు ప్రయత్నించారు. టీటీడీ అతిథిగృహంలో మద్యం, మాంసం అనుమతించమని సెక్యూరిటీ సిబ్బంది అన్నారు. దీంతో మద్యం మత్తులో ఉన్న ఇంజినీర్లు మేమనుకుంటే ఏమైనా చేస్తాం.. మమ్మల్నే ఎదిరిస్తారా’’ అంటూ సెక్యూరిటీగార్డులు శంకర, బాలకృష్ణపై దాడికి దిగారు. ఈ హఠాత్ పరిణామానికి భయపడిన సెక్యూరిటీగార్డులు పరుగులు తీసి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న నెరబైలు గ్రామంలోని తమ బంధువులకు విషయాన్ని తెలిపారు. వారంతా టీటీడీ అతిథిగృహం వద్దకు చేరుకుని సాఫ్ట్వేర్ ఇంజినీర్లను చితకబాదారు. ఈఘర్షణలో అతిథిగృహంలో ఫర్నిచర్ ధ్వంసం అయింది. గాయపడిన వారినందరినీ చికిత్స నిమిత్తం 108లో పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఎర్రావారిపాళెం ఇన్చార్జ్ ఎస్ఐ నెత్తికంఠయ్య ఇరువర్గాల వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.