
ఎలోన్ మస్క్ కొన్ని సార్లు ట్విటర్ లో చాలా ఆసక్తికరమైన పోస్టులు, కామెంట్స్ పెడుతుంటాడు. తాజాగా ఇండియాకు చెందిన క్రెడిట్ క్లబ్ సీఈఓ కునాల్ షా చేసిన ఓ ట్వీట్‌కు "నేను గ్రహాంతరవాసిని" అని మస్క్ ట్విటర్ లో కామెంట్ పెట్టాడు. "ఎలోన్ మస్క్ 500 బిలియన్ డాలర్లు గల నాలుగు పైగా కంపెనీలను ఎలా విజయవంతంగా నడుపుతున్నాడో నాకు అర్ధం కావడం లేదు, అది కూడా ఇతర వ్యాపార దిగ్గజాలతో పోల్చితే ఇంత చిన్న వయసులోనే ఎలా ముందుకెళుతున్నాడో తెలియట్లేదు. అతను వీటిని ఎలా నిర్వహిస్తున్నాడు? అతను ఆలోచనా సరళిని ఎలా మార్చుకోగలుగుతున్నారు? తన సంస్థలను ఇంత బాగా ఎలా రూపొందించాడు? వంటి చాలా ప్రశ్నలకు సమాధానాలు తెలియవు" అని కునాల్ షా ట్విటర్ లో పేర్కొన్నాడు. దీనికి ప్రతిస్పందనగా ఎలోన్ మస్క్ " నేను గ్రహాంతరవాసిని" బదులు ఇచ్చాడు.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment