alians
-
నిజంగా ఏలియన్ల గుట్టు సముద్రాల్లో ఉందా? రెండింటి మధ్య లింకేంటి?
భూమి ఉపరితలంపై 70 శాతం ఆవరించి ఉన్నవి సముద్రాలే. పైకి సింపుల్‌గా కనిపిస్తున్నా.. తీవ్ర ఒత్తిడి ఉండే పరిస్థితులు, అసలు సూర్యరశ్మి సోకని నిండు చీకట్లో బతికే జీవులు.. వంటి విచిత్రాలెన్నో. అంతేకాదు సముద్రాల్లో పరిశోధనలతో గ్రహాంతర జీవం (ఏలియన్ల) గుట్టునూ తేల్చేయొచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. భూమ్మీద సముద్రాలేమిటి, ఏలియన్ల గుట్టు ఏమిటి అన్న సందేహాలు వస్తున్నాయి కదా.. ఆ విశేషాలు ఏమిటో తెలుసుకుందామా.. మనకు తెలిసింది కొంచెమే! మానవ నాగరికత ఇంతగా అభివృద్ధి చెందినా.. అత్యాధునిక టెక్నాలజీలు వచ్చినా.. ఇప్పటివరకు సముద్రాల్లో జీవం, అడుగున పరిస్థితుల గురించి మనకు తెలిసింది చాలా తక్కువ. భూమ్మీద ఉన్న మొత్తం సముద్ర భాగంలో 80 శాతం మేర ఏముందో, ఎలా ఉందో, అక్కడి పరిస్థితులు ఏమిటో అన్నది ఇప్పటివరకు తెలియకపోవడం గమనార్హం. మన సముద్రాల అడుగున భూమి కంటే.. చంద్రుడి ఉపరితలం, అంగారకుడి నేల గురించి మనకు ఎక్కువ తెలుసని శాస్త్రవేత్తలు కూడా చెప్తుంటారు. ఏలియన్లకు లింకేంటి? అసలు గ్రహాంతర జీవం గురించిన ఆనవాళ్లు సముద్రాల్లో ఉండవచ్చని ఎప్పటి నుంచో వాదనలున్నాయి. ఎందుకంటే భూమిపై 70 శాతానికిపైగా సముద్రాలు, మరో 10 శాతం మేర అంటార్కిటికా, ఆర్కిటిక్ వంటి మంచుతో మునిగి ఉన్న ప్రాంతాలే ఉన్నాయి. ఏలియన్లు గానీ, గ్రహాంతర జీవ పదార్థాలుగానీ భూమ్మీదికి వస్తే.. సముద్రాల్లో పడే అవకాశాలే ఎక్కువని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అసలు భూమ్మీద జీవానికి మూలం గ్రహశకలాలు, తోక చుక్కల నుంచి వచ్చిన సేంద్రియ పదార్థాలే కారణమనే ప్రతిపాదనలు ఉన్నాయి. ఇటీవల ‘ర్యుగు’ అనే గ్రహ శకలం (ఆస్టరాయిడ్) నుంచి తెచ్చిన మట్టిలో సేంద్రియ పదార్థాలు ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు కూడా.. అవే పదార్థాలు సౌర కుటుంబంలోని ఇతర గ్రహాలు, వాటి ఉపగ్రహాలకూ చేరే అవకాశాలూ ఎక్కువే. అంటే.. వాటిలోనూ ఎక్కడో జీవం అభివృద్ధి చెంది ఉండొచ్చని అంచనా. ఇక సౌర కుటుంబంలో గ్రహాల చుట్టూ తిరుగుతున్న పలు ఉపగ్రహాల (ఆ గ్రహాలకు చందమామలు)లో ఉండే వాతావరణాన్ని పోలిన పరిస్థితులు.. భూమ్మీద సముద్రాల అడుగున ఉన్నాయని శాస్త్రవేత్తలు ఇటీవలే గుర్తించారు. అత్యంత చల్లగా, తీవ్ర ఒత్తిడి (ప్రెషర్)తో కూడిన ఈ పరిస్థితుల్లో కూడా కొన్ని రకాల జీవరాశులు మనుగడ సాగించగలుగుతున్నాయని తేల్చారు. ఈ లెక్కన సదరు ఉపగ్రహాల్లో కూడా జీవం మనగలదని.. మన సముద్రాల అడుగున పరిస్థితులపై పూర్తిస్థాయి పరిశోధన చేస్తే.. గ్రహాంతర జీవుల గుట్టు కనుగొనడం సులువని నాసా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. హడల్ జోన్.. గురుడి ఉపగ్రహం ‘యురోపా’లా.. గురుగ్రహం చుట్టూ తిరిగే ఉపగ్రహాల్లో ఒకటైన యురోపాపై.. దట్టమైన మంచుతో కప్పబడిన సముద్రాలు ఉన్నాయి. అక్కడి పరిస్థితులు అచ్చంగా.. మన భూమ్మీది సముద్రాల అడుగున ‘హడల్ జోన్’ను పోలి ఉన్నట్టు నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇక్కడ జీవంపై పరిశోధనలు చేస్తే.. యురోపాపై జీవం ఉండే అవకాశాలు, ఉంటే ఎలా ఉండొచ్చన్న వివరాలు తెలుస్తాయని వారు చెప్తున్నారు. సముద్రాల్లో ఆరు కిలోమీటర్ల కన్నా ఎక్కువ లోతున ఉండే ప్రాంతాన్ని ‘హడల్ జోన్’గా పిలుస్తారు. సూర్యరశ్మి ఏమాత్రం సోకని చిమ్మ చీకటి, అతి శీతల పరిస్థితులు, తీవ్రమైన ఒత్తిడి ఉండే హడల్ జోన్లో జీవం మనుగడ కష్టం. ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లోనూ కొన్ని రకాల జీవులు బతుకుతున్నాయి. ప్రయోగాలు మొదలెట్టిన నాసా.. సముద్రాల అట్టడుగున ఉండే క్లిష్టమైన పరిస్థితులపై నాసా ఇప్పటికే ప్రయోగాలు మొదలుపెట్టింది. ఈ పరిస్థితులపై పరిశోధన చేసి.. ఇతర గ్రహాలు, ఉపగ్రహాలపై సముద్రాలు, అక్కడి పరిస్థితులు ఎలా ఉండొచ్చనే అంచనాలను రూపొందిస్తోంది. ఈ అంచనాలకు అనుగుణంగా అన్నిరకాల పరిస్థితులను తట్టుకునే పరికరాలను రూపొందించి.. భవిష్యత్తులో ఆయా గ్రహాలు, ఉపగ్రహాలపై పరిశోధనలు చేయనుంది. చంద్రుడిపైకి నాసా ‘వైపర్’ మంచు, దాని అడుగున నీటిలో (సబ్ సీ) ప్రయాణిస్తూ, పరిశోధన చేయగల రోవర్ ‘వైపర్’ను నాసా వచ్చే ఏడాది చంద్రుడిపైకి పంపనుంది. చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద మంచు, నీటి జాడ గుట్టును ‘వైపర్’ తేల్చనుంది. దీని పనితీరును భూమిపై సముద్రాల్లో పరిశీలిస్తున్నారు. ఆ నీటి అడుగున చిత్రాలెన్నో.. ► సౌర కాంతి సముద్రాల్లో 200 మీటర్ల లోతు వరకు చొచ్చుకుపోగలదు. తర్వాత ఒక కిలోమీటర్ వరకు స్వల్పంగా ఉంటుంది. అంటే మసక చీకటిలా ఉంటుంది. అంతకన్నా లోతున అంతా చిమ్మ చీకటే ఉంటుంది. ► గత ఏడాది అమెరికా తీరానికి సమీపంలో అట్లాంటిక్ సముద్రంలో అత్యంత అరుదైన భారీ ‘ఫాంటమ్ జెల్లీఫిష్’ను గుర్తించారు. రెండు కిలోమీటర్ల నుంచి ఐదు కిలోమీటర్ల లోతులో అవి జీవిస్తుంటాయని తేల్చారు. ►నాలుగైదు కిలోమీటర్ల లోతులో సముద్రపు నేలపై ‘హైడ్రో థర్మల్ వెంట్స్ (వేడి నీరు, పొగను వెలువరించే బిలాలు)’ను శాస్త్రవేత్తలు గుర్తించారు. వాటి నుంచి వెలువడే వేడి, సేంద్రియ రసాయనాల ఆధారంగా.. అంత లోతులో కూడా కొన్నిరకాల జీవులు బతుకుతున్నట్టు తేల్చారు. ► మంచుతో కప్పిఉన్న ఉపగ్రహాల్లోనూ ఇలాంటి ‘హైడ్రో థర్మల్ వెంట్స్’ ఉంటే.. జీవానికి అవకాశాలు ఎక్కువేనని అంచనా వేస్తున్నారు. -
అవును 'నేను ఏలియన్ని' : ఎలోన్ మస్క్
ఎలోన్ మస్క్ అంటే తెలియని వారు చాలా తక్కువ మంది ఉంటారు. హాలీవుడ్ మార్వెల్ సూపర్ క్యారెక్టర్ ఐరన్ మ్యాన్‌తో ఎలోన్ మస్క ను పోల్చుతారు. అలాగే, ఎలోన్ మస్క్ కూడా ఎప్పుడు కూడా తన అభిమానులతో దగ్గరగా ఎప్పుడూ ముందు ఉంటారు. క్రిప్టోకరెన్సీ, టెస్లా నుంచి రాకెట్లు, స్పేస్ ఎక్స్ వరకు బిలియనీర్ ఎలోన్ మస్క్ ట్విటర్ లో అడిగిన ప్రశ్నలకు సాధ్యమైనంత మేరకు సమాధానాలు ఇస్తారు. అంతే కాదు, అతను తన అభిమానులను స్టంప్ చేయడానికి చమత్కారమైన మీమ్స్ పోస్ట్ చేస్తాడు. అయితే, రెండు రోజుల క్రితం ఆగస్టు 28న ఒక యూజర్ మస్క్ నటించిన ఒక చిన్న వీడియో క్లిప్ పోస్ట్ చేశాడు. ఈ 17 సెకన్ల వీడియోలో టెస్లా సీఈఓ భౌతిక శాస్త్రం, తత్వశాస్త్రం, గ్రహాంతరవాసుల గురించి మాట్లాడుతారు. భౌతిక శాస్త్రం, తత్వశాస్త్రంలో గొప్ప ప్రశ్నలలో ఇది ఒకటి అని తాను భావిస్తున్నానని మస్క్ వీడియోలో చెప్పాడు. "గ్రహాంతరవాసులు ఎక్కడ ఉన్నారు?" ఈ ప్రశ్న తర్వాత అతను "బహుశా వారు మా మధ్య ఉండవచ్చు, నాకు తెలియదు" అని జోకులు వేస్తాడు, "కొంతమంది నేను గ్రహాంతరవాసిని అని అనుకుంటారు, కానీ అది నిజం కాదు" అని అంటారు. అయితే ఇప్పుడు ఆ వీడియో ట్రెండ్ అవుతుంది. ఒక యూజర్ (@teslaownersSV) ఈ వీడియోను ట్వీట్ చేసి "@elonmusk గ్రహాంతరవాసినా?" అని అడిగాడు. అయితే, దీనికి మస్క్ ప్రతిస్పందనగా "నిజమే" అవును అని పేర్కొంటారు. 60 వేల మందికి పైగా యూజర్లు ఈ పోస్టును లైక్ చేశారు. మరికొందరు తమ అభిప్రాయాలు వ్యక్తపరుస్తూ రి-ట్వీట్ చేశారు.(చదవండి: ఫోన్ పోతే ఇలా తేలికగా కనిపెట్టొచ్చని తెలుసా?) Of course — Elon Musk (@elonmusk) August 29, 2021 -
'నేను ఏలియన్ని' మస్క్ షాకింగ్ కామెంట్
ఎలోన్ మస్క్ కొన్ని సార్లు ట్విటర్ లో చాలా ఆసక్తికరమైన పోస్టులు, కామెంట్స్ పెడుతుంటాడు. తాజాగా ఇండియాకు చెందిన క్రెడిట్ క్లబ్ సీఈఓ కునాల్ షా చేసిన ఓ ట్వీట్‌కు "నేను గ్రహాంతరవాసిని" అని మస్క్ ట్విటర్ లో కామెంట్ పెట్టాడు. "ఎలోన్ మస్క్ 500 బిలియన్ డాలర్లు గల నాలుగు పైగా కంపెనీలను ఎలా విజయవంతంగా నడుపుతున్నాడో నాకు అర్ధం కావడం లేదు, అది కూడా ఇతర వ్యాపార దిగ్గజాలతో పోల్చితే ఇంత చిన్న వయసులోనే ఎలా ముందుకెళుతున్నాడో తెలియట్లేదు. అతను వీటిని ఎలా నిర్వహిస్తున్నాడు? అతను ఆలోచనా సరళిని ఎలా మార్చుకోగలుగుతున్నారు? తన సంస్థలను ఇంత బాగా ఎలా రూపొందించాడు? వంటి చాలా ప్రశ్నలకు సమాధానాలు తెలియవు" అని కునాల్ షా ట్విటర్ లో పేర్కొన్నాడు. దీనికి ప్రతిస్పందనగా ఎలోన్ మస్క్ " నేను గ్రహాంతరవాసిని" బదులు ఇచ్చాడు. చదవండి: కుమారుడి ఫోటో షేర్ చేసిన ఎలోన్ మస్క్ ఆపిల్ కంప్యూటర్ ఖరీదు రూ.11కోట్లు? -
‘ఏలియన్స్ ఉన్నాయి.. నిరూపిస్తాను’
జెరూసలెం: అంతరిక్షం, ఏలియన్స్ వంటి విషయాలు ఎప్పుడు ఆసక్తికరంగానే ఉంటాయి. ఇక హాలీవుడ్లో ఏలియన్స్ ఆధారిత సినిమాలు ఎంతటి విజయాన్ని సాధించాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఏరియా 51 అనే ప్రాంతంలో అమెరికా సైన్యం గ్రహాంతరవాసులను బంధించి పెట్టింది. వాళ్ల నుంచే అధునాతన టెక్నాలజీని ఆ దేశం పొందుతోంది అనే ఆరోపణలు ఏన్నో ఏళ్లుగా ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓ ఇజ్రాయేల్ మాజీ జనరల్ ఏలియన్స్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రహంతార వాసులు నిజంగానే ఉన్నారని.. భూమ్మీద మనతో పాటు కలిసి తిరుగుతున్నారన్నారు. మాజీ ఇజ్రాయెల్ జనరల్, ప్రస్తుతం ప్రొఫెసర్‌గా పని చేస్తున్న హైమ్ ఎషెడ్ ఒక ఇంటర్వ్యూలో ఏలియన్స్ నిజంగానే ఉన్నారని.. వారు రహస్యంగా మన ప్రభుత్వాలతో కలిసి పని చేస్తున్నారని.. వారి సమయాన్ని మనతో వెచ్చిస్తున్నారని తెలిపారు. అంతేకాక అమెరికా, ఇజ్రాయేల్ ప్రభుత్వాలు ఎన్నో ఏళ్లుగా ఏలియన్స్‌తో కలిసి పని చేస్తున్నాయని వెల్లడించారు. అయితే భూమ్మీద వారిని అంగీకరించే పరిస్థితులు లేనందున ఈ విషయాలని రహస్యంగా ఉంచారని జెరూసలేం పోస్టుకిచ్చిన ఇంటర్వ్యూలో హైమ్ తెలిపారు. (చదవండి: 36 గ్రహాలపై మనలాగే మరికొందరు!) హైమ్ ఎషెడ్ ఇజ్రాయేల్ స్పేప్ సెక్యూరిటీ ప్రొగ్రామ్‌లో 1981-2010 వరకు పని చేశారు. ఇక అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏలియన్స్ గురించి బయట ప్రపంచానికి తెలియజేయాలని తెగ ఉబలాటపడేవారని... కానీ గెలాక్సీ ఫెడరేషన్‌లోని ఏలియన్స్ ఆయనను ఆపాయన్నారు. ముందు జనాలు మా విషయంలో కనబరిచే ఆసక్తి తగ్గాక ఈ విషయాలను వెల్లడించాలని సూచించాయన్నారు. హెమ్ ఎషెడ్ మాట్లాడుతూ.. ‘వారు మాస్ హిస్టీరియా సృష్టించాలని అనుకోవడం లేదు. మనకు తగినంత సమయం ఇచ్చి వారి పట్ల మనం తెలివి, అవగాహన ఏర్పర్చుకోవాలని కోరుకుంటున్నారు’ అన్నారు. (చదవండి: ఆకాశంలో బ్లాక్ రింగ్.. ఏలియన్స్ వచ్చేశారు!) హైమ్ ఎషెడ్ ఇజ్రాయెల్ యెడియోట్ అహరోనోట్తో మాట్లాడుతూ, గ్రహాంతరవాసుల ఉనికిని తాను నిరూపించగలనని, ఎందుకంటే వారు చాలా కాలం నుంచి మన మధ్య ఉన్నారని ఆయన పేర్కొన్నారు. గ్రహాంతర వాసులు సొంతంగా "గెలాక్సీ ఫెడరేషన్" అనే సంస్థను కలిగి ఉన్నారని తెలిపారు. మనుషులకు అంతరిక్షం, స్పేస్‌షిప్స్, ఏలియన్స్ పట్ల ఓ అవగాహన వచ్చే వరకు తమ ఉనికిని బహిర్గతం చేయాలని వారు భావించడం లేదని తెలిపారు. ఎషెడ్ ఇంకా మాట్లాడుతూ, “అమెరికా ప్రభుత్వం, గ్రహాంతరవాసుల మధ్య ఒక ఒప్పందం ఉంది. ఇక్కడ ప్రయోగాలు చేయడానికి వారు మాతో ఒప్పందం కుదుర్చుకున్నారు. వారు కూడా, విశ్వం మొత్తాన్ని పరిశోధించడానికి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వారు మనల్ని సహాయకులుగా కోరుకుంటున్నారు. అంగారకుడి లోతులో భూగర్భ స్థావరం ఉంది, అక్కడ గ్రహాంతర వాసుల ప్రతినిధిలు, మన అమెరికన్ వ్యోమగాములు కూడా ఉన్నారు” అని తెలిపారు. -
కార్పొరేషన్లో పొత్తు లేదు: పైడి
శ్రీకాకుళం న్యూకాలనీ: శ్రీకాకుళం నగర కార్పొరేషన్ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పైడి వేణుగోపాలం అన్నారు. నగర కార్పొరేషన్ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా పొత్తుతో సంబంధం లేకుండా బీజేపీ తరఫున అభ్యర్థులను నిలబెడతామని తెలిపారు. బీజేపీ నగర శాఖ అధ్యక్షులు చల్లా వెంకటేశ్వరరావు ఆధ్యక్షతన నగర కార్యాలయంలో సోమవారం సాయంత్రం జరిగిన శ్రీకాకుళం నగర కార్యవర్గ సమావేశంలో వేణుగోపాలం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి టీడీపీతో పొత్తులు పక్కనపెడతామని, వార్డుల్లో సమస్యలను పరిష్కారం చేయటానికి కృషిచేస్తామన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుకు సహకరించాలని ఆయన కోరారు. కిసాన్ మోర్ఛా రాష్ట్ర అధ్యక్షులు పూడి తిరుపతిరావు, జిల్లా అధ్యక్షులు కోటగిరి నారాయణరావులు మాట్లాడుతూ జిల్లాతోపాటు శ్రీకాకుళం నగరంలో ప్రజలు బీజేపీ పక్షానే ఉన్నారని అన్నారు. ఆన్లైన్ ద్వారా 30వేల వరకు సభ్యత్వం తీసుకోవడమే ఇందుకు ఉదాహరణగా చెప్పారు. చల్లా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రస్తుతం నగరంలో జరుగుతున్న ఏ అభివృద్ధి కార్యక్రమమైనా కేంద్ర నిధులతోనే జరుగుతోందని గుర్తించాలని తెలిపారు. కార్యక్రమంలో దుప్పల రవీంద్రబాబు, పైడి సత్యం, కద్దాల ఈశ్వరమ్మ, ఎస్.నాగేశ్వరరావు, ఎస్.రమణమూర్తి, ఎం.వెంకటరావు, మురళీమోహన్, కృష్ణమూర్తి, రమేష్‌బాబు, కార్యకర్తలు పాల్గొన్నారు.